Dawath Sainath

Drama

5  

Dawath Sainath

Drama

విద్వాన్ష్

విద్వాన్ష్

4 mins
471



         ప్రేమ ఎప్పుడు ఎందుకు మొదలవుతుంది అనేది ఎవరికీ తెలియదు. ఒక వ్యక్తి ని ప్రేమించడానికి ఇది కారణం అని ప్రేమించిన వ్యక్తి చెప్పలేరు. 


అమ్మ నాన్న నీ ఎందుకు ప్రేమిస్తున్నావు అంటే ఇది కారణం అని చెప్పలేం. కారణం లేకుండా పుట్టేదే ప్రేమ. 


అల ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చుసిన, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చుసిన, చుసిన క్షణం లోనే నాలోన ప్రేమ పుట్టింది తను నా జీవితం అని అంటారు.


అల ప్రేమించిన వ్యక్తి నీ పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటారు, కానీ ప్రేమ నీ పెళ్లి వరకు తీసుకెళ్ళేది కొందరు మాత్రమే. 


కొందరు తమ ప్రేమని, పెళ్లి వరకు తీసుకెళ్లలేక మధ్యలోనే ఒదులుకుంటారు. ఒదులుకోడానికి కారణాలు ఎన్ని ఉన్న ప్రేమించిన వ్యక్తి మాత్రం గుండెల్లోనే ఉంటుంది, వాళ్ళ ప్రేమ ఎప్పటికి బ్రతికే ఉంటుంది.


              కొందరికి ఒక కోరిక ఉంటుంది జీవితం లో ఒక్కసారి అయినా సినిమాలో నట్టించాలి అని కానీ అందరికి అవకాశం దొరకడం కష్టం.


ఇంకా కొందరికి సినిమా దర్శకత్వం చేయాలి అని ఉంటుంది . అవకాశం దొరకదు ఒకవేళ దొరికిన డబ్బు ఉండదు , నటి నటులు దొరకరు ఇలా ఎన్నో కారణాలు ఉంటాయి. 


సినిమా దర్శకత్వం చేయలేక కొందరు షార్ట్ ఫిలిమ్స్ ( Short Films ) తీస్తు ఉంటారు. అల సినిమా దర్శకత్వం అవకాశం లేక తన ప్రతిభ చూపించాలి షార్ట్ ఫిలిమ్స్ తీసేవాడు విద్వాన్ష్.


విద్వాన్ష్ గురించి చెప్పాలి అంటే విద్వాన్ష్ వాళ్ళ నాన్నకి ప్లైవుడ్ షాప్ ఉంది, విద్వాన్ష్ వాళ్ళ అమ్మ ఇంట్లోనే ఉంటుంది. సొంత ఇల్లు కొంచం డబ్బు కూడా ఉంది.


విద్వాన్ష్ చదువు అయిపోయాక వాళ్ళ నాన్నకి ఇలా చెప్పాడు " సినిమాలో దర్శకత్వం కోసం ప్రయత్నిస్తాను నాన్న నాకు రెండు సంవత్సరాలు టైం కావాలి అది జరగకపోతే నేను షాప్ చూసుకుంటాను అని చెప్పి నాన్నని ఒప్పిస్తాడు విద్వాన్ష్". 


ఒక సంవత్సరం అంతా అవకాశం కోసం తిరుగుతాడు విద్వాన్ష్, అవకాశం రాకపోయేసరికి తన స్నేహితులతో కలిసి చిన్న చిన్న కథలు రాసి షార్ట్ ఫిలిమ్స్ తీయడం మొదలు పెడతాడు.


అతి తక్కువ టైం లోనే విద్వాన్ష్ కి మంచి పేరు వస్తుంది, డబ్బులు కూడా సంపాదిస్తున్నాడు.


అల ప్రశాంతంగా ఉన్న విద్వాన్ష్ జీవితం లోకి ప్రేమ పరిచయం అయింది అ ప్రేమ పేరు అముల్య. 


ఒకసారి విద్వాన్ష్ తన స్నేహితులతో కలిసి అరకు వెళ్తాడు.అక్కడ తనకి ఒక అమ్మాయి నచ్చుతుంది. తనని చూడగానే విద్వాన్ష్ ప్రేమలో పడతాడు.


తన గురించి తెలుసుకోవాలి అని అ రోజంతా అ అమ్మాయికి తెలియకుండా తన చుట్టూ తిరిగి అ అమ్మాయి తన స్నేహితులతో మాట్లాడేది వినీ అ అమ్మాయిది హైదరాబాద్ అని తన పేరు అముల్య అని తెలుసుకుంటాడు.


అముల్య అరకు నుండి హైదరాబాద్ కి ఎప్పుడు వెళ్తుందనేదీ తెలుసుకొని విద్వాన్ష్ కూడా అదే రోజు హైదరాబాద్ కి అముల్య నీ ఫాలో అవుతూ వెళ్తాడు.


