సిరివెన్నెల❤️-2మనసుల దోబూచులాట
సిరివెన్నెల❤️-2మనసుల దోబూచులాట
అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ గయ్స్...యో బ్రో ఇట్స్ న్యూ ఇయర్ ఈవ్ లెట్స్ పార్టీ అంటూ వినిపిస్తున్న ఆ అరుపులు నచ్చలేదేమో నా ఆత్మా రాముడికి అడుగులు అలా బయటకి మరల్చమని ఆజ్ఞాపించేసింది..
అంతే నా ఫ్రెండ్ గాడి జేబులో ఉన్న నా బండి తాళాలు కొట్టేసి,బండిని జెట్ స్పీడ్ లో ఉరికించ...నువ్వెంత సేపు ఉరికిస్తావో నేను చూస్తా స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అంటూ మళ్ళీ వచ్చేసాడు నా ఆత్మారాముడు ..
అయినా మదికి వేగం తగ్గించాలనిపించలేదెందుకో.. బహుశా నేను బాలేను అని ప్రతీకాత్మకంగా చెప్పినట్టుంది...అలా ముందుకి వెళ్ళానో లేదో నా బండి వేగానికి బ్రేక్ లేస్తూ "హాయ్ మై బాయ్" అంటూ పలకరించింది ట్రాఫిక్...
ఉన్న ఆ కాస్తో కూస్తో మూడ్ కూడా ఆ ట్రాఫిక్ చూసి సూసైడ్ చేసుకోగా... తగలబెట్టండి సర్ నిరంజన్ గారు ఉన్న మూడు ఉత్సాహం అంతా నాశనం..
బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు అంటూ మైండ్ వాయిస్ వేసుకుంటున్న క్షణాన ఉన్నట్టుండి నా బులెట్ సౌండ్ లా దడ్ దడ్ దడ్ దడ్ మని కొట్టేసుకుంది నా గుండె.ఈరోజు ఇలా కొట్టుకోవడం మూడో సారి...
అసల్కే తిక్కలో ఉన్న నాకు దానికేం మాయ రోగం వచ్చిందో అర్థంకాక దాని దడ తగ్గించే ప్రయత్నం మొదలెట్టా...
గంటకు క్లియర్ అయిన ఆ ట్రాఫిక్ నుండి ఆపసోపాలు పడి హాస్టల్ రూమ్ కి చేరుకున్న నాకు, మాడిపోయిన మసాలా దోసలా దర్శనమిచ్చిన నా మొహానికి నిర్జీవమైన నవ్వకొటి విసిరి.. స్నానానికి కదిలా...
చేసేదేమీ లేదు కాబట్టి నాతో సహ జీవనం చేస్తున్న నా చెరవాణిని చేరి దాన్ని గెలకడం మొదలెట్టా...నా గెలుకుడికి దాని వంట్లో ఓపిక క్షీణించి లో బ్యాటరీ అంటూ ఒక సారిగా అరిచింది..
సరే అని దానికి బూస్ట్ అదే ఛార్జింగ్ పెట్టి నా లాప్టాప్ ఓపెన్ చేసి పాటలు పెట్టి.. దాన్ని బెడ్ మీద పెట్టి.. నేను దాని పక్కన పడ్డా...
అలా వింటూ ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలియదు లేసి చూసే సరికి గడియారం పది కొట్టడం నా కడుపు నుండి డిటీహెచ్ రేంజ్ లో సౌండ్ రావడం ఒకేసారి జరిగాయి.....
వచ్చింది మాములు సౌండ్ ఏ అయినా నాకు మాత్రం... రేయ్ ఏమన్నా ఏసేదుంద...లేక న్యూ ఇయర్ గిఫ్ట్ గా గ్యాస్ రిలీస్ చెయ్యన అని చాలా మర్యాదగా అడిగినట్టనిపించింది...
ఇక మనసునేలాగో ఆనంద పరచలేను కనీసం కడుపుకి న్యాయం చేసేద్దాం అని ఫిక్స్ అయ్యి... ఎలాగో ఆ టైం కి కాంటీన్ మూసేసుంటారు కాబ్బట్టి... క్యాంపస్ లోపల ఉండే హోటల్ నుండి ఫుడ్ పార్సెల్ తీసుకుని ముందుకు కదిలా...
