Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chethana Muppuri

Romance

3.6  

Chethana Muppuri

Romance

ఒక్కమాట

ఒక్కమాట

7 mins
890


మీది ప్రేమ వివాహమా.....?పెద్దలు కుదిర్చిన వివాహమా? అన్న ప్రశ్న వినపడగానే....... చందూ వైపు చూశాను............

చందూ నవ్వుతూ..... నా వైపు చూసి ప్రేమ వివాహమే అన్నాడు.

నేను ఆశ్చర్యంతో..... కొంచెం కంగారుగా (నా మనసులోది ఎలా తెలిసిపోయింది అని ) అలానే చూస్తుండిపోయాను......


@@@@@@@@@


స్వేచ్ఛని ఇష్టపడే చాలా మంది అమ్మాయిల్లో నేనొకదాన్ని...........

కొంచెం రెసెర్వ్డ్ టైప్...... ఫ్రెండ్స్ తక్కువే...... కానీ నాతో స్నేహం చేసినవారు మాత్రం మనల్ని అస్సలు వదులుకోరు.......

రెసెర్వ్డ్ టైప్ అంటే..... చదువులలో తోపు అనుకుంటారేమో..... ఎబోవ్ అవేరేజ్ అంతే.....

జీవితంలో ఉన్న ఏకైక డ్రీమ్ (మే బి ఫాంటసీ అనాలేమో )లవ్ మ్యారేజ్ చేసుకోవడం.....

జాబ్...... కార్స్.... బిజినెస్..... worldtour.... లాంటి డ్రీమ్స్ కాకుండా ఇలాంటి aim పెట్టుకోవడానికి..... రీసన్.......

ఇంట్లో కానీ..... రెలెటివ్స్ ఫామిలీస్ లో కానీ..... ఒక్క లవ్ మ్యారేజ్ లేదు....... అన్ని పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లే..... మనం ట్రెండ్ సెట్ చేయాలి కానీ ఫాలో అవ్వడమేంటి 😉😉😉😉....

అందుకే.... లవ్ మ్యారేజ్ చేసుకోవడమే మన డ్రీమ్.....

కానీ..... ఇంట్లో అందరూ..... లవ్ మ్యారేజ్ అంటేనే .... అటువంటి పెళ్లిళ్లకి కూడా తీసుకెళ్లారు...... అందుకే.....నా డ్రీమ్ నిజమయ్యే ఛాన్స్ లేదేమో.... నాది డ్రీమ్ కాదు ఫాంటసీ అనిపిస్తుంటుంది.....

ఇంకా చెప్పాలంటే.......

మా ఫ్రెండ్స్ వాళ్ల ఇంట్లో...... బాయ్స్ ఫ్రెండ్స్ ఉండొచ్చు కానీ బాయ్ ఫ్రెండ్ ఉండకూడదు..... అని చెప్తే.......

మా ఇంట్లో........ :

(10త్ వరకూ )

డాడ్ ఫ్రెండ్స్ :అమ్మాయి ఎక్కడ చదువుతుంది?

డాడ్ :సరస్వతీ గర్ల్స్ హై స్కూల్ ......

(ఇంటర్ లో )

నా ఫ్రెండ్ :అమ్మాయిని ఇంటర్ కి ఎక్కడ చేర్పిస్తున్నారు అంకుల్...?

డాడ్ :శ్రీరామ్ లేడీస్ జూనియర్ కాలేజ్ లో చేర్పిస్తున్నాను అమ్మ....

(ఇంటర్ తర్వాత )

నేను :నాన్న మంచి ర్యాంక్ వచ్చింది కదా..... ఏదైనా యూనివర్సిటీ లో జాయిన్ అవుతాను నాన్న....

డాడ్ :ఎందుకమ్మా..... దగ్గర్లో ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉందికదా..... అక్కడ ఫాకల్టీ.... ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయట....... మనకి దగ్గర్లో కూడా ఉంది..... అక్కడ జాయిన్ అవుదువులేమ్మా.....

