Harianiketh M

Drama Inspirational Others

3  

Harianiketh M

Drama Inspirational Others

నీలాకాశపు జాబిల్లి

నీలాకాశపు జాబిల్లి

3 mins
302


సిటీలో అదో పెద్ద ఫంక్షన్ హాల్.ఆ సిటీలో బోల్డంతమందిలో, ఒక మోతుబరి కూతురు పెళ్లిసందడి జరుగుతుంది అక్కడ.జనాలు బంగారు కాంతులతో,ఇంద్రధనస్సుల్లా మెరిసిపోతున్నారు..


బోలెడన్ని సక్సెస్ ఈవెంట్లని తమ ఖాతాలో వేసుకున్న,ఈవెంట్ మానజ్మెంట్వాళ్ళు పెళ్లికి వచ్చినవారికన్నా,ఎక్కువ సందడి చేస్తున్నారు.


రిసెప్షన్ మొదట్లో మాలశ్రీ,ఆమె ఫ్రెండ్ విజయ పన్నీరు చల్లుతూ,పందిట్లోకి కొత్త సువాసనల్ని తీసుకువచ్చే పనిలో ఉన్నారు..


ఇంతలో మోతుబరి చలపయ్య వచ్చేడు.


అమ్మాయిలూ!మీ సేతిలోది నిఖార్సయిన పన్నీరుతోపాటు,ప్లాటినం పన్నీర్సీసా అది..ఇంకా ఈ పువ్వులు అమెరికాలోనే పూస్తాయని,మా పెద్దల్లుడు పంపేరు..ఇప్పటివరకూ ఈ జిల్లాలోనే ఇలాంటి పువ్వుల్ని ఎవ్వరూ పంచలేదట..జాగ్రత్త అమ్మలూ!అందరితో పాటూ వీళ్ళకి జగ్రత్త చెప్పి వెళ్లిపోయేడు చలపయ్య.


చూడవే!ఇంత పొడుగు జడలున్నాయని,


వారానికోసారి పువ్వులు కొనుక్కుని పెట్టుకోవాలంటేనే,ఇరవైవేలు జీతం వస్తున్నా లాటరి కొడుతున్నాం.వీళ్ళు అమెరికా నుంచి పువ్వులు ,కొన్ని గంటల కోసం తెప్పించేరు.ఒకడు మనకే తిరిగి ఇస్తాడు,ఒకడు కిందేసి తొక్కుతాడు.ఒకరు డస్ట్బిన్ లో వేస్తున్నారు..చాలా మంది లవ్ స్టోరీ కూడా నడిపేస్తున్నారు..ఆడాళ్లు అయితే మాకు వద్దనే అంటున్నారు..వాళ్ళ కబుర్లు చెప్పుకుంటూనే,అప్పజెప్పిన పనులు కానిస్తున్నారు


మిస్..ఆమే..రికన్ ఫ్లవర్ ఇది..కింద పడేసేరు..మళ్ళీ సర్ వచ్చి,మా పెద్దల్లుడు..అమెరికా..అని క్లాస్ పీకుతారు..జాగ్రత్త..చేతిలో పెట్టి వెళ్లిపోయేడు..


మన ట్రూప్ లో ఇంత మంచి కాండేట్ ఎవరే!?ఇద్దరూ మొహాలు చూసుకున్నారు.


అమ్మా!మీరిద్దరూ లోపల భోజనాల దగ్గర ఉండండి.అమ్మగారు అక్కడ ఉండమన్నారు..మీరు అందర్నీ బాగా పలకరిస్తున్నారట.చలమయ్యగారి పీఏ వచ్చి చెప్పడంతో ఆశ్చర్యపోయేరు మళ్ళీ..


భోజనం చెయ్యడానికి వస్తున్న ప్రతివారినీ,


చిరునవ్వుతో పలకరించి,వారిని సీటింగ్ వరకూ తీసుకెళ్లాలి..అక్కడ ఒక పావుగంట ఉన్నారో!లేదో?


అమ్మా!అంటూ వచ్చేడు పీఏ గరుడ


ఎం పక్షిగారూ!ఇపుడు ఎక్కడికి వెళ్ళాలి అంటూ కోరస్గా ఆడిగేరు.


అమ్మా!గిఫ్ట్ ఇచ్చే దగ్గరకి రమ్మన్నారు అమ్మగారు..వినయంగా సెలవిచ్చేడు


సరే!అనుకుని అక్కడికే,బయలిదేరేరు..కాళ్ళకి పసుపు రాసి, బొట్టు పెడుతున్నారు ఇద్దరమ్మాయిలు..వాళ్ళని అమ్మాయిలు కంటే అప్సరసలు అంటే బావుంటుందేమో?అనుకున్నారు మాల,విజ్జులు


వీళ్ళు ఏం తిని పిల్లల్ని కంటారో?ఆ పిల్లలు ఏం తిని ఏపుగా పూల తోటల్లా ఎదుగుతారో?కదే విజ్జు..


మనం చూడు ..ఇలాంటి ఈవెంట్ ఉన్న ప్రతిసారి మీటరు మందం పేడ పుయ్యాలి..ఫ్యాన్ ఉన్న చోట మనల్ని నుంచొనివ్వరు.. చెమట పడితే తుడవకూడదు..ఒకవేళ తుడిస్టే మొహాలు...మనం చూసుకోవాలంటేనే..యాక్..చీ...వీళ్లిలా కష్టాలు


చెప్పుకుంటుంటే,ఈవెంట్ మేనేజర్ వచ్చింది.


మీరు ఒక్కచోట ఉండకుండా.ఈ టైం కి మూడు సెక్షన్లు మారేరు..బ్లాక్ మార్క్ వస్తే,అంతా మేమే బేర్ చెయ్యాలి..పనిష్మెంటుగా జీతం కట్ చేస్తే,మమ్మల్ని మీ మైండ్లో ఎలా తిట్టుకుంటారో,ఊహించుకుంటే..


అబ్బా!తలపట్టుకుంది emమైథిలి.


ఆమె అలా తిడుతుంటే,వీళ్ళిద్దరూ చలపయ్యగారి పీఏ కోసం చూస్తున్నారు...ఈవిడ తిట్లనుంచి తప్పించి,వేరే సెక్షన్ కు మార్పించవయ్యా అనుకుంటూ..


నేనింతలా చెబుతుంటే,మీరు ఎక్కడ చూస్తున్నారు మిస్ మాలా..మైధిలి టోన్ పెంచలేకపోతుంది కానీ,మిగతా స్టాఫ్ కూడా ఇలా ఈవెంట్ ని,ఆటగా మార్చేస్తారన్న భయం ఆమెను తొలుస్తుంది...


తొందరగా మానిపించడానికి కూడా లేదు.


మామ్ మిమ్మల్ని పెళ్లికూతురి దగ్గర ఉండమన్నారు అమ్మగారు,పన్నీటి జల్లు కురిపించేడు పీఏ .


మామ్..వెళ్ళమా!?మైధిలిని ఆడిగేరు


అమ్మగారు ఆర్డర్ వేస్తే తప్పదుకదా!కారీ ఆన్ అంది చెయ్యి ముందుకు చూపిస్తూ.


అలా అయితే విజ్జు!మనం ఇపుడు లక్ష్మీదేవిని లైవ్ లో చూడబోతున్నాం అన్నమాట..


అవును మాలా!జీవితంలో వడ్డాణం,వంకీలు వగైరాలు పెట్టుకునే అదృష్టాన్ని దేవుడు మనకి మాక్సిమం ఇవ్వడు..కష్టే ఫలీ అన్నారు..అంత కష్టం మనం ముఖ్యన్గా నేను జన్మలో పడలేను.ఓ మాటు చూస్తే మనసు ,ఏడాదివరకూ ఊరగాయ రుచి పోనట్టు,సంతోషాన్ని దాచుకుంటుందేమోనే!? ...పద అంటూ పెళ్లికూతురు గదిలో అడుగుపెట్టగానే వావ్!అనకుండా ఉండలేకపోయారు ఇద్దరూ..ఈ ఉన్నవాళ్ల అందం పాడుగాను ..


అయినా ఏమయ్యా!వెంకయ్యా..నీకు ప్రతి శనివారం కొబ్బరికాయ,ఇష్టమని చామంతి పువ్వులు,పులిహోర నైవేద్యం..ఏమిచ్చేవు నాకు?అమ్మానాన్నల్ని ఎప్పుడో మింగేసేవ్!ఉన్నదల్లా ఈ ఒక్క మాల.రేపు దీనికి పెళ్లి అయిపోయి వెళ్లిపోయిందనుకో!ఒంటరిపోరాటం చెయ్యాలి..అసలు ఏం దేవుడివయ్యా


మామ్!మీ డ్యూటీ ఇక్కడ అయిపోయింది ...


పందిట్లోకి రమ్మన్నారు అమ్మగారు...


ఈసారి మాటకి ఒళ్ళుమండింది ఇద్దరికీ..కొంచెం సేపు అయినా అయిందా వచ్చి..అప్పుడే పందిట్లోకి ఏంటయ్యా గరుడయ్యా?కనీసం చెవికమ్మలయిన చూడనివ్వలేదు.ఏడువారాలని పక్కన పెట్టి,మూడొందలఅరవైఆరు రోజులకి నగలు ఉన్నట్టున్నాయి ఇక్కడ..విజ్జు మనసులో అనుకుంటుంది.


అమ్మగారు రమ్మన్నారు ..నేనేం చెయ్యగలనమ్మా?అన్నాడు


అమ్మగారు నిజంగా అమ్మలగన్న అమ్మలా ఉంది..ఇలారామ్మా!పిలిచింది.


ఎవర్నీ అనుకుని మొహాలు చూసుకున్నారు ఇద్దరూ..


మాలా నువ్వే!ఎంటలా చూస్తున్నావ్?ఆమె నవ్వింది.


