Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Praveena Monangi

Drama Romance

4.4  

Praveena Monangi

Drama Romance

ప్రేమ మాధుర్యం

ప్రేమ మాధుర్యం

10 mins
1.7K



     ఆ రోజు నా జీవితములో మరిచి పోలేని రోజు.......ఇంజనీరింగు కళాశాలలో నా మొదటి రోజు.........కాలేజీ ప్రాంగణములో అడుగుపెట్టగానే ఏదో సాధించాననే చెప్పలేని సంతోషం .......ఆ రోజు నాన్నతో పోరాడి,నాన్నని ఒప్పించి,సాధించి ఇంజనీరింగులో జాయిన్ అయ్యాను.కారణం ఆడపిల్లకి చదువెందుకు,ఉధ్యోగము చేయాలా?ఊరిని ఏలాలా! అనే భావాలు కల ఇంటిలో పుట్టిపెరిగిన ఆడపిల్లను నేను.మరి నేను సాధించినట్లే కదా!మా నాన్న కి నేనంటే చాలా ఇష్టం అందుకే నామాట కాదనలేక ఒప్పుకున్నారు.నా స్నేహితురాలు సుమ కూడా అదే కళాశాలలో చేరింది కనుక నాన్నని ఒప్పించడము తేలిక అయ్యింది.నా ఈ విజయము లో తన పాత్ర కూడా ఉందండోయ్ ........ఇద్దరము కంప్యూటర్ బ్రాంచ్ లో చేరాము. క్లాస్ రూమ్ ఎక్కడ ఉందో కనుక్కుని అటువైపుగా వెళ్తున్న మాకు చాలా కంగారుగా ఒక అబ్బాయి మా రూమ్ వైపే వస్తూ అనుకోకుండా నన్ను ఢీ కొట్టాడు.పడిపోబోతున్న నన్ను సుమ పట్టుకుంది.ఆ అబ్బాయి సారీ అండీ క్లాస్ కి టైమ్ అయిపోతుందనే ........ కంగారులో.....చూసుకోకుండా.........ఇలా........అంటూ .......నావైపే చూస్తూ.....మాటలు మింగేసాడు.సుమ మాత్రం ఆ అబ్బాయి మాటలు పట్టించుకోకుండా చీవాట్లు పెడుతూనేఉంది......ఇంక ఆపవే తల్లి సారీ చెప్పాడుగా అని తనని అక్కడినుండి క్లాస్ లోకి తీసుకుపోయాను.......కానీ ఆ అబ్బాయి చూపు మాత్రం నా పైనే ఉంది.మా క్లాస్ లోనికే వచ్చి కూర్చున్నాడు. అబ్బాయి పేరు రేవంత్. చూడడానికి స్మార్ట్ గా ఉన్నాడు.ఎత్తు రంగు అన్నీ కలసి ఆడపిల్లలు కలలు కనే రాజకుమారుడిలా ఉన్నాడు. ఆ రోజు నుండి కాలేజీ లో మా చదువు ప్రారంభమైంది.క్లాసులు బాగానే జరుగుతున్నాయి క్రొత్త స్నేహితులు ముచ్చట్లు అంతా సరదాగా సాగిపోతూ ఉంది.ఇది ఇలా ఉండగా రేవంత్ ప్రతీ రోజు నన్ను ఓరచూపు చూడడము గమనించాను.

‘’సుమ చూడవే రేవంత్ రోజూ నన్నే చూస్తున్నాడు ఎందుకంటావ్?’’

‘’నన్ను ఒక చూపు చూడమంటావా’’?

‘’వద్దే బాబు నీతో చెబితే ఇదే సమస్య తగువు కి ముందుంటావు రేవంత్ నన్నేమీ ఇబ్బంది పెట్టలేదు కదే’’!

‘’సరే నువ్వు చెప్పావు కనుక వదిలేస్తున్నాను.’’

హమ్మయ్య!శాంతించింది అనుకున్నా నా మనసులో......                                  రోజూ నన్ను రేవంత్ చూడడము.... అది చూసి ఏంటి అని నేను కనుబొమ్మలతో సైగ చేయడము.... ఏమీ లేదు ......అంటూ తల అడ్డముగా ఊపి రేవంత్ తల కిందకు దించేయడము ఇలా రోజు ఒక దిన చర్యగా మారిపోయింది.        ఎదుటపడినా ఏమీ మాట్లాడడు....అందమైన చూపు చూసేవాడు అంతే.....ఆచూపులో ఏదో తెలియని నిష్కల్మషమైన ఆకర్షణ ఉంది.ఇలాగే నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి.ప్రతీ రోజు రేవంత్ నన్ను అలానే చూసేవాడు.ఏంటి అలా చూస్తున్నావ్ అని అడిగే ధైర్యము లేదు నాకు.ఎందుకంటే నేను పెరిగిన వాతావరణము,మా ఇంటికట్టుబాట్లు నన్ను ముందుకు అడుగు వేయనీయలేదు.ఇంజనీరింగు పూర్తి అయిపోయింది.నేను, రేవంత్,సుమ ముగ్గురము మంచి మార్కులతో ఉత్తీర్ణులమయ్యాము.ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోయాము.ఇక ఇప్పుడు ఇంట్లో ఖాళీగా తింటూ కూర్చోవడమే.......ఒక వైపు మా అమ్మేమో వంట నేర్చుకోమని సతయిస్తూనే ఉంది.మా నాన్న పెళ్లి సంబంధాలు మొదలుపెట్టడానికి ముహూర్తము చూస్తూ ఉన్నారు.మరో వైపు నాకేమో రేవంత్ కాలేజీలో విసిరిన చూపుల బాణాలు కలసి నాకు దారి తోచడం లేదు. నాకు ఎంత ఆలోచించినా రేవంత్ ఎందుకలా చూశాడు,నాతో ఏమీ మాట్లాడలేదో అర్ధము కాలేదు.

   ఒకనాడు నాన్న అమ్మతో చెబుతున్నారు ‘’ఎల్లుండి శుక్రవారము అమ్మాయిని చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు ఆ ఏర్పాట్లన్నీ చూడు’’ అని ........ఆ మాట వినగానే నాకు ఎందుకో తెలియని సిగ్గు ఆవరించి చిన్న నవ్వు నవ్వుకున్నాను.రాత్రి నిద్రపోతూ రాబోయే సంబంధము గురించి ఆలోచించడము మొదలు పెట్టాను. అబ్బాయి ఎలా ఉంటాడు.....వాళ్ళకి నేను నచ్చుతానా.....ఇలా ఏవేవో ఆలోచనలతో నిద్రలోకి జారుకున్న నాకు రేవంత్ చూపుల బాణాలు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి చేశాయి నా కలల నిండా రేవంత్ ఆలోచనలే ......ఉలిక్కి పడి లేచాను......ఏంటి ఇలా జరుగుతుంది నాకు రేవంత్ ఎందుకు గుర్తుకు వస్తున్నాడు ........తనని నేను ఇష్టపడుతున్నానా!....తానేమీ నాతో ఏమీ చెప్పలేదే......మరి ఎందుకు నాకిలా......అనుకుని మంచి నీళ్ళు త్రాగి పడుకున్నానే కానీ రేవంత్ ఆలోచనలు నన్ను కుదుటపదనీయలేదు.రాత్రి నిద్ర పట్టక పోవడము వలన పొద్దున్న ఎనిమిదింటి వరకు నిద్రపోయాను.లేచి ముఖము కడుగుకొని వంటింట్లోకి వెళ్ళి....

‘’అమ్మా తల నొప్పిగా ఉంది కొంచెం కాఫీ పెట్టి ఇస్తావా ప్లీజ్!’’

‘’ఇస్తాను గాని,కాఫీ త్రాగి నువ్వు తొందరగా రెడీ అవ్వాలి మరి’’

రెడీ అవ్వాలా?అదీ తొందరగానా!ఎందుకమ్మా?

‘’ఎందుకా! మరిచి పోయావా,అబ్బాయి వాళ్ళు వస్తున్నారుగా నిన్ను చూసుకోవడానికి’’

‘’ఓహ్!సారి అమ్మా మరిచిపోయాను’’

‘’ఇదిగో కాఫీ తొందరగా త్రాగు,వాళ్ళు పదింటికే వచ్చేస్తామన్నారు’’.

సరే తయారవుతాను లే!.

