STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

చెప్పనెలా

చెప్పనెలా

1 min
7



అర్థం పర్థం లేనిది..లేదనేది చెప్పనెలా..!? 
అంతా అవసరార్థమే..అవుననేది చెప్పనెలా..!? 

మంచీచెడు ఏమైనా..అప్పటి ఫలితం వరకే.. 
సందర్భం ఏదైనా..తీర్పనేది చెప్పనెలా..!? 

అజ్ఞానం ఏమున్నది..జ్ఞానం అందీ అందకె.. 
ఏ మొక్కా పిచ్చిమొక్క..కాదనేది చెప్పనెలా..!? 

శాంతిని ఇచ్చే చీకటి..రంగదెంత కారునలుపు.. 
సమధర్మం ప్రవచించే..గురువనేది చెప్పనెలా..!? 

ఏదో ముచ్చట పడుతూ..పోవడమే మరణంలే.. 
ఉపాధిగా దొరికేదే..తనువనేది చెప్పనెలా..!? 

చూస్తే అనంత విశ్వం..అందమైన ఓ కావ్యం.. 
ఎవ్వరికో ఇంకేదో..చదువనేది చెప్పనెలా..!? 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics