అలగా జనం
అలగా జనం
అలగా జనం
మోహనరావు మంత్రిప్రగడ,
సబ్రమణ్యం గబగబా తెమిలి మడి పంచ కట్టుకొని దానిపైన కండువా వేసుకొని గుడికి వెళ్ళాడు. అప్పటికింకా పూజారిగారు రాలేదు, సుబ్రమణ్యం గుళ్ళో ఓ స్దంబాన్ని ఆనుకోని కూర్చుని పదినిమిషాలు జపంచేసుకొన్నాడు. ఓపక్క ఎవరైనా గుడిదగ్గరకి వస్తున్నారేమోనని ఓకంట కనిపెడుతునే ఉన్నాడు, దూరంగ పూజారి రావడం చూసి గబ్బుక్కున లేచి గబగబా నడుచుకొంటు రోడ్ దాటీ ఇంటికి
చేరి నూతిదగ్గరకెళ్ళి గబగబా రెండుబాల్చిలు నెత్తిన పోసుకొని ఇంట్లోకి వచ్చాడు. "అదెమిటండీ మళ్ళా స్నానం చేసారు కొంపతీసి గుడిదగ్గర ఎవరైన తగిలారా మైలుపడ్డార
చెప్పండి" అని అడిగిందాయన భార్య. "అదేంంలేదు ఈరోజు నేను రోడా దాటకముందు ఓ చచ్చిన ఆవుని మోసుకొంటు వెళ్ళారు అలగా జనం, అదేరోడ్ దాటానుకదా
అందుకు, అయన వీళ్ళకి మంచి చడ్డ, ఓటైము పాడులేదు,
తెల్లారిదాక ఆగచ్చుగ సన్యాసులు" అని కొపంగాఅరిచాడు,
"ఇదిమరీబాగుంది అయనా ఆరోడ్లో ఎవరువెళ్ళారు ఏం వెళ్ళాయో రాత్రి మీరుచూసారా రోజు అదే రోడ్ దాటి వస్తారుగా, ఈరోజు ఏదో చూసి మాట్లాడుతున్నారు, ఆరోడ్
మీకోసమే కాదు అందరికోసంవేసారు, మీకునచ్చకపోతే
ఇంట్లోనే కాసేపు జపంచేసుకోండి అంతేకాని పిచ్చిగా మాట్లాడకండి ఎవరైనవింటే తిరగబడతారు" అంది ఆయన
భార్య కూడా గట్టిగానే.
"సరే అలాగే నేను కాసేపు బగద్గీత చదువుకొస్తా ఈలోగా వంటఏర్పాటు చూడు" అని అరచి గదిలోకెళ్ళిపోయాడు.
మరొ నాలుగురోజులు అలాగే గడిచాయి, తరవాత ఓరోజు మాములుగ సుబ్రమణ్యం గుడినించి వస్తన్నాడు,
అప్పుడే కొంతమంది "న్యాయంజరగాలి భాధితులకు మంచి వైద్యం చేయించాలి" అని అరుచుకొంటు కొంత మంది, ఎవర్నో మోసుకుంటు వడి వడిగా నడచుకొంటు వెడుతున్నారు, అదిగమనించి సుబ్రమణ్యం రోడ్డు మీదకు
రాకుండా ఓ అడుగు వెనక్కి వేసాడు, అంతె అక్కడున్న రాయి కాలికి తగిలి కళ్ళుతిరిగి పడబోయాడు, వెంటనే
అక్కుడున్న బారికాడు(గ్రామనౌకరు) వెంకన్న గబుక్కున
ఆయన్ని పట్టుకొని పడిపోకుండా తన తొడమీదకి ఆన్చుకొని పట్టుకొన్నాడు. అసలే రాత్రి ఉపవాసం చేసాడెమో బాగా నీరసంగాఉంది, అంచేత కొంచం స్పృహ
తప్పాడాయన. వెంకన్న చుట్టుచూసాడు ఎవరుకనిపించ లేదు అప్పుడు అతను ఆయన చంబులోగల నీళ్ళు కొన్ని
మిగిలిఉన్నవి తీసి ఆయన మొహంపైన జల్లాడు. కొంచం
సేపటికి ఆయన కొంచం కళ్ళు విప్పాడు, అదిగమనించిన వెంకన్న గబుక్కున ఆయన్ని వదిలేసి దూరంగా జరిగాడు.
ఆయనకూడా కొంచం అసరాచేసుకొని లేచి కూర్చోన్నాడు.
"క్షమించండి అయ్యగారు తమరు పడిపోతంటె అక్కడ రాళ్ళ మీదపడతే తమ తలకి దెబ్బతగులుద్దని అట్టుకొన్నా
నండి" అన్నాడు వెంకన్న. సుభ్రమణ్యంగారు చుట్టు చూసారు. వెంకన్నచెప్పినట్లు అక్కడ పెద్దపెద్ద రాళ్ళున్నాయి
అంతవరకు జరిగింది గుర్తు తెచ్చుకొందుకు ప్రయత్నించాడు
ఆయనపడబోతుండం వెంకన్న పట్టుకోవడం దాకానే గుర్తుకి
వచ్చింది, ఆతరవాత ఏంజరిగిందో ఆయనకి గుర్తురాలేదు.
కొంచంసేపు అలాగే కూర్చోని లేవబోయిరు ఆయన, కాని
లేవలేకపోయాడు, ఇంతలో ఆవూరి కాపుగారొకాయన అటు వచ్చాడు, అక్కడ సుభ్రమణ్యంగారిని దూరంగా వెంకన్నని చూసారు, ఆయన అడక్కుండానే వెంకన్న విషయంఅంంతా ఆయనకి వివరించాడు. "సరే పంతులు గారు నాచెయ్య ఆసరా ఇస్తాను లేంవండి" అనిచెయ్య చాపాడు అతను.సుబ్రమణ్యం అతని చెయ్య ఆసరా చేసుకొని లేచి అతని భజానికి ఆనుకొని నిలపడ్డారు, "పంతులుగారు తవర్ని ఇంటికాడ దాక తీసుకెల్తనండి జాయగ నడండి" అని ఆయన్ని ఇంటిదాకా తీసుకెళ్ళు అరుగుమీద కూర్చోపెట్టి ఆయన భార్యని పిలిచి విషయం అంత చెప్పి ఆతను వెళ్ళిపోయిడు.
"ఏవండి ముందు కొంచం కాఫి త్రాగండి బాగ నీరసంగా ఉన్నారు" అని కాఫీ ఇచ్చింది ఆయనభార్య. ఆయన ఏం మాట్లాడకుండా కాఫిత్రాగారు. "మరిప్పీడేంచేస్తారు స్నానం
చేస్తారా" అడిగిందావిడ. "అలగే" అని ఆయన నెమ్మదిగా లేచి నూతిదగ్గరకేళ్ళి స్నానం చేసిపంచ మార్చుకొని హాల్లో
పడక కుర్చిలో కూర్చోని "ఇదిగో వంట పెందరాళే చెయ్యి" అని అని వెనక్కి వాలారు.
********
ఎదురుగా ముగ్ధ మనోహర రూపుడు, మోహనాకారుడు
శిఖపించమౌళి-వేణుమాధవుడు దర్శనమిచ్చాడాయనకి.
"స్వామి ఏమి నాభాగ్యం ఎందరో యోగులకు కూడా దర్శనం ఇవ్వని నీవు నాకు దర్శమిచ్చావా,ఏమినాఅదృష్టం
స్వామి అలా ఆసీనులుకండి" అన్నాడు సుబ్రమణ్యం.
