పాపం వీరబద్రం
పాపం వీరబద్రం
మోహనరావు మంత్రిప్రగడమోహనరావు
ఇదో సినీమా డైలాగుతో కధ ప్రారంభిస్తున్న ఇదో సినీమా డైలాగుతో కధ ప్రారంభిస్తున్నా, నూతనప్రసాదుగారి తొలిసినీమా అనుకొంటా. ఆడైలాగోక్కటే అందులోది మిగతా కధంతా కల్పితమే నండి
."హాలో అమ్మడు హైదరాబాదలో ఉన్న అహోబలరావుగారికి ఫోను కలుపు" అన్నాడు వీరబద్రం, మీసాలు చూసుకొంటు. (ఆరోజుల్లో సేల్ఫోన్లు లేవు అన్ని లాండులైన్న్లే ఆఫోనులకి డైరెక్టుగా డైలు చేసుకొనే సౌకర్యంలేదు, ఫోను తీయగానే ఆపరేటరు లైన్లోకి వస్తారు, వారికి వివరంచెపితే లైనుకలుపుతారు, ఆరోజుల్లొ ఫోన్లు కూడా తక్కువ కనక లైను గమ్మునే దొరికేది ఓక్కోసారి మదరాసు లాంటి దూర ప్రదేశాలనుండి వచ్చే ఫోన్లలోమాటలు స్లో అయ్యేవి, దానికి మధ్య రిపీటింగ్ అసిస్టంటు ఉండి వారిమాటలు వీరికి వీరిమాటలు వారికి వినిపించెవారు.
వీరబద్రంగారి ఫోను రింగయింది, ఆయన తీసి "హలో అన్నాడు.
"సవస్కారవండి, మనూరెప్పుడొత్తన్నారు, వచ్చెటప్పుడు ఓ శేరు జీడిపప్పట్రండి" అంది ఆవతల గొంతు. " అలాగేనండి ఓమూడు కెజీలు అట్టుకొత్తాను, ఫోను అహోబలరావుగారికియ్యండి" అన్నాడు వీరబద్రం. "అహోబలరావా, ఆయనెవడు,అలాంటెవాల్లు లిక్కడలెరండి నాను ఆదిరేడ్ని మాట్టాడతనాను" అన్నాడతగాడు
ఓర్ని, ఫోనేట్టెయి ముందు" అని ఫోను పెట్టెసి మళ్ళా ఎత్తి "ఇదిగోఅమ్మాయి, అహోబలరావు గారికి లైనుకలపమంటే ఆదిరెడ్డికి కలిపావేంటి," అని అడిగాడు. "సార్ మీరు వివరం చెప్పాలి, ఆయన ఫోనునంబరు చెప్పాలి" అంది ఆంది ఆపరేటరు. "ఏంటి, నీకుహౌదరాబాదులోని అహోబలరావుగారు తెల్దా,బలే సిత్రంగుంది ఓలుమొత్తం మన రాట్రంలో ఆయన పేరు తెలవనోడు లేడు" అన్నాడు అహహా అని నవ్వుతు. ఆనవ్వుకి అ ఆపరేటరమ్మాయి భయపడి, "అయ్యా తమరు ఫోను పెట్టెయండి, నేను హైదరాబదు విఐపి లిష్టుచూసి మళ్ళా రింగుచేస్తాను" అంది, "సరే అమ్మడు అలాగె కాని" అని ఫోను పెట్టెసాడు వీరబద్రం.
