Keerti Priya

Romance Others

2.6  

Keerti Priya

Romance Others

మర్చిపోలేని గుర్తులు

మర్చిపోలేని గుర్తులు

1 min
322


ఆఫీసులో వర్క్ టెన్షన్స్ ఎక్కువైపోయి కాస్త రిలాక్సేషన్ కోసం ఆ పక్కనే ఉన్న ఒక పార్కులో వెళ్లి కూర్చున్నాడు  సంజయ్. 


ఆ పార్కు చుట్టు పక్కల అంతా చూస్తూ, చల్లటి సాయంకాల వేళ చల్లటి పిల్ల గాలులతో పాటు చేరి పోయి ఆడుకుంటున్న చిన్ని చిన్ని పిల్లల ముద్దు నవ్వులని చూస్తుంటే అతని మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది.  


వాళ్ళ వైపే లోకాన్ని మరిచి చూస్తున్న అతని మనసుని, మెదడుని ఒక్కసారిగా ఇటు వైపుకు తిరిగేలా చేశాయి అతని నరాలు జివ్వుమనిపించేలా ఎవరో కొరకటంతో. 


చూస్తే ఎవరో ఒక చిట్టి పిల్ల, “అన్నయ్య ఇందాక నుంచి పిలుస్తుంటే పలకవేంటి అని తనని చూస్తే... 


అతనిలో ఆశ్చర్యం - ఎవరు ఈ పాప అన్నట్టుగా తోచుతుంటే.


ఆ పాపలోని ఆశ్చర్యం - మా అన్నయ్య కాదా అన్నట్టుగా తోచి, “సారీ సారీ అన్నయ్య మా అన్నయ్య అనుకున్నాను” ముద్దుగా కాస్త భయపడుతూనే చెప్పి తుర్రు మనింది అక్కడి నుంచి. 


ఆ పాప చిలిపి చేష్టలనే నవ్వుతూ చూస్తూ, ముద్దుగా ఇచ్చిన ఆ పంటి ఘాటులని చిన్నగా తన కర్చీఫ్ తో రుద్దుకుంటుంటేనే,


“సంజు సంజు ఏం చేస్తున్నావ్ ఇక్కడ ఇందాక నుంచి పిలుస్తున్నా నిన్ను” అంటూ తన ముద్దు ప్రేయసి అరుస్తూనే వచ్చి అతని భుజంపై తీపి పంటి గుర్తులను బహుమతులుగా ఇచ్చేసి అతని కనుచూపుమేరా కానరానంత లోకాల్లోకి వెళ్లిపోయింది. 


ప్రేమగా ఇచ్చిన ప్రియసతి తీపి ఘాటులనే తలుచుకుంటున్న అతని కంట నీరు ఎలా వచ్చాయో తెలియదు. 


మర్చిపోలేని గుర్తులనే గుర్తు చేసుకుంటూ ఆకాశం వైపుగా అతని కన్ను చూస్తే, 


ఆ కళ్ళ నిండా నిండిన కన్నీటి చుక్కలు నేలను తాకాయి. 


మర్చిపోలేని వ్యక్తుల నుంచి వచ్చిన ఆ మరువలేని గుర్తులని మరవడం చాలా కష్టం కదండీ.... 


- కీర్తి ప్రియా✍🏻✍🏻



Rate this content
Log in

Similar telugu story from Romance