ఓ మనసా
ఓ మనసా
మాట గుచ్చుకుందంటే..తీసేందుకు కుదిరేనా..!
మనసు నొచ్చుకుందంటే..మాన్పేందుకు కుదిరేనా..!
నీ జడలో మల్లెచెండు..నవ్వాలను కోరికేల..
నీ నవ్వుల వానలోన..తడిసేందుకు కుదిరేనా..!
నీ అందెల సవ్వడినే..అనువాదం చేయుటెలా..
నీ పదముల ఒక పువ్వుగ..చేరేందుకు కుదిరేనా..!
నీ చూపుల వెన్నెలలో..ఆడుకునే పసిపాపను..
నీ భుజమున ఒక్క క్షణం..వాలేందుకు కుదిరేనా..!
'నీ - నా'లను తోడుకునే..చిలిపితనం వరమేగా..
కలలపంట చేనులోన..కలిసేందుకు కుదిరేనా.