Varun Ravalakollu

Drama Romance

4.8  

Varun Ravalakollu

Drama Romance

లవ్

లవ్

7 mins
560


అది 1970వ సంవత్సరం

ఆదివారం

సమయం ఉదయం 7 గంటలు

ఆదిలాబాద్ అడవులు

వర్షాకాలం కావడంతో పెరిగిన పొదలతో ఇంకా దట్టంగా తయారయింది అడవి.

ఆ దట్టమైన అడవి గుండా పోతున్న వెస్ట్రన్ ఘాట్స్ మద్యలో ఒక అందమైన భవంతి.

ఎవరైనా చూస్తే అంత భయంకరమైన అడవి మద్యలో ఇంత అందమైన భవంతా అనుకుంటారు.

ఎటు చూసిన పచ్చదనం తో అంత అంధంగా ఉంది ఆ భవంతి.

ఇంటి నిండా పూల మొక్కలు,ఇంటి ఆవరణలో,పెరట్లో రకరకాల కూరగాయల మొక్కలను పెంచిన తీరును చూస్తే ఎవరైనా ఫిదా కావల్సిందే. ఆ ఇంట్లో తినే ప్రతీది కూడ పండిచేదే అని చెప్పొచ్చు.

రాత్రి కురిసిన భారీ వర్షంతో,చుట్టు పక్కల ఉన్న ప్రదేశం అంతా చిత్తడిగా తయారైంది.

***

ఆ ఇంటి ముందర శివుడు తోక కాలిన పిల్లిలా అటు,ఇటు తిరుగుతున్నాడు.అది చాలా సేపటి నుండి గమనిస్తున్న రంగి ఇక ఆపుకోలేక అడిగేసింది.

“ఏమైందయ్యా,ఒక గంట నుండి అటు ఇటు తిరుగుతూనే ఉన్నావ్.కసరత్తులు చేత్తున్నావా ఏంది.అయిన ఈ వయసులో ఇదేం రోగం నీకు” అర్దం కాక అయేమయంగా అడిగింది రంగి.

“గమ్మునుండహే,నా పరేశాని లో నేనుంటే,నీ ఎకసక్కాలు నువ్వు” రాని కోపాన్ని తెచ్చుకున్నట్టు నటిస్తూ అన్నాడు శివుడు.

ఇలా వీళ్ళు మాటా మాటా అనుకుంటు ఉండగానే ఒక తెల్ల అంబాసిడర్ కారు ఆ ఇంటి ఆవరణలోకి వచ్చింది.

ఆ కారులోంచి దిగింది జాహ్నవి. నీలి రంగు చీరతో,కంటికి కాటుకతో,నొదుట నిండైన తిలకంతో, ఎలాంటి ఆభరణాలు హంగు ఆర్భాటాలు లేకుండా,అచ్చం దేవకన్యలా ఉంది. వర్ణాతీతం అయిన అందం ఆమెది.

వెంటనే శివుడు అమ్మ గారు వచ్చేసారు అంటూ పరుగెత్తాడు.

తన చేతిలో ఉన్న లగేజిని శివుడికి ఇస్తూ, “ఏం శివుడు పొద్దున్నే మొదలయిందా మీ యుద్దం.ఈ మద్య ఎక్కడో చదివాను,ఒక బంధంలో పోట్లాటలు,అలకలు,కోపతాపాలు లేకొంటే అది నిజమైన బంధం కాదట,అది ఒకరిని ఒకరు మోసం చేసుకుంటు బ్రతికినట్టు” అని తన ఫిలాసఫి మొదలు పెట్టింది జాహ్నవి.

జాహ్నవి అంతే ఏదైన ఒక విషయం మాట్లాడడం మెదలు పెట్టిందటే,ప్రపంచంలో ఎక్కడెక్కడో జరిగినవి,తాను విన్నవి,చదివినవి అన్వయిస్తూ చెప్తుంది.బహుషా పాండిత్యం అంటే ఇదేనేమో.

