Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Santha kumari Kankipati

Inspirational

3  

Santha kumari Kankipati

Inspirational

కవయిత్రిని నేను

కవయిత్రిని నేను

1 min
137



*పరిగెత్తు కాలానికి పగ్గాలు వేసే

పదునైన కలమున్న కవయిత్రిని నేను.


*బీడుభూముల్లో అక్షరవిత్తులు నాటి

సాహిత్యాన్ని సాగుచేసే కవయిత్రిని నేను.


* హృదయఫలకం మీద ఊహలను రచించే (చిత్రించే) కలం (కుంచె) పట్టిన కవయిత్రిని నేను.


*ప్రజామేధను ప్రభావితంచేయ, వాస్తవాన్ని

నిర్భయంగా,నిస్సందేహంగా రాసే కవయిత్రిని నేను.


*అదృశ్యంగావుండి భాషద్వారా భావాలను వ్యక్తపరచి, భాష్యం చెప్పే కవయిత్రిని నేను.


*జీవిని స్పందింపజేసే భావాలోచన కలిగి

 బౌతిక జీవమున్న సజీవదృక్కోణ కవయిత్రిని నేను.


*స్ఫూర్తి, ప్రేరణలకోసం అధ్భుత, ఆశ్చర్య 

ఘటనలు వెదికే నిర్భయ కవయిత్రిని నేను.


*మానసిక సంఘర్షణలను తర్కిస్తూ, వాస్తవ అనుభూతులను రుచిచూపే కవయిత్రిని నేను.


*వ్యక్తి తన మానసికస్థితిని అసహ్యించుకునేలా సౌందర్య భావనను కలిగించే కవయిత్రిని నేను.


*నిరాకార సొగసును సుందరంగా వర్ణించి 

అందరినీ ఆనందింపజేసే మీ కవయిత్రిని నేను.


                 శాంత కుమారి. కంకిపాటి 

                     06. 04. 2023.


Rate this content
Log in

Similar telugu poem from Inspirational