"అదే రచనంటే"
"అదే రచనంటే"
ఆ పదాలు మెదడు పొరల్లో
అణువణువూ అక్రమిస్తాయి
అదొక నిరదక్షిణ్యమైన
మధురమైన దాడి
నేను నిలిచింది
నేలమీద ఆతని భావనలమీదా
తెలియని తెలిసినతనం
రచనా ప్రవాహం దేహాన్ని
ఆక్రమించి
కన్నీటి ధారలుగా మారి
దోసిట్లో వాలుతాయి
ఆలోచనల సీతాకోక చిలుకలై
అది రచన
అది కదా రచన
అదే రచన.