           అమ్మ చాలా హడావిడిగా ఉంది ఏర్పాట్లలో........నాన్న ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నారు.కాఫీ త్రాగి తయారవడానికి గదిలోకి దూరాను.చీర ఎన్ని సార్లు కట్టుకున్నా సరిగ్గా కుదరడములేదు కట్టీ కట్టీ విసుగుపుట్టి ఇంక చేసేదేమీ లేక అమ్మని పిలిచాను.ఊరిలోనే మా మేనత్త ఉంది.తనని నాన్న పిలిచారు మొదటి సంబంధము కదా......మా అత్త నాకు చీర కట్టి రెడీ చేసింది. ‘’కుందనపు బొమ్మలా ఉన్నావే మేనకోడలా!వచ్చే అబ్బాయి ఇప్పుడే పెళ్లి చేసేసుకుంటాను అని అంటాడేమో నిన్ను చూసి’’ అని నన్ను ఆట పట్టించింది.అంతలోనే అబ్బాయి వాళ్ళు వచ్చారు అన్న మా నాన్న మాట నా చెవిన పడింది.ఎందుకో నాలో ఏదో తెలియని కంగారు పుట్టింది.కాసేపటికి అమ్మాయిని తీసుకురండి ముహూర్తము దాటిపోతుంది అని ఎవరో అన్నారు.వెంటనే మా మేనత్త నన్ను హాల్లోకి తీసుకుని వెళ్ళి ఒక కుర్చీలో కూర్చో బెట్టింది.ఇరువైపుల నిశ్శబ్ధము నెలకొంది.కొన్ని నిమిషాలకి అబ్బాయిని చూడమ్మా!అని ఎవరో అనగా ....తలపైకి ఎత్తి అబ్బాయిని చిన్నగా చూశాను.హుందాగా కూర్చుని చిరు ధరహాసము తో నన్నే చూస్తున్న రేవంత్ ని చూసి స్థాణువినైపోయాను.వెంటనే తల దించేసుకున్నాను.నా కళ్లని నమ్మలేక పోయాను.ఇది కలా లేక భ్రమా అని మరొకసారి తల పైకి ఎత్తి చూశాను సందేహము లేదు రేవంతే.......అదే చూపు......సిగ్గుల మొగ్గయి ముడుచుకుపోయాను.అంతలోనే హఠార్తుగా అంకుల్ నేను మీ అమ్మాయితో మాట్లాడాలి అని అడిగేశాడు రేవంత్.ఇది నాకు మరొక షాక్.అసలు నోరే విప్పని రేవంత్ ఇలా అడగడం ఆశ్చర్యమనిపించింది. మళ్ళీ నిశ్శబ్ధం.......మా నాన్న కి ఇలాంటివి నచ్చవు ........అసలు అబ్బాయి మనకు నచ్చాడో లేదో తెలుసుకోక ముందే ఏంటి ఇలా అని నాన్న సందేహం నాకు తన ముఖములో కనబడుతుంది.నాన్న నా వైపు చూశారు నాకు రేవంత్ తో మాట్లాడడము ఇష్టమే అని కళ్ల ద్వారా తెలిపాను గత్యంతరము లేక మాట్లాడడానికి అంగీకరించారు మా నాన్న.రేవంత్ ని, నన్ను మేడ పైన రెండు రూముల బయట కొంత కారిడార్ లా ఉంటుంది అక్కడ కూర్చోబెట్టారు మమ్మల్ని.మా నాన్న ఏమి అమాయకులు కారండోయ్ మాకు కాపలాగా మా మేనత్త కొడుకుని కూర్చోబెట్టారు అక్కడ, కాకపోతే వాడి వయసు పది సంవత్సరాలు.ఇద్దరము కుర్చీలలో కూర్చున్నాము మరలా రేవంత్ అదే చూపు ఏమీ మాట్లాడడు.ఆ చూపులో ఏమి మాయ ఉందో తెలియదు గాని నేను అలాగే చూస్తూ ఉండిపోయాను.అంతలో మా చింటూ ఏదో శబ్దము చేయడముతో ఇద్దరము ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాము.ఇంక లాభము లేదని నేనే చొరవ తీసుకున్నాను.     ‘’ఇప్పటికైనా మాట్లాడతావా!లేదా’’?                                           ‘’ఎందుకు మాట్లాడను!నేను వచ్చిందే అందుకు కదా!’’                              ‘’హమ్మాయ్యా! ఇప్పటికయిన గొంతు విప్పినందుకు సంతోషము,ఇన్నాళ్ళు ఈ గొంతు ఎందుకు మూగ బోయింది’’? ‘’కావాలనే గొంతు విప్పలేదు రేవతి’’.                                              నా పేరు అంత అందముగా ఉంటుందని అతని నోటితో వింటే గాని తెలియలేదు నాకు.ఇంతకీ నాపేరు చెప్పనే లేదు కదూ! అదేనండీ ఇప్పుడే రేవంత్ పిలిచాడు కదా!రేవతి అని అదే .......

‘’కావాలనేనా!ఎందుకు? 