ఓహ్ ఇంతకీ నేనేవరో చెప్పలేదు కదా.. నా పేరు అభి..అభిమన్యు... తగ్గేదేలే యూనివర్సిటీ లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా... భోగి తర్వాత సంక్రాంతి ఎంత కామన్ ఓ...బీటెక్ అన్నాక బ్యాచ్ లు అంతే కామన్ గా...నేను,అవినాష్, రాధిక, సంజయ్, నక్షత్ర ఇదే మా కోతి బ్యాచ్...
ఇంకా చెప్పాలంటే నా బీటెక్ అయ్యాక నాన్న కంపెనీ భాద్యతలు నాకు అప్పచెప్పడానికి రెడీ గా వున్నారు కానీ నాకు సొంతగా ఒక కంపెనీ పెట్టి ఆయన లా సొంతంగా పేరు సంపాదించాలని కోరిక... చూడాలి మరి...
లైఫ్ లో నాకంటూ కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి బాగా సెటల్ అవ్వాలని,అమ్మానాన్నలని బాగా చూసుకోవాలని,ఒక మంచి అమ్మాయ్ ని పెళ్లి చేసుకుని తనని ప్రేమగా చూసుకోవాలని,ఇద్దరో..ముగ్గురో..పిల్లలతో హ్యాపీ లైఫ్ లీడ్ చెయ్యాలని...
ఇప్పుడు నా మనసు బాగోలేక పోవడానికి ఆ ప్రేమే కారణం..
మీకు చెప్పలేదు కదు నాకు ప్రేమ మీద అస్సలు నమ్మకం లేదు...ఎవడ్రా ఈ తిక్కలోడు ఒకసారి నమ్మకం లేదంటాడు..ఒకసారి ప్రేమే కారణం..గుమ్మంలో తోరణం అంటాడు అనుకోకండీ..నాకు నమ్మకం లేనిది ఈ కాలం ప్రేమ మీద... అర్ధం కాలేదు కదా ఆగండి చెప్తాను...
బాంక్ బాలన్స్ లు, ఫిజిక్ లు, బిల్డప్ ల కోసం, స్టేటస్ లు పెట్టుకోవడం కోసం, లవ్ పేరు చెప్పుకుని ఒకరిని ఒకరు వాడుకోవడం... మళ్ళీ మాదే ట్రూ అని చెప్పుకుని ఊరంతా రాసుకు పూసుకు తిరిగి... ఒక చిన్న మాటకి విడిపోవడం...ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఒకరి సెక్సువల్ డిసైర్స్ కోసం ఒకరితో ఒకరు మేకింగ్ ఆఫ్ లవ్ అని పేరు చెప్పుకుని కలవడం... బోర్ కొట్టాక వదిలేయడం..
వీటన్నిటికీ లవ్ అన్న పేరు పెట్టుకు తిరిగి అసలు దాని విలువ తీసేసారు. అందుకే నాకు ఈ కాలం లవ్ అంటే పడదు.. సొసైటీ లో నిజమైన ప్రేమ కన్నా ఇలాంటివే ఎక్కువ ఇప్పుడు... ఇలాంటివి చూసి అసలు ఒక అమ్మాయిని ప్రేమించాలనే ఆలోచనే లేకుండా పోయింది....అప్పుడు కనిపించింది శశి.. శాన్విక శశిప్రియ నా జూనియర్....
మాములుగా మనకి ఒక్కో మనిషిని చూసినప్పుడు ఒక్కో భావన కలుగుతుంది.. కొందరిని చూసినప్పుడు ఫ్రెండ్లి గా, కొందరిని చూడగానే కోపం తెప్పించేలా, కొందరు చూడగానే మనసుకి దగ్గరగా ఇలా రకరకాలగా..
కానీ శశిని చూడగానే ఏదో తెలియని ఒక కొత్త ఫీల్..ఒక ఆరాధన లాంటి భావన... తనని చూడగానే అసలు అమ్మాయిలను 36 24 36 సైజ్ లతో, రంగుతో ఎవరు లెక్కేట్టారో గాని చంపేయాలనిపించింది... అలా ఉంది మరి..
పొడుగు జడ,పెద్ద కళ్ళు, చెక్కినట్టు ఉండే ముక్కు,లేత గులాబీ రంగులో బుజ్జి పెదాలు, దట్టమైన కనుబొమ్మలు.... పెద్ద రంగు లేకపోయినా మొహం మంచి కలగా ఉంటుంది...ఒక మాటలో చెప్పాలంటే చూడగానే ఎంత అమాయకంగా, ముద్దుగా అనిపించిందంటే.. చేత్తో దిష్టి తీసేంతల...మా మొదటి పరిచయం చాలా బాగా గుర్తు నాకు...