ఓపావుగంట తర్వాత వీరబద్రం ఫోనుకి రింగొచ్చింది. "హలో అహోబలరావుగారేనాండీ, ఆయి నేనండియీరబద్రాన్ని మొగలతుర్రునించండి," అన్నాడు ఆనందంగా "ఓమీరా బాగున్నారా," అడిగారాయన, "ఆయి బాగున్నానండి, తవరివల్ల
ఓ సాయంకావాలండి" అన్నాడు వీరబద్రం మొహమాట పడుతు."అలాగా చెప్పండి" అన్ననారాయన. "అదేనండి మాయంకడుఉన్నాడుకదండి, ఆడ్ని పోలీసులు అట్టక పోయారండి" అన్నాడు."అలాగ ఎందుకని" అడిగారాయన. "మరేనండి ఆడింట్లో ఏవడోకన్నంయేసాడటండి, ఆయిసయం పోలీసులకి చెప్పడానికేల్తె ఆడ్నిబొక్కలో యేశేసారండి" అన్నాడు విరబద్రం గట్టిగా. "ఓఅలాగనేను ఇక్కడ పెద్ద పోలీసాయనతో
"మాట్టాడతాను" అన్నారాయన ఆడ్ని వదిలిపిత్తే మీకట్టం ఉంచుకోడండి, రేపు సాయంత్రం బండికి నేను ఆడు వచ్చేత్తామండి" అన్నాడు వీరబద్రం."అలాగే, ఉంటాను" అని ఆయన ఫోను పెట్టెసా రు.ఆమరనాడు వీరబద్రంగారు స్టెషనుకి వెళ్ళారు, ఎస్సై గారు ఎదురొచ్చి "ఏంటి బద్రంగారుఇలావచ్చారు" అని అడిగారు. "ఆయి, ఎస్సైగారు మాయంకడ్ని వదిలేసారా" అని అడిగాడు.లేదండి ఆడిమీద కెసు కట్టేసాం ఈరోజు కొర్టుకి తీసుకుపోతాం" అన్నారాయన. "ఐతే అహోబలరావుగారు ఏంచప్పలేదా" అడిగారు వీరబద్రంగారు. "ఆయనెవరు ఏదో రాప్ట్రపతో గవర్నరో అన్నట్లు చెపుతున్నారు" అని గట్టిగా నవ్వేసాడా ఎస్సైగారు. "అంటే మీకు హైదరాబాదు అహో
బలరావుగారు తెల్దన్నమాట, అహోబలరావు తెలియకపోవడం ఏమిటండడి!" అన్నాడు ఆశ్చర్యంగా. ఆమాటకి ఎస్సైగారికి ఆయన ఏదైన పెరున్న నాయకుడేమో అన్నకొంచం అనుమానం కలిగింది, వెంటనే ఆయన లెచి నుంచొని అయ్యా బద్రంగారు, కేసు కట్టేసాం అంచేత మీరు కోర్టులో మేనేజి చేసుకొండి" అన్నారు ఆయన. " సరే అని వీరబద్రం ఇంటికొచ్చి అహోబలరావు గారికాల్చెరు కాని ఫోను కలవలేదు. సాయంత్రం దాకా చాలాసార్లు
చేసినా ఫోనుకలవలేదు సాయంత్రం లైను కలిసింది, "అలో అహోబలరావుగారేనాఅండి" అడిగాడు వీరబద్రం. "అవును చెప్పండి వీరబద్రం" అన్నారాయన. "అయ్యగారు తవరు, పైఅధికార్లతో మా యంకడి యిసయం చెప్పలేదాండి" అడిగాడు వీరబద్రం. "సారి బద్రంగారు నేను అసవరమైనపనిమీద నిజమాబాదెళ్ళాను, విషయం పరాకుపడ్డాను, ఇంతకి ఏవయాంది" అడిగారు ఆయన. కోర్టులో ఆడు నిజంవప్పెసుకొని తనే కన్నంయేసానని చెప్పాడంటండి, ఆడికి మూనెళ్ళు, జైలేసారండీ," అన్నాడు వీరబద్రం. "ఓ ఐసి సర్లే తక్కువ శిక్షే కదా," అన్నారాయన, మళ్ళా ఆయనే "వీరబద్రంగారు రేపు సాయంత్రం బండికి వస్తన్నారా" అడిగారాయన. "ఆయి తప్పకుండా వత్తానండి," అని గట్టిగా చెప్పాడాయన. "అదిసరే వచ్చెటప్పుడు- అని ఆయన మాట పూర్తవకుండానే, "అలాగేనండి మూడుకేజీలు జీడిపప్పు అట్టుకొస్తానండి" అన్నాడు వీరబద్రం సంతోషంగా, "అదే సరేనయ్య మరాపార్టి- అనేమాట ఆయన పూర్తి చెయకుండానే "ఆయి ఐదేలు వసులైందండి, అదికూడా అట్టుకొస్తానండి" అన్నాడు, "సరే బండి దిగ్గానే ఆటోఎక్కి మాఇంటికని చెప్పండి, తీసుకొచ్చేస్తాడుఆటోవాడు" అన్నారు.