మామ్!ఏమైనా తప్పు ఉంటే నాదే!దాన్ని ఏమీ అనకండి.చెప్తే సరిచేసుకుంటాం,కానీ em వరకూ ఇష్యూ తీసుకెళ్లొద్దు విజ్జు కంగారుగా అంది.


అరె!ఉన్నవాళ్లు అందరూ రాక్షసుల్లాగే ప్రవర్తిస్తారా!తప్పులే చెప్తారా!మంచివాళ్ళు ఉండరామాలో?దేనికి అంత కంగారు ఆమె ముందుకు వచ్చి ,మాలని ఓసారి తనివితీరా చూసుకుంది..


నీకు ఇష్టమైతే అంటూ....ఇలారా!అంతా చేసి అక్కడే నిలబడ్డావ్..బడవా..నవ్వుతూ ముందుకు వచ్చాడు ఆమె పిలిచిన అబ్బాయి.


వీడు నా రెండో కొడుకు.పెద్ద అందగాడు కాదు.ఇప్పటిలా చదువూ కాదు.డిగ్రీ చేసి,వాళ్ళనాన్నగారి పనుల్లో సాయంగా ఉంటాడు.నాకు ఇంకో అబ్బాయి,అమ్మాయి ఉన్నారు.అబ్రాడ్ లో ఉంటారు..వీడికి ఇక్కడ ఉండడమే ఇష్టం..నిను చూసిన వెంటనే అనను కానీ,మీరు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను,నాకు నచ్చేవు,వీడు ఓసారి!పేరు తమన్ కూడా ఇష్టపడ్డాడు..ఇహ నీ ఇష్టమే తరువాయి.నవ్వింది తమన్ తల్లి.


అస్సలు వదులుకోవద్దు మాలా.ఎంత పెద్ద కుటుంబం.నా ఉద్దేశ్యం ఎక్కువమంది అనే ఆంటీ..ఆ వేంకన్న నీ మొర విన్నాడు.


నిజమో,అబద్దమో తీర్మానించుకోలేని స్థితిలో కన్నీటి


పర్యంతమైంది మాల.


ఆంటీ ఈమెకు నేను తప్ప ఎవరూ లేరు.ఇంఫాక్ట్ మాఇద్దరిది ఒకటే కధ.


నాకు తెలుసు అన్నాడు తమన్.నీ ఫ్రెండ్కి చెప్పు ఇపుడే సమాధానం అవసరం లేదు.ఆమెఒప్పుకుంటే ఈ జాబిలికి అమావాస్య రానివెలుగై ఎప్పటికీ వుంటుంది అని,పదమ్మా!మనం ఉందన్న అధికారం చూపించడం కూడమంచిది కాదు..బై మిస్ మాలా.


వెళ్తున్న వాళ్ళని ఆపింది విజ్జు.ఏంటి ఆలోచన మాలా.ఉన్నింటిలో అడుగు పెడుతున్నాను అని భయపడకు,మనసున్న ఇంటికి వెళ్తున్నా అని మరోసారి ఆలోచించు.అదృష్టం ప్రతిసారీ తలుపు తట్టదు..


ఆంటీ మొదటిసారి నోరు విప్పింది మాల.


చెప్పు మాలా..


ఇది ఇప్పటి వరకూ అందించిన సాయం,ఇపుడు మీరు చేయబోతున్న సాయం రెండు కళ్ళు నాకు..వెనక్కి తిరిగి చూసుకుంటే విజ్జులేని నేను లేను.దాన్ని ఒంటరి చేయలేను..


నీకేమన్నా పిచ్చ మాలా!నాకు ఉద్యోగం,హాస్టల్ ఎప్పటిలానే ఉంటాయి.ఓ అమ్మాయి కోరుకునే అంచెల ఉన్నతిలో సరైన పోస్ట్ ఇపుడు నిన్ను వరించింది...ఇలా చెబుతున్న విజ్జుని ఒక్కసారి.!ఆపేడు తమన్.


మీ సమస్య మిమ్మల్ని విడదీస్తాం అనేకదూ!అలా అస్సలు జరగదు.మీ వరుస నాకు తెలీదు.కానీ ఇప్పటి నుంచి విజ్జు నాకు దేవుడు ఇచ్చిన చెల్లి..భార్యనయినా వదులుకుంటాం కానీ చెల్లిని వదిలిన అన్న ఉంటాడా ఎక్కడయినా!?ఎం మమ్మీ...

ఇంక దేనికి ఆలస్యం!ఇంకా అనుమానం ఉంటే రేపే మేమిద్దరం ఈ విజ్జుని దత్తత తీసుకుంటామ్.ఏమంటావ్ కౌసల్యా!తమమ్ తండ్రి అరవింద్ పెళ్లి మాటను ఖాయం చేసేరు..

వదినా!రేపటి నుంచి ఉదయం ఆరింటికే బెడ్ కాఫీ నా చేతిలో ఉండాలి.ఏమంటావ్ అన్నయ్యా తమన్ భుజం మీద చెయ్యి వేసింది..

ముత్యాల తలంబ్రాల్లా నవ్వులు మెరిసేయి పందిట్లో..



Rate this content
Log in

Similar telugu story from Drama