Praveena Monangi

Drama

3  

Praveena Monangi

Drama

పరిష్కారం

పరిష్కారం

4 mins
211



నా పేరు రాజేష్......నా వయస్సు 40......ప్రస్తుతం ఆసుపత్రి లో ఐసియూ లో చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్నాను.....కళ్ళు మసకమసకగా కనబడుతున్నాయి.....నాకు ఎదురుగా మా ఆఫీసులో పనిచేసే ప్యూన్ ఉన్నాడు.....డాక్టరు తో ఏవో మాట్లాడుతున్నాడు..... డాక్టరు అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పినట్లున్నారు.......ప్యూన్ హమ్మయ్యా!అని ఊపిరి తీసుకుంటున్నాడు......నిద్ర మాత్రలు ఎక్కువ మోతాదు లో తీసుకున్నా,యముడిని పలకరించి వచ్చేసి ఇలా ఆసుపత్రి లో ఉన్నాను.....

  ‘’సార్! ఏమిటి ?మీరు ఇలా !ఇంత పెద్ద కంపెనీ కి సి‌ఈ‌ఓ మీరు.....మీరు ఆత్మ హత్యాప్రయత్నం......నమ్మలేక పోతున్నాను’’……..

!+!+!+! నిశ్శబ్దం 

‘’సరే సార్! చెప్పడానికి ఇష్టం లేకపోతే చెప్పవద్దు లెండి,మీ ఇంటికి కాల్ చేస్తాను’’అని ప్యూన్ వెళ్లబోతుంటే అతని చెయ్యి పట్టుకుని ఆపాను.నా మనసులోని బాధను ఎవరితోనయిన పంచుకుంటే కొంచెమయిన ఉపశమనము అని.....

ప్యూన్ పేరు రవి.చాలా నమ్మకస్తుడు ఐదు సంవత్సరముల నుండి మా ఆఫీసు లోనే పని చేస్తున్నాడు.

‘’చెప్తాను రవి చెబుతాను……నీకు నేను ఈ కంపెనీ కి సి‌ఈ‌ఓ గానే తెలుసు కానీ ఈ సి‌ఈ‌ఓ వెనుక ఒక ఓడిపోయిన తండ్రి,చేతకాని భర్త గురించి తెలియదు నీకు.22 ఏళ్లకే ఉధ్యోగము,25 ఏళ్లకే పెళ్లితో నా జీవితము ప్రారంభమయిపోయింది.నాకు చక్కటి భార్య,ఇద్దరి మగ బిడ్డలను ఇచ్చాడు ఆ భగవంతుడు.నా జీవితములో ఉన్నత స్థానానికి వెళ్లాలన్నదే నా లక్ష్యం గా పెట్టుకుని అహర్నిశలు పోరాడాను.అప్పట్లో మా బాస్ మాటలు నన్ను ఎక్కువ ప్రేరేపించాయి.దానితో నాకు మరింత ఏదయినా సాదించాలని పట్టుదల ఏర్పడింది.ఆ పట్టుదలే నన్ను ఈరోజున ఇదే కొంపెనీ లో చిన్న పోస్ట్ లో జాయిన్ అయిన నన్ను సి‌ఈ‌ఓ గా నిలబెట్టింది.నా జీవితము లో నేను అనుకున్నది సాదించాను.కానీ ఈ పయనములో నా కుటుంభాన్ని కోల్పోయాను......నన్ను అర్ధము చేసుకుని నా భార్య ఎంతో ఓర్పు తో కుటుంభాన్ని నడుపుకుంటూ వచ్చింది. పిల్లల బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తించింది. కానీ నా లక్ష్య సాధనలో పడి భార్యా పిల్లల్ని అలక్ష్యం చేశాను.ఎప్పుడో పొద్దున్నే ఆఫీసుకి వెళ్లిపోయే నేను రాత్రి పదింటికి పద కుండింటికి ఇంటికి చేరేవాడిని నేను వచ్చేసరికి పిల్లలు నిద్రపోయేవారు నా భార్య లత నాతో ఏదో చెప్పాలని ప్రయత్నించేది కానీ అప్పటికే అలసిపోయిన నేను అవేమీ వినకుండా నిద్ర పోయేవాడిని .పొద్దున్నే మళ్ళీ హడావుడిగా వెళ్లిపోవడం ఇలా రోజు పరిపాటి అయిపోయింది.ఒక రోజు లత నాతో...

‘’ఏమండీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు మీ గురించి అడుగుతున్నారు’’

‘’నా గురించా! దేనికి?’’

‘’అదేంటి! దేనికి అంటారేమిటి? వాళ్ళకి డాడీ తో మాట్లాడాలని సరదాగా తిరగాలని ఉండదా?’’

‘’లతా నీకు నాగురించి నా లక్ష్యం గురించి తెలియదా! అయినా నేను నీకు పిల్లలకి ఏ లోటు రాకుండా చూసుకోవడానికే కదా ఈ సంపాదన నీవు ఏదో ఒకటి సర్ది చెప్పు నాకు ఆఫీసుకి టైమ్ అయిపోతుంది.’’