.ఆయన. మరనాడు సాయంత్రం వీరబద్రం బండెక్కి మరనాడు ఉదయం సికింద్రాబాదులో దిగి ఆటోపిలిచాడు. ఆటో అతను వచ్చి "ఏడకా పోవాల్న" అడిగాడు. అహోబలరావు గారింటికి" అన్నాడు వీరబద్రం, "ఆయనెవడు ఆయనఇల్లు నాకెట్ట తెలుస్తది, అందంతవదిలై, సరిగా ఏడకి పావాలో సెప్పు" అన్నాడుఅతను చిరాగ్గా, వీరబద్రం కొంచంఆలోచించి, బహుశా ఇతను కొత్త వాడైయుంటాడు, అనుకొని "సరే అస్సేంబ్లి కాడకి పోని అన్నాడు ఆటో ఎక్కి, ఆటో అస్సేంబ్లి దగ్గర ఆగింది. వీరబద్రం ఆటోదిగి గెటులోంచి లోపలకెళ్ళబోయాడు."టైరో, భాయి టైరో," అని అరచాడు గేటుదగ్గర ఘూర్క, "అరేఇది టైరు, సూపు కాదయ్య జీడిపప్పు, జీడిపప్పు, అహోబలరావు గారికి" అన్నాడు, ఇంతలో లోపలనించీ కార్లు రావడంచూసి, "ఏభాయి జర హఠో గాడి ఆతాహై అని విరబద్రాన్ని చెయ్యపట్టుకుపక్కకి లాగేసాడు, వరసగా ఐదు కార్లు వెళ్ళిపోయాయి, ఆరోకారు గేటుదాటి ముందుకి వెళ్ళి ఆగి వెనక్కి వచ్చింది, కారు అద్దం తీసిచూసి కార్లో ఉన్నాయన, "బాబాయి, వీరబద్రంబాబాయి" అనిపిలిచాడు, వీరబద్రం ఆయన్ని చూసి "ఒరేబుజ్జీ నువ్వట్రా" అని కారు దగ్గరకొచ్చాడు. "ఇక్కడున్నావేమిటి" అడిగాడుబుజ్జి."అదేరా మన అహోబలరావు" అని ఇంకా ఎదో అనబోతుంటే, "బాబాయి ముందుకారెక్కు ఇంటికెళ్ళి మాట్లాడు కొందాం" అనిడోర్ తీసి విరబద్రాన్ని ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్ళాడు ఆయన. "బాబాయి అసలు ఎప్పుడొచ్చావు,దేనికి వచ్చావు" అడిగాడు బుజ్జి. "ఈరోజేరా, అదె మన అహోబలరావు గారిని కలుద్దామని వచ్చాను, "ఆయనెవరు బాబాయి,ఆయన నీకెలాతెలుసు" అడిగాడు ఆయన. "అదేరా ఓసారి మన భీవరంలో మీటంగంటే యెల్లాను, శానామంది వచ్చారు మైకుట్టు కొని శానా మాటలు సెప్పాడురా, ఆతరవాత మీటింగైపోయే ముందు, ఎవరైన పార్టికి కీ యిరాళాలు ఇవ్వదలస్తే అక్కడ మామేనేజరున్నాడు మీపెరు ఫోనేంబరు సెప్పిఆయనకి ఇచ్చి రసీదుతీసుకొండీ" అన్నాడురా, నెను ఒవందఇచ్చాను నాపేరు