STORYMIRROR

muntaj shaik

Abstract Others

3  

muntaj shaik

Abstract Others

ప్రేమంటే ఏంటి

ప్రేమంటే ఏంటి

3 mins
219

"ప్రేమ" ఎంత చిన్న పదమో కదా..... కానీ దాన్ని అర్థం చేసుకోవడం కూడా అంతే సులభమా? నన్ను అడిగితే మాత్రం కాదు అనే అంటాను, ఎందుకంటే ప్రేమ అనే దానికి ఒక సరైన అర్థాన్ని ఎవరు చెప్పలేకపోయారు. ప్రేమ అనే దానికి ప్రతి ఒక్కరికి వేరే వేరే అర్థాలు ఉంటాయి. ప్రేమని అనుభూతి చెందగలం కానీ, ప్రేమ అంటే ఇది అని ఎవరం చెప్పలేము. అసలు మన జీతివంలో ఎన్ని సార్లు ప్రేమ కలుగుతుంది? ఒకే మనిషి మీద మాత్రమే పుడుతుందా? ప్రేమ అనేది మనసుకు సంబంధించిందా లేక శరీరానికి కూడా సంబంధించిందా ? ప్రేమ పుట్టడానికి ఒక్క క్షణం చాలు కానీ దాన్ని మార్చిపోవడానికి జీవిత కాలం పడుతుంది అంటారు. అది నిజమేనా?

తల్లితండ్రుల మీద చూపించేది ఏంటి? స్నేహితుల మీద? పిల్లల మీద చూపించేది? భర్త లేదా భార్య మీద ఉంది ఏంటి? తేడా ఏంటి? నన్ను అడిగితే మాత్రం... అందరి మీద ఉంది ప్రేమే కానీ దాన్ని చూపించే వీదానంలో తేడా ఉంటుంది అని అంటాను.

కొందరు అంటారు మనసుకి మనసుకి మధ్య ఉండేదే ప్రేమ, శారీరక వాంఛ అనేది ఉండదు అంటారు, అదే నిజం అయితే... మరి భార్యాభర్తలు ఎందుకు శారీరకంగా వేరే వారితో సంబంధం ఉంది అని తెలుసుకున్న తర్వాత విడిపోతున్నారు? శరీరం వేరే వారితో మూడి పడినా... మనసు మాత్రం వీళ్ళతోనే మూడి పడి ఉంటుంది కదా! మరి సమస్య ఏంటి?

సరే అది వదిలేయండి..... 

ఒకరు మనకి సమయం ఇస్తున్నారు, ఇష్టాలను గౌరవిస్తున్నారు, వాళ్ళకి నచ్చినట్టు మాత్రమే కాకుండా మనకి నచ్చినట్టు కూడా ఉంటున్నారు.... ఇదేనా ప్రేమ అంటే? అలా అయితే.... రేపు మీ జీవితంలో ఇంకొక వ్యక్తి వొచ్చి అలానే చేస్తే వాళ్ళని కూడా ప్రేమిస్తారా?

కొందరు ఒకరిని ప్రేమిస్తారు కానీ వేరే వారిని వీవాహం చేసుకుంటారు, వాళ్ళ భాగస్వామిని బాగా చూసుకుంటారు, అంటే ప్రేమ అన్నది జీవితంలో రెండు సార్లు పుడుతుందా? 


ఒకరిని ఎంతో ప్రాణంగా ప్రేమించాను అంటారు, ఒకవేళ ఆ మనిషిని వొదిలి వెళ్లిపోతే వాళ్ళ గురించి దుర్భాషలాడుతారు, చెడ్డగా చెబుతారు. అంటే... మనతో కలిసి ఉంటేనే వారిని గౌరవిస్తాం లేదు అంటే లేదు... ఇదేనా ప్రేమ అంటే?


ప్రేమలో బాధ ఉంటుంది కానీ - బాదే జీవితం అవ్వదు


ప్రేమ అంటే బలం - బలహీనత కాదు


నిన్ను నీకు కొత్తగా చూపుతుంది


గౌరవం ఉన్న చోట ప్రేమ ఉంటుందో లేదో కానీ - ప్రేమ ఉన్న చోట మాత్రం గౌరవం తప్పకుండా ఉంటుంది


గొడవలు జరగకుండా ఉండడం ప్రేమ కాదు - ఎన్ని గొడవలు ఉన్నా కలిసి దగ్గరా ఉండడం


తప్పు చేస్తే సరి చేయాలి - కుదరకపోతే కలిసి దాన్ని పంచుకోవాలి, అంతే కానీ వొదిలి వెళ్ళడం కాదు


కొన్ని సార్లు ఎదురు చూడడం కూడా ప్రేమే


మన భావాలను తెలుపడం తప్పు కాదు - కానీ వారు వేరొకరితో ఉన్నారు అని తెలిసి కూడా పదే పదే వారి మధ్యకు వెళ్ళడం తప్పు


స్టేటస్ లో ఫొటోస్ పెట్టి లవ్ యూ అని చెప్పడం మాత్రమే కాదు, మన ప్రారదనలో కూడా ఉండాలి! ఉన్నారా?


ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచనులు రావడమే కాదు - ఎంత మందిలో ఉన్న వాళ్లు ఎలా ఉన్నారు అనే ఆలోచన రావాలి


ఆనందం బాధ ఏం జరిగిన ముందుగా వాళ్ళతోనే చెప్పుకోవాలి అని అనిపించాలి


వాళ్ళ బాధను చూస్తే నీ మనసులో కల్లోలంగా ఉండాలి


ఎప్పుడు కూడా మీ ప్రేమను వేరేవారి కదలతో పోల్చుకోకండి, ఎందుకంటే.....

మీ కథ వేరు

మీ పరిస్థితులు వేరు 

మీరు అర్థం చేసుకొనే వీధానం వేరు


ప్రేమకి మాటలతో 

రంగు

రూపం

ఇంకా దీనితో పనిలేదు


ఒకరిని నిజంగా ప్రేమిస్తే మన మనసుకి తెలిసిపోతుంద్ది


ఎప్పుడైనా ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి

ఒకరిని ప్రేమిస్తే దయచేసి వాళ్ళకి చెప్పండి

ఒప్పుకుంటారా లేదా వేరే విషయం


ఇప్పుడు ఉన్న ప్రేమ రేపు ఉంటుంది ఏమో కానీ మనిషి ఉంటారో లేదో తెలియదు


నేడు ఉన్న కాలంలో ఒక స్వచ్చమైన మనసు, ప్రేమించే వ్యక్తి దొరకడం చాలా కష్టం

ఒకవేళ మీకు అలా ఎవరైనా ఉంటే వొదులుకోకండి


# నా వరకు ప్రేమ అంటే సమర్పణ 


తనువు నేనైతే ఆత్మ వాళ్లు అయ్యి ఉండాలి


మొదటి దాన్ని కాకపోయినా - ఆఖరి మనిషిని నేనే అయ్యి ఉండాలి


మాంసికంగానే కాదు శారీరకంగా కూడా తనలో నేను కలిసిపోవాలి


తనకి నచ్చిన వాటిని ప్రేమించక పోయిన గౌరవిస్తాను


తన బాధ సంతొషం అన్ని కూడా నావే అని భావిస్తాను #

 

నీతో జీవితం పంచుకోలేక పోయిన 

నీతో ఉన్న జ్ఞాపకాలని మనసులో నింప్పుకొని 

నాలో నిండి ఉన్న నీకు

నీ రాకకై ఎదురు చూస్తూ 

ఎప్పుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను 



Rate this content
Log in

Similar telugu story from Abstract