Vijaya Sree

Classics Inspirational Others

4.7  

Vijaya Sree

Classics Inspirational Others

మగువ మనసు

మగువ మనసు

3 mins
782


చాల రోజుల తర్వాత గాలి పీల్చుకున్నట్టుగా వుంది కరోనా భయం తో ఇల్లు తప్ప మరో ప్రపచం లేక పోవడం తో బలవంతంగా ఇవాళ పుట్టిన రోజని శ్రీవారిని లాక్కొని కొండ మీద గుడికి వచ్చింది వినయ,భర్త ని బయటికి తీసుకు రావటానికి యజ్ఞం చేసిందంటే అతిశయోక్తి కాదేమో! వినయ భర్త విరించి కి భయం జాస్తి జానలు వస్తారేమోనని చాల దూరం గా నుంచుని ఫోన్ చూసుకుంటున్నాడు.ఆ కొండమీద కి చాల కొద్ది మంది వస్తారని వినయ కి తెలుసు అందుకే ప్రశాంత గా ప్రకృతిని ఆశ్వాదిస్తోంది.అక్కడ వాచ్ మెన్ అందమైన గులాబి తెచ్చి అక్కడే గుడి తుడిచే భార్య కి ఇచ్చాడు,అతడి భార్య కళ్ళల్లో ఆనందం వెలుగు స్పష్టంగా కనిపిస్తోంది,అలాగే ఆ భార్య దాచిన ప్రసాదాన్ని ఇద్దరు కలసి కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు చూడముచ్చటగా వుంది అనుకుంటువుండగా విరించి హడావుడిగా పద వెళ్దామా ఎక్కువసేపు బయట వుండకూడదు అంటూ వచ్చాడు,సరే వెళ్దాం కాసేపు కూర్చోండి అంది వినయ,లేదు ఇప్పటికే ఆలస్యం అయింది పద పద అనటంతో కదలక తప్పింది కాదు.చిన్నబుచ్చకున్న మొహం తో కారులో ఎక్కి ఆలోచనలో పడింది వినయ తొమ్మిది వసంతాలు వెనక్కి వెళ్ళి,,చిన్న కోడలు భాద్యతలు వుండవు అని అందరూ అనుకున్నారు,కానీ పరిస్థితుల రీత్యా ఆ కుటుంబ భాధ్యత తీసుకోవలసి వచ్చింది తప్పించుకునే మనస్తత్వం లేని వినయ ఆ ఇంటికి అన్ని తానే అయింది,నా రిటైర్మెంట్ అయిపోయింది అనే అత్తగారి ని,అడపాదడపా వచ్చే ఆడపడుచులు ఏడాది కి ఒకసారి అమెరికా నుంచి వచ్చే బావగారి కుటుంబాన్నీ బంధు గణాన్ని, ఇంటి బాధ్యతను, భర్తను ఏ లోటూ లేకుండా చూసుకుంటుంది. వినయ మనసు లో మాత్రం ఏదో చిన్న వెలితి,సొంతఇల్లు,ఏ వ్యసనాలు లేని భర్త,మంచి సంపాదన ఇంత కన్నా ఏ మగాడైనా ఏమివ్వగలడు అని విరించి వివరణ,చూసే వాళ్ళకి వినయ సమస్య చిన్నదే ,ప్రతి స్త్రీ సమస్య ఎదుటి వారికి చిన్నదే,భర్త పుట్టిన రోజైన,లేక వాళ్ల పెళ్లి రోజైన,పండగైన ఇష్టంగా ఎన్నో చేస్తుంది. ఇంటి పని అయిన బయటి పని అయిన భర్త కి ఇష్టం లేక కష్టమని గ్రహించి తానే చూసుకునేది.భర్త ఇష్టాలకు అలవాటు పడింది.వినయ,వినయ ఎన్ని సార్లు పిలవాలి అన్న పిలుపుతో ఈ లోకం లోకి వచ్చింది.ఆ... చెప్పండి అంది నువ్వు హ్యాపీగా,గుడికి తీసుకు రమ్మన్నావు తీసుకెళ్ళాను,మ్మ్ అంది,,అదే తన సమస్య వినయ మనసు లో ఏముందో తెలుసుకోవాలని అనుకోడూ,కాసేపు కూర్చుని వద్దాం అనుకున్నాను...,ఆ ఇంకో సారి వద్దాం లే,వినయ కి తెలుసు మళ్ళీ విరించిని బయటకు కు తీసుకు వెళ్ళాలంటే ఎంత కష్టమో,ఇప్పుడంటే కరోనా అంతకు ముందు కూడ అడుగు బయట పెట్టడం ఇష్టం వుండేది కాదు ఎందుకో అర్థం కాదు వినయకి ఏమన్నాంటే 30 ఏళ్ల నుంచి వచ్చిన అలవాట్లు ఇవాళ మారవు అంటారు మరి తాను అన్ని మార్చుకుంది కాదా! ఇవాళ ఎలాగైనా తన భావాలను విరించికి వివవరించాలని నిర్ణయించుకుంది,విరిన్ నీతో మాట్లాడాలి,మాట్లాడు ఇలా కాదు కాసేపు కారు ఆపు,ఇప్పటిదాకా బానేవున్నావుగా ఏమైంది ఎవరో అన్నట్టు అతి వేగంగా మారేది స్త్రీ మనసు ఆ దేవుడికి కూడ అర్థం కాదు,అమ్మ ఒక్కతే వుంది, భయపడుతుంది అన్నాడు,లేదు విరిన్ 5 నిమిషాలు... అని స్థిరంగా చెప్పటం తో ఏమనుకున్నాడో కారు ఆపాడు చెప్పు,మన ఇద్దరి మధ్య దూరం మీకు తెలుస్తుందా?ఏముంది నాకేమీ అలా అనిపించటం లేదు నీకు అనిపిస్తే నేనేమీ చేయలేను,మీరు అలా అంటేనే ఇంకా భాధ వేస్తుంది,పెళ్లి తర్వాత నేను బాధ్యతలలో లోటూ చేశాన, ‌' లేదు' నేను మాత్రం నీకేమి లోటూ చేశానని విరించి అడిగాడు,లోటు చేశారని అనటం లేదు, కానీ నా అభిప్రాయాలను పంచుకోవాలని అనుకుంటున్నాను,

