ఎందుకే.... ఓ మనసా...
ఎందుకే.... ఓ మనసా...


పరుగెత్తుతావెందుకు
పదిలంగా ఉండలేవా
తృప్తి లేక జీవితాలలో
అసంతృప్తి కలుగుతుందని
తెలియజెప్పక పోతివి
ఎందుకే..ఓ..మనసా
వెర్రితలలు వేస్తావు
మాయపొరలు కమ్ముతావు
బ్రాంతిలోన ముంచుతావు
పలురకాల ఆలోచనలతో
పాపకూపం లో దిగుతున్నామని
తెలియజెప్పక పోతివి
ఎందుకే ఓ మనసా
వెర్రితలలు వేస్తావు
నాదినాది అనుకుంటూ
నాశనం చేస్తున్నాము
ఏదీ మనవెంట రాదని
అన్ని వదిలిపోవాలని
తెలియజెప్పక పోతివి
ఎందుకే ఓ మనసా
వెర్రితలలు వేస్తావు
కోరికలకు బానిసలుగా
మేము దిగజారుతున్నాము
బానిసయిన మా బతుకు
బండలై పోతుందని
తెలియజెప్పక పోతివి
ఎందుకే ఓ మనసా
వెర్రితలలు వేస్తావు
స్వార్థం, అహంకారం
మాలోన పెరిగితే
మానవత్వం సమూలంగా
అడుగంటి పోతుందని
తెలియ జెప్పక పోతివి
ఎందుకే ఓ మనసా
వెర్రితలలు వేస్తావు
రక్తసంబందాలని
పరుగెడుతున్నావు
కొడుకులు,బిడ్డలు రారు
బంధువులు అసలుకారని
తెలియజెప్పక పోతివి
ఎందుకే ఓ మనసా
వెర్రితలలు వేస్తావు
మద మాత్సర్యాలతో
విర్రవీగుతుంటే
క్షణభంగురమైన జీవితం
నీటిబుడుగల్లే చిదుమునని
తెలియజెప్పక పోతివి
ఎందుకే ఓ మనసా
వెర్రితలలు వేస్తావు
భవనాల, మిద్దెలు
ఎన్ని ఉన్నాకాని
కోట్లకొలది
ఆస్థులెన్నయిన కానీ
వెంట ఏది రాదని
చివరి యాత్రకు నీకు
ఆరడుగులే చాలని
తెలియజెప్పక పోతివి
ఎందుకే ఓ మనసా
వెర్రితలలు వేస్తావు
ఎందుకే...ఓ...మనసా......
తెలియ జెప్పక పోతివి
తెలియా..జెప్పక...పోతివి.....
......................................