ప్రేయసియే
ప్రేయసియే
నిదురరాని రేయికన్న..ప్రేయసియే లేదు..!
పట్టేసిన వ్యథకన్నా..చీకటియే లేదు..!
వస్తావను నమ్మకమే..గాలిలోన కలిసె..
ఆశపడే మనసుకన్న..వెర్రిదియే లేదు..!
రెండుంటే మోయలేని..బరువెంతో చూడు..
ఏకాంతము చిక్కినంత..తొక్కిడియే లేదు..!
కంటివలన జరుగుతోంది..చెప్పరాని మాయ..
ఆలోచన నిలిచిందా..తాకిడియే లేదు..!
కిటికీలను మూసేయక..తప్పదింక పైన..
అసలు లోని వెలుగుచేర..అలజడియే లేదు..!
మట్టితోటి గగనానికి..అనుబంధం ప్రేమ..
కలిసీకలవని తీరుకు..పరిమితియే లేదు..!