నీకు నేనేమీ కానని
నీకు నేనేమీ కానని
నీకు నేనేమీ కానని..తెలిసిందా ఇప్పుడైనా..!
నీకు నీవేమీ కావని..వెలిగిందా ఇప్పుడైనా..!
కల ఎంత నిజమో..ఈ నిజమూ అంతేగా..
నిజానికి నిజమేదీ..అందిందా ఇప్పుడైనా..!
ఏ రెండు ఒకటౌతాయట..కలనైనా అసలు..
ఉన్నదంతా ఒకటేనని..తోచిందా ఇప్పుడైనా..!
వెతుకులాటలో సుఖం..నిట్టూర్పును అడుగు..
అంతమయే ఏకాంతం..దొరికిందా ఇప్పుడైనా..!
అర్థమవని సంగతులే..దారిదీపాలు కదా..
నిఘంటువుల అడవి..నవ్విందా ఇప్పుడైనా..!
పారిపోవు పనిలోనే..నిమఘ్నమై మనసా..
మౌనమైప్రియా "చిగురాలా"..మెరిసిందా ఇప్పుడైనా..!