     ‘’నిన్ను కాలేజీ లో కలిసిన,నిన్ను ఢీ కొట్టిన క్షణమే నీతో ప్రేమ లో పడిపోయాను.......చూడగానే ప్రేమా!అని నువ్వు అనుకోవచ్చు కానీ ఇది నిజం ఎప్పుడూ సినిమాలలో చూడడమే కానీ నిజ జీవితము లో చూడగానే ప్రేమ నాకు తారసపడలేదు కానీ నాకు నీతో జరిగింది.అయితే నా ప్రేమని నీతో ఎందుకు తెలుపలేదని నీకు సందేహము రావచ్చు దానికి కారణము ఉంది.నువ్వు ఎటువంటి కుటుంబము లోనుండి వచ్చావో తెలుసుకున్నాను.అందుకే నా ప్రేమని అంగీకరిస్తావో లేదో అని సందేహము కలిగింది.తెగించి నీకు నా ప్రేమ గురించి చెబితే నీవు ఎలా స్పందిస్తావో తెలియదు.....ఒకే అంటే సంతోషము,ఒక వేళ నువ్వు నిరాకరిస్తే .......,నాలుగు సంవత్సరాలు ఒకే చోట చదవాలి మనం ....అప్పుడు నేను నిన్ను చూసుకునే భాగ్యాన్ని కోల్పోతాను.ఉన్న నాలుగు సంవత్సరాలు నిన్ను మౌనముగా ఆరాదించుకునే భాగ్యాన్ని కోల్పోదలుచుకోలేదు.తొలిచూపులో నీ అందము నన్ను ఆకర్షించింది.ముద్దులోలికే నీ మోము చూస్తూ యుగాలయిన గడిపేయవచ్చు అని అనిపించింది.రోజు రోజుకీ నీ అందము తో పాటు నీ వ్యక్తిత్వము,సంస్కారము,సభ్యత నిన్ను మరింత ఆరాదించేటట్లు చేశాయి.అన్నీ కలబోసిన పుత్తడి బొమ్మవు నీవు....నా తొందరబాటుతో నిన్ను చేజార్చుకోవడము నాకిష్టము లేదు.అందుకే నా ప్రేమ విషయము నీకు తెలుపలేదు.అయినా రోజు నిన్ను చూస్తూ నిన్ను ఆరాదిస్తూ నాలోనే నా ప్రేమను దాచుకుని ఆనందముగానే గడిపాను.ఈ అందాల బొమ్మ సుగుణాల రాశిని నా సొంతము చేసుకోవాలంటే సరి అయిన పద్దతిలోనే వెళ్లాలని చాలా ఆలోచించాను.మా ఇంటిలో చెబితే ఎలా స్పందిస్తారో అని ఆలోచిస్తూ,నీ జ్ఞాపకాలలో విహరిస్తూ గెడ్డాన్ని పెంచుకుని దేవదాసులా తిరుగుతున్న నాకు విషయము ఏమిటని అమ్మ గుచ్చి గుచ్చి అడిగింది.అమ్మ కదా!అన్నీ కనిపెట్టేసింది .నేను ఏమీ దాచలేక మొత్తము చెప్పేశాను.నా ఆలోచనని తనతో చెప్పేశాను.మీ ఇంటిలో నీకు పెళ్ళిచూపులు మొదలుపెడుతున్నారని తెలుసుకున్నాను.మనము అమ్మాయిని చూడడానికి వెళ్ళి పద్దతిగా అడుగుదామా అమ్మా!అని అమ్మని అడిగాను ......మా అమ్మ అందుకు అంగీకరించి నాన్న ని ఒప్పించి ఇక్కడ వరకు నన్ను తీసుకువచ్చింది.ఇప్పటికైనా నా మనసులో మాట నీకు చెప్పక పోతే నువ్వు మీ నాన్న చెప్పినట్లే విని నన్ను ఎక్కడ కాదంటావో అనే భయానికి ముందే నీతో మాట్లాడాలని కోరాను.ఈ ధీనుడను ఇప్పటికైనా కనికరిస్తావా రేవతి’’ అని మోకాకాళ్ళ మీద కూర్చుని ఎక్కడినుండి తీశాడో తెలియదు చేతిలో గులాభి పట్టుకుని నాకు అందిస్తూ అభినయ నయనాల సోగ్గాడు చిరుచూపు ముసిముసి జల్లువాన కురిపించాడు,నా చిరు యెద తడిసింది ఆవానలో............,తన త్వరితానికి తబ్బిబ్బింది నా స్వాంతనము.ఇంక ఏమి చేస్తాను కాదనలేక పోయాను.నాన్నని ఒప్పించగలననే ధైర్యముతో గులాభీని అందుకుని అంగీకారాన్ని తెలిపాను.నా జీవితములో ఇంత అందముగా.... ఇంత పద్దతిగా......అదీ నాకు ......ఇలా లవ్ ప్రపోజల్ వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు.నా హృదయమంతా ఆనందముతో నిండిపోయింది.ఇంతలో క్రింద నుండి మాకు పిలుపు రావడముతో ......క్రిందికి దిగాము.నాన్న రేవంత్ వాళ్ళ నాన్న గారితో ఏవో మాట్లాడుతున్నారు.కాసేపటికి ఎక్కడివాళ్లు అక్కడికి వెళ్ళిపోయారు.నేను గబగబా మెడపైకి వెళ్ళాను.కారులోకి ఎక్కుతూ రేవంత్ చూపులు నన్నే వెతుకుతున్నాయి.అంతలోనే పైకి చూశాడు నన్ను.చిన్న చిరునవ్వుతో నాకు టాటా చెప్పాడు.వాళ్ళు వెళ్ళిన తరువాత అమ్మ నాన్న ఏవేవో మాట్లాడుకుంటున్నారు.తరువాత మళ్ళీ నిశ్శబ్దం. ఆ రోజు రాత్రి అంతా నాకు రేవంత్ జ్ఞాపకాలే.........అతను తన ప్రేమ ను తెలిపిన తీరు,అతని మాటలు,నవ్వు పదేపదే గుర్తుకువచ్చాయి.ఆ రాత్రి మొత్తం నా మనసంతా రేవంత్ ఆక్రమించుకున్నాడు ఏమాయచేశాడో మరి...........ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలియలేదు.పొద్దున్న నిద్ర లేచేసరికి అమ్మతో నాన్న అన్న మాటలు నా చెవిన పడ్డాయి.ఖచ్చితముగా అవి రేవంత్ కి సంబంధించినవే.                                    ‘’నిన్న చూసి వెళ్లారో లేదో అప్పుడే అమ్మాయి నచ్చింది మీ సమాధానము కోసము చూస్తున్నాము త్వరగా నిర్ణయము తెలపండి అంటూ ఫోన్ చేశారు.

‘’అవునా అండి...ఎప్పుడు చేశారు?’’  

‘’ అరె అంత తొందరపడితే ఎలా ......మంచీ చెడు నలుగురిని అడిగి తెలుసుకోవద్దూ!, ఇందాకనే ఫోన్ చేశారులే!’’                 ‘’మన అమ్మాయి వాళ్ళకి అంత బాగా నచ్చింది మరి ....దీనికి సంతోషించక అలా చిర్రుబుర్రులాడతారెందుకు’’?     అమ్మ అంటూ ఉంటే నేను నవ్వు ఆపుకోలేక పోయాను.అది చూసి నాన్న                              ‘’రా బంగారు తల్లి రా నువ్వు చెప్పింది నిజమేనే! మన బంగారము ఎవరికయిన ఎందుకు నచ్చదు?’’          అని నన్ను గారం చేశారు.                                                     ‘’అమ్మాయిని అలా పొగుడుతూ ఉండకపోతే అబ్బాయి వాల్లగురించి వాకబు చేయకూడదూ!’’               ‘’సరే దీనికి ఏమివచ్చినా ఆపలేము నేను బయలుదేరుతున్నానురా తల్లి’’                                   అని నాన్న బయటకి వెళ్ళిపోయారు.అలా రెండు రోజులు గడిచిపోయాయి.                                 అమ్మనాన్న మళ్ళీ మాట్లాడుకుంటున్నారు,అబ్బాయి గురించి…….                                      ‘’అందరూ మంచిగానే చెబుతున్నారు,కుటుంబానికి కూడా మంచి పేరు ఉంది,మంచి ఆస్తిపరులే,ఈడు జోడు బాగుంది’’          ‘’మరి దేనిగురించి మీ ఆలోచన?’’                                                      ‘’అన్నీ బాగానే ఉన్నాయి కానీ మొదటి చూపులకే మనమెందుకు కంగారుపడాలి?ఇంకా మంచివి సంబంధాలు వస్తాయేమో కదా!’’ 

‘’మీరు చెప్పింది వాస్తవమే,మరి ఆలోచించండి’’.                                                         ఆమాటలు వినగానే నాకు దిగులు పట్టుకుంది.....ఇప్పుడు ఎలా ......ఏమి చేయాలి?మనసు పరిపరివిదాలుగా ఆలోచించసాగింది ...........రేవంత్ వాళ్ళ ఇంటి నుండి కబుర్ల మీద కబుర్లు చేస్తూనే ఉన్నారు మీ నిర్ణయము తెలుపండి అని ........నాకు తెలుసు ఇదంతా రేవంత్ పనే అని.......కానీ నాన్న కి కోపం వచ్చి ఎక్కడ ఈ సంబంధం వద్దని చెబుతారేమో అని ఒక ప్రక్క అనుమానం మొదలైంది.......అందుకే ఇక లాభం లేదని ఒక నిర్ణయానికి వచ్చి ఒక కాగితము మీద ఇలా రాశాను ‘’నాన్న నాకు రేవంత్ నచ్చాడు అతనితో పెళ్ళి నాకు సమ్మతమే’’ అని వ్రాసి నాన్న కళ్ళద్దముల బాక్స్ క్రింద పెట్టాను.ఒక రోజు తరువాత అమ్మ నాదగ్గరకొచ్చి...                               ‘’కాగితము పెట్టే ముందు నాకు చెప్పవా’’?                                            ‘’ఏమయిందమ్మ! నాన్న కోపగించుకున్నారా?’’                                              ‘’మీ నాన్న చూడక ముందే ఆకాగితాన్ని నేను చూసి చించి చెత్తబుట్టలో పడేశాను’’.

‘’ఎందుకని చించేసావమ్మా’’?