"పరవాలేదు లేవయ్య నాకు నిలబడడం అలవాటే, నాభక్తుడైన పాండురంగడు విసిరిన ఇటుకపై అతను వచ్చు
వరకు అలానే ఉంటినికద, ఆలయాలలో సాధారణంగా నావిగ్రహాలన్ని నిలబడే దర్శనమిస్తాయికదా, అయనా నీవెందుకో బాగా ఆందోళణగా ఉన్న ట్లుంది" అని అడిగారు స్వామి. "ఏమని చెప్పమంటారు స్వామి, నేను
ఇంతకాలంగా పదిలంగా కాపాడుకొంటున్న నామడిఆచారం
మంట కలసిపోయాయి, నేను అస్పృష్యునిగా భావించె వ్యక్తి వల్ల తాకబడ్డాను. నేను అలగా జనంగా భావించే వ్యక్తి నన్ను తాకి ఇంటివద్ద వరకు తీసుకొచ్చినాడు, ఇంక అపవిత్రుడనైన నిన్ను ఎలా కొలవగలను" అని కన్నీరు కార్చాడు ఆయన. "నాయనా సుబ్రమణ్యం విచారించకు, అయనా ఏనాడైన గుడితలుపులు తీసేదాక ఆగావా నన్ను దర్శించి అర్చకునిద్వార ఆశీర్వాదం తీసుకొన్నావా," అని మళ్ళా అడిగారు స్వామి. "ఎలాతీసుకోగలను స్వామి, ఆయన వచ్చి ఆలయం తీసేవరకు ఉంటే ఊళ్ళోని అలగా
జనం వస్తారు, ఆయన అందరికి అదే జలంతీర్దంగా ఇచ్చి అక్కుడున్న శటకోపం అందరి తలలమీదఉంచినది నాతలపై కూడా ఉంచుతాడు కద, అప్పుడు నేను మైల పడతానుకదా, అటువంటి బట్టలతో తమని ఎలా దర్శించడం స్వామి" అన్నాడు ఆయన. "సరే సుబ్రమణ్యం, నీవు చెప్పడం అయిందిగా, ఇంకనామాటవిను" నేను నీకు ఆరాధ్య దైవమయ్యిను, కానినువ్వనుకొనే అలగా జనం కనపడతారని గుడితీయకుండా, నాదర్శనం చేసుకొకుండా తీర్దం తీసీకోకుండా వచ్చేసేవాడివి, మరి నాఅపరభక్తుగా నీవు చెప్పుకొంటున్నావు, కానినా దర్శనం చేయటంలేదు, అసలు నాగురించి నీకు ఏమితెలుసు, నేను యిదవ కులంలో పుట్టాను, మరి నీదృష్టిలోఅందరు అలగాజనం కదా, మరి నన్ను ఎలా అర్చిస్తున్నావు," అడిగాడు స్వామి. "అయ్యొ నీవ్వేకులంలోపుట్టినా దేవుడివి దేముడిని ఎవరు కుల దృష్టితో చూడకూడదు, భగవంతునిగానే భావించి అర్చించాలి స్వామి" అన్నాడు సుభ్రమణ్యం కంగారుగా.
"అదిసరే, నీకు నేను వెలసిన క్షేత్రం ఉడిపి తెలుసా" అని అడిగారు, స్వామి. "తెలుసుకొన్నాను స్వామి, కాని దర్శంచ
లేకపోయాను, ఆక్షేత్రం వెళ్ళాలంటే బస్సులు రైళ్ళు ఎక్కాలి
అందరితోకలిపి దర్శనం చేసుకోవాలి అలా అలగా జనంతో
కలసి రాసుకు పూసుకు తిరగడానికి మనసొప్పక వెళ్ళలేక పోయిను స్వామి" అన్నాడు ఆయన. "సరే అక్కడ నేను గర్బగుడి తలుపులకేదురుగా దర్శనం ఇయ్యను, ప్రక్కకు తిరిగి గవాక్షంగుండా మాత్రమే దర్శనం ఇస్తాను తెలుసా" అడిగారు స్వామి. "విన్నాను స్వామి, అలా ఎందుకు జరిగిందో తెలియదు స్వామీ" అన్నాడు సుభ్రమణ్యం.
