దిశా నిర్ధేశం జరిగిందా ....
దిశా నిర్ధేశం జరిగిందా ....
ఓరి నాయినా ..మన మెదళ్ళెంత మొద్దుబారిపోతున్నాయో రోజురోజుకి ...
అర్ధమవుతుందా అసలు ఏమి జరిగిందో ...
ఇక్కడ జరిగింది న్యాయమనుకున్నా ,
సులువుగా చేసింది వాళ్లు సామాన్యులనే స్వామీ ...
చరించబడ్డవాళ్లతోనైనా , చట్టపోళ్ళతోనైనా ,
ఎగుమతి , దిగుమతి బేరశారాలు చేసి
సొమ్మున్నోళ్లు , సోకున్నోళ్ళు చల్లబరిచేసుకుంటారు దేన్నయినా ...
మధ్యలో మనమే ఈ ,
అయేషా , ప్రీతి , ప్రత్యూషల నాత్మనలానే గాలిలోకి వదిలేద్దాం ,సరేనా ....
సామాన్యులు చేసుంటే అరిచో , గోలచేసో చంపించేద్దుమా ఎలాగైనా ,
అప్పుడు ఎలాగై
నా మన అరుపులు చట్టానికి వినిపిస్తాయి కాబట్టి....
చేసిందాన్ని సమర్ధించడం , వ్యతిరేకించడం కాదు సొల్యూషన్ ,
అందరికీ ఒకేలా జరుగుతుందా లేదా అన్నదే సమస్య ...
ఏం చేసినా చంపించడమే సొల్యూషనంటూ అనాగరికులమైపోయాం ఎలాగూ ,
ఆ సావైనా సామాన్యులకి, చట్టపు - చుట్టాలకి సరిసమానంగా పంచుతున్నారా లేదా అన్నది ప్రశ్నించాలి ...
వేల కోట్లమందిని ఆడిస్తోంది ,వందలమంది అధికారమిక్కడ ...
నేటి సావులే ...రేపు నువ్వాపలేనన్ని మన వాళ్ళ సావులవుతాయి .
ఎందుకంటే ఆ మనంలో నువ్వూ , నేనే ...సామాన్యులం కదా .