‘’ఎందుకో మీ నాన్న ఎలా స్పందిస్తారోనని భయము పుట్టి చించేశాను. తరువాత మీ నాన్న రేవంత్ విషయమై నాతో మాట్లాడుతూ ఒక నిర్ణయానికి రాలేక పోతున్నాను అని అన్నప్పుడు రేవతి కి ఇష్టమే అని నేను అన్నాను నీకెలా తెలుసు అని అడిగినపుడు నువ్వు రాసిన చీటి గురించి చెబితే మీ నాన్న నమ్మలేదు. నా కూతురు అలా వ్రాయదే అని అన్నారు అప్పుడు చించి పడేసిన కాగితము ముక్కలన్నీ ఒక చోట పేర్చి మీ నాన్న చదివారు తరువాత మారు మాట్లాడకుండా బయటకి వెళ్ళిపోయారు’’అమ్మ చెబుతూ ఉంటే నాలో ఒకటే కంగారు మొదలైంది నాన్న ఏమనుకుంటున్నారో నా గురించి అని.......ఈ బుద్ది చీటీ పెట్టక ముందు ఉండాలి ఇప్పుడనుకుని ఏమి లాభం ఏమి చేయను రేవంత్ మీదున్న ప్రేమ అలా చేయించింది .....ఇలా నాలోనే ఎన్నో ప్రశ్నలు సమాదానాలు ......ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత నాన్న రేవంత్ కి నాకు పెళ్ళి నిశ్చయించారు.ఆరోజు నా ఆనందానికి అవదులు లేవు.పసుపుకుంకాలు ఇచ్చిపుచ్చుకున్నారు.ఆరోజు రేవంత్ కి నాకు ఎంతో అపురూపమైన రోజు ఉంగరాలు మార్చుకున్నాము,కళ్ల తోనే ఎన్నో ఊసులు చెప్పుకున్నాము,బాసలు చేసుకున్నాము.మొత్తానికి సాధించావ్ బాస్ అని సుమ రేవంత్ పై చతురులు వేసింది.నాన్న అని కళ్ళతో సుమని మందలించాను.మూఢము రావడము వలన పెళ్ళి ముహూర్తము మూడునెలలు వాయుదా పడింది.

   ఒక రోజు రేవంత్ వద్ద నుండి ఉత్తరము వచ్చింది నాకు.అదే నా మొదటి ప్రేమ లేఖ .......అందుకున్నాను లేఖ ఆనందముగా,రుచిచూశాను ఆత్రముగా .........ఆస్వాదించాను లేఖ లోని పరిమళాలను .....ఎంత బాగా రాశాడు.....కవులకైనా సాధ్యమా ఆ వర్ణనా అనిపించింది.....అంతా బాగా రాశాడు.....ప్రియా అని వ్రాద్దామంటే ఆపదము సరిపోదనిపిస్తుంది రేవతి అని సంభోదిద్దామంటే చిన్నదనిపిస్తుంది .....ఇంకా ఏవేవో ....మోడులాంటి ఈ జీవితములోకో చిగురులా ప్రవేశిస్తావని నీకోసం చకోర పక్షిలా ఎదురు చూస్తూ నీ రేవంత్ .....అని చాలా బాగా రాశాడు.ఉత్తరం చదువుతూ నాలో నేనే మురిసిపోయాను.రేవంత్ నాకు ఉత్తరం వ్రాసిన విషయం నాన్న కి తెలిసి ఇలాంటివి పెళ్ళికి ముందు నేను అనుమతించను అని ఖచ్చితముగా చెప్పేశారు.....వాళ్ళ భయాలు వాళ్ళకి ఉంటాయి కదా.....అందుకే ....ఏమి చేస్తాను మరి ...నా భావాలన్నీ కవితలు,ఉత్తరాల రూపము లో వ్రాసుకుని వాటిని భద్రపరుచుకున్నాను.అయితే రేవంత్ వ్రాసిన ఉత్తరాన్ని దొంగచాటుగా రోజూ చదువుకున్నాను.ఎందుకంటే అదే నా మొదటి ప్రేమ లేఖ కదా....మరి......