ఎదుటి వాళ్లు ఎంతటి వాళ్ళు ఐనా తన వాక్చాతుర్యం తో కట్టి పడేస్తుంది.

జాహ్నవి,విజయ్ ఒకటే సారి ఉద్యోగం లో చేరారు. తనేమో చాలా చలాకి,విజయ్ ఏమే ఏం మాట్లాడడు.ఇద్దరికి అసలు పొంతనే లేదు. కాని ఇప్పుడు వారు ప్రాణ స్నేహితులు.చెప్పాలంటే అంతకన్న ఎక్కువే. తను పక్కనే ఉన్న రేంజ్ లో రేంజ్ ఆఫీసర్.ఎంత బిజీగా ఉన్నాగానీ ప్రతీ ఆదివారం విజయ్ దగ్గరికి ఒచ్చెస్తుంది జాహ్నవి.

ఇంట్లోకి అడుగు పెట్టిన వెంటనే విజయ్ గదిలోకి వెళ్ళింది. విజయ్ అక్కడ లేడు.

***

దట్తమైన కారు మబ్బుల మద్యలో దాక్కున్న సూర్యుడు,బయటకు రాకుండా దోబూచులాడుతున్నాడు. నువ్ మొండి అయితే నేను నీకన్నా మొండి అన్నట్టు, విజయ్ తన కామెరా పట్టుకుని సూర్యోదయాని బందించడానికి రెడీగా ఉన్నాడు.

విజయ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్. సరిగ్గా 8 సంవత్సరాల క్రితం,22 సంవత్స రాల వయసులో, ఉద్యోగం సంపాదించాడు. తన స్నేహితులంతా సాఫ్ట్ వేర్ ఉద్యోగలతో లక్షల్లో సంపాదిస్తూ ఉంటే,విజయ్ మాత్రం ఇలా అడవుల్లో ఉంటున్నాడు.

విజయ్ కి ఇలా ఉండడమే ఇష్టం. కెమెరాతో ప్రకృతి అందాలను బంధిచడం విజయ్ హాబి. రోజు డైరీ కూడా రాస్తాడు. వృద్దాప్యం లో ఉన్నప్పుదు,ఎప్పుడో జరిగిన వాటిని చూడడం,వాటి గురించి చదవడం ఒక థ్రిల్లింగ్ ఫీలింగ్ అది. అందుకే రోజు జరిగే వాటిని, తన కెమెరాలో,డైరీలో బందిస్తాడు.

***

“శివుడు,శివుడు, ఎక్కెడికెల్లాడ్రా ఈ మహానుభావుడు” పట్ట రాని కోపంతో అడిగింది జాహ్నవి.

“ఏమోనమ్మా,గంట క్రితం ఇక్కడే పడుకుని ఉన్నాడు,మీకోసం ఎదురు చూస్తు బయట ఉన్నాను.ఇంతలోనే మాయల మరాఠీలా మాయమైపోయాడు” అయోమయంగా అన్నాడు శివుడు.

ఇలా అనుకుంటూ ఇంటి ఆవరణలోకి రాగానే కనిపించాడు విజయ్.

విజయ్ కి రోజు ఉదయం నడకకి వెళ్లడం అలవాటు.ఈ రోజు అలానే వెళ్ళాడు. కోర మీసాలతో,నిండైన గడ్డంతో,అలసటతో చెమటలు పట్టి ఉన్న కండలు తిరిగిన దేహంతో ఆరడగుల విజయ్ ని అలా చూసే సరికి చూపు తిప్పుకోలేక పోయింది జాహ్నవి.

“అలా చూడమాకండమ్మా,అయ్యోరికి దిట్టి తగులుద్ది” జాహ్నవి చెవి దగ్గర చెప్పింది రంగి

జాహ్నవి మొహం సిగ్గుతో కందగడ్డ లా తయారయింది.