ఆ రోజున నా పిల్లలని నిర్లక్ష్యం చేశానని ఇప్పుడు అనిపిస్తుంది రవి.....

అయినా నా లక్ష్యం ముందు ఇవేవీ కనబడలేదు నాకు.నేనేమీ తప్పు చెయ్యడం లేదే నా కుటుంబం సంతోషము గా ఉండాలనే కదా ఇదంతా చేస్తున్నాను అని నా మనసుకి సర్ది చెప్పుకున్నాను.ఇంట్లో పరిస్థితులు కొంచెం కొంచెం మారుతున్నాయి.పెద్దోడు స్కూల్ కి సరిగ్గా వెళ్ళడం లేదని చిన్నోడికి మార్కులు తక్కువ వస్తున్నాయని రోజూ ఏవేవో చెబుతుంది లత,కానీ అవన్నీ నువ్వే చూసుకో నాకు ఖాళీ లేదు డ్రైవరు కారు డబ్బులు అన్నీ ఇచ్చానుగా ఇంకా నాతో పనేమిటి అని విసుగు కున్నాను.మీరు పట్టించుకుంటే పిల్లలు జాగ్రత్తగా ఉంటారు అన్న నా భార్య మాట ఆ రోజు విని ఉంటే ఎంత బాగుండేది .......

    ఆ రోజు ఆఫీసు నుండి ఎంతో ఆనందముగా వచ్చాను...

‘’లతా లతా! ఎక్కడ ఉన్నావ్?’’

‘’ఇక్కడున్నానండి’’అంటూ లోపల నుండి బయటకి వచ్చింది ఎక్కడికో వెళ్లడానికి అన్నట్లు తయారయిఉంది.అయినా అవేమీ పట్టనట్లుగా....

‘’నాకు మేనేజరుగా ప్రమోషన్ వచ్చింది’’చాలా గర్వముగా చెప్పాను.

‘’ఓహ్! కంగ్రాట్స్ ‘’అని చెప్పిందే కానీ ఆ మాటలలో ఉత్సాహము కనబడలేదు నాకు....నేనేదో మాట్లాడుతుంటే లోపలికి వెళ్లిపోయింది నా ఆనందాన్ని తనతో పంచుకుందామంటే నిద్రపోయింది.మరుసటి రోజు ....

‘’డాడీ ఎన్నింటికి వచ్చావ్ నిన్న’’?

‘’పదింటికి రా ఏమి’’?

‘’నిన్న అమ్మ ,నేను తమ్ముడు నీ కోసం ఎదురు చూసాము మమ్మల్ని బయటకి తీసుకెళ్తావని నువ్వు ఎంతకీ రాకపోయేసరికి మేము నిద్రపోయాము’’ 

‘’బయటకా? నేను చెప్పలేదే!’’  

‘’అదేమిటి నిన్న మీ పెళ్లి రోజు కదా! అప్పటికి గాని గుర్తురాలేదు నాకు,లత నిన్న ఎందుకు అలా ఉందో.....సరే లతకి సారీ చెప్పడానికి లోనికి వెళ్లబోతుంటే ఆఫీసు వాళ్ళందరూ నాకు కాంగ్రాట్స్ చెప్పడానికి వచ్చారు అక్కడితో విషయము మరిచిపోయాను కానీ మా బంధానికి బీటలు వారుతున్నాయని గ్రహించలేకపోయాను.మేనేజరు పోస్ట్ వచ్చిన నా అధికార దాహం తీరలేదు మనసు ఇంకో మెట్టు ఇంకో మెట్టు పై పైకి వెళ్ళమని చెబుతూనే ఉంది.వెళ్తూనే ఉన్నాను.చివరికి సి‌ఈ‌ఓ గా నన్ను నిలబెట్టింది.ఆ రోజు నా భార్య నాకు ఫోన్ చేస్తూనే ఉంది.....కానీ నా పని ఒత్తిడి వలన తన కాల్ రిసీవ్ చేసుకోలేక పోయాను.నా పనిని పక్కన పెట్టి ఒక్కసారి తన ఫోన్ ఎత్తి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు రవి......

‘’ఇంతకీ మేడమ్ గారు మీకు అన్ని సార్లు ఎందుకు ఫోన్ చేసినట్లు?’’

‘’మా పెద్దబ్బాయి క్రికెట్ బెట్టింగ్ లు కట్టి అందులో డబ్బులు పోగొట్టుకుని ఎవరితోనో పోట్లాడుతూ పోలీసులకి దొరికిపోయాడంట’’

‘’అయ్యో! మరి ఎలా ఇప్పుడు?’’