     మూడు నెలలు మూడు యుగాలుగా గడిచాయి మా ఇద్దరికీ.మొత్తానికి ఆ శుభ తరుణము రానే వచ్చింది.మా పెళ్ళి అంగరంగ వైభవము గా జరిగింది.ఇరువైపుల నుండి పెళ్ళికి పిలిచిన అందరూ వచ్చి మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.అప్పగింతలు జరిగిపోయాయి.పంతులుగారు మాకు అరుందతి నక్షత్రం చూపిస్తుంటే రేవంత్ ‘’నా పక్కనే రేవతి నక్షత్రం ఉండగా మీరు మళ్ళీ వేరే చూపిస్తారేమిటి పంతులుగారు’’ అని అనేసరికి అందరూ ఒక్కసారిగా పకపకా నవ్వారు.సరదా మనిషే అని అనుకుని నేను నవ్వుకున్నాను.అందరూ అప్పగింతల సమయములో ఏడుస్తారని విన్నాను,కానీ నాకు ఏడుపురాలేదు బహుశా ఆదేఊరిలో ఉంటానానో లేక మనసుకి నచ్చిన వాడిని చేసుకుంటున్నానానో మరి తెలియలేదు.మా నాన్నకి నేను ఏకైక కూతురిని అవడము వలన చిన్నాన్న కొడుకు తమ్ముడి స్థానములో ఉండి చేయవలసిన అన్నీ కార్యాలు పూర్తి చేశాడు.హోమము చుట్టూ తిరుగుతున్నపుడు రేవంత్ నా వెనుక నిల్చోని తన చేతులని నా నడుముకు ఇరువపుల నుండి నాచేతుల కింద తన చేతులను ఉంచి హోమము లో పేలాలు వేస్తున్నపుడు రేవంత్ నాకు అత్యంత సమీపముగా రావడము అదే తొలిసారి.అతని బాహువులలో బందీని అయిపోయినట్లుగా,అతని శ్వాస నాకు అత్యంత సమీపముగా తన చేతులు నా చేతులను తాకుతూ ఆ తొలి స్పర్శ లో నన్ను నేను మైమరిచిపోయాను.పెళ్లి లో ప్రతీ తంతు ని ఆస్వాదించాము ఇరువురము.అన్నీ ముగిశాక అత్తవారింటిలో అడుగుపెట్టాను.అంతా కొత్తగా గమ్మత్తుగా బిడియముగా ఏదో తెలియని కంగారూ ఆవహించాయి నన్ను ఒక్కసారిగా.....వ్రతము,రెసెప్షన్ అన్నీ చక్కగా జరిగాయి.అన్నట్లు అసలు విషయం చెప్పలేదు కదూ .....మంచి ముహూర్తాలు లేకపోవడం వలన శోభనము పదిహేనురోజులు వాయుదా పడింది.ఇంక ఈ పదిహేను రోజులు మా అవస్థలు చూడాలి.....ఎదుటపడతాము ఒక ముద్దుకూడా పెట్టుకోలేము.రేవంత్ నాకు దగ్గరగా వచ్చి ఏదో చేప్పడానికి ప్రయత్నించడం ......అంతలోనే ఏయ్ దూరం అని ఎవరో అరివడం .....అంతే బుంగమూతి పెట్టుకుని రేవంత్ అక్కడి నుండి వెళ్లిపోవడం......రోజు ఇదే తంతు .........బలే నవ్వు వచ్చేది నాకు రేవంత్ అవస్థ చూసి.....లోలోపలే తమాయించుకున్నాను నవ్వుని.ఒక రోజయితే రేవంత్ నాతో...                                      ‘’రాత్రి అందరూ పడుకున్నాక ఎవరికీ తెలియకుండా నెమ్మదిగా మేడ మీదకి రా రేవతి’’

‘’అమ్మో! నేను రాను రేవంత్,నాకు భయం’’

‘’భయమెందుకు?నేనున్నానుగా!’’

‘’నువ్వున్నావనే నా భయం ఏమి చేస్తావో అని.....’’

‘’ప్లీజ్ రేవతి ప్లీజ్ రావా?’’

‘’సరే ప్రయత్నిస్తాను రావడానికి’’

‘’ప్రయత్నం కాదు తప్పకుండా రావాలి ఎదురు చూస్తూ ఉంటాను.....’’

‘’సరే’’అని చెప్పి అక్కడినుండి వెళ్లిపోయాను.                                                               

                                                                                                                                                                                                        వస్తానని చెప్పాను గాని ఒకటే భయం......వెళ్ళనా,వద్దా?ఇలా చాలా సేపు ఆలోచించాను.ధైర్యం చేసి వెళ్దామని లేచాను.....నాకు తోడుగా మా మేనత్త నాతో కూడా మా అత్తగారింటికి వచ్చింది,నేను లేవడము గమనించి ‘’ఎక్కడికి’’?అని అడిగింది అంతే ఒక్కసారిగా గుండె జారినట్లనిపించింది.’’ఏమీ లేదు అత్తా’’! అని .....ఏదో చెప్పబోతుంటే ‘’నాకు తెలుసులేవే అబ్బాయి రమ్మన్నాడు కదా’’! అంది నీకెలా తెలుసు అని ఆశ్చర్యము గా చూశాను ‘’ఇవన్నీ దాటుకుని వచ్చినవాల్లమేనే పిల్లా’’! అని పడుకోమంది అంతే వెంటనే దుప్పటి కప్పుకుని పడుకుండి పోయాను.పాపం రేవంత్ నాకోసం ఎదురుచూస్తూ ఉంటాడు.........అనుకుని పడుకుండి పోయాను.