@@@
నా సెకండ్ ఇయర్ లో కాలేజ్ మొదటి రోజు... జూనియర్స్ తో క్యాజువల్ గా పరిచయం చేసుకుందాం అని ఎంట్రన్స్ కి కొంత దూరంలో కూర్చోవున్నాం నేను.. నా కోతి బ్యాచ్... కొంతసేపటికి వచ్చింది. తను... చూడగానే ఆ కళ్ళ దగ్గరే ఆగిపోయా... అలా ఎంతసేపు చూశానో ఏమో మా వాళ్ళు కనిపెట్టేసారు...
సంజయ్ గాడు,"ఓ బ్లూ డ్రెస్ అమ్మాయ్ ఇలా రా అంటూ తనని పిలిచాడు.. తను వచ్చి మా ముందు నిల్చుంది...
ఏం పేరు? అని అడిగా నేను... శశిప్రియ మరి మీ పేరు అంది.
అ...భి అని నేను చెప్పేంత లోనే మా అవినాష్ గాడు ఏ అమ్మాయి సీనియర్స్ ని క్వశ్చన్ చెయ్యకూడదని, రెస్పెక్ట్ ఇవ్వాలని తెలియదా.. అని అనేసాడు..
తను మౌనంగా తలూపినా...ఆ యా నిమిషం ఎందుకో మా అవి గాడిని అండమాన్ కి పార్సెల్ చేసేయాలనిపించింది...
హ్మ్ గుడ్ సరే నీకో చిన్న టాస్క్... ఇక్కడ ఉన్న ఎవరోకరికి ప్రపోజ్ చెయ్యాలి అంటూ రాగ్ చెయ్యడం స్టార్ట్ చేసాడు సంజయ్ గాడు...
తను కళ్ళు అమ్మాయికంగా ఆడిస్తూ నా వైపు చూసింది... మరీ ఇంత అమాయకంగా ఉంటే ఎలా అని అనుకుంటుండగా...
తన బాగ్ లో నుండి ఫోన్ తీసి కెమెరా ఆన్ చేసి తనకి తనే ఐ లవ్ యూ శశి అని చెప్పి ఫోన్ లోపల పెట్టేసుకుంది...
అప్పుడు మా సంజయ్ గాడి ఫేస్ చూడాలి ఎలక్కాయి తిన్న కోతి మొహం వాడూను...
ఇంతలో మళ్ళీ మా అవినాష్ గాడు అందుకుని... ఏంటి ఇదస్సలు వాడు మా లో ఒకరికి ప్రపోస్ చెయ్యమంటే నీకు నువ్వు చేసుకుంటావ్.. అడగాలి గా అర్థంకాకపోతే అన్నాడు...
దానికి తను అయ్యో సర్ మీరేగా సీనియర్స్ ని క్వశ్చన్ చెయ్యకూడదు అన్నారు అందుకే చెయ్యలేదు ఈసారి కరెక్ట్ గా చేస్తాను ను అంది చేతులు కట్టుకుంటూ...
తన మాటలకి అలానే చూస్తుండిపోయా నేను.....
సరే కానీ అన్నాడు అవి గాడు...
వెంటనే రాధిక దగ్గరకి వెళ్ళి ఐ లవ్ యూ మేడం అని చెప్పి వచ్చేసింది... ఈసారి అవి గాడు బిక్క మొహం వేసాడు...
ఇక నవ్వాగలేదు నాకు,గట్టిగా నవ్వేసా... నా నవ్వుకి సంజయ్ గాడు తేరుకుని ఇలా కాదమ్మాయ్ మా ముగ్గురు అబ్బాయిల్లో ఎవరో ఒకరికి ప్రపోస్ చెయ్ అన్నాడు వాడు...
తను మాత్రం నక్షత్ర వైపు చూసి,చూడండి మేడం మీతో లవ్ లో ఉండి నన్ను ప్రపోస్ చెయ్యమంటున్నారు సార్, మీ ముందే ఇలా ఉంటే మరి మీరు లేనప్పుడు?????...అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టి వదిలేసింది తను...
దానికి నక్షత్ర సంజయ్ వైపు కోపంగా చూస్తుంటే..
అమ్మ తల్లి నువెళ్ళు ఇక... మా మధ్య గొడవలు పెట్టేలా ఉన్నావ్ అంటూ దణ్ణం పెట్టేసాడు సంజయ్ గాడు...
