STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

గూలబీ బాల

గూలబీ బాల

1 min
4


అందాల గులాబీ బాల

చిలిపి పరువపు కవ్వింతలేలా,

లేలేత వన్నెలన్నీ ప్రేమలా,

అల్లరి గిలిగింతలన్నీ మమతలా,

దోరనవ్వులెందుకే

దొంగసిగ్గులేందుకే,

మోహపుమత్తు వీడవేలా,

తెరతీసి మనసు తెలపవేలా.


ముద్దుల నీరూపం గుండెలో నిలవాలే,

అనురాగపు వీణియగా ఎదను మీటాలె,

పరిమళించు మనసుతో ప్రణయగీతం పాడాలే,

మదినేలు మనోహరి

కనురెప్పల్లో కాపురముండాలే.


భోగాలా రాసులతో వలపన్నది పంచలేనే,

కలలజగతి పలుకులతో పరవశాలవిందు పెట్టలేనే,

పసిడిచూపు మదికి వాంఛగా వుండలేనే,

సత్యప్రేమకు ప్రతిరూపమై నాహృది చేరుకోవే.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance