సంబరం
సంబరం
నా కనులు నీ కొరకు..వెతకడం సంబరం..!
నీ కబురు గాలినే..అడగడం సంబరం..!
ఈ మనసు అలజడే..అంటెనే గగనమే..
రెప్పలే నీ పాట..పాడడం సంబరం..!
మాటలే తేలికై..పొంగెనే మౌనమే..
పదములే పక్షులై..ఎగరడం సంబరం..!
గుండెలో రాగమే..చేసెనే సమరమే..
తలపులే తాళమే..వేయడం సంబరం..!
పరుషమో సరళమో..పొంగెనే పరువమే..
వలపులే తియ్యగా..గిల్లడం సంబరం..!
అడుగులో అడుగుకే..పెరిగెనే దూరమే..
విరహాలు నిప్పులే..చిమ్మడం సంబరం..