STORYMIRROR

Nagalakshmi kata

Classics Others

4  

Nagalakshmi kata

Classics Others

వారంలో పెళ్లి...అంతలోనే....

వారంలో పెళ్లి...అంతలోనే....

1 min
220

     వారం లో పెళ్లి.......?? 

జీవితంలోమనకుఎన్నోకోరికలుఉంటాయి.కానీ మన జీవితం ఎప్పుడు మనం అనుకున్నట్లుగా వుడందు. జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో మనం ఊహించలేము.తలచినదే జరిగినదా దైవం ఎందులకు అన్నట్లుగా మనం ఎన్ని చేద్దాం అనుకున్నా జరిగేది ఆపలేము.      ఇది నా జీవితం నాకు నేర్పిన పాఠం. మాది చాలా రిచ్ ఫ్యామిలీ.నేను కోరుకున్నది అప్పటి వరకు అన్ని దక్కాయి. ఓడిపోవడం అంటే ఏంటో నాకు తెలియదు.మా అమ్మానాన్న లకు నేనొ్కడినే. నా పేరు అచ్యుత్.నన్ను ఎంతో గారాబంగా పెంచారు. నేను అడగకుండాన్నే అన్ని ఇచ్చారు.

    ఏదీ అడిగిన ఎప్పుడు కాదనలేదు. నేను మా ఫ్రెండ్స్ తో చాలా క్యాజువల్ గా ఉంటాను.నేను మా కాలేజీడేస్ లో ఒక అమ్మాయి ని ప్రేమించాను. తన పేరు సారిక. చాలా మంచిది. మానవత్వం ఎక్కువ.ఎప్పుడు ఏదో ఒక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేది. చిన్న వయ్సులోనే ఇలా ఉండటం చూసి నాకు చాలా బాగా నచ్చింది.

   నాతో చాలా స్నేహపూర్వకంగా మాట్లాడేది.ఒకరోజు తనకి నా ప్రేమ విషయం చెప్పాను. తను కొన్ని రోజులు తరువాత నాకు ఒకే చెప్పింది. వాళ్ల ఇంటి ల్లో వాళ్ళు ఒప్పుకుంటే నన్ను చేసుకోవడానికి తనకి ఎలాంటి ప్రాబ్లెమ్ లేదని చెప్పింది.నేను మా ఇంట్లో విషయం చెప్పాను. ఎప్పటిలాగానే వాళ్ళు నా ఇష్టానికి అడ్డుచెప్పలేదు. వాళ్లే వెళ్ళి సారిక వాళ్ళ ఇంట్లో మాట్లాడారు.

            కులాలు వేరు కావడంతో మొదట వాళ్ళు ఒప్పుకోకపోయినా తరువాత అంగీకరించారు.చాలా హ్యాపీగా ఉన్నాం. ఎంగేజ్మెంట్ కూడా గ్రాండ్గాచేసుకున్నాం. పెళ్లి పనులు కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి.పెళ్లి ఇంకో వారం ఉందనగా అనుకొని సంఘటన జరిగింది.సారిక యాక్సిడెంట్లో చనిపోయంది. రెండు కుటుంబాలలో విషాదం అలముకుంది.నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను.

నా బాధ చూడలేక మా అమ్మ ఆరోగ్యం కూడా పాడైంది.నేను ఆ బాధ లో నుంచి బయటపడటానికి రెండు సంవత్సరాలు పట్టింది.ఇప్పటికీ సారిక రోజు గుర్తుకొస్తుంది.మనం ఎన్ని అనుకున్నా ఏదీ జరగాలనుంటే అదే జరుగుతుందని అర్దం అయ్యింది. మా ఇంట్లో వాళ్లు నన్ను పెళ్లి చేసుకోమంటున్నారు. నేను మాత్రం సారిక ఆలోచనల్లో నుంచి ఇంకా పూర్తిగా బయటకు రాలేకపోతున్నారు. తన స్థానంలో మరొకరిని ఊహించుకొలేకపోతున్నాను.

చివరిగా " రాసి పెట్టి ఉన్నద జరుగుతుంది!!!!".



Rate this content
Log in

Similar telugu story from Classics