థాంక్యు సర్ అంటూ వెళ్లిపోయింది తను.... తను వెళ్తుంటే ఎందుకో వెళ్ళద్దు అని చెప్పాలనిపించింది నాకు అలా చెయ్యలేక అలానే చూస్తుండి పోయా...
ఆరోజంతా మా ఇద్దరి కోతులది ఒకే గోల... అరేయ్ మేము తనని రాగ్ చేశామా... తను మమల్ని రాగ్ చేసిందా అని...
కానీ వాళ్ళని పట్టించుకునే పరిస్థితుల్లో లేను నేను నాలో నాకే చిన్నపాటి సంఘర్షణ మొదలైంది.. ఆ భావన.. ఆ భావన ఇంతకమునుపెప్పుడు నాకు కలగలేదు.
ఇది ప్రేమ అన్న ఆలోచన రాగానే నాలో ఉన్న ఆ భావనని తొక్కేయ్యడానికి ప్రయత్నించా కారణం మీకు తెలుసుగా... సంవత్సరం పాటు నన్ను నేను ఈ ఆలోచన నుండి దూరం తెద్దాం అని ప్రయత్నిస్తూనే ఉన్నా కానీ లాభం...శూన్యం....
@@@
సంవత్సరం తరువాత కాలేజ్ ఫెస్ట్ రోజు యాంకరింగ్ చేస్తుంది తను...
నెక్స్ట్ మా డాన్స్ పెర్ఫార్మెన్స్ అనగా వచ్చిన శశి...సర్ నెక్స్ట్ మీదే రెడీ గా ఉండండి ఆల్ థ బెస్ట్ అంటూ చిన్నగా నవ్వింది...
తన ఉనికే ఏదో తెలియని సానుకూలతని ఇవ్వగా చిరు నవ్వుతో థాంక్యు శశి అన్నాను నేను...
మా కాలేజ్ ఫెస్ట్ అయిపోయింది... అందరూ డిన్నర్ కి కదలడం మొదలెట్టారు.... ఆరోజు ఎందుకో తనని చీరలో మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది, అంత ముద్దుగా ఉంది మరి...తనని వెత్తుకుంటూ వెళ్లిన నాకు..
అక్కడే ఒక కుర్చీలో కూర్చుని ఒడిలో రెండు కోన్ లు, చేతిలో ఒకటి పట్టుకుని చాలా కాన్సంట్రేషన్ తో తింటూ కనిపించింది...
ఆ ఎదురు టేబుల్ లో కూర్చొని, అలానే చూస్తుండి పోయా నేను...
తను మాత్రం చుట్టుపక్కల పట్టించుకోకుండా చిన్న పిల్లలా కవర్ ని కూడా వదలకుండా తింటున్నింది... ఆ క్షణం ఎంత ముచ్చటేసిందో ఆ వెన్నెల్లో నింగిలోని శశికి ,ఈ నేల మీద శశి పోటీ ఇచ్చినట్టు అనిపించింది...
పక్కన నుండి తన ఫ్రెండ్ శశి చాలే ఇక పోదాం రూమ్ కెళ్లాక తిందువు రావే అంటూ ఒకటే గోల...
అన్ని కోన్ లు ముగించి కానీ తన ఫ్రెండ్ వైపు చూడలేదు శశి..
ఇక చేసేది లేక విసుగొచ్చి ఒసేయ్ నీ వెన్నెల్లో ఐస్ క్రీమ్ పిచ్చి తగలెయ్య నాకు చలేస్తుంది రా అంటూ లాక్కుపోతున్న తన ఫ్రెండ్ ని ఆపి మరీ మహి గోబీ ఏ ప్లీస్ అంటూ పప్పి ఫేస్ పెట్టేసింది...
మహిత ఏదోకటి తేల్చుకుని చెప్పే లోపే తుర్ మని, కొనుక్కుని మారుమాట్లాడకుండా మహిత వెనక వెళ్ళిపోయింది...
తను వెళ్లిన తర్వాత పక్కకి తిరిగి చూసిన నాకు మా కోతి బ్యాచ్ అంతా నా వైపు సి.ఐ.డి,ఎన్.ఐ.ఏ ఆఫీసర్ ల రేంజ్ లో చూస్తూ కనిపించారు వాళ్ళ చూపులకి దడుచుకుని వెన్ను తట్టుకుని నిలదొక్కుకున్న నాకు, వరసగా ప్రశ్నల తూటాలు తగిలాయి...
