THE HOTEL - SUSPENCE
THE HOTEL - SUSPENCE
రోడు మీద కార్ స్లౌగా వెళుతున్నది.
అబ్బా ఏంటి అనుదీప్ మరీ ఇంత మెల్లగా వెళ్తున్నా రు.
కొద్దీగా స్పీడ్ పెంచు అంది ప్రేరణ.
ఓస్ నువ్వు మరచిపోయావా ఏంటి ప్రేరణ ఏమైనా నువ్వు మామూలు మనిసీవా ఏంటి,? అని ప్రేరణ
కడుపు వైపు చూస్తూ అన్నాడు అనుదీప్.
(పేరణ ఇంకా అనుదీప్ మంచి భార్యా భర్తలు అని చెప్పచ్చు. ఇంకా ఇపుడు ప్రేరణ నిండు గర్భనీ .
తానూ ఇపుడు తన పుట్టినరోజు సందర్భంగా తన పుట్టింటికి వెళ్లాలని ఆశ, భర్త తనని తీస్కుపోతున్నాడు .కానీ త్వరగా వెళ్ళాలని షర్ట్ కట్ లో
వెళుతున్నారు.కాని వారికి తెలియదు అది షార్ట్ కట్ దారి కాదని.
కొద్దీ దూరం వెళ్లిన తర్వాత వారికి ఒక హోటల్ కనిపిస్తుంది. అక్క డా అంత నిర్మా నుషంగా ఉంది.
చుట్టు చెట్లు కూడా సరిగా లేవు. ఎక్క డో అక్క డ విసిరి వేసినట్లు దూరంగ ఉన్నాయి.
హే కొద్ది సేపు నువ్వు అక్క డా విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నా అన్నాడు భర్త.
దానికి చటుక్కు న చూసింది ప్రేరణ. అబ్బా ఎంటండి ఇది మరి నన్ను మీరు గాజు బొమ్మ లాగ చుస్తు నారు అంది ప్రేరణ.
అబ్బ నీకు తెలియదా నువ్వు ఉన్న పరిస్తితిలలొ నాకు నువ్వు గాజుబొమ్మ వె. నికేం తెలియదు సైలెంట్‌గా ఉండు అన్నాడు అనుదీప్.
చాళ్లే ని వెటకారం, తెల్లవారు జామున అనంగా తీసుకుని వచ్చా వ్ చూడు టైం ఎంత అయిందో మధ్యా హ్నం కావొస్తుంది మనం ఇప్పటికి
ఇంటికి వెళ్లి ఉండాల్సింది నువ్వు వచ్చి న స్పీ డ్ కీ ...అంటూ విసుగు చెందుతున్న భార్యా వైపు చూసి సారి నేను ఎం చేస్తాను ఆ రాస్కేల్ నాకు ఈ దారిన
పోతే త్వరగా వెళ్లొచ్చు అన్నాడని వచ్చాము నేను కావాలనీ చేయలేదు. అన్న భర్త వైపు చూస్తూ నేను మా ఊరికి ఎపుడు ఇటు రాలెదు అంటుంది ప్రేరణ.
అసలు ఈ దారి ఉన్న విషయం కూడా నాకు తెలియదు. అందుకే అలా అన్నాను మీకు కోపం వచ్చి ఉంటె నన్ను క్షమించండి. ఆ మాటలకు భార్యా వైపు
చూస్తూ హెయ్ ఏంటి నువ్వు నాకు సారి చెపుతున్నావ్, నువ్వు పెగ్నెంట్ వీ నాకు సారీ లు చెప్పకూడదు, రేపు నీ కడుపులో ఉన్న బాబూ నో బేబీ నో మా అమ్మ
తో సారీ చెప్పించుకుంటావా అని నా మీదికి వస్తారు అంటూ పక పకా నవ్వు తాడు దానికి ప్రేరణ కుడా నవ్వుతుంది.
ఒకే డియర్ మనం ఇక ఆ హెటల్ కీ వెళదామా అంటాడు .దానికి ఒకే కాని ఎక్కువ సేపు మనం అక్కడ ఉండకూడదు అంటూంది ప్రేరణ.
దానికి అనుదీప్ హో ఎందుకు అంతడు. ఇలా ప్రెగ్నెంట్ గా ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు అని అంటుంది.
హో డియర్ ఆలా ఏమి కాదు ఇలాంటి చోట అలానే అనిపిస్తుంది అంటడు భర్త. ఇక కార్ ఆ హోటల్ ముందు అగుతుంది.
