STORYMIRROR

Prince Prem

Tragedy Classics Inspirational

3  

Prince Prem

Tragedy Classics Inspirational

ప్రేమ చేసిన గాయం

ప్రేమ చేసిన గాయం

6 mins
7



2022 లో జరిగిన యదార్థ సంఘటన...

యువర్ అటెన్షన్ ప్లీజ్ ట్రైన్ నెంబర్ 12727 
విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళు గోదావరి ఎక్స్ప్రెస్
నలభై నిమిషాలు ఆలస్యంగా నడుచుచున్నది.
ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నాము...
నిద్రలో ఉన్న నాకు అనౌన్స్మెంట్ లీలగ వినిపిస్తుంది
ఒక్కసారిగా మెలకువ వచ్చి లేచాను.
అప్పటికే ట్రైన్ డోర్నకల్ స్టేషన్లో ఆగింది.
40 నిమిషాలు ఆలస్యంగా ఉంది అని అనౌన్స్మెంట్
వినేసరికి ఒకటే టెన్షన్ మొదలయింది.
ఇప్పుడే 40 నిమిషాలు అంటే నేను హైదరాబాద్ చేరేసరికి
కచ్చితంగా గంట పైనే ఆలస్యం అవుతుంది అనుకుంటూ
ఠక్కున మొబైల్ తీసి నెంబర్ డయల్ చేశాను.

ఫోన్ చాలాసేపు రింగ్ అయింది కానీ
అవతలి వ్యక్తి లిఫ్ట్ చేయలేదు.
మళ్లీ ట్రై చేశాను ఈసారి లిఫ్ట్ చేసారు.
ఏంటి సార్... తమరికి ఇప్పుడు గుర్తొచ్చామా మేము
అంటూ అవతలి వ్యక్తి గొంతులో వెటకారం..
అబ్బా అదేం కాదు లే.... వస్తున్నాను కదా 
ట్రైన్ ఇప్పటికే 40 నిమిషాలు లేటు ఉంది 
అసలే మార్నింగ్ షిఫ్ట్ నాకు
ఒకసారి DY CMO కి చెప్తావని కాల్ చేశాను అని
అన్నాను.
అదేదో తమరే చేయొచ్చు కదా అని కాస్త వెటకారంగా
చెప్పింది నా స్నేహితురాలు డాక్టర్ గౌతమి.
వద్దులే అసలే నా మీద చాలా కోపంతో ఉన్నాడు 
ఇప్పుడు మళ్లీ లేటుగా వస్తున్నాను అంటే ..
ఇంకా పొద్దున్నే వాయిస్తాడు.
నువ్వే ఎలాగైనా చెప్తావని కాల్ చేశాను
అలాగే ప్రభావతి మేడం గారితో కూడా ఒక మాట చెప్పు
లేట్ అవుతుందంట అని చెప్పి ఫోన్ కట్ చేశాను.

        ట్రైన్ భువనగిరి స్టేషన్ చేరుకునేటప్పటికీ మరింత ఆలస్యమైంది
భువనగిరి స్టేషన్ దగ్గర్లో ట్రైన్ ని మళ్లీ ఆపేశారు.
ఈసారి డాక్టర్ గౌతమికి మళ్లీ కాల్ చేశాను.
ఇంకా లేట్ అయ్యేలా ఉంది. 
ఇప్పుడే భువనగిరి స్టేషన్ దాటింది. 
సరిగ్గా వస్తే ఇంకా 40 నిమిషాలు పడుతుంది 
కానీ మధ్యలో ఆపేశారు.
నీది నైట్ డ్యూటీ కదా మరి.
నువ్వు వెళ్ళిపోతావా లేదా నేను వచ్చేదాకా ఉంటావా అని
అడిగాను.
మార్నింగ్ షిఫ్ట్ డ్యూటీ డాక్టర్ కూడా రాలేదు.
ఇప్పుడు నువ్వేమో లేటుగా వస్తున్న అని చెప్తున్నావు
పర్వాలేదులే.  నువ్వు వచ్చేదాకా ఉంటాను అని చెప్పింది గౌతమి.
  సరే ఎమర్జెన్సీ కేసులు ఎన్ని ఉన్నాయి ఐసీయూలో అని అడిగాను. 

