పొదుపరి
పొదుపరి
ఆమెగొప్పపొదుపరి
ఆ పొదుపరితనం ఎంత ఆస్తి కూడబెట్టిందో మురిసిపోతుంది రాత్రి ఏడింటి వరకూ లైటు వెయ్యదు ఇంకా సూరీడి చివరి చూపు వుందని
చీకట్లో నడవాల్సొస్తే కళ్ళనే వుపయోగించే మిణుగురు
వొళ్ళన్నిటికీ అలవాటుపడాలని
ఫ్రిజ్ వాడదు
ఫేను వెయ్యదు
ఏసీ వూసే లేదు
అన్నింటినీ కలిపిన కిచిడీకి
ఏరుచీ తగలనీదు
వూపిరిని మాత్రం ఎందుకు పొదుపు చెయ్యకూడదని
వూపిరి తియ్యడం మానేసింది
ఏ ఖర్చూ తగలని పొదుపు మిగిలిపోయింది