ఇదండీ సిట్యుయేషన్....... ఇక బాయ్ ఫ్రెండ్ లేడు ..... బాయ్స్ ఫ్రెండ్స్ లేరు.....

బోరింగ్ లైఫ్...... ఇక ఎటు వంటి అనవసరమైన వ్యాపకాలు లేకపోవడంతో...... బాగా చదవాల్సి వచ్చింది..... దాని ఫలితంగా..... క్యాంపస్ ప్లేసెమెంట్స్ లో జాబ్ వచ్చింది.....

@@@@@@@

జాబ్ లొకేషన్ వైజాగ్......

అక్కడికి వెళ్తే..... రెస్ట్రిక్షన్స్ ఉండవు..... ఇష్టమొచ్చినట్టు ఉండొచ్చు ....... స్వేచ్ఛగా విహరించవచ్చు...... అనుకున్నాను.....

కానీ...... అమ్మానాన్నల్ని వదిలి అస్సలు వెళ్లాలనిపించలేదు..... అప్పుడు.... అమ్మ.... కష్టపడి చదివి జాబ్ తెచుకున్నావ్...... నువు ఇండిపెండెంట్ గా , ధైర్యంగా ఉండాలి...... ఇప్పటి వరకూ.... ప్రపంచాన్ని నువు చూసిన కోణం వేరు.... ఇప్పటి నుండి వేరు...... ఎలాగో ఫ్రీ బర్డ్ లా ప్రపంచం మొత్తం తిరగాలి అంటూ ఉంటావుగా....... వైజాగ్ బాగుంటుందంట...... ఎంజాయ్ చెయ్..... అని చెప్పి సాగనంపింది.....చూదాం మన డెస్టినీ ఎలా ఉందో అని city of destiny కి పయనమయ్యాను........

@@@@@@

నలుగురు కొలీగ్స్ మి కలిసి ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ తీసుకున్నాము...... ఉదయాన్నే..... నిద్రలేవగానే ........ నా పిచ్చి నంతా భరించే ...... అమ్మానాన్న నా దగ్గర లేరు అని విషయం గుర్తురాగానే..... డల్ ఐపోయేదాన్ని..... మెల్లిగా నా రూంమేట్స్ అలవాటు అయ్యారు..... ఎంతైనా అమ్మని మిస్ ఐయినా ఫీల్ ఉండేది.....

ఇలా ఒక ఆరు నెలలు గడిచిపోయింది.......... ఆఫీస్ లో ఉండగా వర్క్ తో టైం గడిచిపోయేది...... ఫ్లాట్ రావడంతోనే ఎక్కడలేని ఒంటరి తనం ఆవరించేది..... మిగతా ముగ్గురు..... ఫోన్ లని అస్సలు వదిలిపెట్టారు..... ఎలా వదులుతారులే..... వారిదైన ప్రేమ ప్రపంచంలో విహరిస్తూ ఉండేవారు......

ఈ ఆరు నెలలో అరడజను ప్రొపొసల్స్ వచ్చాయి...... చాలా polite గా అందరికి నో చెప్పాను.......

ఇలా ఐతే నీ డ్రీమ్ ..... డ్రీమ్ గానే మిగిలిపోతుంది అన్నారు అంతా.......

కానీ మనసులో ప్రేమ అంటూ ఉంటేనా కదా ఎస్ చెప్పగలం...... అని లైట్ తీసుకున్న ....


@@@@@@@


ఒకరోజు ఆఫీస్ నుండి వచ్చి చూస్తే...... ముగ్గురు ఫోన్ లలో బిజీగా ఉన్నారు..... హ్మ్మ్ బోరింగ్ లైఫ్ అనుకొని ఫ్రెష్ అయ్యి....... చేతన్ భగత్ నొవెల్ పట్టుకొని టెర్రస్ మీదకి వెళ్ళాను.....

