పరిపూర్ణత
పరిపూర్ణత
స్త్రీకి గొప్ప వరం మాతృత్వం
సిద్ధించును పరిపూర్ణత్వం
గావించును జన్మ సార్థకం
తను పొందిన తల్లి ప్రేమను
తన బిడ్డ లకు పంచి
నిలువెల్లా పులకించి పోతుంది
కడుపులో పెరిగే పిండపు
ప్రతీ కదలికకు పరవశిస్తూ
తొమ్మిది నెలలు
తొమ్మిది యుగాలుగా
బిడ్డ కై ఎదురు చూస్తుంది
తన బిడ్డకు జన్మనిచ్చి
తను పునర్జన్మ ను పొంది
పండంటి కలల రూపానికి
ప్రాణం పోస్తుంది
కారు మబ్బులు కమ్మినా
కటిక చీకటి ముసిరినా
పునరుజ్జీవన సారంతో
కంటికి రెప్పలా కాపాడుతూ
కాంతులీనే భవితకై
నిత్యం పరితపిస్తూ
పరిపూర్ణ జీవన సాఫల్యం
పొంది తరించిపోతుంది
