STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

జీవిత సత్యం

జీవిత సత్యం

1 min
6



మట్టితో రూపుదిద్దుకున్న ఓ మాయా బొమ్మరా..
ఎముకల పంజరంలో దాగి ఉన్న ప్రాణానికేంత పొగరురా?

శ్వాస ఉన్నంతసేపే ఈ రూపు, ఈ పేరు, ఈ హోదా..
శ్వాస ఆగిందో.. నీవు కట్టుకున్న ప్రపంచమంతా ఒక కల మాత్రమేరా!

రూపాయి వెనక పరిగెత్తే ఓ మనిషీ..
వెళ్లేటప్పుడు నాతో ఏమొస్తుందో ఒక్కసారైనా ఆలోచించావా?

అధికారము, అహంకారము అగ్నిజ్వాలల్లో బూడిదయ్యేవే..
కానీ నీవు పంచిన అప్యాయత, ప్రేమ మాత్రమే చిరస్థాయిగా నిలిచేవి.

రాజులైనా, పేదలైనా చేరేది ఆ ఆరు అడుగుల నేలకేరా..
నలుగురి కంట నీటిని తుడిచిన మంచితనమే నీ నిజమైన ఆస్తిరా!

ఉన్నంతకాలం ఒదిగి ఉండు, ప్రేమగా జీవించు..
కాలం కాలేలోపే నీ అడుగుజాడల్లో ఒక మంచి గురుతును వదిలివెళ్లు!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics