STORYMIRROR

Balamurali Krishna Ippili

Romance

4.4  

Balamurali Krishna Ippili

Romance

నిరీక్షణ!!

నిరీక్షణ!!

1 min
385


నిన్న మొన్నటి దాక నాలో లేదు ఈ కలవరం

నిన్ను చూసాకే మొదలైంది ఈ కలల విహారం

నువ్వు కళ్ల ముందుంటే అఖ్ఖర్లేదు నాకు నిద్రాహారం

నువ్వు కనిపించని క్షణాన నా మది నిండా మోయలేని భారం.


ఎప్పుడొచ్చేనో కదా నువ్ కరుణించే ఆ క్షణం

నీ గుడి ముందే కూర్చుంటా వరమిచ్చిన మరుక్షణం

నీ పేరుని మంత్రంలా జపియిస్తా ప్రతీక్షణం

నా ప్రాణంతో కల్పిస్తా నీ అణువణువుకి రక్షణం. 


Rate this content
Log in

More telugu poem from Balamurali Krishna Ippili