మొత్తం ఐదు కేసులు ఉన్నాయి.  
మూడు ఈరోజు వార్డ్ కి షిఫ్ట్ చేయాలి అని చెప్పింది.
మిగతా రెండింటి కండిషన్ ఏంటి అని అడిగాను.
ఒకటి యాక్సిడెంట్ కేస్.  ఇంకొకటి ఆత్మహత్య ప్రయత్నం.
ఎలా ఉంది కండిషన్ పేషెంట్లది పరవాలేదా? 
ఒకసారి నాకు పూర్తి డీటెయిల్స్..
కేస్ షీట్ వాట్సాప్ చేయి అని చెప్పాను.
తను వాట్స్ అప్ చేసింది.
చూశాను. పర్వాలేదు 
నువ్వు ఫ్రెష్ అయ్యి త్వరగా రా...
టెన్షన్ పడకు నేను చూసుకుంటాను అని చెప్పి
ఫోన్ కట్ చేసింది గౌతమి

      ట్రైన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకునేసరికి 
చాలా ఆలస్యమైంది.  
హడావిడిగా హాస్పిటల్ కి బయలుదేరాను.
అసలే జరిగిన ఆలస్యానికి ఈ ట్రాఫిక్ మరింత ఆలస్యాన్ని
కలిగిస్తుంది. ఎలాగైతే నేమి 9 గంటల 30 నిమిషాల వరకు
హాస్పిటల్ కి చేరుకున్నాను.
చాలా ఆలస్యమైంది. నా లగేజ్ బ్యాగ్ పక్కన పెట్టి
డ్రెస్ మార్చుకొని ఎమర్జెన్సీ వార్డులోకి పరిగెత్తాను.
అప్పటికి వార్డుకు షిఫ్ట్ చేయాల్సిన పేషెంట్ తాలూకు వాళ్ళు అనుకుంటా... 
ఒక్కొక్కరు పేషెంట్ పక్కన కూర్చొని
ఉన్నారు.  గౌతమి మేడం రౌండ్స్ లో ఉంది.
వెళ్లి తనని పలకరించి తన చేతిలో ఉన్న.... కేషీట్ తీసుకున్నాను.
ఏంటి ప్రాబ్లం అన్నట్టుగా అడిగాను తనని.
రెండు రోజుల క్రితం అడ్మిట్ అయ్యాడు సూసైడ్ కేసు.
కండిషన్ ఓకేనా అంటూ పేషెంట్ ని చెక్ చేశాను.
గౌతమి కేసు షీట్ చూపిస్తూ ఉంటే పేషెంట్ ని చెక్ చేసి వివరాలు కనుకున్నాను.
వయసు 30 సంవత్సరాల లోపే ఉంటుంది
తను ఒక టీచర్... ఏమ్ మాట్లాడకుండా
సైలెంట్ గా ఉన్నాడు.  
పదిమందికి చెప్పాల్సిన నువ్వే 
ఇలాంటి పనిచేయడం ఏంటి మాస్టారు అన్నాను.

తనేO మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు.
ఏమైంది అన్నట్టుగా కళ్ళతో సైగ చేశాను గౌతమికి
రెండు రోజుల నుంచి తను ఎవరితో మాట్లాడటం లేదు
ఏమి తినడం లేదు 
అలా సైలెంట్ గానే ఉంటున్నాడు అని చెప్పింది తను.
తనకు ఇవ్వాల్సిన మెడిసిన్స్ కేషీట్లో రాసి సంతకం చేసి
మిగతా పేషెంట్లను చూసి వచ్చి నా సీట్లో కూర్చున్నాను

      ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి గౌతమి కూడా వచ్చి
నా ఎదురుగా ఉన్న సీట్లో కూర్చుంది.
ఏంటి సార్ ....ఎలా జరిగింది ఏంటి  
మీ కేరళ టూర్ అని అడిగింది.
టూర్ కి ఏంటి చాలా బాగా జరిగింది అని చెప్పా నేను
అంతేలెండి మేమెక్కడ ఫోన్ చేస్తామో అని 
మొబైల్ ముందుగానే స్విచాఫ్ పెట్టేసారు కదా
బానే ఎంజాయ్ చేసి ఉంటారు అంది కాస్త.. కోపంగా
అబ్బా అలాంటిదేం కాదు 
నీకు తెలిసిందే కదా మనం టూర్ లో ఉంటే
మొబైల్ స్విచ్ ఆఫ్ పెట్టేస్తాము అని.
అంతే ఆ మాత్రం దానికి 
తమరు అంతగా కోపడకండి నా మీద అన్నాను నవ్వుతూ.
అసలే నైట్ డ్యూటీ చేసి ఉన్నావు
వెళ్తావా మరి మీ హాస్టల్ కి అని అడిగాను నేను
ఇప్పుడు నేను ఉంటే నీకేమైనా ఇబ్బంది నా సర్ అని అనింది గౌతమీ నా బాగ్ చెక్ చేస్తూ...
అలా అని కాదు నైట్ డ్యూటీ చేసి 
మళ్ళీ ఇప్పుడు
ఈ టైం దాకా ఉండడం అంటే కష్టం కదా
అందుకే అడిగాను వెళ్తావా అని అన్నాను నేను