ఇక చేసేదేం లేక మొత్తం వాళ్ళకి చెప్పి ఊపిరి పీల్చుకున్నెంత లోనే..నేను వాళ్ళకి ప్రేమ మీద తీసుకున్న క్లాస్ ల ప్రభావం వల్లేమో.. అరేయ్ అసలు ఇప్పుడు ఇది ప్రేమా.. కాదా అని అందరూ ముక్తకంఠంతో ఆడిగేసారు..
గట్టిగా నిట్టూర్చి వాళ్ళకి చెప్పడం మొదలెట్టా... నాకు కూడా ఇది ప్రేమా లేక ఆకర్షణా తెలియక సంవత్సరం ఈ భావానని అదుపు చేయడానికి ప్రయత్నించా..
కానీ ఈ సంవత్సర ప్రయత్నంలో నాకు తెలిసింది ఇది ఆకర్షణ మాత్రం కాదని ఎందుకంటే ఆకర్షణకి ఆయువు తక్కువ అది ఇన్ని రోజులు నిలువదు... ఇంకా చెప్పాలంటే తన గురించి ప్రతి ఒక్కటి ఒద్దు అనుకుంటూనే తెలిసేసుకుంటున్న నా ప్రవర్తన నాకే వింతగా తోచింది...
ప్రేమ ఇదేనా అని అడిగితే కచ్చితమైన సమాధానం లేదు నా దగ్గర కానీ తను జీవితాంతం నాతో ఉండాలి అనే బలమైన కోరిక ఉంది... ప్రస్తుతానికి నాది ఆరాధన అంతే, అని ముగుంచిన నాకు మా వాళ్ళ కళ్ళు కొత్తగా అనిపించాయి..
ఏమైందని వాళ్ళ ముందు చేతులాడించ...అందరూ ఒకేసారి నా మీద పడి గ్రూప్ హగ్ ఇచ్చేసారు... వీళ్ళ ప్రేమ కి మళ్ళీ జారిపడబోయిన నేను నిలదొక్కుకుని నిల్చున్న....
రేయ్ మామా నువ్వు లవ్ లో ఉన్నావని ఆనందించాలో లేక నీ ఫ్రీడమ్ పోతుందని బాధపడాలో తెలియట్లేదు రా... అంటూ వాడి మానాన వాడు చెప్పుకుంటూ పోతున్న అవినాష్ నెత్తి మీద ఒక్కటిచ్చింది రాధిక...
రేయ్ అవి నువ్వు ముయ్... అరేయ్ నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావ్ అని సూటిగా అడిగింది రాధి...
తెలీదే అని సమాధానమిచ్చాను నేను...
రేయ్ పోనీ మేము ఏమన్నా ప్లాన్ చెయ్యమా అని అడిగాడు సంజయ్.
వద్దు మీరు ఏం చెయ్యద్దు అని కరాకండిగా తేల్చి చెప్పేసి.. ఇకచాలు అందరూ వెళ్ళండి అని నేను సంజయ్ ని తీసుకుని రూమ్ కి కదిలాను...
@@@
కొన్ని నెలల తర్వాత.....
క్రికెట్ టోర్నమెంట్ ముందు రోజు రాత్రి.... ఆ మ్యాచ్ మా కాలేజ్ ప్రెస్టీజ్ కి సంబంధించింది... ఎన్నో స్టేజెస్ దాటి అక్కడిదాక వచ్చామ్ మేము... యూనివర్సిటీ మొత్తం ఫుల్ టెన్షన్ తో ఉన్నారు... చూడబోయే వాళ్లే అలా ఉంటే ఇక ఆడే మా పరిస్థితి చెప్పనవసరం లేదు ...
ఆరోజు నైట్ ప్రాక్టీస్ అయ్యాక రూమ్ కి వెళ్లిన నాకు ఎంతసేపటికి నిద్రపట్టలేదు ఇక బయటకి వచ్చి కాలేజ్ గ్రౌండ్ దగ్గరికి వెళ్లి కూర్చున్న... (మా కాలేజ్ వెనక గ్రౌండ్ ఉంటుంది..కాలేజ్ కి ఇటు పక్క బాయ్స్ హాస్టల్ అయితే అటు గర్ల్స్ హాస్టల్...)