అక్కడ ఎవరు వుండరు. చాలా పాత కాలం హోటల్ లా ఉంటుంది. చూస్తూ వుంటే అక్కడికి ఎవరూ వచ్చి వెళుతున్నటు లేదు ఎం చేస్తాం అనుకుంటూ లోపలికి వెళ్తారు.
అక్క డ చుట్టు చూస్తు ఉంటారు. అది మరి ఓల్డ్ ది కాకాపోయిన ఇక్కడికి సరిగా ఎవరు రారు అనే విషయం అర్ధం అవుతుంది వీరికి. అంతలో అకస్మాత్తుగ్గ ప్రేరణ వెనకాల ఎవరో స్పీడ్ గా వస్తారు.
ఉలిక్కిపడుతూ వెనక్కీ తీరిగి చూస్తారు ఇద్దరూ .అక్కడ ఒక మధ్య వయస్సు కలిగిన అతను ఉన్నాడు. ఎం కావాలి సర్ అంటడు.
దానికి అనుదీప్ అది ఇక్క డ మేము రెస్ట్ తీసుకోవాలి మరియు మాకు ఎమైనా తినడానికి కావాలి అంటాడు.
ఒకే సర్ మీరు రేపు ఉదయం వరకు ఉంటరా సర్ అంతాడు ఆ వ్యక్తి. దానికి అనుదీప్ నో నో మేము ఈవ్నింగ్ వరకు ఉండి వెళతాం అంటడు అనుదీప్.
ఏంటి ఈవ్నింగ్ వెళ్తరా మీకు ఏమైనా పిచ్చ సర్
అందులోని మీ భార్య చూస్తుంటే ప్రెగ్నెంట్ అనుకుంటా .అందులోనూ ఆmey నిండు గర్భిణీ, ఎలా వెలతారు సర్ అంటడు ఆ వ్యక్తి.
దానికి ఇద్దరీకి బృకుటి ముడి పడింది.
ఎమ్ అంటున్నారు మీరు అర్ధం అయ్యేలాగా చెప్పండి అంటడు అనుదీప్.దానికి ఆ వ్యక్తి మీకు తెలియదు అనుకుంతా ఈ దారిలో ఎవరు పెద్దగా రారు వచ్చి
నా నైట్ ఎవరు వెళ్లరు అది చాలా ప్రమాదం అటూ వైపు వెలితె ...ఇంకా మాట పూర్తిగా కాకుండానె..... (పేరణ అనుదీప్ ప్లీస్ మనం వెలిపోదాం అంటుంది.
దానికి అనుదీప్ ఆగు ప్రేరణ అంటూ…
"హెలో ఎందుకు వెళ్ళ కుడదు ఈ దారిలో అంటాడు అనుదీప్.
దానికి ఆయన కంగారుగా ఏమీ లేదండి,అక్క డ దొంగలు ఎక్కువగా ఉంటరు వారు ఇటు వెళ్లేవాళ్లని
దోచుకుని తరువాత వారిని చంపేస్తారు అనే మాటలు ఆయన చాలా భయంకరంగా చెప్పాడు.
దానికి ప్రేరణ చాలా కంగారు పడుతూ....ప్లీస్ అనుదీప్ మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండ వద్దు
ఇప్పుడె వెళ్లిపాదాం, అంటుంది. దానికి అనుదీప్ కూడా చాలా భయపడతాడు కానీ బయట పడడు.
ఒకే మనం వెళ్లిపోదాం అంటు అక్కడి నుండి బయటకు వస్తారు.
'వెనుకాలే ఆ హోటల్ ఆయన కూడా వస్తాడు
ఆగండీ ఆగండి ఎక్కుడికి వెళ్తున్నారు ఆగండీ
అంటు వారి వెంట వస్తాడు అయన....
వద్దు వద్దు మేము ఇక్క డ ఒక క్షణం కూడా ఉండం అంటూ స్పీడ్ గా కార్ వద్దకు వస్తారు. అంతే వారి పై ప్రాణ0 పైనే పోతోంది కార్ టైర్ పంచర్ అయ్యింది.
ఓ మై గాడ్ అంటాడు అనుదీప్ .దానికి గమంచిన ప్రేరణ సంగతీ అంతే.
అదేంటి ఇందాకె కదా మనం వచ్చింది అప్పుడె ఇదెలా జరిగింది, అని ఏదో చేప్పబోయె లోపే ఆ హోటల్ ఆయన వస్తాడు.
అయ్యో... సర్ మరేం కాదులే ఇక్కడ రిపేర్ షాప్ కూడా ఉంది అంటూ అటు వైపు చూపిస్తాడు. వారు అటూ వైపు చూస్తారు కానీ దానికి తాళం వేసివుంది.
