ఈ ప్రాణం
ఈ ప్రాణం


నువు చూడక ఒక్కక్షణం..నిలువ'లేదు ఈ ప్రాణం..!
నీ చూపుల వెన్నెలనే.. వీడ'లేదు ఈ ప్రాణం..!
హాయేదో సౌఖ్యమేదొ..మాటలేవొ నాకెందుకు..
హృదిలోనే నీవుంటివి..చూప'లేదు ఈ ప్రాణం..!
నడుస్తున్న నవ్వుపూల..తరువులాగ తనువైనది..
నీ మహిమలు గాక ఏమొ..తలచ'లేదు ఈ ప్రాణం..!
నాదైనది ఏమున్నది..పట్టిపట్టి దాచుకోగ..
మది నీవే దోచితివని..ఎంచ'లేదు ఈ ప్రాణం..!
పంజరమున పడికుమిలే..పనితప్పెను నీదయతో..
నీకోసం గాకుండా..పాడ'లేదు ఈ ప్రాణం..!
చెలిమికి ఒక అద్దమేదొ..పట్టడమది ఎట్లాగో..
పూలు తెచ్చి నీ పదముల..పోయ'లేదు ఈ ప్రాణం..!