నువ్వే లేని నేను
నువ్వే లేని నేను
ఏమైపోయావే నన్నేవదిలేసి
కనుమరుగయ్యావు నిండా ముంచేసి
మదిలో.. యదలో ..నువ్వేలే
శ్వాసే..ధ్యాసే.. నువ్వేలే
కళ్ళే.. మూసున్న కలలో నీవే
కదిలే.. వెళ్తున్న ఊహల్లో నీవే
కనుమరుగయ్యావు నిండా ముంచేసి
ఏమి చేస్తున్నా..చేయూత నువ్వేలే
ఎగిసే ఆల లాగా..ఆశే నువ్వేలే
వదిలీ....వెల్లవే ....
క్షణమే యుగమై నువ్వేలేకుండా..
కరిగే కాలం విలువే లేకుండా..
సాగే పయనం లో గమనం నీవే
చేరే తీరం లో గమ్యం నీవే
ఎమైపొయావే నన్నేవదిలేసి
కనుమరుగయ్యావు నిండా ముంచేసి .