STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఎదురుదెబ్బ

ఎదురుదెబ్బ

1 min
1

ఎదురుదెబ్బ తగిలినోడే
ఏ యుద్ధానికైనా సిద్ధమవుతాడు
గాయం నేర్పిన పాఠమే
గెలుపు దారిని చూపిస్తాడు
పడిపోయాడని నవ్విన వాళ్ళ ముందే
పిడుగులా లేచి చరిత్ర రాస్తం
కన్నీటి చుక్కలే కత్తుల పదునెక్కాయి
కాలం వేసిన గాట్లే కవచమై నిలిచాయి
నిప్పులో నడిచిన అడుగులు ఉక్కులా మారాయి
ఒక్క అవకాశం చాలు ప్రపంచమే తలవంచుతుంది

ఎదురుదెబ్బే నా ఆయుధం
ఎదురొచ్చినోడే నా సాధనం
ఓటమి నా గురువు
గెలుపే నా గమ్యం
నా గర్జన వింటే
వణుకుతుంది సమయం
గాలికి వంగని వృక్షంలా నేనున్నాను నిలబడి
గాయం చేసిన ప్రతి చేతికి సమాధానం విజయమే
నా నిశ్శబ్దాన్ని బలహీనత అనుకున్న వాళ్లకు
నా విజయం వినిపించే గర్జనే తీర్పవుతుంది

భయపడే మనసు కాదు ఇది
భవిష్యత్తునే మార్చే తుఫాను ఇది
నన్ను ఆపాలని చూసిన ప్రతి అడుగు
నా విజయానికి పునాది రాయిగా మారిపోతుంది


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics