సాగిపో ముందుకు
సాగిపో ముందుకు
గమకాల వేణు గాలి నాదంలా
శిలను చెక్కిన ఉలి గాయంలా
ఆకాశంలో పరిచిన అరుణంలా
ఉవ్వెత్తున ఎగసిపడే కెరటంలా
అలజడి రేపే సంద్రంలా
అణువణువు తాకిన వర్షంలా
కొమ్మలలో దాగిన కోయిలంలా
పలకరిస్తూ వెళ్లే పవనంలా
కరిగిపోని మధుర గానంలా
కలలు నిండిన తీపి కావ్యంలా
కాల్చి వేసే జ్వలితంలా
కాంతి చూపే ప్రమిదంలా
ప్రవహించే రుదిరంలా
కానరాని కాళికలా
తప్పు నీది కానప్పుడు
తలదించకు ఇంకెప్పుడు
స్వగతించి ప్రతి మలుపు
సాగిపో ముందుకు
కానరాదు వెనకడుగు
వేచి ఉండు ప్రతి గెలుపు
తిరిగొచ్చే నీ కొరకు
బై
రజిత ముంద్రతి ( హృదయాంకిత)