చాలా ప్రశాంతంగా అనిపించింది....... కైలాసగిరిని చూస్తూ ఉన్నా....... మేఘాలు చుట్టూ కమ్ముకుంటున్నాయి....... వాతావరణం మొత్తం చల్లగా..... ఆహ్లాదకరంగా మారిపోయింది...... అలా ప్రకృతి ని ఆస్వాదిస్తూ ఉన్నా..... చాలాసేపు....... ఈలోపు ఇద్దరూ చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉన్నారు..... నేను మెట్లమీద కూర్చొని మై ఫేవరెట్ చేతన్ భగత్ నొవెల్ ఓపెన్ చేశాను.... ఆ పిల్లలు ఇద్దరూ నా దగ్గరికి వచ్చి ముద్దుముద్దుగా.....

అక్కా..... చదువుకుంటున్నావా అని అడిగారు......

అవునమ్మా......

మీకు ఎగ్జామ్స్ ఉన్నాయా అక్కా.....?

😆😆😆😆 లేదమ్మా.....

మరి హోమ్ వర్క్ ఇచ్చారా అక్కా......?

🤣🤣🤣🤣🤣కాదు.....

.

.

.

.

.

.

ఇలా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను.....

మనసు పులకరించేలా చిరు జల్లు కురవడం ప్రారంభమైంది....... ఒక్కసారి కళ్ళుమూసుకొని నన్ను తాకుతూ గిలిగింతలు పెడుతున్న చల్లని పిల్ల గాలిని ..... కవ్వించే చినుకులని ఆస్వాదిస్తున్నాను.....

అక్కా నువు డైలీ ఇక్కడికి వస్తావా.....?

ఈలోపు ఒకతను వాళ్ళని పిలుస్తూ పైకి వచ్చాడు.....

కళ్లు తెరిచి చూసేసరికి......

బ్లాక్ blazer లో..... గాగుల్స్ పెట్టుకొని.....చాలా handsome ఉన్నాడు అతను........ గాలికి చెదురుతున్న తన హెయిర్ ని అలా చేత్తో adjust చేస్తూ..... అబ్బా..... అంతబాగున్నాడో......

అలా అనుకుంటూనే..... టక్కున మొహం బుక్లో దూర్చేసాను......

సరే అక్కా..... అన్నయ్య పిలుస్తున్నాడు.... మేము వెళ్తాము బాయ్ అని చెప్పి వెళ్లిపోయారు వారు.....

@@@@@@@@

నైట్.... పడుకున్నానే గాని ..... అతనే గుర్తొస్తున్నాడు..... అబ్బా ఎందుకు అలా.... చేశాను..... ఇంకొంచెం సేపు తనని చూడాల్సింది..... అని తెగ ఫీల్ అయ్యాను....

తర్వాత రోజు.......

ఆఫీస్ నుండి రాగానే ...... ఫోన్ .... హెడ్ఫోన్స్ పట్టుకొని టెర్రస్ మీదకి వెళ్ళాను......

ఇళయరాజా సాంగ్స్ వింటున్న........ అమ్మ ఫోన్ చేసింది..... మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతున్నాను....... అప్పుడే వచ్చాడు హీరో టెర్రర్స్ మీదకి...... ఎందుకో తెలియదు..... కంగారుగా అనిపించి కిందకి వెళ్ళిపోయా.......

నైట్ మళ్లీ నాతో నాకే యుద్ధం స్టార్ట్.....

inner voice:ఎందుకు అలా వచ్చేసావు.....

తనని చూడగానే..... కంగారుగా అనిపించింది.....

inner voice:ఎందుకు కంగారు.......

ఏమో..... తెలియట్లేదు.....

inner voice:నువు ఇలా ఇంట్రావర్ట్ గానే ఉంటావా.... ఇలా ఉంటే నీకు ఈ జన్మలో లవ్ మ్యారేజ్ అయినట్టే......

😳😳😳😳😳☹️☹️☹️☹️

నో..... ఈసారి అతను కనిపిస్తే కచ్చితంగా మాట్లాడతాను......

inner voice:చూద్దాం.....

@@@@@@@@@

తర్వాతి రోజు evening మెట్లమీద కూర్చొని సాంగ్స్ వింటుండగా ఇద్దరూ పిల్లలు బుక్స్ పట్టుకొని వచ్చారు ........ ఒకరికి మాథ్స్ డౌట్ ఉంటే చెప్పాను.....

ఇంకా ఇతను రాడేంటి అని ఎదురు చూస్తున్నాను......

ఇంకొక అమ్మాయి...... అక్కా నేను స్పెల్లింగ్ చదువుతాను..... నువు ప్రొనౌన్సియేషన్ చెప్తావా అని అడిగింది.......

సరే అని స్టార్ట్ చేసాం.....

cat.....క్యాట్

dog.....డాగ్

apple...... ఆపిల్

...

.

.

.

.

zebra...... జీబ్రా

.

.

.

.

chandu....... చందూ.....

అది మా అన్నయ్య నేమ్ అక్కా......

oh

అన్నయ్య.... అని తను గట్టిగా అరిచేసరికి అటు తిరిగి చూశాను....

నిజంగా....... చంద్రుడే....... ఎంత చక్కగా ఉన్నాడో..... కానీ రెడ్ teeshirt లో సూర్యుడిలా వెలిగిపోతున్నాడు........ చూపు తిప్పుకోలేనంత అందంగా ఉన్నాడు.......

నవ్వుతూ నన్నే చూస్తున్నాడు...... నాకు చాలా సిగ్గు అనిపించి తల దించుకున్నాను......

అతని పేరు పలకడం........ అతను నవ్వడం....

నాకు తెలియకుండానే నాకు సిగ్గు ముంచుకొచ్చి బుగ్గలు ఎరుపెక్కాయి......

inner voice :చూడు..... ఎందుకు తల దించుకున్నావ్.....

no.....నా వల్ల కాదు......

i.v:ఇప్పుడు చూడకుండా తర్వాత బాధపడు.....

ఈలోపు....

బాయ్ అక్కా అని చెప్పి ....... ఆ పిల్లలు వెళ్లిపోయారు.... వాళ్ళ వెనకే..... అతను వెళ్ళిపోయాడు.......

ఆ తర్వాతా అతను ఎప్పుడు అతను అనిపించలేదు.........

ఆ పిల్లలు కూడా కనిపించలేదు..... అతనిగురించి తెలుసుందామంటే...... ☹️☹️☹️☹️☹️☹️

@@@@@@@

వర్షం వచ్చినప్పుడల్లా........ ఫస్ట్ టైం అతనిని చూసినదే గుర్తొచ్చేది.....

తను చివరి సారిగా నన్ను చూసి అతను నవ్వే గుర్తొచ్చి నాలో నేను మురిసిపోతుండేదాన్ని......

అతను ఎక్కడున్నాడో అని వెతకడం మొదలుపెట్టాను........ ఒక్కసారి ..... ఒకే ఒక్కసారి అతను కనిపిస్తే...... బాగుండు అని ఎన్నిసార్లు అనుకున్నానో లెక్కేలేదు......

పరిచయం లేని వారి కోసం పరుగులు పెట్టే మనసు.. మాట వినకుండా అల్లరి చేసే వయసు.......

తనకోసం వెదికేలా చేసాయి......

కానీ తను కనిపించలేదు.

@@@@@@@

నెల రోజుల తర్వాత వీకెండ్కి ఇంటికి రా అని చెప్పి అమ్మ కాల్ చేసింది సరేనని చెప్పి బాగ్ సర్దుకుని బయలుదేరాను.

బస్సు బయలుదేరింది....... ఆకాశాన్ని మేఘాలు కమ్మేశాయి...... వర్షం కురవడం మొదలయ్యింది...... అతని గురించిన ఆలోచనలు మనసును కమ్మేశాయి..

అతని గురించిన ఆలోచనలలో ఉండగానే దిగాల్సిన స్టేషన్ వచ్చేసింది బస్సు దిగి ఇంటికి వెళ్లాను........