‘’ఆ విషయం చెబుదామనే తను అన్ని సార్లు నాకు ఫోన్ చేసింది.లాకప్ లో పెట్టారంట వాడిని.... పదవ తరగతి చదువుతున్నాడు వాడు......చెడు సావాసాల వలన,తండ్రిగా నేను పట్టించుకోకపోవడము వలనే వాడు ఇలా తయారయ్యాడు. చిన్న వాడు సెల్ ఫోన్లు,వాట్స్ ఆప్ ,ఫేస్ బుక్ అంటూ పూర్తిగా చదువుని నిర్లక్ష్యం చేశాడు.పాపం ఇవన్నీ తట్టుకోలేక,నాతో చెప్పినా, నేను వినక......నా లత మానసికముగా ఎంతో క్రుంగి పోయింది.నీరసించిపోయింది.తన ఆరోగ్యము పాడయిపోయింది.నా జీవితము లో నేను అత్యున్నతస్థానానికి చేరానని మురిసిపోయానేగాని ఈ పరుగులలో నా అందమయిన కుటుంబాన్ని కోల్పోతానని ఊహించలేదు.ఎంత సేపు నా వాళ్ళకోసం సంపాదిస్తున్నాను వాళ్ళు హాయిగా ఉంటారని అనుకున్నాను గాని ఇలా జరుగుతుందని అనుకోలేదు రవి.....పదిహేనేళ్ళ ఈ పయనములో ఏమి సాదించానని వెనక్కి చూస్తే అంతా శూన్యమే కనిపించింది అందుకే నా భార్యా పిల్లలకి నా ముఖం చూబించ లేక ఈ నిర్ణయం తీసుకున్నాను రవి ‘’………

!+!+!+.....నిశబ్ధం .....

‘’సార్ మీకు చెప్పేటంత  పెద్దవాడిని కాదు, అయినా నాకు తెలిసింది చెబుతాను’’

‘’చెప్పు రవి వింటాను...ఏమి వినకపోవడము వలనే ఈ స్థితిలో ఉన్నాను’’

మనము చిన్నతనములో కష్టాలు పడ్డాము,మన పిల్లలు అదేవిధముగా ఇబ్భంది పడకూడదని ఆలోచించి రాత్రి పగలు కష్టపడి పనిచేస్తాము కానీ మనం అలా చేయడం వలన భార్యా పిల్లలని నిర్లక్ష్యం చేయడమే కాకుండా మన పిల్లలకి కష్టమన్నది తెలియకుండా చేస్తున్నాము.ఇది చాలా తప్పు.ఎలా కష్టపడాలో నేర్పాలి,ఉన్నంతలో సర్దుకుపోమని చెప్పాలి,అదే సమయములో మనము సంపాదించాలి అన్నీ బంధాలను,అనుబంధాలను నిలుపుకుంటూ సాగిపోవాలి.నాకు ఇద్దరు పిల్లలు.....నా సంపాదనతో మేము ఎంతో సంతోషముగా గడుపుతున్నాను జీవితాన్ని.....మీరు మీ సంపాదనలో మునిగి పోయి భార్యా పిల్లలని నిర్లక్ష్యం చేయడమే కాకుండా నిద్ర మాత్రలు మింగి మరో తప్పు చేశారు.క్షనిక ఆవేశములో మీరు తీసుకునే ఈ నిర్ణయము ఎన్ని అనర్ధాలకు దారి తీస్తుందో ఒక్కసారయినా ఆలోచించారా?ఇంతా సంపాదించినది వాళ్ళకోసమే కదా!మరి మీరు లేక పోతే మీ భార్య పరిస్థితి ఆలోచించారా?మిమ్మల్నే నమ్ముకుని ఉన్న ఆమె ఏమి తప్పు చేసింది?ముక్కు పచ్చలారని ఆ పసివాళ్ళ జీవితం ఏమయిపోతుంది’’

‘’మరి నన్నేమి చేయమంటావు రవి?నా ముఖం నా భార్యా పిల్లలకి ఎలా చూపించ మంటావ్?ఓడిపోయిన తండ్రిగానా!చేతగాని భర్త గానా?’’…..

‘’సార్!చావొక్కటే అన్నింటికీ పరిష్కారము కాదు,జీవితము ఎంతో విలువైనది,క్షణిక ఆవేశములో తీసుకున్న ఏ నిర్ణయము సరి అయినది కాదు. మీ భార్యా పిల్లలతో మనసు విప్పి మాట్లాడి చూడండి.వాళ్ళు మిమ్మల్ని అర్దం చేసుకుంటారు.కాక పోతే కోలుకోవడానికి కొంత సమయము పట్టవచ్చు కానీ మీ ప్రయత్నము మీరు చేసి చూడండి.....’’

‘’తప్పకుండా రవి.....నువ్వు చెప్పినట్లే చేస్తాను నా తప్పు తెలుసుకున్నాను.....నా కళ్ళు తెరిపించి,నా సమస్యకి మంచి పరిష్కారము తెలిపినందుకు నీకు రుణపడిఉంటాను’’……..

‘’సార్ అంత పెద్దమటాలెందుకు!మీకోసం ఎవరోచ్చారో చూడండి’’ రవి గది తలుపు తెరిచేసరికి బయట నా భార్య పిల్లలు ఉన్నారు.వాళ్ళని చూడగానే నా కళ్ళ వెంబడి జర జర కనీళ్లు వస్తూనే ఉన్నాయి..........


Rate this content
Log in

Similar telugu story from Drama