నేను ఏదైనా ఎక్కువ ఆలోచిస్తే బాడీ వెచ్చగా అయిపోతుంది అలానే అప్పుడు కూడా వెచ్చగా అయిపోయింది,అప్పుడొచ్చింది తను.. అభి సర్ అంటూ..తల ఎత్తి చూసిన నాకు నవ్వుతూ కనిపించింది శశి... కూర్చో శశి అంటూ పక్కకి జరిగాను నేను...
తను నా పక్కన కూర్చుంటూనే, ఏమైంది సర్ ఒకరే ఏంటి ఇక్కడ ఇలా కూర్చుని వున్నారు అని అడిగింది...
ఏమ్ లేదు శశి రేపు మ్యాచ్ ఉందిగా నిద్రపట్టలేదు అందుకే ఇలా వచ్చి కూర్చున్న అంతే అంటూ చెప్పాను నేను...
తన బాగ్ లో నుండి ఒక చాక్లెట్ తీసి నాకిచ్చి ఆల్ ద బెస్ట్ సర్ అంటూ కరచాలనం ఇచ్చింది ... మరుక్షణం అభి సర్ ఏమైంది..? ఆర్ యూ ఓకే అంటూ నుదిటి మీద చెయ్యిపెట్టి చూసింది....
ఆ క్షణం తనకెలా వున్నిందో కానీ నాకు మాత్రం, శశి జీవితాంతం నాతో ఉండిపోతావ.. అని అడిగి తన భుజం పై వాలిపోవాలనిపించింది...
సర్ బానే ఉన్నారా అంటూ వినిపిస్తున్న మాటలకి తేరుకుని హా శశి అన్నాను...
సర్, మీరు దేని గురించో ఎక్కువ ఆలోచిస్తున్నారు కదా...వెంటనే అడిగింది తను...
ఆశ్చర్యంగా తన వైపు చూస్తూ నీకెలా తెలుసు శశి అన్నాను...తను చిన్నగా నవ్వి నేను కూడా ఎక్కువ ఆలోచిస్తే ఇలా అవుతుంది అని చెప్పి...
సరే సర్ మీరు నేను చెప్పినట్టు చెయ్యండి అని ఫస్ట్ టేక్ ఏ డీప్ బ్రెత్ అంది.
చెప్పినట్టే గట్టిగా ఊపిరి పీల్చా నేను...
రిలాక్స్ అంది...
దానికి అనుగుణంగా చేసి తన వైపు చూసా...
ఒక ఫైవ్ టైమ్స్ చెయ్యండి సర్ అంది...
తను చెప్పినట్టు చేసాక మళ్ళీ టెంపరేచర్ చెక్ చేసి..హ చెప్పండి అభి సర్ అంటూ బాసిపట్టం వేసి నా వైపుకి తిరిగి కూర్చుని...
తను అలా అడిగితే ఏం చెప్పాలో తెలియక ...ఏం లేదు శశి.. ఇప్పుడు ఓకే... అది సరే కానీ ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్ళొస్తున్నావ్ అని అడిగా...
ఓ అదా బయట చిన్నపని ఉంటే వెళ్ళొస్తున్నాను లేండి.. మీరు టాపిక్ మార్చద్దు అభి సర్...చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారని అర్థమవుతుంది...
సరే వదిలేయండి..మీరు రేపటి మ్యాచ్ గురించి ఏ నా ఆలోచిస్తున్నారు.. అంది శశి..
అవును అన్నట్టు తలూపా నేను..
మీకో విషయం చెప్పనా.. నాకు ఈ క్రికెట్ గురించి పెద్దగా తెలియదు బట్ మీ గురించి తెల్సు మీరు ఏదన్నా అనుకుంటే అది సాధిస్తారు అభి సర్...
ఇప్పుడు మీలో ఈ టెన్షన్ కూడా మీకు, మీ మీద సందేహంతో కాదు గెలుపా... ఓటమా... అన్న సంశయంతో... దాన్ని వదిలి ఆలోచించండి, ఖచ్చితంగా అనుకున్నది జరుగుతుంది... అంటూ నా చేతిని ధైర్యం చెప్తున్నట్టు మెల్లగా ఒత్తింది తను...
తను మాట్లాడిన ప్రతి మాటా నిజం..నేను ఆలోచిస్తున్నది ఉన్నది ఉన్నట్టు చెప్పేసింది తను..
శ...శి... నేను అనుకున్నది చెప్పబోయేంతలో...
మీరేం చెప్పద్దు అభి సర్ రేపు మ్యాచ్ అయ్యాక చెప్పండి..నేను రేపు మ్యాచ్ కి వస్తాను..మీరు గెలిచేది చూస్తాను...