అమ్మానాన్న చూడగానే ఎక్కడలేని సంతోషం వచ్చేసింది. ఆ రోజంతా అమ్మానాన్నలతో హ్యాపీగా గడిపేసాను. తర్వాత రోజు ఉదయాన్నే...... టిఫిన్ చేసి టీవీ చూస్తూ కూర్చున్నాను......

అమ్మ వచ్చి....... నాన్న నీ కోసం సంబంధాలు చూస్తున్నారు. ఒకసారి ఫోటో చూసి నీకు ఓకే అయితే రేపే పెళ్లి చూపులు అని చెప్పింది.

కాళ్ళ కింద భూమి కంపించినట్టు అనిపించింది......... నా ఆశల సౌధం కూలిపోతున్నట్టు అనిపించింది.

అమ్మ నాకు ఇష్టం లేదని ఇప్పుడే పెళ్లి చేసుకోను అని చెప్పాను.

ఎందుకు అమ్మాయి....... ఎవరినైనా ప్రేమించేవా.....?

అడిగింది అమ్మ.

(మనసులో..

అవునమ్మా..... అతనిని చాలా ఇష్టపడుతున్నాను...... కానీ అతని పేరు తప్ప నాకేం తెలియదు...... ఇంకా తన గురించి ఏం చెప్పమంటావు నీకు...... )

అమ్మ..... అది......

ప్రేమ.... లాంటి వేమైనా ఉంటే నీ మనసులోనే దాచిపెట్టుకో....... నాన్నగారి గురించి తెలుసుగా ఏదేమైనా తను చూసిన సంబంధమే ఖాయం చేస్తారు. నువ్వు కాదు ప్రేమ.... ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుంటాను ఇలాంటి అని అన్నావంటే ఈ సంబంధాలు కూడా కాకుండా ఎవరినైనా తీసుకు వచ్చి వెంటనే పెళ్లి చేసేస్తారు.....

ఆటంబాంబ్ ని పేల్చి కామ్ గా వెళ్ళిపోయింది అమ్మ.

నాకు ఏం చేయాలో తెలియలేదు....... ఆలోచిస్తుంటే....

అమ్మ వచ్చి ఫోటో చూసావా అని అడిగింది.

నాకు పెళ్లి చేసుకోవాలని లేదు.... అని గట్టిగా అరిచాను.

ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేసుకుంటావు అమ్మ ఇంకా గట్టిగా అరిచింది.

లైఫ్ లో ఫస్ట్ టైం అమ్మ అంత గట్టిగా మాట్లాడడం చూసింది........ అలాగే షాక్ లో ఉండిపోయా....... ఫోటో చూడు అని చూపించ పోయింది ఎలాగో నాకు ఇష్టం లేకుండానే పెళ్లి చేస్తున్నారు గా మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని కోపంగా వెళ్ళిపోయాను.....

తర్వాత రోజు వైజాగ్ వెళ్ళిపోయాను.......

తనని గురించి ఇంకా ఆలోచిస్తూ ........ తననే తలచుకుంటూ ఉన్నాను........ ఒకేఒక్కసారి అతను కనిపిస్తే బాగుండు........ అని అనుకుంటూ ఉన్నాను.

@@@@@@@@@


వారం రోజుల తర్వాత అమ్మ మళ్ళీ ఫోన్ చేసింది ఇంటికి రమ్మని, నేను రాను అని కోపం గా అన్నాను.

నిన్ను చూడాలనిపిస్తుంది అని సెంటిమెంట్ డైలాగ్స్ కొట్టి అమ్మ నన్ను ఇంటికి రప్పించివేసింది.

ఇంటికి వెళ్లేసరికి.... బంధువులంతా ఇంటికి వచ్చి ఉన్నారు వాళ్లందర్నీ చూడగానే చాలా కంగారుగా అనిపించింది ఏం జరుగుతుందో అర్థం కాలేదు భయమేసింది పరుగులాంటి నడకతో ఇంట్లోకి వెళ్లాను.

