STORYMIRROR

శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Drama Inspirational Children

4  

శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Drama Inspirational Children

శిథిలాలక్రింద... కొత్తలోకం

శిథిలాలక్రింద... కొత్తలోకం

4 mins
246

కేదార్నాథ్ పర్వత శ్రేణుల్లో నిత్యం వినిపించే హర హర మహాదేవ్....అనే దివ్యమైన పలుకులతో నిద్రలేస్తుంది

అక్కడి ఒక ఆదివాసీ తండా...

వచ్చేపోయే యాత్రికులపై,పువ్వులు,అడవిలో ఎన్నుకొని తెచ్చిన సుగంధ ద్రవ్యపు నీటిని చిలకరిస్తూ,మహాదేవుని సైన్యానికి స్వాగతం అంటారు వారి భాషలో...

అలా చేయడం వల్ల,యాత్రికుల్లో పెద్దమనసు గలవారందరూ పదో,పరకో ఇస్తుంటారు...

ఓహో!!ఈ ప్రేమంతా ఈ నోట్ల కోసమా??? అంటూ వారిమీద విసిరే,రాక్షస గణం కూడా ఉంటారు.....వీళ్ళకి దక్కే గౌరవం అరుదైనది తో పాటూ ఖరీదైనది అయ్యుండాలని వారి అభిప్రాయం...

అయితే ఎవరు తమ మీద సంతోషంతో పువ్వులు చల్లించుకుంటారో, వారికి పరమశివుడు అక్కడే దర్శనమిస్తున్నట్టుందని అన్నవారూ లేకపోలేదు...

యాత్రికులు ఎక్కడ చెత్త పడేసినా వెంటనే తీసేస్తుంటారు....శుభ్రంగా ఉంచుతారు వాళ్ళుండే ప్రదేశాన్ని...

అందులో నుంచే ఒక అద్భుత ఆవిష్కరణ జరుగుతుందని ఆ తండా ప్రజలు ఆ రోజు ఊహించలేకపోయారు....

రాంలాల్ కి ఒక్కడే కొడుకు...ఓం అతని పేరు... చదువు మాత్రం పదవ తరగతి ....ఆ గ్రామంలో ,ఆ చదువు అంటే,విదేశాల్లో చదివినట్టుగా గొప్పగా చెప్పుకునేవారు రాంలాల్....

తల్లి కేసరి మాత్రం తిట్టిపోసేది....నువ్వు కూడా యాత్ర జరిగినన్ని రోజులు సుగంధ మేలా(యాత్రికులపై పూలు చల్లే పండుగ) కి వస్తే,రోజు ఇంకొంచెం బాగా గడిచి....అందరి ఐదు వేళ్ళు నోట్లోకి పోయేవి...నీ చదువు మన జీవితాల్లో వెలుగు నింపుద్దా.... అంటూ

అమ్మా! మనకి మంచి రోజులు వస్తాయి...మా మాస్టర్ చెప్తుంటారు కష్టపడితేనే ఫలితం ఉంటుందట... తల్లిని సమాధాన పరచడానికి ప్రయత్నం చేసేవాడు రోజు..

ఒకరోజు తల్లి బాగా పట్టు బట్టడంతో....ఊరికి చాలా దూరంగా ఒక మెకానిక్ షెడ్ లో పనికి కుదిరేడు... నెలకి వెయ్యి రూపాయల జీతం,షెడ్ లొనే పడక....ఒక పూట తిన్నంత భోజనం....మిగతా సమయంలో కావాలంటే జేబుకు పని పెట్టాల్సిందే...

అలాంటి సమయంలో కూడా,ఓం ఇంటికి ఆరువందలు పంపేవాడు... నెలకోసారి రాంలాల్ డబ్బు తీసుకోవడానికి కొడుకు దగ్గరకి వస్తుంటాడు....

ఒకరోజు షెడ్ కి ,కొత్త మోడల్ బైక్ వచ్చింది....ఇద్దరు అబ్బాయిలు...వాళ్ళని చూస్తే,హీరోల్లా అనిపించేరు ఓంకి....ఇంగ్లీష్ లో అడుగుతున్నారు....కొంచెం అయిన పెట్రోల్ దొరుకుతుందా?? అంటూ

యజమానికి అర్థం కాలేదు... కానీ ఓం ఇంగ్లీష్ లొనే బదులిచ్చేడు... ఎం చెప్తున్నాడో భయం,కంగారు పడుతున్నాడు యజమాని...

అర్థం చేసుకున్న ఓం అన్నాడు యాజమానితో....వీళ్ళు లాంగ్ రైడ్ కి వచ్చి,తిరిగి వెళ్తున్నారట... తెచ్చుకున్న ఆయిల్ అయిపోయింది....కొంచెం పెట్రోల్ దొరుకుతుందా అంటున్నారు ...