అంతలో ఆయన కలుగజెసుకుంటు మరేం కాదులే సాయంత్రం అతను వస్తాడు రిపేర్ చేస్తాడు అంతవరకు మా హోటల్ లొ ఉండచ్చు అని అంటాడు.
సాయంత్రం అవుతుంది. అనుదీప్ ఇంకా ప్రేరణ ఇద్దరు స్వీమింగ్ ఫుల్ వద్ద ఉన్న బెంచ్ మీద కూర్చుని ఏదో కబర్లు చెప్పుకుంటు వుంటారు.
అంతలో మరో కార్ వచ్చి అక్కడ అగుతుంది వారి చూపులు ఆ కార్ వైపు తిరుగుతాయి. అందులోనుండి ఇద్దరూ వ్యక్తులు దిగుతారు.
ఒక ఆవిడ ఒక అతను చూస్తూ ఉంతే ఆవిడ ఎదో జాబ్ చేస్తూ ఉన్న టు ఉంది.ఆయన తన అసిస్టెంట్ అని కొద్దీసేపటికి తెలుసుకున్నారు.
వారు వీరి వైపు చూస్తూ లోపల్కి వెళ్తారు. వారు వీరిని చూసి నవు తారు వీరు కూడా పలకరింపుగా నవ్వుతారు. అలా వారు హోటలో లోపలికి వెళతరు.
"చూసావా ప్రేరణ , ఇంత సేపటి నుంచి ఇక్కడ మనం ఒంటరిగా ఉండలేము ఇక్కడ ఎవరూ లేరు అని భయపడిపోయావ్ అందుకేనెమో నీకోసం ఆ దేవుడు వీరిని తోడుగా ....
అంతలోనే వారు బయటకు వస్తారు.అది చూసి వీరు ఏమి తెలియనట్లు ముఖం ప్రక్కకు త్రిప్తు కుంటరు. వారు బయటకు వచ్చి " హాయ్ నా పేరు భవాని,
అంటూ తన గురించి చెప్తుంది.
నేను ఈ ప్రక్కన ఉన్నా ఓ కంపెనీ లో పని చేస్తున్న, ఆ కంపెనీ మేనెజర్ నేనే. తాను నా అసిస్టెంట్ కోటి అంటూ తన గురించి తెలియజేస్తుంది.
ప్రేరణ అనుదీప్ ఎందుకు ఇవన్ని చెప్తున్నారో అర్ధం కాలేదు వీరికి కానీ ఏం చేస్తాం ఒక తోడు దొరికింది కదా అని వీరు కూడా తమ గురించి తెలియజేస్తారూ.
పరిచయం పెరుగుతుంది
అందరూ కలసి మాట్లాడుకుంటరు.
కలసి టీ తాగుతారూ.
అప్పుటికే సాయంత్రం దాటుతుంది.
సూర్య కిరణాలు ఎర్రగా పడుతున్నాయ్.
కోటి ఇంకా అనుదీప్ ఇద్దరు కలిసి ఆలా హోటల్ చుట్టు చూస్తూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు.
(పేరణ ఇంకా భవాని ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటు ఉంతారు అంతలో భవాని కళ్ల వెంట నీరు వస్తుంది.
ఏమైంది అంటుంది ప్రేరణ, ఏమి లేదు ప్రేరణ నువ్వు అదృష్ట వంతురాలివి, దానికి ప్రేరణ ఎందుకు అంటుంది.
నువ్వు ఇపుడు గర్భవతివి నాకు ఈ జన్మ లో నాకు ఆ రాత లేదు. అంటుంది భవానీ...
దానికి ప్రేరణ భవానీనీ ఓదారుస్తూంది. ఇంతకు ఏమైంది అంటుంది [పేరణ.
దానికి భవాని నాకు పిల్లలు లేరు అని ఇక పుట్టరు అని నా భర్త నన్ను వదిలివేసాడు.
తాను రెండో పెళ్లి చేసుకుని దూరంగా వెళ్లిపోయాడు. అంటూ బావురమంది.
(పేరణ వెంటనే భవానినీ దగ్గర తీసుకుంది.
పాపం తాను ఎం చేయగలదు. తనకు కూడా చాలా బాధ గా ఉంది. కాసేపటికి భవాని అక్కడి నుండి బయలు దేరుతుంది.
అప్పుడే వెళ్తున్నారా అంటుంది ప్రేరణ.