అమ్మ అమ్మ అని గట్టిగా అరుస్తూ ఉన్నాను.....

అమ్మ నవ్వుతూ వచ్చి.... వాటర్ ఇచ్చింది గబగబా బాటిల్ మొత్తం తాగేసాను.

ఏంటమ్మా ఇంత మంది వచ్చారు అని మెల్లిగా అమ్మ చెవిలో అడిగాను......

నీ ఇష్టాన్ని మేమందరం ఎలా మిస్ అవుతాం....... అటు వైపు వస్తూ చెప్పింది సుష్మ అక్క.

ఒక్క నిమిషం నాకు ఏమి అర్ధం కాలేదు...... అమ్మ వస్తున్న అంటూ వెళ్ళి పోతుంటే తన చేయి పట్టుకొని రూమ్ లోకి తీసుకువెళ్ళాను........

ఒక గంట మంతనాలు తర్వాత నేనే తగ్గి నిశ్చితార్దానికి ఒప్పుకోవలసి వచ్చింది......... లేదు లేదు అమ్మ ఒప్పించివేసింది...... 😏😏😏😏😏😏😏😏😏


అసలు ఫోటోలోకూడా చూడని వ్యక్తితో నా నిశ్చితార్థం జరగబోతుంది....... ఆ సిట్యుయేషన్ నాకు అస్సలు నచ్చలేదు....

కసిన్స్ జోక్స్ వేస్తున్నారు.... అవేమి...... ఎంజాయ్ చేయలేకపోతున్నాను...... ఇప్పుడు కూడా నా కాబోయే భర్త ఫేస్ చూడలేదు.......... ఫోటోషూట్ కూడా ఐపోయింది....... నేను అస్సలు హ్యాపీగా లేను....... తల దించుకొని ఉన్నాను....... అందరూ సిగ్గుపడుతున్నానుకున్నారు....... అందరూ జోక్స్ వేసుకుంటున్నారు........ నేను అక్కడ అన్యమనస్కంగా ఉన్నాను.

నేను మీకు నచ్చలేదా అండి..... ఎప్పుడు నన్నుచూసి తలదించుకునేవారు........ ఇప్పుడు అసలు నా మొహం కూడా చూడట్లేదు.......

అని అడిగాడు అతను.....

తలెత్తి తనని చూసిన నేను షాక్.........

ఒక్కసారి గిల్లి చూసుకున్న............

ఎస్..... తను చందునే.........

మొహంలోకి నవ్వువచ్చి చేరింది...... తెలియకుండానే

చందూ.....

అన్నాను.

అతను అదే మైమరపించే నవ్వుతో నన్నే చూస్తున్నాడు.

@@@@@@@

అంగరంగ వైభవంగా..... ఆనందోత్సహాలతొ జరిగింది మా పెళ్లి...... ....

రిసెప్షన్ లో...

అతని స్నేహితులతో ఒకరి వైఫ్ అడిగారు........

మీది ప్రేమ వివాహమా.....?పెద్దలు కుదిర్చిన వివాహమా?

ఆ ప్రశ్న వినపడగానే....... చందూ వైపు చూశాను............

చందూ నవ్వుతూ..... నా వైపు చూసి ప్రేమ వివాహమే అన్నాడు.

నేను ఆశ్చర్యంతో..... కొంచెం కంగారుగా (నా మనసులోది ఎలా తెలిసిపోయింది అని ) అలానే చూస్తుండిపోయాను......

@@@@@@

తర్వాత రోజు వ్రతం జరిగింది....... చందుతో మాట్లాడాలి...... అని రెండు రోజులనుండి చూస్తున్నాను అస్సలు కుదరడంలేదు...... అతనేమో... తన నవ్వుతో నన్ను కవ్విస్తున్నాడు..........


మూడో రోజు.....

తొలిరాత్రి.....

మనసులో అలజడితో గదిలోకి అడుగుపెట్టా .... చందుతో మాట్లాడాలని ........... తనని ఒక విషయం అడగాలని .......... తనకి ఒక విషయం చెప్పాలని చాలా ప్రిపేర్ అయ్యాను.

