sri sri

Drama Romance Fantasy

3.4  

sri sri

Drama Romance Fantasy

నాకుపెళ్లిఅయ్యింది

నాకుపెళ్లిఅయ్యింది

3 mins
255



 ఉదయం నుంచి పని చేసి చేసి అలసిపోయి మాట్లాడే తోడు కోసం ఎదురు చూస్తోంది అనిత, అప్పుడే బిజినెస్‌ ముగించుకొని ఇంటికి వచ్చాడు చందు. చందుకి డిన్నర్ వడ్డించి టేబుల్ మీద పెట్టి టీవీ గదిలోకి వచ్చింది అనిత.

మీకు ఇష్టమైన పూరీ మటన్‌ కైమా చేసాను. వచ్చి తినండి అని చందుని అడిగింది. ఒకవైపు టీవీ ఆన్‌చేసి మొబైల్ ఫోన్‌ చూస్తూన్న భర్తతో ఏ సమాధానం చెప్పక పోయేసరికి నేరుగా బెడ్‌రూమ్‌లోకి వెళ్లింది అనిత. ఎప్పటిలాగే మొబైల్ ఫోన్ తీసుకుని నెట్ ఆన్ చేసి బెడ్ మీద పడుకుంది.

చందు అనితలది ఇద్దరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. పెళ్లయి 10 సంవత్సరాలైనా వారికి పిల్లలు లేక పోవడంతో వారి దాంపత్య జీవితం బోరింగ్‌గా మారింది. ఎన్ని ఆస్పత్రులు తిరిగిన, పరీక్షలు చేసిన తర్వాత, ఏదీ పని చేయలేదు. చివరికి, వారు ఒకరినొకరు నిందించుకోవడం ప్రారంభించారు. వారి మధ్య దూరం అలా పెరుగుతూ వచ్చింది.

ఎంతో అన్యూన్యంగా గడపాల్సిన ఇద్దురూ…. ఇప్పుడు ఒక గదిలో, విశాలమైన మంచానికి రెండు చివర్లలో అపరిచితులలా జీవిస్తున్నారు. ఇద్దరూ టైం పాస్ చేయడానికి మొబైల్ ఫోన్ మీద ఆధారపడటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇంటర్నెట్ వారి ప్రపంచం. ఆన్‌లైన్‌ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా చూడడానికి అలవాటు పడ్డారు. 

మొబైల్‌ ఒపెన్‌ చేసిన అనితకు కొద్దిసేపటి తర్వాత మెసెంజర్‌లో నోటిఫికేషన్‌ వచ్చింది. గుడ్ ఈవినింగ్ అంటూ రవి మెసేజ్ చూడగానే ఆమె గుండె దడదడలాడింది. ఎందుకో తెలియని అలజడి మనస్సులో రేగింది.

వేంటనే ఆ మెస్‌జ్‌కు రిప్లే ఇస్తూ “ హాయ్‌, ఇంతసేపు ఎక్కడున్నావు, నేనెంత సేపు ఎదురు చూస్తున్నానో తెలుసా? ఆమె భయంగా అతనిని అడిగింది.

 ఒకసారి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో రీల్‌ చూస్తుండగా అతని మెసేజ్ మొదటిసారి వచ్చింది. సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలను ప్రలోభపెట్టి చాలా మందిని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఆమెకు ముందుగానే తెలుసు కాబట్టి మొదట ఆమె అతని సందేశాలను పూర్తిగా పట్టించుకోలేదు..

కానీ రవి ఎన్ని విన్యాసాలు చేసిన అనిత పట్టించుకోలేదు. రవి నిరంతర ప్రయత్నాల తర్వాత అనిత మనసును కదిలించగలిగాడు. 


రవి అనిత ఇద్దరు ఆ చాటింగ్‌లోనే ఎన్నో విషయాలు, ఆలోచనలు పంచుకున్నారు. రవి మాట్లాడిన మధురమైన మాటలకు ఆమె పడిపోతుందేమోనని భయపడి, ఎప్పుడూ రవిని ఫోటో అడగలేదు. రవి ఎక్కడ హద్దు దాడుతున్నాడు అన్నప్పుడల్లా "నాకుపెళ్లిఅయ్యింది." అని చాలా సార్లు గుర్తు చేసింది.

దానికి రవి "నాకు భార్య ఉంది, కానీ అది పేరుకు మాత్రమే, మేము సంవత్సరాల తరబడి విడిపోయాము." అంటూ ఉండే వాడు. అప్పుడే అనిత నేను, రవి సమానమైన దుస్థితిలో ఉన్నారనే సత్యాన్ని గ్రహించింది. రవి ఎంతో ప్రేమతో చాలా దయగా మాట్లాడే వాడు.

తన భర్త నోటి నుంచి ఎప్పుడూ వినని ప్రేమ మాటలు రవి నుంచి రాగానే.. ఇంతకాలం దీనికోసమే తహతహలాడిపోయాననిపించింది. ఇంత ప్రేమగల వ్యక్తిని పొందడం ఎంత అదృష్టమో అంటూ రవి భార్య గురించి అనిత ఎంతో గొప్పగా చెప్పింది.

“కానీ అదే గాంభీర్యం, హుందాతనం మరియు ప్రశాంతత ఉన్న అనితలాంటి అమ్మాయి నాకు కావాలని రవి చెప్పినప్పుడు, అనిత అతన్ని ఆరాధించింది. 