ఆఫీసు లొ పని ఉంది వెళ్ళాలి, మేము రోజూ ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు ఈ హోటల్ దగ్గర ఆగి కాఫీ తాగి వెళ్తాము అని చెప్పింది భవాని.
ఏదో తోడుగా ఉంటారూ అనుకుంతే ఇప్పుడు ఇలా అవుతుందని అనుకోలేదు అంది ప్రేరణ.
ఏం కాదులే ప్రేరణ నేను ఉన్నా కదా అంటూ దైర్యం చెప్పాడు అనుదీప్.
కానీ ఏం చేస్తాం ఎవ్వరికైన ఇలాంటి చోట భయం వేస్తుంది. చుట్టు చాలా కిలో మీటర్ల వరకు ఏ ఒక్కరు లేరు.
ఇక్కడా కేవలం ముగురు మాత్రం ఉన్నారు. అనుదీప్ , ప్రేరణ , హోటల్ వర్కర్.
"ఎలా అనుదీప్ ఇక్కడ ఇంత నైట్ లో కేవలం మనం మాత్రం ఉన్నాము,
పాపం అనుదీప్ మాత్రం ఎం చేస్తాడు తన బెంగ తన భార్య మీద నే ఏందుకంతే తనకి ఇపుడు నిండు నెలలు ఎపుడైనా ఏదన్నా
అనుకోనిది జరిగితే ఇంత రాత్రీ వేళలో అందులోనూ కార్ పంచర్ ప్లీస్ గాడ్ నువ్వే కాపాడాలని అనుకుంటాడు.
హోటల్ ఆయన వద్దకు వెళుతాడు అనుదీప్ ఎంటండి ఇంకా మెకానిక్ రాలేదు ఎపుడు వస్తాడు అని అడుగుతాడు
అబ్బా సర్ వస్తున్నాడు ఇందాకే ఫోన్ చేసా టౌన్ నుండు రావాలి కదా లేట్ అవుతుంది మీరేం కంగారు పడకండి వెళ్లి డిన్నర్ కి రెడీ అవ్వండి
నేను మీకు డిన్నర్ రెడీ చేస్తున్న అంటాడు. దానికి అనుదీప్ ఎదో చేప్పబోయి అక్కడి నుండి వెళ్తాడు.
కానీ అక్కడే ఉన్న ఓ కిటికి వైపు చూస్తాడు చుట్టు చీకటి ఇక్కడ మానవ మాత్రుడు ఐనా ఉంటాడా అని అనిపిస్తోంది. ఎదో భయం.
అంతలో వెనుక నుంచి చెయ్ వేస్తారు. వెంటనె ఉలిక్కిపడి చూసాడూ అక్కడ తన భార్య ప్రేరణ ఉంటుంది.
ఏంటండి భయపడ్డరా అంటుంది (పేరణ.
నో నో అది కాదు అని ఏదో చెప్ప బోయాడు కానీ అంతలో (పేరణ దృష్టి కిటికీ మీద పడుతుంది అను నాకు
భయం అవుతుంది ఇంత చీకట్లో ఈ హోటల్ ఎలా రన్ అవుతుంది ఇక్కడ ఒక వెహికల్ కూడా వెళ్లటం లేదు అని ఏదో చెప్పబోయింది అంతలో హోటల్ అయిన పిలుస్తాడు ఇద్దరు వెళ్లి డిన్న ర్ చేసి రూమ్ కి వెళ్తారు.
అప్పు టికె ఆ హోటల్ చుట్టుకు చీకటి అలుముకొని ఉంది.
ఇక వారు రూమ్ లో మాట్లాడుకుంటున్నారు.
వీరు ఓకే క్లాస్‌మెట్స్ బట్ వీరికి పెళ్ళి ఐ వన్ ఇయర్ దాటింది.
మన కాలేజీ రోజులు చాలా బాగుండెవి కదా అంటూ కాలేజీ డేస్ వాళ్ళ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుంటూ వారు ఆ భయాన్ని మరిచి వారు తమ కుటుంబం
(ఫెండ్స్ కాలేజీ ఇలా మాట్లాడుకుంటు ఎపుడు నిద్ర పోయారో ఏమో.
అర్థ రాత్రి సడెన్ గా తనకు ఎదో సౌండ్ వచ్చి కళ్లు తెరిచి చూస్తాడు. అంతే పక్కన ప్రేరణ కనిపించలేదు.
(పేరణ అంటూ చుట్టూ చూస్తూ అంతా వెతుకుతాడు. ఎక్కడైనా ఉంటే కద కనిపించడానికి. బాత్రూం లో చూస్తాడు అక్కడ కూడా కనిపించదు.