గుడ్ నైట్ మీరు కూడా పడుకోండి అంటూ వెళ్ళిపోయింది తను...శశి ఇచ్చిన చాక్లెట్ తింటూ..తననే స్మరిస్తూ హాస్టల్ వైపు అడుగులేసా నేను...
@@@
మ్యాచ్ రోజు...
మాకిచ్చిన డ్రెస్సింగ్ రూమ్ బయటకి వచ్చిన నాకు హాయ్ అభి సర్ అంటూ షాక్ ఇచ్చింది శశి...
ఆ క్షణం తీన్మార్ స్టెప్ లేసింది నా అంతరాత్మ.. మనం ప్రేమించే వాళ్ళు మన కోసం వస్తే ఆ ఆనందం మాటల్లో చెప్పడం కష్టం...
హాయ్ శశి.. చెప్పినట్టే వచ్చేసావ్ అయితే అన్నాను నేను...
మరి శశి మాటంటే మాటే అంటూ కోలర్ ఎగరేసింది తను...
నేను నవ్వుతూ చిన్న పిల్ల చేష్టలు పోలేదు నీకు అంటూ తన తల పై మొట్టి అలా అడుగేసానో లేదో అమ్మా అంటూ కూర్చుండిపోయా...నా కాలు పట్టేసింది...(నాకు కాలు పెట్టేస్తే అంత త్వరగా వదలదు.. నొప్పి కూడా బీభత్సంగా ఉంటుంది... మ్యాచ్ కి టైం ఏమో అయిపోతుంది..)
అభి సర్ ఆర్ యూ ఓకే అంటూ అడిగింది తను మోకాళ్ళ మీద కూర్చుంటూ..
లేదు శశి కాలు పట్టేసింది అంటూ బదులిచ్చాను నేను...
తను వెంటనే కింద కూర్చుని తన తొడ పై నా పాదాన్ని పెట్టుకుని అభి సర్ కాలుని వీలైనంత స్ట్రెయిట్ గా పెట్టి బలంగా తొక్కండి అంది...
కానీ.. అనే నా మాట పూర్తి కాకముందే.. అభి జస్ట్ డూ ఇట్ అంది తను..
తను చెప్పినట్టే చేసాను.. కాలు మాములుగా అయిపోయింది.. ఆ మూమెంట్ ఎందుకో తన కంగారుకి, ఆ చొరవకి చాలా ఆనందమేసింది నాకు..
వెంటనే తనని అప్రయత్నంగా హత్తుకున్నా.. నేను చేసిన పని అర్థమైన వెంటనే దూరం జరిగి తల దించుకు నిల్చున్న...
ఇంతలో బయట నుండి పిలుపు రావడంతో బ్యాట్ తీసుకుని తన వైపు చూడకుండానే సారీ అంటూ వచ్చేసా...
మ్యాచ్ స్టార్ట్ అయ్యింది నేను తన కోసం గాలరీ వైపు చూసా తనని చూసి తను ఫ్రంట్ రో లో నన్నే చూస్తూ కనిపించింది...
సారీ అంటూ సైగ చేశా... తను పర్లేదు అన్నట్టు కళ్ళార్పి... ఆల్ థ బెస్ట్ అంది చిన్న చిరునవ్వుతో .... ఆ క్షణం నా గిల్ట్ ఫీల్ గాల్లో ఎగిరిపోగా,మ్యాచ్ మొదలైంది..
ఎంతో ఉత్కంఠ మధ్య మ్యాచ్ సాగుతుంది... ఆడుతునంత సేపు నన్ను టెన్షన్ పడద్దని,తను గోళ్లు కొరికే రేంజ్ లో టెన్షన్ పడిపోతూ కనిపించింది...
లాస్ట్ బాల్... బాటింగ్ నాదే... 6 కొడితే మ్యాచ్ విన్... అందరూ ఊపిరి బిగపట్టుకుని మరి చూస్తున్నారు...
లాస్ట్ బాల్ నా వైపు దూసుకొచ్చింది... ఒక్కసారిగా మొత్తం నిశబ్దం,వెనువెంటనే గాలరీ అంతా అరుపులతో నిండిపోయింది...
మా వాళ్ళు నన్ను పైకి ఎత్తేశారు... నా చూపులు తన కోసం వెతక సాగాయ్... చిన్నపిల్లలా చప్పట్లు కొట్టేస్తున్నింది శశి... తనని అలా చూస్తుంటే నిజంగా ఏదో సాధించేసిన ఫీల్ ఛాతి ముందుకొచ్చేసింది...
