STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఏమి ఈ బతుకా

ఏమి ఈ బతుకా

1 min
2

ఏమి ఈ బతుకు బతుకా...
ఏ సాగే జీవన పోరాటమా...
అడుగే ఆగెనా... దిక్కే తోచక తగిలేనా...
గుండెలో మంటలే రగిలినా...
నా నిరీక్షణ ఇంకా చావలేదురా...
ఏమి ఈ బతుకు బతుకా...
ఏ తీరని వేదన బాటనా...

బాల్యమంతా గడిచిపోయే...
ఆశలన్నీ రాలిపోయే...
గుడిసె చిరిగే... గుండె కురిసే...
తడిసే లోకంలో ఏకాకిగా...
ఎంత కష్టకాలమైనా...
జీవితం ముందుకు సాగుతుందే...
ఏమి ఈ బతుకు బతుకా...

కోటి సమయాలు దాటినా...
బాటసారిగా అడుగు వేయనా...
బీటవారిన పాదాలతో...
అడుగు సాగే అంధకారాన...
దారంతా ముళ్లై ఎదురైనా...
మేఘం ఎంతో దూరమున్నా...
భూమిపై పాదం కాలినా...
ఆకాశం వైపు చూపు నిలిచెనా...

కాలం కత్తిలా కోసిన వేళ...
గాయం గీతమై మారిన వేళ...
వేదనే వాక్యమై లేచే...
నిరీక్షణ శక్తిగా పిలిచే...
ప్రేమ పంచే అక్షరమై...
అడిగే ప్రతి కన్నీటి చుక్కకి...
ఎవరూ తోడు లేకున్నా...
కాలమే నాతో నడువగా...
కలమే నా బలమౌతా...
నా ఈ గీతం వినిపిస్తా...!



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics