గురువు
గురువు
జీవితంలో చదువుని తీసుకోలేము అరువు
చదువు లేకపోవడం మనిషికో పెద్ద బరువు
అది ఎవ్వరూ పూడ్చలేని, తీర్చలేని కరువు
మెదడుకు చదువే అతి పెద్ద ఎరువు
చదువుకున్న మనిషి వికసించిన మరువు
నీ విజ్ఞానమే సమాజంలో నీకు ఇస్తుంది పరువు
జ్ఞానంతో వేరే వారి జీవితానికి నువ్వు అవుతావు తరువు
చదవని విద్యార్థికి ఎప్పుడు పడుతుంది దరువు
పాఠ్య పుస్తకాలను క్షుణ్ణంగా చదవమని గురువు ఏకరువు
గురువు అడుగుజాడల్లో నడిచిన శిష్యుని జీవితం అందమైన చిత్తరువు
భవిష్యత్తుని బంగారు బాట చేసుకోవాలని గురువు ఉత్తరువు
ఎందరి జీవితాలకు అఖండమైన వెలుగునిచ్చేది గురువు
