మేలుకో నేస్తమా...
మేలుకో నేస్తమా...


మేలుకో నేస్తమా...ఇకనైనా ...మేలుకో....ఈ ధరినిని కాపాడుకో...
కరోనా రోగమట ...కంటి కునుకు మరిచాము...
మానవ మేధస్సుకి ... సవాలుగా నిలిచింది...
మేలుకో నేస్తమా...ఇకనైనా ...మేలుకో....ఈ ధరినిని కాపాడుకో...
చెట్టుకొట్టి మెడకట్టి.....
చెట్టుకొట్టి మెడకట్టి ఉష్ణోగ్రత తట్టలేక గొడుగు చేతపట్టి...తిరిగాము..మనం తిరిగాము...
మేలుకో నేస్తమా...ఇకనైనా ...మేలుకో....ఈ ధరినిని కాపాడుకో...
పరిశ్రమలు వంద పెట్టి.....
పరిశ్రమలు వంద పెట్టి పొగగొట్టాల్ దానీకెట్టి ఇప్పుడేమో మాస్క్ పెట్టుకున్నాము... మనం వున్నాము....
మేలుకో నేస్తమా...ఇకనైనా ...మేలుకో....ఈ ధరినిని కాపాడుకో....
నదులన్నీ అడ్డుకట్టి .....
నదులన్నీ అడ్డుకట్టి వ్యర్ధాన్ని దాంట్లో నెట్టి ఇప్పుడేమో హ్యాండ్ వాష్ చేస్తున్నాము.... మనం వున్నాము....
మేలుకో నేస్తమా...ఇకనైనా ...మేలుకో.....ఈ ధరినిని కాపాడుకో....
కరోనా బారి నుండి....
కరోనా బారి నుండి తమ ప్రాణాల్ని అడ్డుకట్టి మన ప్రాణాల్ని నిలుపుతున్న వైద్యులకు...రక్షక భటులకు...పారిశుధ్య కార్మికులకు...
వందనం...పాదాభి వందనం.....
మేలుకో నేస్తమా...ఇకనైనా ...మేలుకో.....ఈ ధరినిని కాపాడుకో....
కరోనా వెళ్ళాకా....
కరోనా వెళ్ళాకా తప్పులన్నీ మరచిపోయి మళ్లీ తప్పులన్ని చేస్తే...
భూతల్లి అంటూంది "మనుషులంతా మరోనా"... మీరు మరోనా ...
అందుకే ... ధరినిని కాపాడుదాం...మనం ప్రాణాలతో జీవిద్దాం...
మేలుకో నేస్తమా...ఇకనైనా ...మేలుకో.....ఈ ధరినిని కాపాడుకో....ఈ ధరినిని కాపాడుకో.......ఈ ధరినిని కాపాడుకో..................