నాపరమభక్తుడొకడు అతను నీ దృష్టిలో అస్పృష్యుడు నన్ను చూడాలని రాత్రంంతనడచి ఉదయం ఆలయం తెరచె వేళకి ఉడిపి ఆలయంవద్దకి చేరాడు. అక్కడున్న జనం అతన్ని గుడిలోకి రానీక అడ్డగించారు, అతను చేసేది
ఏమిలేక అక్కడకు కొంచం దూరంలోగల ఓ చెట్టు క్రింద నుంచొని నా ఆలయంకేసి తధేకంగా చూస్తు ఉనన్నాడు.
అప్పుడునేను గవాక్షంవైపు తిరిగి అతనికి దర్శనం ఇచ్చాను
ఆలయంతలుపులు తీసిన అర్చకులు విస్తుపోయారు, అందులొ ఓ వృధ్ధ పూజిరి విషయం గ్రహించి అందరికి వివరించినాడు, అందరు పశ్చాత్తాపడ్డారు, కాని నేను ఇప్పటికి అలాగే భక్తులకు దర్శనం ఇస్తున్నాను. అంటే నేను
కూడాఅస్పృష్యుడనంటావానన్నుపూజించడంమానుతావా ఆలోచించు" అని స్వామి చెప్పాడు. "అయ్యో స్వామి, నువ్వు పరమాత్ముడవు నీకు కుల బేధములుండవు, సర్వదా పూజనీయుడవే" అన్నాడు సుబ్రమణ్యం కంగారుగా. "అంతేకాదు నాసంగతలా ఉంచు, శివ భగవానుడు, తిన్నడనేకోయవ్యక్తి ఆరాధనకుమెచ్చి మోక్షము ఇవ్వలేదా, విష్ణు భగవానుడు కరిని రక్షించడానికి వెంటనే బయలుదేరలేదా, శ్రీశైల మల్లన్నని ముందుగా చెంచులే కదా ప్రతిష్టించి పూజించేవావు, నేడుఅది స్వార్ద పరుల చేతికిపోయి చెంచుదొరలను తప్పించారు. ఇలా నేను చెప్పుకుంటుపోతే ఇలలో చాలా ఉంటాయి. విషయం విన్నావుకదా, నిన్ను ఆవెంకన్న రక్షించకపోతే ఏమయ్యొదొ
ఉహించు" అన్నారుస్వామి. "ఈపాటికి తలకి గాయమై వైద్య శాలలో నువ్వు భావించే అలగా జనంచేత సేవలు చెయించుకుంటు ఉండేవాడివిగా, ఒకవేళ నీవు సృహతప్పి మంచముపై ఉన్నయడల నాదర్శనం ఈవిధంగా నీకు కలిగేదా, నువ్వు ధీర్గంగా ఆలోచించు, భక్తులు దేవుని
'ఆయువు, ఆరోగ్యం ఇచ్చి రక్షించమని కోరతారుకదా, దేముడు భక్తులను ఏదోరూపంలో రక్షిస్తాడని తెలుసుకో దైవం మానుష రూపెణా, అని సమయానికి నీకురక్షణ ఆవిధంగా కలిగిందని భావించుకో, నీకు ఉన్న భక్తికిమెచ్చి అనుకోకుండా నీవ్వుభావించే ఓ అస్పృష్యునివలన నీవు రక్షింపచేయబడ్డావు అది దేమునిదయ లలాటలిఖితమును మనం మార్చలేము సుబ్రమణ్యం. ఇంకోవిషయం నీవ్వెలా జీవిస్తున్నావు?"అడిగారుస్వామి, "అదెమిటి స్వామి భూమిమీద అందరు ఆహారం తీసీకొనే బ్రతుకుతారుకదా, నెనైతే అన్నంతిని బ్రుతుకుతున్నాను స్వామి" అన్నాడు ఆయన. "అంన్నం ఎలావస్తుంది, ధాన్యం బియ్యంగా మారడం వల్ల కదా, ఆధాన్యాం ఎలావస్తాయి" అడిగారు స్వామి. అదేంమిటి స్వామి ధాన్యం పొలాలో రైతులు పండిస్తారుకదా" అన్నాడు సుబ్రమణ్యం. "అయతె ఆధాన్యం ఎవరు పండిస్తారు అవిపండించి నీఇంటికి తెచ్చి బియ్యంగా మార్చడంలో నువ్వనుకునే అలగాజనం- అస్ప్రస్యులు పాల్గొంటున్నారు కదా మరాబియ్యం నీవ్వెలా తింటున్నావు బాగా ఆలోచించు, నువ్వు అలగా జనం అనుకొనేవారు పండించిన ధాన్యంనుండి వచ్చిన బియ్యం తిని బ్రతుకుతున్నావు, కాని గుడిదగ్గర వెడితె అలగాజనం కనపడతారంటావు నీ ఆలోచనవిధానంగురించి పునరాలోచించు, నువ్వే బాగా ఆలోచించుకొని నీలోని
ఈమూఢ విశ్వాసం త్యజించి మానవత్వమున్న మనిషిగా
మారు. ఇంతకన్న నేనేం చెప్పలేను" అని స్వామి అదృష్యమైనారు.
