అందమైన మరుగుజ్జు మనిషిని!
అందమైన మరుగుజ్జు మనిషిని!
కళ్ళు వింత చూపులు నా వైపే నేను ఎక్కడున్నా....
వందల
మీరెంత ఎత్తుకెదిగినా అవసరమైతే నా ముందు వంగటమే ...
కాలంతో పాటు ఎదగని కన్నీటి కథని నేను
లోకం కలుపుకోని సజీవ చిత్రాన్ని నేను
ఎవరేమి అనుకున్నా నాకున్న దైర్యం నా రూపమే
అద్దం ముందు వుంటే అద్దానికి నేనే అందం
ఆకృతిలో మీకన్నా తక్కువైనా కృతిలో నేనెక్కువే
ఆదరించాలని ఆదుకోవాలని నేనెప్పుడూ ఆశపడను
నన్నూ మీలో ఒకడిలా చూడండి... మానవత్వంతో మురిపించండి...
మురిపించే బాల కుమారుడ్ని .. పసి వన్నెల చిన్నోడ్ని... మీరందరూ ముద్దుగా పిలుచకొనే అందమైన మరుగుజ్జు మనిషిని!