ఇంతలో..... రూమ్ బాయ్ వచ్చి టీ తీసుకు రమ్మంటారా సార్ అని అడిగాడు. క్యాంటీన్ కి వెళ్లి నాకు ఏదైనా టిఫిన్
ప్రిపేర్ చేయమని చెప్పు లక్ష్మణ్ గారితో అని చెప్పాను.
అలాగే కాస్త స్ట్రాంగ్  టీ తీసుకుని రా ఇప్పుడు అని చెప్పి
అతని పంపించాను.
తను వెళ్ళిపోయాక అక్కడ ఉన్న కేసు షీట్స్ చూస్తున్న నాకు గట్టిగా అరుపులు వినిపించి 
ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్లాను.
  ఇంచార్జ్ సిస్టర్ సుశీల గారు ఒక పేషంట్ పై అరుస్తున్నారు. తను ఎవరా అని చూస్తే
సూసైడ్ ప్రయత్నం చేసిన పేషంట్. 
అన్నట్టు అతని పేరు రేవంత్.

దూరం నుంచే ఏమైంది మేడం అని అడిగాను
చూడండి సార్ రెండు రోజుల నుంచి మెడిసిన్
వేసుకోవడం లేదు 
ఏమి తినడం లేదు 
ఎవరితో ఏమీ మాట్లాడడం లేదు
ఇప్పటికే చాలా నీరసం అయిపోయాడు అని చెప్పింది
సరే అతనితో నేను తర్వాత మాట్లాడతాను కానీ
మీరు ఒకసారి నా చాంబర్కి రండి మేడం అని చెప్పాను.
అక్కడ ఉన్న సిస్టర్స్ కి మిగతా పనులు చెప్పి మేడం గారు నా ఛాంబర్ కి వచ్చారు.

      లొపలికి వస్తూనే....
ఎలా జరిగింది సార్ మీ టూర్ అంటూ అడిగింది .
చాలా బాగా జరిగింది అని చెప్పాను.
ఇదిగో మేడం మీరడిన స్వీట్స్ అంటూ...
నా బాగ్ లో నుంచి ఒక బాక్స్ తన చేతిలో పెట్టాను.
థాంక్స్ చెప్తూ....తీసుకుంది.
ఎదురుగా కూర్చున్న గౌతమి గారు
మరి నా కోసం తీసుకురాలేదా స్వీట్స్ అని అడిగింది.
స్వీట్స్ తింటే నువ్వు లావు అవుతావని తీసుకురాలేదు అన్నాను నవ్వుతూ...
ఇంతలో...రూమ్ బాయ్ టీ తీసుకువచ్చాడు.

టీ తాగుతూ.....
ఏంటసలు అతను ఎవరితో మాట్లాడడం లేదంట
మెడిసిన్ తీసుకోవడం లేదంట
ఏంటి ప్రాబ్లం అని అడిగాను సుశీల గారిని.
చనిపోవడానికి ఏదో లిక్విడ్ తాగాడు సార్. 
జానకి మేడం గారు చాలా రిస్క్ చేసి
అతని ప్రాణాలు కాపాడింది. 
ఏమాత్రం ఆలస్యం అయినా కూడ
తన ప్రాణాలు పోయేవి. మేడం చాలా రిస్క్ చేసింది
కానీ రెండు రోజుల నుంచి ఎవరితో 
మాట్లాడటం లేదు.  ఏమి తినడం లేదు.
చూస్తున్నారు కదా 
అలాగే ఉంటున్నాడు అని చెప్పింది సుశీల మేడం.
సరే తనకు సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరా అని
అడిగాను నేను.
అడ్మిట్ చేసేపుడు తన స్నేహితుడు వచ్చాడు
ఆ అబ్బాయి కూడా మళ్లీ రాలేదు అని చెప్పింది.
మేడం గారితో మాట్లాడుతూ ఉండగానే ...
నా ఫోన్ రింగ్ అయింది. 
ఫోన్ లిఫ్ట్ చేశాను మా ఓనర్ అక్క వాయిస్
నేనే మాట్లాడడం మొదలుపెట్టా..
ట్రైన్ లేటుగా వచ్చింది అక్క 
ఇంకా దిగేసి డైరెక్ట్ గా హాస్పిటల్ కి వచ్చాను 
నేను రూమ్ కి వచ్చేసరికి సాయంత్రం అవుతుంది
అని చెప్పి ఫోన్ పెట్టేసాను.