హైదరాబాద్ లో అముల్య ఎక్కడ ఉంటుందో తెలుసుకుంటాడు. అల విద్వాన్ష్ ప్రేమ మొదలయింది.


అముల్య వాళ్ళ ఇల్లు ఒక పార్క్ దగ్గర ఉంటుంది. అముల్య నీ కళ్లుదాం అని తర్వాత రోజు పొద్దున్నే జాగింగ్ పేరుతో అముల్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న పార్క్ కి వెళ్తాడు విద్వాన్ష్.


చలికాలం అవ్వడంతో మంచు ఎక్కువగా ఉంది.అముల్య బయటికి ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటాడు విద్వాన్ష్ కానీ అముల్య వాళ్ళ ఇంటి కిటికీ నుండి ముసుగుతో ఉన్న ఒక వ్యక్తి బయటికి రావడం విద్వాన్ష్ చూస్తాడు. 


అ వ్యక్తి వెనకాలే విద్వాన్ష్ వెళ్తాడు. అ వ్యక్తి నీ పట్టుకొని కొడతాడు. అ వ్యక్తి దగ్గర ఉన్న బ్యాగ్ తీసుకొని చూస్తాడు. 


అ బ్యాగ్ లో డబ్బులు , నగలు ఉంటాయి. బ్యాగ్ చూసే టైం లో అ వ్యక్తి విద్వాన్ష్ నీ తోసేసి పారిపోతాడు.


అ బ్యాగ్ తీసుకొని విద్వాన్ష్, అముల్య వాళ్ళ ఇంటికి వెళ్లి జరిగిన విషయం చెప్పి అముల్య ని పరిచయం చేసుకుంటాడు.


అముల్య తో పరిచయం పెంచుకోవాలి అని ఏదో రకంగా అముల్య ని కలుస్తుంటాడు విద్వాన్ష్.


అముల్య మనసులో ఎవరైనా ఉన్నారా, లేదా అముల్య నీ ఎవరైనా ప్రేమించరా అనే విషయాలు తెలుసుకోడానికి ప్రయత్నిస్తుంటాడు.


తను ప్రేమించిన విషయం అముల్య కి చెప్పడానికి ఎంతో టైం లేదు కానీ అదే టైం లో విద్వాన్ష్ కి ఒక విషయం తెలుస్తుంది.


అముల్య వాళ్ళ తల్లితండ్రులు అముల్య కి పెళ్లి చేస్తున్నారు అని వచ్చే నెల పెళ్లి అని తెలుసుకుంటాడు.


అ విషయం తెలుసుకొని విద్వాన్ష్ అముల్య పై తనకి ఉన్న ప్రేమని ఒదులుకుంటాడు.


అముల్య పై తనకి ఉన్న ప్రేమ నీ ఒదులుకున్న విద్వాన్ష్ , అముల్యని మరిచిపోలేకపోతాడు. 


ఎలా అయినా అముల్య నీ మరిచిపోవాలి అని తన షార్ట్ ఫిలిమ్స్ పై దృష్టి పెడతాడు అల ఆరు నెలలు గడిచిపోయాయి.


ఆరు నెలల తర్వాత విద్వాన్ష్ కి సినిమా దర్శకత్వం అవకాశం వస్తోంది.


సినిమా షూటింగ్ కోసం వివిధ ప్రదేశాలు తిరుగుతూ ఉంటాడు విద్వాన్ష్. అల ఒకసారి బెంగళూరు వెళ్తాడు అక్కడ కాఫీ షాప్ లో పనిచేస్తున్న అముల్య నీ చూస్తాడు.


అముల్య దగ్గరికి వెళ్లి మాట్లాడుతాడు విద్వాన్ష్ .


విద్వాన్ష్ :- నమస్తే అండి! గుర్తు పట్టరా హైదరాబాద్ లో మీ ఇంటికి ఒచ్చాను బ్యాగ్ ఇచ్చాను .


అముల్య :- అ గుర్తు ఒచ్చింది. ఎలా ఉన్నారు ?


విద్వాన్ష్ :- నేను బాగున్నాను. మీరు ఏంటి ఇక్కడ పని చేస్తున్నారు . మీకు పెళ్లి అయ్యింది కదా. 


అముల్య :- అ పెళ్లి అయ్యింది కానీ బెంగళూరు కదా భార్య భర్త పని చేస్తేనే ఇక్కడ బ్రతకగళం .


విద్వాన్ష్ :- అ అది నిజమే అండి.


అముల్య:- సరే అండి పని లో ఉన్నపుడు ఎక్కువగా మాట్లాడకూడదు.


విద్వాన్ష్ :- సరే అండి నాకు షూటింగ్ ఉంది నేను వెళ్తున్న. 


అల చెప్పి విద్వాన్ష్ అక్కడినుండి వెళ్ళిపోతాడు కానీ అముల్య చెప్పింది విద్వాన్ష్ నమ్మడు , సాయంత్రం వరకు కాఫీ షాప్ చుట్టూ తిరుగుతూఉంటాడు .