ఇక హోటల్ ఆయన వద్దకు వెళ్తాడు.
నా భార్యా ప్రేరణ కనిపించడం లేదు కిందకి ఏమైనా వచ్చిందా మీరు ఏమైనా చూసారా అని అడుగుతాడు. అదేంటి సర్ మీతోనే కదా గదిలోకి వచ్చారు.
అంతలోనే ఎటు వెళుతుంది .ఒక వేళ బయటకు వెళ్లాల్సి వచ్చిన ఇక్కడి నుండి వెళ్లాలి. అంటూ సమాదానం చెబుతాడు.
కోపం చిర్రెత్తు కోస్తోంది అనుదీప్ కి. ఏయ్ మర్యాదగా చెప్పు అంటూ అరుస్తాడు. కానీ అతను వెటకారంగా నవ్వుతాడు.
ఇక కోపం ఎక్కువుతుంది వెంటనె అతని కాలర్ పట్టుకుంటాడు.
రేయ్ నా భార్యను ఎం చేసావు రా చెప్పు రా అంటూ.
పోలీసులకు ఫోన్ చేద్దాం అంటే ఫోన్ లో సిగ్నల్ లేదు,
వెంటనే ఆతనికి హోటలో లో ఒక చోట ఉన్న ల్యాండ్ ఫోన్ గుర్తు వస్తుంది. అక్కడికి వెళ్లి పోలీస్లకు ఫోన్ చేయబోతాడు అంతలో దబ్ మని సౌండ్,
వెనుక నుంచి ఆ హోటల్ ఆయన ఫ్లవర్ వాజ్ తీసుకొని బలంగా అనుదీప్ తల మీద కొడతాడు.
అంతే అనుదీప్ అమ్మా అంటూ వెనక్కి తిరుగుతాడు అక్కడ హోటల్ ఆయన నవ్వుతూ అనుదీప్ ని చూస్తుంటాడు .
అనుదీప్ చెతిలోని ల్యాండ్ ఫోన్ కింద పడుతుంది. అనుదీప్ సృహ కోల్పోతాడు.
తరువాత రోజు ఉదయం.
(పేరణ కళ్లు తెరిచి చూస్తుంది. తాను ఎక్క డ ఉంధో అర్దం కాలేదు.తనకు ఏదో తేలికగా ఉంది, నొప్పిగా ఉంది.
వెంటనె తన కడుపు వైపు చూస్తుంది. అంతే తన ప్రాణం పోయినట్లు అయ్యింది.
తన కడుపు లేదు ఎవరో తన కడుపు కోసి బిడ్డను తీశారు. కుట్లు వేసారు ఇంక ప్రేరణ గట్టిగా అరుస్తుంది. ఏడుస్తుంది. తన బాధ వర్ణనాతీతం.
ఏ తల్లి గుండె అయిన ఎలా ఉంటుందో ఊహించండి.
ఆ గది అంత రక్తంతో ఉంది చుట్టు చూసింది.ఎవరు లేరు తనకి ఇంకా ఏదో మత్తు గా ఉంది అలా చాలా సేపు అక్కడే ఎడిస్తూ అరుస్తూ ఉంది.
హోటల్ లో అనుదీప్ కళ్లు తెరుస్తాడు.
తనని బెడ్ మీద కట్టేసి ఉంటారు. ఏ వదలండి రా నా భార్య కి ఏమైంది రా రేయ్ మీకు డబ్బులు ఇస్తారా నన్ను వదలండి అంటడు కానీ ఆ హోటల్ ఆయన
ఏమి ఎరుగనట్లు తన పనిలో తాను ఉంటాడు. అదే అదునుగా మెల్లగా తాడు విప్పుకుంటాడు అనుదీప్.
మెల్లగా ప్రక్కన ఉన్న ఒక రాడ్ తీసుకొని మెల్లగా వచ్చి ఆ హోటల్ వాడి తల మీద కొడుతాడు.
అలా ఒక 3, 4 సార్లు గట్టిగా కొడతాడు. అంతె ఇక వాడు అలానే కుప్ప కూలిపోయాడు.
ఇక అనుదీప్ మెల్లగా కుంటుతూ తూగుతూ ల్యాండ్ ఫోన్ వద్దకు వచ్చి పోలీస్‌లకు ఫోన్ చేసి జరిగింది అంత చెప్తాడు.
అక్కడకి రాబర్ట్ అనే పోలీస్ ఆఫీసర్ బయలుదెరుతడు.
To be continued….. Written bY
I.ZC.PK