    నేను అలా ఫోన్ పెట్టేసానో లేదో మళ్లీ ఏదో అరుపులు  వినిపించాయి వార్డు నుంచి.
నేను సుశీల మేడం హడావిడిగా అటువైపు పరిగెత్తాము... రేవంత్ ఈసారి మళ్లీ ఆత్మహత్య చేసుకోవడానికి 
పక్కనే ఉన్న కత్తెరతో తన చేతిపై గట్టిగా పొడుచుకున్నాడు.
అక్కడే ఉన్న సిస్టర్స్ అతనికి ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు.
అతని ప్రవర్తనకి చాలా కోపం వేసింది
ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా తన దగ్గరకు వెళ్లి నిలుచున్నాను. పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదు 
సిస్టర్స్ వెళ్ళిపోయాక తన వైపుకు చూశాను 
తను ఏం మాట్లాడటం లేదు
శూన్యంలోకి చూస్తూ.. ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు
రెండు రోజుల నుంచి ఆహారం తీసుకోకపోవడం వల్ల
నీరసంగా కాళ్లు చేతులు వణుకుతున్నాయి.

     తన పక్కనే ఉన్న అతనికి కేస్ షీట్
తీసి  చూసాను.
జానకి మేడం గారు నిజంగా చాలా రిస్క్ చేసి ఇతని
ప్రాణాలు కాపాడింది
ఇదే మాట అతనితో చెప్పాను.
నేను బ్రతకాలి అనుకోవడం లేదు డాక్టర్
నాకు చావాలి అని ఉంది 
మీరు ఎందుకు బ్రతికించారు అంటూ...అరుస్తున్నాడు

తను అన్న మాటలకి చాలా కోపం వచ్చింది
నిన్ను  బ్రతికించాలి అని అనుకోవడం
మా మూర్ఖత్వమే అంటావా మరి అని అడిగాను కోపంగా
ఏం సమాధానం లేదు.
నువ్వు ఎందుకు చావాలి అనుకుంటున్నావు అని అడిగాను.
తనేమీ మాట్లాడలేదు.
లవ్ ఫెయిల్యూరా అని అడిగాను.
అవును అన్నట్టుగా తలువుపాడు.
ఈరోజుల్లో ప్రేమించడం మోసం చేయడం ..
మోసపోవడం కామన్ కదా
ఈ మత్రానికే చనిపోవాలా అన్నాను..
తనేమీ మాట్లాడలేదు.
తను నిన్ను వదిలేసింది నువ్వు కూడా తనని వదిలేయవచ్చు కదా అని ప్రశ్నించాను.
తనే నన్ను వదిలేయలేదు తన మనసులో నేను ఉంటాను నా మనసులో కూడా తను ఉంటుంది అని సమాధానం చెప్పాడు. 
గొల్లున నవ్వాను నేను. ఈ డైలాగ్ ఏదో బాగుంది అని అన్నాను.
తనకి కోపం వచ్చినట్టుగా ఉంది