ఫోనేంబరు సెప్పానురా, ఆఖర్న నేను ఆయన్ని కలిసి మాఅన్న గారబ్బాయి బుజ్జి ఎమ్ ఎల్యే అండి అన్నాను. "అలాగా నేను ఏభైమంది ఎంఎల్యెకి పై నాయకుడిని, ఆళ్ళంతా నాక్రింద పని సేత్తారని చెప్పాడురా, ఆతరవాత ఒరోజు ఫోన్చేసి శానాసేపు మాట్టాడి, ఎదైన పని కావాలంటె ఫోన్చెసి అహోబలరావంటే లైను కలిపెత్తారని సెప్పాడురా, మొన్న మనయంకడ్ని పోలీసులు అట్టుకుపోయారని సెప్పాను, రా ఆతరవాత మళ్ళా ఫోన్చేసాను, యంటనేరండి వచ్చెటపుడు పార్టి ఫండు అట్రా మన్నాడురా, అందుకని ఓ మూడుకేజీల జీడిపప్పు, ఓ ఐదేలు డబ్బు తెచ్చానురా" అన్నాడు వీరబద్రం. "అరే బాబాయి ఆడు ఓ తుకారాంగాడు, చాలామందిని ఇలానే మోసం చేత్తన్నాడు, పోలీసులకు దొరక కుండ తిరుగుతున్నాడు, ఇంకా నయం నేను నీకు కనపడకపోతె ఆడు ఎక్కడినించో వచ్చి నీదగ్గర ఉన్న ఐదేలు నొక్కేసి రాత్రి బండెక్కించెసేవాడు" అన్నాడు బుజ్జి నవ్వుతు. "ఓర్నీ ఇంత మోసమా బగమంతుడు నాపాలున్నా డురా అందుకే నీకు కనిపించాను" అన్నాడు వీరబద్రం, "సరే బాబాయి నువ్వు బోంచేసి విశ్రాంతి తీసుకో, నాకుపనుంది బైటకి వెల్తాను" అన్నాడు బుజ్జి. "అరే నేను సాయంత్రంబండికి యల్తను"అన్నాడు,వీరబద్రం. "అలాగే నేనువచ్చి బండెక్కిస్తాను" అని అతను బైటకి వెళ్ళి పోయాడు, సాయంత్రం బుజ్జి ఇంటికోచ్చెసరికి వీరబద్ర శిధ్ధంగాఉన్నాడు, "ఒరేబుజ్జి ఈ ఐదెలు నీకాడుంచి పార్టి ఫండుకి ఇయ్యరా" అని ఐదువేలు అతని చేతికి ఇవ్వబోయాడు, వీరబద్రం, "బాబాయి ఇలా ఐదేలు పదేలు పార్టి తీసుకోదు, అయనా ఆవ్యవహారంవేరు, అంచెత అవి నీదగ్గరే ఉంచు" అన్నారు బుజ్జిగారు. బుజ్జిగారు వీరబద్రాన్ని బండెక్కించారు.
ఇంటికి చేరి వీరబద్రం అంతా భార్యకి చెప్పాడు, "ఇంకానయం, దేవడు మనదగ్గరున్నాడు లేదంటే నీ కట్టార్జితం ఆడు ఊష్ కాకి చెసేసేవాడు" అంది ఆయన భార్యం. "ఇందాక రైతొచ్చాడు మినపకాయ కోయడాన్కీ మనుషలనెట్టాడంట" అంది ఆవిడ. "సరే అలాగే" అని లోపలకెళ్ళాడు వీరబద్రం.