కాసేపు భర్త తో కబుర్లు చెప్పాలని,సరదాగా బైక్ మీద షికారు కి వెళ్లాలని,నేను చెప్పకుండా కనీసం పుట్టినరోజున అయిన ఏదైనా తేవాలని అంటే ఒక పూవ్వో పండో ,ఏదైనా పర్లేదు,పిల్లలు కూడా లేక నేను కార్చే కన్నీటిని తుడిచి తలనిమరాలని ఆశ,అత్తయ్య గారి ముందు మాట్లాడలేను,పడుకునేటప్పుడు ఎన్నో విషయాలు పంచుకుని స్వాంతన పొందాలని రోజు ఆశగా వచ్చేలోపే గురకలు వినిపిస్తాయి,ఇవన్నీ ఎవరితో పంచకొగలను,కనీసం ఇప్పుడైనా మీ భావాలు చెప్తే నాకు ‌సమస్య అర్థం అవుతుంది

.. ఏం చెప్పను ఆన్లైన్ లో నీకు నచ్చినట్టు కావలసినవి కొనుక్కోమన్నాను,ఇద్దరం కలిసే ఉంటాం ప్రత్యేక కబుర్లు ఏముంటాయి,ఇక బైక్ అంటావా అందరూ కార్లలో గొప్పగా తిరుగుదామని అనుకుంటారు నువ్వేంటి బైక్ ‌లో‌అంటావు,నీకు ఇంకా ఏం కావాలో నాకు అర్థం కావట్లేదు అన్నాడు విరించి,మీరుంచెప్పినంత కష్టం కాదండీ మగువ మనసు తెలుసుకోవడం మీరు అద్దం లో మొహం చూసుకున్నఅంత తేలిక అద్దంలో మొహం చూసుకుంటూ లోపాలు సరిచేసుకుంటారు,స్త్రీ మనసు అద్దం లాంటిదే దగ్గరగా వెళితే స్పష్టంగా తనకి ఏమి కావాలో తెలిసిపోతుంది.ఇంకో విషయం బైక్ మీద తిరగాలనేది నా కోరిక ఇతరులకి అదే ఇష్టాలు ఉండాలని లేదుగా, పుట్టిన రోజు బహుమతి ‌అనేది నేను కొనుక్కోవడం ఏంటండీ మీరు ‌రాసే‌ చిన్న ఉత్తరం ‌అయిన అది నాకు వెల కట్టలేని బహుమతే. పుట్టింటిని వదిలేసి వచ్చకా అన్ని మీరే అని నేను వున్నప్పుడు మీరు నా కోసం కాస్త సమయం కేటాయించాలి కదా అండి, మీరు చూపే ప్రేమ, ఆప్యాయత లే నాకు బలాన్ని ఇస్తాయి అని వినయ చెప్పటం ఆపింది.కాసేపు మౌనం తర్వాత 'సారి'వినయ నాలో 10 రోజుల్లో మార్పు చూస్తావు అని చేతి లో చేయి వేశాడు విరించి.చిరు నవ్వు తో హ్మ్మ్ ఇక పదండి అంది వినయ.కానీ వినయ కి కచ్చితంగా తెలుసు తన భర్త ఆలోచన లో అంత త్వరగా మార్పు రాదనీ కానీ నమ్మకం నెమ్మదిగా తెలుసుకుంటాడు అని. అయిన మగువ మనసు తెలుసు కోవటం కంటె మగడి ఆలోచన తెలుసుకోవటం మహాకష్టం.                                      మీ విజయశ్రీ


Rate this content
Log in

More telugu story from Vijaya Sree

Similar telugu story from Classics