“మీ ప్రొఫైల్‌లో మీ స్వంత ఫోటోను ఎందుకు పెట్టకూడదు? అని రవి ఆమెను ప్రశ్నించారు. అనిత బదులిస్తూ, "నా స్వంత ఫోటోలు ఇతరులు చూడటం నాకు నిజంగా ఇష్టం లేదు." ఇప్పుడున్న ఫ్రోఫైల్‌కూడా లలిత పేరుతో స్నేహితురాలి సహాయంతో క్రియేట్‌ చేసిందే అని చెప్పింది. కాకపోతే అసలు పేరు అనిత చెప్పలేదు. 

‘‘రవి ప్రొఫైల్‌లో నటుడు ప్రభాస్‌ చిత్రం పెట్టుకున్నాడు. నువ్వు ప్రభాస్‌ చిత్రం ఎందుకు పెట్టుకున్నావు అని అడిగితే నేను ప్రభాస్‌ ఫ్యాన్‌ అని సమాధానం చెప్పాడు.

 అవునా? అని ఆమె ఆశ్చర్యం కలిగించే ఎమోజీని ఆమె పెట్టింది. ఇప్పుడు మనం చాలా దగ్గర అయ్యాం కదా మనం ఇప్పుడు మన ఫోటోలను ఎక్సెంజ్‌ చేసుకుందాం. అని రవి అడిగాడు. 

ఆ ప్రశ్న ఆమెను ఆందోళనకు గురి చేసింది. బహుశా రవి… నేను చాలా అందంగా ఉన్నానని అనుకుంటే, ఒకసారి నన్ను చూసిన తర్వతా రవి నన్ను చూడటానికి ఇష్టపడతాడా లేదా అనేది సమస్య. ఆ ఆలోచన ఆమెకు చిరాకు తెప్పించింది.

ముందుగా రవి ఫోటోను పంపమని అనిత అడిగింది.. ఒకసారి నన్ను చూసిన తర్వతా నన్ను ఇష్టపడతావ అని కూడా అడిగింది. అతను ఇచ్చిన రిప్లేను చూడాలనే ఆత్రుతతో ఆమె మెసెంజర్ పేజీ వైపు చూస్తూ ఉంది. అయితే రీప్లే రాకపోవడంతో ఆమెకు షాకింగ్ నిజం తెలిసింది.

“నెట్ బ్యాలెన్స్‌ అయిపోయింది. ఇప్పుడు రీచార్జ్‌ చేస్తే చందుకు అనుమానం వస్తుంది. రేపు ఉదయం 11కి రవి వెళ్లగానే రీచార్జ్‌ చేసుకుందాం అనుకుంది.

వీలయినంత త్వరగా వెలుతురు రావాలని ప్రార్థిస్తూ పడుకుని, పొద్దున్నే ఎప్పుడో నిద్రలోకి జారుకుంది. మరుసటి రోజున ఉదయం 8 గంటలకే రవి సమాధానం తెలుసుకోవాలనే కుతూహలం ఆమెలో పెరిగింది. ఇంకా మూడు గంటలు ఎదురు చూడలేక పోయింది.

చందు స్నానానికి వెళ్లిన సమయంలో ఫోన్ తీసుకుని Wi-Fi కనెక్ట్ చేయాలని నిర్ణయించుకుంది. బాత్ రూం షవర్ లోంచి నీళ్ళు పడుతున్న శబ్దం విన్న అనిత తన భర్త ఫోన్ తీసుకుని ఇంటర్నెట్ ఆన్ చేసింది. ఆ సమయానికి, వాట్సాప్ మరియు మెసెంజర్‌లలో నోటిఫికేషన్‌లు వెంటనే స్క్రీన్‌ను నింపాయి. వాటిలో, మెసెంజర్‌లో, ఆమెకు తెలిసిన ప్రొఫైల్‌ను చూసి, జాగ్రత్తగా చూసింది.

రవి ప్రొఫైల్ పిక్ కనిపించింది. ఎంటి అనిచూస్తే చందునే రవిలాగా ప్రోఫైల్‌ క్రియేట్‌ చేసుకొని తనతో చాట్‌ చేశాడు.

 చందు కావాలనే రవిలాగా ఫ్రోఫైల్‌ క్రియేట్‌ చేసి అనితతో మాట్లాడాడ? లేదా ఇంట్లో భార్య ఇస్తోన్న ప్రేమ సరి పోక ఆన్‌లైన్‌లో వెతుతున్నాడా? అనే విషయం అనితకు అర్థం కాలేదు. ఈలోపు స్నానం ముగించు కొని వచ్చిన చందు. అనిత చేతిలో ఉన్న ఫోన్‌ చూసి ఇంకెప్పుడూ నిన్ను దూరం పెట్టనని అనితను బుజ్జగింజి ప్రేమతో మాట్లాడి వారి జీవితాన్ని ముందుకు కొనసాగించారు. 

ఈ విషయంపై అనిత చందునూ ఎక్కువ అడగలేదు. చందు కూడా తన భార్య ఈ విషయంపై పెద్దగా ఆరా తీయక పోయేసరికి నిశ్చింతగా ఉన్నారు.


Rate this content
Log in

Similar telugu story from Drama