ఓ యెస్ గా....సంబరపడిపోతూ చెప్పేడు...లీటరుకు వంద తీసుకో...అంటూ తెచ్చిచ్చేడు...

ఓంకి మోసం నచ్చలేదు...ఎనభై లీటరుకు తీసుకున్నాడు...ఈ టైం లో,ఇంత లోన్లీ ప్లేస్ లో ఆయిల్ దొరికినందుకు సంతోషడుతూ,, టిప్ గా యాభై ఇచ్చేరు ఓం కి..

మీరు ఎక్కడ చదువుతున్నారు???అడిగేడు ఓం

ముంబై లో...ఇంజనీర్స్ మేము అని చెప్పేరు వాళ్ళు...

వాళ్ళని చూసి ముచ్చటేసింది ఓం కి....చదువుకుంటే అలా స్టైల్ గా ఉండొచ్చు అనుకుంటూ, షెడ్ లోకి వెళ్లబోతున్న అతన్ని ఎండపడి మెరుస్తున్న ఒక చిన్న వస్తువు ఆకర్షించింది...

ఏంటా అని దగ్గరికి వెళ్లి చూస్తే,వాళ్ళు కూర్చున్న ఒక గంటలో,కోక్ టిన్ తో ముచ్చటైన గులాబీ ని కట్ చేసేరు.... భలే అనిపించింది....రేకులు విచ్చుకుని ,టిన్ మీద రంగులు కలిసి ముద్దుగా ఉంది గులాబీ....

ఓనర్ పిలిచేడు. ....డబ్బులు ఏవిరా...మొత్తం తీసుకున్నావా అంటూ....

ఆ! అంటూ ,వాళ్ళిచ్చిన యాభైతొ కలిపి ,మొత్తం ఇచ్చేసాడు...సాబ్! నాకు మన షెడ్ లో ఉన్న కొన్ని రేకుముక్కలు ఇవ్వండి...ఇలా ఎదో ఒకటి తయారు చేసి,బయట పెడతాను.... ఇష్టపడితే ఎవరైనా డబ్బులిచ్చి కొనుక్కుంటారు....నాకు టెన్త్ క్లాస్ లో రీసైక్లింగ్ పాఠం లో అదే నేర్పేరు... నాకు ఇలాంటివి చాలా ఇష్టం సాబ్....

దొంగా!! పని మానేసి నువ్ అడ్డమైనవీ తయారుచేసుకుంటుంటే, కూర్చోబెట్టి జీతం ఇవ్వాలా నీకు??ఇలా చేస్తే నీ ఉద్యోగం ఊడిపోతుంది....అందరి మీద పువ్వులు చల్లుతూ,రూపాయలు ఎరుకుంటూ, బతుకుదువు గాని!!అంటూ హూంకరించేడు....

ఎం మాట్లాడకుండా పని చేసుకున్నాడు ....కానీ ఇంకోపక్క వేస్ట్ ఐరన్ ని తీసుకుని చిన్ని ఇల్లు బొమ్మలు,కొంగలు,కోళ్లు....ఇలా ఏదీ మనసులో తెలిస్తే దాన్ని కార్య రూపంలో పెట్టేవాడు... ఏవైనా వెల్డింగ్ జరుగుతున్న టైం లో,వాటిని అతికించే పనుంటే....పనిలోపని కానిచ్చేవాడు....

వారానికో,బొమ్మగా మొదలయి,రోజుకోకటిగా రూపాంతరం చెందింది...తాను అన్నట్టే,

తయారు చేసిన వాటికి, పెయింట్ వేసి అందంగా తయారుచేసి,అంగడిలో పెట్టేవాడు...

కొత్తదనాన్ని స్వాగతించడంలో ముందుండే యువత వాటిని సప్లై ని మించి కొనడానికి ఎగబడేవారు....

వారం రోజులుగా ఈ తతంగాన్ని గమనిస్తున్న అభినవ్ అనే ఇంజినీర్ ,నాతో వస్తావా???రాజధానికి ....అక్కడ నీలాగే ,ఇనుము తో వింతల్ని సృష్టించేవారున్నారు....ఇష్టమయితే ఉండిపోవచ్చు కూడా....అన్నాడు....

విన్నదే, తడవుగా...ఉద్యోగానికి గుడ్ బై చెప్పి అతనితో బయలుదేరేడు....ఢిల్లీని చూసి మూర్ఛపోయాడు.... ఏంటి సార్ ???? ఇంత జనం లో నాకు పని దొరుకుతుందా???మోసం చేసేరు నన్ను అన్నాడు ఓం

కంగారు పడకు... మనం అనుకున్న కొత్తలోకం అదిగో... అక్కడే అంటూ...ఒక ఐరన్ స్క్రాబ్ యార్డ్ చూపించేడు....