ఆమరనాడు వీరబద్రం ఉదయమే పొన్ను కర్ర తీసుకొని పొలంకి బైలుదేరాడు. కొంతదూరంవెళ్ళాక, "నమస్కారం యీరబద్రంగారు" అనే మాట వినిపించి అటుఇటుా చూసాడు, "అయ్య ఇక్కడండి నేనుా నాగరత్నాన్నండి కిటికేసి సూడండి" అని వినిపించి, అటు చూసాడాయన. "నాగరత్నమ్మబాగున్నావా" అడిగిరాయన. "ఏంబాగులెండీ ఏదోబతికేత్తన్నాను" అంది, "సరే ఎందుకు పిలిచావు" అడిగారు ఆయన. ఇంతలో విస్సిగాడు అటెపు వచ్చి "బలేవారండీ ఏదైన మాట కలపడానికి అయింటదండి అని నవ్వేసాడు, "ఒరేయి యదవ ఏంమాటల్రా అవి నేనెప్పీడైన ఆదిరెడ్డిగారు పోయాక తలపుతీసుకొని బైటకొచ్చాన్రా యదవ అల యదవమాటలు మాట్టాడితె తలబద్దలకొట్టించ్చెత్తాను యదవ" అంది నాగరత్నం కోపంగా. "క్షమించక్క నీసంగతి నాకు తెల్దా, ఏదో సరదాకన్నాను" అన్నాడు విస్సిగాడు తలోంచుకొని. "క్షమించండి బద్రంగారు" అని గబగబా వెళ్ళి పోయాడు అతను."ఇంతకి ఇసయం చెప్పలేదు నువ్వు" అన్నారు వీరబద్రంగారు. "ఏంలేదండి తమవల్ల ఓ మేలు కావాలండి, మీ అన్నగారబ్బాయి ఎంఎల్యె కదండి" అని అడిగింది నాగరత్నం. "అవును యిసయం సెప్పు" అన్నారు వీరబద్రంగారు. "అదేనండీ అమ్మాయికి పంతులమ్మ ఉద్యోగం వచ్చిందండి భీవరం యేసారండీ, ఒక్కత్తి ఉంటందండి, నన్నకూడాా వచ్చేయమంటం దండి, నేనుబతికుండగ ఈగడపదాటడం నాకిట్టంలేదండి, అందుకని తవరుఅబ్బాయిగారి తో చెప్పి, మన మొగలత్తుర్రు కాని నరసాపురంకి కాని బదిలి సేయింత్తారని" అంది నాగరత్నం, "అలాగే రేపాదివారంకదా అమ్మాయి ఇంటికొత్తాదికదా,యివరాలు రాసిమ్మను ఆడితో మాట్టాడతాను" అని ముందుకెళ్ళిపోయారు వీరబద్రంగారు. మరునాడు ఉదయం నాగరత్నం కూతురు వివరాలన్ని కాగితం మీద వ్రాసి తెచ్చి వీరబద్రంగారికిచ్చింది. ఆసాయంత్రం వీరబద్రం గారు నరసాపురం అన్నగారింటికెళ్ళారు. "ఏరోయిాతమ్ముడు ఎంటి ఈయాల ఇలాఊడిపడ్డావేంటి" అని అడిగారు ఆయన అన్న గారు. "ఏంలేదు తమ్ముడితో పనుండి వచ్చాను, ఫోన్చేసిలైను కలుపు" అని అడిగారు వీరబద్రంగారు. "లైనేందుకురా ఆడిక్కడే ఉన్నాడు, నిన్నేవచ్చాడు" అని ఒరేబుజ్జి అనిపిలిచారు. ఆయన బైటకొచ్చి బాబాయిని చూసి బాగున్నావ బాబాయి" అని అడిగాడు, "బానేఉన్నానురా నాకోపని కావాల" అని అడిగారు వీరబద్రంగారు. "చెప్పుబాబాయి" అని పక్కన కూర్చోన్నాడాతను. "ఏంలేదీరా మానూళ్ళో నాగరత్నం ఉంది కదా ఆవిడ కూతీరిని పంతులమ్మగా భీవరం ఏసారంట, అక్కడ వక్కర్తి ఉంటందని బయపడతంది నాగరత్నం అందుకని ఆయమ్మాయికి, మన మొగలతుర్రు కాని నరసాపురంకాని బదిలి సేయించాల, ఇయిగో యివరాలు" అని కాగితం అతనికిచ్చారు వీరబద్రంగారు. "అలాగే బాబాయి, అని అతను ఎవరికో ఫోన్చెసి విషయం చెప్పాడు, ఆవతల సమాధానంవిని, "బాబాయి పనైపోతుందిలే నాల్గు ఐదు రోజుల్లో ఆర్డరు వస్తుంది" అనిచెప్పాడు అతను. 'సాలాాసంతోషంగా ఉందిరా మరినేనింకయెడతాను" అన్నాడు ఆయన. "అదేంటి బాబాయి పొద్దుపోయిందిగా ఉండిపో పొద్దున్నా వెడుదుగాని" అని అన్నాడు బుజ్జిగారు. "లేదురా ఇంటికాడ మీపిన్ని ఒక్కత్తి ఉంటది, ఎంతసేపు అరగంట పయాణం" అనిలేచి బయలు దేరారు ఆయయన.