మీరెవరినైనా ప్రేమించి మోసపోతే మీకు తెలుస్తుంది 
ఆ బాధ ఏంటో అన్నాడు తను
అలాంటి ఆఫర్లు నాకెందుకులే కానీ...
ముందు సరిగ్గా ఆహారం తీసుకో
లేకపోతే చాలా నష్టo నీకు అని చెప్పి
పక్కనే ఉన్న ప్లేట్ అందించాను.
నాకు వద్దు అంటూ ప్లేట్ ని దూరంగా విసిరేసాడు.
వార్డులో ఉన్న మిగతా వాళ్లంతా నన్ను అతన్ని విచిత్రంగా చూడ సాగారు.
ఇంతలో కోమలి సిస్టర్ వచ్చి ప్లేట్ తీసి కింద పడి ఉన్న
ఫుడ్ ని ప్లేట్లోలోకి తీయసాగింది.
ఆ వెంటనే స్కావెంజర్ వచ్చి అక్కడ అంతా క్లీన్ చేశాడు.
అతను చేసిన పనికి చాలా కోపం వచ్చింది నాకు
ఏం మాట్లాడకుండా వెళ్లి నా సీట్లో కూర్చున్నాను.

తను ఒక టీచర్ అయి ఉండి పదిమందికి మంచి చెడు
చెప్పాల్సిన వ్యక్తి అలా ముందు వెనుక ఆలోచించకుండా ప్రవర్తించడం ఎందుకనో నాకు నచ్చలేదు.
కానీ..
బాధలో ఉన్న విషయం మాత్రం అర్థమైంది 
అందుకే నేను కూడా ఏం మాట్లాడలేదు.
కాసేపయ్యాక....
మళ్ళీ తను అరవడం మొదలు పెట్టాడు.
నన్ను వదిలేయండి నాకు చచ్చిపోవాలని ఉంది
బ్రతకాలని లేదు అని అరుస్తున్నాడు
ఇంతలో ..
దూరంగా ఎక్కడో డ్రెస్సింగ్ చేస్తూ ఉన్న సుశీల మేడం గారు
పరిగెత్తుకు వచ్చారు.
అలా అరుస్తున్న అతని చెంపపై గట్టిగా కొట్టారు.
జరిగిన పరిణామానికి నాతో పాటు అందరూ షాక్ అయ్యారు 
ఎందుకంటే ఎంతో సౌమ్యంగా మృదువుగా ఉండే
మేడం గారిలో ఇంతటి కోపాన్ని చూడడం 
ఇదే మొదటి సారి..
ఒక్కసారిగా ఎమర్జెన్సీ వార్డ్ అంత సైలెంట్ అయింది

సుశీల మేడంగారు మాట్లాడడం మొదలుపెట్టారు
నిజమే... ఆ అమ్మాయి జ్ఞాపకాలతో బ్రతకడం కంటే చనిపోవడం చాలా బెస్ట్ 
కాకపోతే నేను ఒక చిన్న విషయాన్ని నీకు చూపిస్తాను
అది చూసిన తర్వాత నువ్వు చనిపో అని చెప్పి
అక్కడే ఉన్న వార్డ్ బాయ్ ని ఒక వీల్ చైర్
తీసుకురమ్మని చెప్పి.... రేవంత్ ని ఆ వీల్ చైర్ లో కూర్చోబెట్టి
అక్కడ నుంచి మెటర్నిటీ వార్డుకి తీసుకువెళ్ళి..
దూరంగా తన బిడ్డకు జన్మనివ్వడం కోసం
ఆపసోపాలు పడుతున్న ఒక తల్లిని చూపించి
ఇప్పుడు చెప్పు బాబు..
ఎవరో అమ్మాయి చేతిలో మోసపోవడం కోసమేనా..
కష్టపడి మీ తల్లి నిన్ను కన్నది.
ఒకసారి ఆ తల్లి పడుతున్న కష్టం చూడు
ఇంతటి కష్టాన్ని బాధని దిగమింగుతూ మీ అమ్మ కూడా నిన్ను ఇలాగే కనీ ఉంటుంది
ఎవరో అమ్మాయి మోసం చేస్తే చనిపోవడం కోసమే
మీ అమ్మ నిన్ను కష్టపడి పెంచిందా...
సమాధానం చెప్పు అని అడిగింది
ఏమి మాట్లాడకుండా మౌనంగా తలదించుకొని ఉన్నాడు రేవంత్
తన కళ్ళల్లో నుంచి కన్నీళ్లు అతడి చేతికి పెట్టిన కాన్యుల మీద పడుతున్నాయి.
క్యానుల నుంచి బయటకు వస్తున్న రక్తంతో..
అతని కన్నీరు కలిసిపోయి నిశ్శబ్దంగా
ముందుకు సాగుతుంది

@@@##### ఇంకా ఉంది @@@#######



Rate this content
Log in

Similar telugu story from Tragedy