STORYMIRROR

Tejaswini Balivada

Inspirational

4  

Tejaswini Balivada

Inspirational

ఒజ్జా!

ఒజ్జా!

1 min
379

సంఘమనే సాన మీద

శ్రీగంధపు చెక్కవోలె

 అరిగి అలసిపోతావు ఒజ్జా!

నీవు విజ్జెల పరిమళాలు వెదజల్లుతావు


అఆలను దిద్దించి అంకెలెన్నో నేర్పించి

క్రమశిక్షణతో చక్కని నడవడికనే నేర్పుతావు

కొవ్వొత్తి వలె నువు కరుగుతూ 

అజ్ఞానపు తిమిరాలను తొలగించి

జ్ఞానజ్యోతులనే వెలిగిస్తావు


నిచ్చెనెక్కి మేము పైపైకి ఎదుగుతుంటే-2

నిచ్చెనవై నీవు పడకుండా ఒడిసిపట్టి

మురిసిపోతావు మా ఎదుగుదలనే చూసి

దిశలెరుగని బాటసారికి మార్గమే చూపుతూ

తీర్చిదిద్దుతావు నీవు ప్రయోజకులుగా

అలుపెరుగని సహనశీలివై

నీ జీవితమును బోధనకే అంకితమిచ్చావుగా


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

More telugu poem from Tejaswini Balivada

Similar telugu poem from Inspirational