ఇంతలో తనకి ఏదో ఫోన్ వస్తే బయటకి వెళ్ళింది... కప్ తీసుకుని తనని వెతుకుంటూ వెళ్ళాను నేను...
తనకి మూడు విషయాలని చెప్పాలని ముందు సారీ... ఆ తర్వాత థాంక్యూ.. ఇక మూడోది చెప్పేది కాదు అడిగేది నన్ను పెళ్ళి చేస్కోమని... తను నా జీవితం అని తేల్చేసుకున్నా నేను...
కొంత దూరంలో ఫోన్ మాట్లాడేసి వెనక్కి వస్తూ కనిపించింది తను...
ఇంతలో ఎవడో మధ్యలో వచ్చి శశి భుజం పై నొక్కుతూ ఏయ్ పిల్లా కత్తిలా ఉన్నావ్ రూమ్ కొస్తావా...రేట్ ఎంతైనా పర్లేదు... *******...
ఆ మాటకి నా ఒంట్లో రక్తం మరిగిపోగా పిడికిలి బలంగా బిగుసుకుంది వాడిని చంపేద్దాం అన్నంత కోపంతో అడుగు ముందుకు వేసిన నాకు ,తరువాత చెవిన పడ్డ మాటలు భూమిలోకి కూరుకుపోయేలా చేసాయి...
వస్తాను..ఇప్పుడు కాదు ఈరోజు నైట్... అడ్రస్ ఏంటి..? రేట్ అప్పుడు మాట్లాడుకుందాం..
ఈ మాటలు శశి నుండి వింటానని కలలో కూడా అనుకోలేదు... నమ్మాలని లేదు... కళ్ళు మెల్లగా మసగయిపోయాయ్... గుండెని ఎవరో కిందకి లాగి గట్టిగా కొట్టినంత నొప్పి... అక్కడుంటే ఏంచేస్తానో తెలియక అడుగులు పరుగులగా మార్చి నా రూమ్ వైపు వెళ్లిపోయా....
ఎన్నో వింత ఆలోచనలు.. సందేహాలు.. ఇన్ని రోజుల నా రంగుల ప్రపంచంలో..ఈ చీకటి కోణాన్ని నమ్మలేకపోయా నేను... ఎవరి మీద చూపించలేని కోపం...
కొన్ని రోజులు తరవాత...కోపం తమాయించుకుని..తనని మొత్తం అడిగి పారేయాలని తన కోసం చూసా... వారం గడిచింది కానీ, తను ఆరోజు నుండి ఈరోజు వరకు కనిపించింది లేదు.. తన పై ఈ భావన తగ్గింది లేదు...
ఏంటి ఏం ఆలోచిస్తున్నారు... లవ్ ఫెయిల్ అయినవాడు ఇందాకటి నుండి ఏ బాధ లేకుండా స్టోరీ చెప్తున్నాడనా...నాది లవ్ ఫెయిల్యూర్ కాదు నా ప్రేమ నా గుండెల్లో అలానే ఉంటుంది కానీ ఆ మనిషి మీద చూపించలేను అంతే...
ఇక బాధ అంటారా.. హు బాధ ఎందుకు లేదు బయటకి చెప్పలేనంత ఉంది... కానీ ఆ బాధ మాయం అవుతుందేమో.. నేను విన్నది,చూసింది అబద్దం అవుతుందేమో అనే చిన్న ఆశ...
ఒక వేళ ఇదే నిజమైనా కూడా ఈ బాధ తను ఇచ్చిన బహుమతి గా.. అందుకే అలానే ఉంచుకో దల్చుకున్నా... జీవితాంతం... ప్రతి లవ్ ఫెయిల్ స్టోరీ ఒక మలుపుతో ముగుస్తుంది..కానీ నా ప్రేమకి ఆదే అంతమైంది ఇక మలుపులకి తావేది..?
సరే సరే గుడ్ నైట్..మిగతాది రేపు చెప్తా..
@@@కొనసాగుతుంది@@@
1. ఇంతకీ శశి మంచిదా..? చెడ్డదా..?
2.అసలు శశికి ఏమ్ అయ్యింది ఆ రోజు తర్వాత..?
3. ఇప్పుడు అభి పరిస్థితి ఏంటి?
4. వీరిరువురు కలిసేనా?