       తెల్లారింది స్నానము అన్నీ ముగించుకుని గదిలోనుండి బయటకి వచ్చిన నా కళ్ళు రేవంత్ ని వెతుకుతూనే ఉన్నాయి......ఎక్కడా రేవంత్ జాడే లేదు ....నామీద బాగా కోపం వచ్చి ఉంటుంది అని అనుకుని వంట గదిలోకి వెళ్ళాను అక్కడా లేదు.తరువాత గమనిస్తే రేవంత్ నా చుట్టుప్రక్కలే తిరుగుతున్నాడు కానీ నన్ను తప్పించుకుని తిరుగుతున్నాడు.ఎందుకలా అని నాకు అనుమానము వచ్చి మొత్తానికి రేవంత్ ని పట్టుకుని........ ‘’విషయము  ఏమిటి ఎందుకు నన్ను తప్పించుకుని తిరుగుతున్నావు’’?                                ‘’సారీ రేవతి రాత్రి బాగా నిద్ర పట్టేసింది మేడమీదకి రాలేక పోయాను పాపం నువ్వు నాకోసం వచ్చిఉంటావ్ కదా’’!  నాకు కోపం వచ్చింది ........కానీ వెంటనే నవ్వు వచ్చేసింది...నేను నవ్వడం చూసి రేవంత్ .....

‘’ఎందుకలా నవ్వుతున్నావు?’’ 

‘’నేను కూడా రాలేదు’’ 

‘’అవునా!నువ్వూ రాలేదా? హమ్మయ్యా! నేనెంత కంగారూ పడ్డానో తెలుసా?’’

మేమిద్దరము నవ్వు ఆపుకోలేక పోయాము. అంతలోనే ఎవరో వస్తున్న అలికిడి అయ్యేసరికి ఎక్కడి వాళ్ళం అక్కడికి జారుకున్నాము.                                                          హోటల్ కి వెళితే టేబల్ కింద ఒకరి చెయ్యి ఒకరు పట్టుకోవడం....ఎవరికీ తెలియకుండా రహస్యముగా  మాట్లాడుకోవడం...దొంగతనముగా కలుసుకోవాలనుకోవడం అన్నీ బలే గమ్మత్తుగా జరిగాయి ఆ పదిహేను రోజులు....పెళ్లి అయిన తరువాత ప్రేమించుకోవడం.ఇది అందరికీ రాని అదృష్టం అని నేను ఆనందించాను.

      మొత్తానికి మేము ఎదురు చూసిన రోజు రానే వచ్చింది.అదేనండీ మా శోభనము రోజు.నన్ను మామేనత్త బాగా అలంకరించింది చెవిలో ఏవేవో చెప్పింది నాకు అవేమీ అర్దము కాలేదు నా మనసు నిండా రేవంత్ నిండి పోయిఉన్నాడు.పంతులుగారు వచ్చారు... దంపత తాంబూలాలు ఇప్పించారు మా ఇద్దరి చేత....బంతులాట ఆడిపించారు.....ఏవేవో తతంగాలు జరిపించారు. మొత్తానికి మమ్మల్ని గదిలోకి పంపించారు.ఎందుకో తెలియదు ఒక్కసారిగా సిగ్గు ఆవహించింది నన్ను...రేవంత్ నాకు దగ్గరగా వచ్చేసరికి నా గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది.కానీ రేవంత్ నన్ను దగ్గరికి తీసుకుని నీ గురించి మీ వాళ్ళ గురించి చెప్పు అన్నాడు ఇంక అంతే నా భయము,బిడియము అన్నీ ఒక్కసారిగా మాయామయిపోయాయి.అల్మారాలోనుండి ఒక ఫైల్ తీసి రేవంత్ చేతిలో పెట్టాను.ఏమిటి ఇది అన్నట్లు రేవంత్ నా వైపు ప్రశ్నగా చూశాడు. ‘’తొలి రాత్రి బహుమతి అని మెల్లగా చెప్పాను.నీకు చేరవేయలేని నా మదిలోని బావాలను అక్షరరూపములో వ్రాసి లేఖలుగా వ్రాసుకుని ఇన్నాళ్ళు నాదగ్గరే పదిలముగా దాచుకుని నీకు ఇస్తున్నాను వీటిని ప్రేమ లేఖలు అనుకుంటావో! నా మనో సుమాలుగా అనుకుంటావో! నీ ఇష్టం ఇది నా మొదటి ప్రేమ లేఖ’’ అని వివరించాను.వాటిని అందుకుని చదివాడు. ‘’ఎంత బాగా వ్రాసావు’’ అని నా పెదవులపై తొలి ప్రేమ సంతకము చేశాడు. అది మొదలుకుని తెల్లవార్లు మాట్లాడుతూనే ఉన్నాము ఇద్దరము.... అలా ఎప్పుడు పడుకున్నామో మాకే తెలియలేదు.మనసులు కలిసిన తరువాత మాటలు కలిసిన తరువాత తనువులు ఏకమయ్యాయి.రేవంత్ కౌగిలిలో గువ్వలా ఒదిగిపోయాను.

     మా అనురాగ బంధాన్ని చూసిన అందరూ మీది మేనరికమా?అని, ప్రేమ వివాహమా?అని అడుగుతున్నారు.ఏమి చెప్పాలో అర్దము కాక మాలోమేమో నవ్వుకుంటున్నాము. మధురమైన ప్రేమకు సాక్షిగా ముడిపడిన మా అపురూప బంధం పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహబంధం కదా మరి!..........


Rate this content
Log in

Similar telugu story from Drama