"స్వామి ఆగు స్వామి మరికొంతసేపు ఉండు నీవు వచించిన విషయములు యదార్దములుని, ఆచరణ యోగ్యమైని అనిపించుచున్నది,నాతప్పు తెలుసుకొన్నాను, నేనిప్పుడే మారాను స్వామి, అసలుఎవరు అంటరానివారు దెవుడి దృష్టిలో అందరు సమానమైనప్పుం డు, అస్పృష్యులు, అలగా జనం అనడంలో అర్దంలేదు స్వామి, నన్ను క్షమించి ఆశీర్వదించు స్వామి" అంటు ముందుకి వంగాడు సుబ్రమణ్యం. అంతె ఒక్క ఉదుటున "స్వామి, స్వామి అంటు క్రిందపడ్డాడు.
ఆశబ్దానికి ఆయన భార్యపరుగునవచ్చి"ఏమయిందండి
అలా క్రిందకి పడ్డారేమిటి" ఆశ్చర్యంగా అడిగింది. "కమలా ఏడి నాస్వామి, వెళ్ళాపోయారా" అని ఆతృతగా అడిగాడు సుభ్రమణ్యం. "స్వామెవరు నీరసానికి మనసు చలించి నట్లుంది లేవండి లేచి భోంచేయండి" అని అందావిడ. మతి చలించడంకాదే స్వామి మన గోపాలడు నాకు కనిపించి నాకు బోధ చెసాడే, అని కలంతా వివరించాడు, నాకు ఆత్మజ్ఞానంకలిగించాడే"అన్నాడు. "సరే బాగుంది లేంవండి భోంచేద్దురుగాని" అందావిడా.సుబ్రమణ్యం లేచివేళ్ళి భోంచేసాడు.
ఆమరనాడు ఆయన ఐదుగంటలఅతరవాత లేచి స్నానంచేసి ఉతికి ఆరవేసిన పంచి చొక్కా ధరించి బయటకు వచ్చాడు, తిన్నగ గుడికి వెళ్ళాడు, గుడిదగ్గర పూజారి ఆచారిగారు ఆయన్నిచూసి ఆశ్చర్యంతో "సుబ్రమణ్యం గారు ఎమిటీవింత మీరు ఈసమయంలో గుడికి వచ్చారు" అని అడిగారు, "ఆచారినాకు జ్ఞానోదయం అయ్యందయ్య, దెముడి దర్శనం చేసుకొందామని వచ్చానయ్య ముందు తీర్దం ఇచ్చి శెటకోపం పెట్టవయ్య," అన్నాడు. ఆతరవాత ఆచారి తీర్దం ఇచ్చి ప్రసాదం కూడా ఇచ్చాడు. అది తీసుకొని నవ్వుతు ఇంటి ముఖంపట్టాడు.
ఆతరవాత సుభ్రమణ్యం రోజు గుడికెడుతున్నాడు.***
ఈకధ నా స్వంతమని దేనికి అనువాదం కాని అనుసరణ కాదని ఏమాధ్యమంల పరిసీలనలోలేదని దృవచు చున్నాను
మోహనరావు మంత్రిప్రగడ
9515275307
