STORYMIRROR

RAKHI PATEL

Romance Others

4  

RAKHI PATEL

Romance Others

నీ మౌనమే నాకు మరణం

నీ మౌనమే నాకు మరణం

1 min
245

కనురెప్పలు కాపలా కాస్తున్నా...


నీ కలలును ఆపలేకపొయింది..!


నీ భావాలు ముట్టడిస్తున్నాయని తెలిసి...!


నీకోసం వెతుకుతున్న నేత్రాలనూ...!


ప్రతి రొజు కన్నీటి పొరలతొ కప్పుతుంది, 


నేను ఊహించిన హృదంతర దృగంతర దివ్యత్వం..

నీవు చేస్తున్న అవమానపు యాసిడిలో కాలిపోతున్నా,  


ప్రియా నాకోసం ధైర్యంగా నిలబడే దృక్పధం నీకు లేనప్పుడు....!


నేను కాకుండా మరొకరు నీ మనసులో చేరినప్పుడు, 


నిన్ను నేను వలచి ప్రయోజనం ఎందుకు...?


ఆదర్మాలతొ నిండిన ఆశయాలు నీకున్నప్పుడు...!


నిట్టూర్పులతొ వేదనను మిగల్చడం ఎందుకు...?


నేను కప్పుకున్న నిన్నటి మన అందమైన కలల్నే తలుచుకుంటూ...!


ముగింపులేని కధగా మిగిలిపొతున్నాను...!


మరుగున పడిన నిన్నటి మాటలను చీల్చుకుంటూ...!


అంతం లేని వ్యధతొ మరలిపొతున్నాను...!


లొలొపల నవ్వుకుంటున్న నీవు...! 


నా అంతం కోరుకుంటున్నావు, 


ఎందుకోనా అంతరంగ మనో నేత్రంలో. 


నీవు వెలిగించిన తొలిదీపాన్నీ...!


నీవే ఆర్పేస్తున్నావు...!


నేను నీపైన పెట్టుకున్న ఆశల్ని...!


నీ అందమైన కాళ్ళతో తొక్కి చిదిమేస్తున్నావు, 


ప్రియానాకు మనొవ్యధని చేకూర్చే నీ ఆలొచనలు...!


నా మనొగత భావాలలొ నలుగుతున్న నీ జ్ఞాపకాలు...


అనంతమైన నా ప్రేమకు ప్రతీకలని...!


ఎప్పుడు తెలుసుకుంటావు...? 


నీ మౌనం అనే శాపం ఇచ్చే కన్న...! 


మరణమనే శిక్షను విధించు నేస్తం, 



Rate this content
Log in

Similar telugu story from Romance