నిజంగానే!!అబ్బా...నాకు కొంచెం ఇప్పిస్తారా??? మీరు చూసే ఉంటారుగా...నేను బోలెడన్ని ఆకృతులు తయారు చేయగలను....ఓం ఆనందానికి అవదులులేవు...

ఇదంతా ఐరన్ ఫేక్టరీ నుంచి వస్తున్న రద్దు...కొన్ని పాడయినవి, కొన్ని ప్రమాదాల్లో చిక్కుకున్నవి వాహనాలు,వరదల్లో కొట్టుకొచ్చిన ఐరన్ స్క్రాబ్ కూడా ఉంటాయి...వాటిని మనం కొత్తగా మార్చాలి...నీ నిబద్ధత చూసి తీసుకొచ్చాను...కానీ దీనికి మంచి చదువు,అనుభవం రెండూ అవసరమే...

ఇక్కడ పని చేసేవాళ్ళంతా ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్...ఈ విషయం లో ఆరితేరినవారు... ఈ చుట్టూ నిర్మాణాలు చూస్తే నీకు అర్థమయే ఉండాలి...

సార్...ఇది ఈఫిల్ టవర్ కదూ,అయ్యో!!తాజ్మహల్...స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ....అమ్మో....వీటిని చూస్తే భయం వేస్తోంది....నేను చిన్ని చిన్ని బొమ్మలు చేసేవాడిని...ఇందులో నాకు పనేం దొరుకుతుంది????ఆ స్థాయికి తాను పనికి వస్తాడో,రాడో అన్న భయంతో అడిగేడు...

ఇక్కడ ఒక రద్దుని చూసి, దీంతో కొత్తగా, ఎం తయారు చేయగలం?? ఎక్కడ ఉపయోగించగలం అన్న ఆలోచన ఉంటే నువ్వే రాజు...అన్నాడు అతను

నిజంగానా???నన్ను ఒక్కసారి వెనక్కి పంపండి....అమ్మానాన్నతో విషయం చెప్పి వస్తాను...ఆ తరువాత మీ దగ్గరే...అంటున్న ఓం ని చూసి,అడిగేడు ఒక ఇంజినీర్...

ఎవరు ఈ అబ్బాయి????

...మనకులమే...శిథిలాలపై శిలలు చెక్కడానికి ప్రయత్నిస్తుంటే,పైకి వస్తాడు అని తీసుకోచ్చేను... ఎం గొడవ లేదుగా??? అన్నాడు అభినవ్

కొత్తదనం కావాలి బ్రో...అది ఎవరు చేస్తేనేమి...అని చేతులు కలుపుకున్నారు హైఫై లా...

ఇక్కడ తండాలో రాంలాల్ సంతోషానికి హద్దులే లేవు..నాకొడుకు రాజధానికి పోయి వచ్చాడు అని ,అందరికి తీపి పంచుకున్నాడు....

ఊరు మొత్తం జాగ్రత్త చెప్పి పంపిన ఆరోజుని మర్చిపోలేదు ఓం...అప్పటి ఆ ఊరి ముఖచిత్రాన్ని ,చెట్లు చేమలు, పుట్టలు,వాగులు,కొండలు చివరికి తన ఊరి జనమంతటినీ మనసులో,స్మరణకు తెచ్చుకుంటూ పూర్తి ఐరన్ రద్దు ఉపయోగించి ఒక చిన్ని ఊరిని తయారుచేసేడు....పోటీకి గాను కేటాయించిన ఎకరం స్థలంలో ఈ ఆవిష్కరణ జరిగింది...

కొన్నాళ్ళకు జరిగిన అంతర్జాతీయ స్క్రాబ్ టూ ఫాబ్ పోటీకి ,తన వంతు పోటీ ఇచ్చేడు...దానికోసం ఓం దాదాపు రెండు రమారమి గ్రామాలుండే అంత,ఏరియా లో గుట్టగా వేయబడిన రద్దు పై....నిరంతరం రెండేళ్లు శ్రమించేడు....మొట్టమొదటి గిన్నిస్ రికార్డ్ సొంతం చేసుకున్నాడు....

వేదిక మీద మాట్లాడుతూ చెప్పేడు ఓం...ఈ రద్దంతా కొన్నాళ్ళకి శిథిలమవ్వాల్సినవే అని ఆలోచన వచ్చినపుడు,ఒక మెకానిక్ గా బాధ పడ్డాను...కానీ,శిథిలం నుంచి పదిలం వరకూ నేను గుర్తింపబడిన ప్రతిచోటా,నన్ను ఈ దారికి తీసుకువచ్చిన ఆ దేవుడు నాకు నిత్య పూజ్యుడు అంటూ నమస్కరించేడు, తనని ఢిల్లీ కి తీసుకువచ్చిన అభినవ్ సార్ కి....


Rate this content
Log in

Similar telugu story from Drama