కానీ అతను నవ్వుతూ నన్ను చూస్తుంటే నన్నునేనే మర్చిపోయి తనని చూస్తున్నాను....

ఏంటి అమ్మాయి....... అలా చూస్తున్నావ్...... అని అతను అడగడంతో...... ఈలోకంలోకి వచ్చి..........

అతని ముగ్దమనోహర రూపాన్ని ..... అత్యంత అందమైన తన నవ్వులోని ఆకర్షణ నుండి తప్పించుకుంటూ ఒక్కోమాట కూడగట్టుకొని.............

మిమ్మల్ని ఒక విషయం అడగాలి....... మీకు ఒక విషయం చెప్పాలి అన్నాను.....

నవ్వుతూ నా దగ్గరికి వచ్చి నన్ను బెడ్ దగ్గరకి తీసుకొచ్చి కూర్చోబెట్టి...... నా చేతులు తన చేతుల్లోకి తీసుకోని ....

ఇప్పుడు అడుగు అమ్మాయి ఏం అడగాలి అన్నాడు....

అతని స్పర్శకి మనసు గాల్లో తేలిపోతుంది.... ఎలాగో మనది అరేంజ్డ్ మ్యారేజ్ కదా.......? లవ్ మ్యారేజ్ అని చెప్తున్నారేంటి అని అడిగాను.......

నవ్వుతూ నా కళ్ళలోకి చూస్తూ....లవ్ మ్యారేజ్ ఏ అమ్మాయి..... నేను నిన్ను లవ్ చేసే పెళ్లిచేసుకున్నాను...... ఫస్ట్ టైం నేను నిన్ను టెర్రస్ మీద చూశాను....తొలిచూపులోనే నచ్చేశావమ్మాయ్... తర్వాత నీతో మాట్లాడదామని ట్రై చేశా నువ్వు అస్సలు ఛాన్స్ ఇస్తేగా..... నన్ను చూసిన వెంటనే తలదించేసుకునే దానివి........... నా పేరు నువు పిలినప్పుడు నేనేంత ఆనందించానో... మాటల్లో చెప్పలేను. బాబాయ్ పిల్లలు నిన్ను అక్కా... అక్కా అని పిలుస్తుంటే ....... తను అక్కా కాదమ్మా వదిన అని చెప్పాను... అంతే అది విన్న పిన్నిబాబయ్..... అమెరికా వెళ్ళిపోతూ ...... ఈ విష్యం అమ్మానాన్నలకు చెప్పేసారు........ మా అమ్మానాన్నలు మీ అమ్మానాన్నల్ని కలిసి మాట్లాడి మన పెళ్లి కుదిర్చారు. అది అమ్మాయి జరిగింది.

నేను హ్యాపీగా తనని hug చేసుకున్నాను.... తను తను ఇంకా గట్టిగా హత్తుకొని..... చెవిలో ఏదో చెప్పాలన్నావ్..... అన్నారు.

నేను ట్రాన్స్ లో ఉన్నట్లు...... హా..... మీకు ఒక మాట చెప్పాలి అన్నాను....

కళ్ళలోకి చూస్తూ... చిలిపిగా నవ్వుతూ........ ఏంటి అమ్మాయి ఆ మాట ? అని అడిగారు.

నేను సిగ్గుపడుతూ అది..... అది....... ఐ లవ్ యు చందూ 😍😍😍😍😍😍😍.....

తను నవ్వుతూ నన్ను దగ్గరికి తీసుకోని.... ఐ లవ్ యు too😍😍😍😍😍 అని చెప్పాడు...... .......

@@@@@@@@

నేను చాలా హ్యాపీ....

నా చందూ నా తో ఉన్నందుకు.............

అలాగే నా కల తీరినందుకు 😉😉😉😉


@@@@@@@@@@



సమాప్తం 🙏🙏



Rate this content
Log in

Similar telugu story from Romance