నాలుగురోజులు పోయాక వీరబద్రంగారు పొలంవెడుతుంటే మళ్ళా నాగరత్నం పిలిచింది. "అయ్యా యీరబద్రంగారు అమ్మాయికి నరసాపరం ఏసారండి ఈయాల జాయఅవ డానికి యెల్లిందండి" అంది. "బాగుంది నిన్న మాబుజ్జి ఫోన్చెసి సెప్పాడు, మన మొగలతుర్లో కాళిలేదంట, అందుకు నర్సాపురం యేసారని" అన్నాడు వీరబద్రం. "తమ రుణం ఎలాతీర్చుకోగలనుబాబుగారు" అంది కాస్త గద్గదంగా. అదెటైంమికి మళ్ళా విస్సి గాడు అటొ చ్చాడు, "దానికెవుందక్క, ఒసారి యీదితలుపు తీసావంటె బద్రంగారుాలోపలకొత్తారు, నీరుణం తీరిపోద్ది" అన్నాడు. "ఓరేయి యదవ అలాంటి పరాసకాలు ఆడద్దన్నానా"అని పొన్ను కర్ర పైకేత్తారు వీరబద్రంగారు. "అయ్యబాబోయి నన్నుక్షమించండి బాబు" పరిగెత్తాడు విస్సిగాడు. వీరబద్రంగారు ముందుకి సాగారు నవ్వుకొంటు.
వీరబద్రంగారికి ఓ పాతికెకరాల కొండ్రఉంది(భూమి) ఓమంంచి ఇల్లూఉంది. కాని పిల్లలు లేరు పాపం. అ ఆదంపతులు ఇద్దరు ఎప్పుడు దానిగురించి బాధపడలేదు, అలాని ఎవర్ని పెంచుకుందుకు ప్రయత్నంచేయలేదు. అలాగే జీవిత నౌక నడుస్తోంది.
వీరబద్రంగారూ రోజు పొలంనించి వచ్చేటప్పుడు అప్పారావు బడ్డి కొట్లో పప్పుండలు, బేల్లపు అచ్చులూ, శెనక్కాయలు, కొనుక్కోని ఇంటికి వస్తారు, అప్పుడు ఆచుట్టుపక్కల పిల్లలందరు
"తాతయ్య" అంటు వచ్చి చేరతారు, అందరికి సమంగా పంచి ఇస్తాడు ఆయన, అందరు తింటుంటే ఆదంపతులిద్దరు ఆనందగా చూస్తుంటారు.
ఆరోజు మామూలుగానే వీరబద్రం అన్ని కొని తేచ్చాడు,పిల్లలు చేరారూ, అందరికి పెట్టాడు, అందరు తినేసి "బై బై తాతయ్య అని పరిగెత్తారు, అరూగు మీదగోడకి చేరబడి ఆనందంగా చూస్తు అలానే ఉండిపోయాడు పాపం వీరబద్రం.
************
హామిపత్రం ఈకధ నాస్వంతరచన అని, దేనికి అనువాదం కాని అనుసరణకాని కాదని, ఇంతవరకు ఏమీడియాకుగాని, పత్రికకుగాని ప్రచురణ నిత్తం పంపలేదని
దృవపరచుచున్నాను.
మోహనరావు మంత్రిప్రగడ. రచయత.
2-27 మధురానగర్ -కాకినాడ 533004
9515275307. mnarmohanrao@gmail.com