సాయంత్రం అముల్య ఇంటికి వెళ్లే టైం లో అముల్య నీ ఫాలో అయి అముల్య వాళ్ళ ఇంటికి వెళ్తాడు.


అముల్య వాళ్ళ ఇంటికి వెళ్లి చూసేసరికి అముల్య వాళ్ళ భర్త తాగుతూ ఉంటాడు , అమూల్య నీ కొడతాడు.


అముల్య ఏడుచుకుంటూ బయటకి వస్తుంది, అక్కడే ఉన్న విద్వాన్ష్ నీ చూస్తుంది.


అముల్య నీ బయటికి తీసుకెళ్తాడు విద్వాన్ష్ . ఏం జరిగింది అని అడుగుతాడు.


అముల్య మాట్లాడుతూ " నా పెళ్లి జరిగిన తర్వాత మేము బెంగుళూరు వచ్చాము . 


ఒచ్చిన రెండు నెలలు అంతా బాగానే ఉంది కానీ అనుకోకుండా ఒకరోజు అయన తాగి ఇంటికి ఒచ్చారు .


అ తర్వాత రోజు నుండి అయన ఉద్యోగానికి వెళ్లకుండ ఇంట్లో ఉండి తాగుతూ ఉండేవాడు .


ఇంటి నుండి డబ్బులు తీసుకొని రా అని కొట్టేవాడు .ఇల్లు గడవడం కష్టం అయిపోయింది . వాళ్ళ అమ్మానాన్నలకు చెప్పలేను మా ఇంట్లో చెప్పుకోలేను.


తప్పని పరిస్థితిలో నేను ఇక్కడ కాఫీ షాప్ లో పని చేస్తున్నాను.అసలు ఏం జరిగింది అని అయన ఆఫీస్ కి వెళ్లి తెలుసుకున్నాను. 


ఆఫీస్ కి సంబందించిన వివరాలు వేరే వారికీ ఇస్తున్నారు, డబ్బులకి అమ్ముడుపోయాడు అని జాబ్ లో నుండి తీసేసారు వేరే ఎక్కడ జాబ్ లేకుండా చేసేసారు.


కానీ అయన అలంటి వారు కాదు మంచివాడు. అయనని మోసం చేసి ఇలా జాబ్ లేకుండా చేసారు అప్పటినుండి అయన అలాగే ఉండిపోయారు".


విద్వాన్ష్:- మీ ఆయనతో నేను ఒక్కోసారి మాట్లాడొచ్చా. 


అముల్య :- అ పదండి ఇంటికి వెళ్దాం.


విద్వాన్ష్ :- ఇంతకీ మీ అయన పేరు చెప్పలేదు.


అముల్య :- అరుణ్!


అముల్య ఇంటి దగ్గర:-


విద్వాన్ష్:- చుడండి అరుణ్ నేను మీకు తెలియదు కానీ మీ గురించి మీ జాబ్ ప్రాబ్లెమ్ గురించి నాకు అముల్య అంతా చెప్పింది. నేను అముల్య వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ . నేను మీకు జాబ్ చూపిస్తాను .మీరు ఈ తాగడం మానేసి అముల్య నీ సంతోషంగా చూసుకోండి.


అరుణ్ :- మీరు ఎవరో నాకు తెలియదు కానీ నాకు సహాయం చేస్తాను అని చెప్తున్నారు . నేను తాగడం మానేస్తాను . సంతోషంగా జాబ్ చేసుకుంటూ నా భార్య నీ సంతోషంగా చూసుకుంటాను.


విద్వాన్ష్:- మీరు హైదరాబాద్ కి వెళ్లిపోండి . నేను ఒక అడ్రస్ ఇస్తాను అక్కడికి వెళ్ళండి.మీకు జాబ్ తప్పకుండ ఉంటుంది.


అరుణ్ :- సరే వెళ్తాను. 


అముల్య :- థాంక్యూ విద్వాన్ష్ నా కోసం ఇంత చేసారు.


విద్వాన్ష్:- అయ్యో పర్లేదు నేను వెళ్తాను అముల్య.


విద్వాన్ష్, అమూల్య పై తనకి ఉన్న ప్రేమ నీ మాత్రమే ఒదులుకున్నాడు కానీ ప్రేమ నీ ఒదులుకోలేదు.అందుకే తన ప్రేమ ఆపదలో ఉంటె ఆదుకున్నాడు , సహాయపడ్డాడు.


ప్రేమ నీ ఒదులుకోడానికి కారణాలు ఎన్ని ఉన్న ప్రేమించిన వ్యక్తి మాత్రం గుండెల్లోనే ఉంటుంది, వాళ్ళ ప్రేమ ఎప్పటికి బ్రతికే ఉంటుంది.



Rate this content
Log in

Similar telugu story from Drama