“పోవే” అంటూ విజయ్ దగ్గరికెల్లింది.

***

“నీకింతైనా,ఏమైనా ఉందా విజ్జు” ఉరిమింది జాహ్నవి

“ఏమి ఉంది,ఎంత ఉంది క్లారిటీ ప్లీజ్ జాను” నవ్వాడు విజయ్.

“అరేయ్ ఎక్స్ట్రాలు చేయకుండా వెల్లి తొందరగా రెడీ గా” హుకుం జారీ చేసింది జాహ్నవి.

“యువర్ హైనెస్” అని చెప్పి వెల్లిపోయాడు విజయ్.

ఎప్పుడూ ఇంతే.విజయ్ మీద కోపంతో వెళుతుంది,కాని అతను చేసే చిలిపి చేష్టలు,అమాయకమైన వ్యక్తిత్వం,అంతకు మించి అతను చూపెట్టే అభిమానం ఆ కోపాన్ని చల్లారేస్తాయ్. బహుస ప్రేమంటే ఇదేనేమో

ఇంతలో జాహ్నవి ఫోన్ మ్రోగింది. అవతల విజయ్ వాళ్ల అమ్మ.జాహ్నవి ని దేని గురించో బ్రతిమిలాడుతోంది. కాని జాహన్వి ఒప్పుకొట్లేదు.

జాహ్నవి ఫోన్ పెట్టేయగానే రంగీఅడిగింది.

“అమ్మా ఈ రోజు ఏటైన పిక్నిక్ పోతున్నారా” అని

“లేదే,ఈ రోజు మీ అయ్యగారు, అదే మన దేవుడికి....” అని రంగి చెవిలో మెల్లిగా ఏదో చెప్పింది.

అది చెప్తున్నంత సేపు జాహ్నవి కళ్లలో నీల్లు తిరిగాయ్. విన్న రంగి కూడ అలానే ఉంది.

శివుడు తడారుతున్న కళ్లతో ఒద్దమ్మా అని సైగ చేసాడు.

కాని జాహ్నవి తెచ్చుకున్న నవ్వుతో “వాడి ఆనందమే మనకు ముఖ్యం.మన ఆనందం కన్నా” అంది.

***

జాహ్నవి చాల గొప్పింటి అమ్మాయి. తన తండ్రి జాహ్నవి ని చక్కగా ఫారెన్ వెళ్ళి అక్కడే సెటిల్ అవ్వమని చెప్పాడు. అంతా తాను చుసుకుంటా అన్నాడు. కాని అందుకు భిన్నంగా జాహ్నవి అడవిని ఎంచుకుంది. ఉన్న ఒక్క గానొక్క కూతురు,తనకు దూరం గా ఉండటం తో జాహ్నవి తండ్రి బెంగతో మంచం పట్టాడు. తర్వాత కొన్నాళ్లకు పిల్లలు పుట్టకుండా జాహ్నవి ఆపరేషన్ చేయించుకున్నట్టు తెలియడంతో,జాహ్నవి జీవితం పై బెంగ ఎక్కువై మంచం మీదే కన్ను మూసాడు.

తన తండ్రి పోయిన వెంటనే.తన ఆస్తి మీద ప్రేమతో తన బంధువులు తన మీద ప్రేమ ఉన్నట్టు నటించడం,తన ముందు ఒకటి వెనకాల ఒకటి అనడం జాహ్నవి బంధాలు,అను బందాల మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టేసాయ్. ఆస్తిని ఎవరికైనా అమ్మడానికి ప్రయత్నిస్తే,తన బంధువులు గొడవ చేస్తారని వాళ్లకు తెలియకుండా ఆస్తి మొత్తం మీద బ్యాంకు లోన్ తీసుకుంది. ఆ డబ్బును వెరే బ్యాంకులో ఫిక్స్డు డిపాజిట్ చేసేసింది. తీసుకున్న అప్పు ని తీర్చకపోవడం తో,బ్యాంక్ వాళ్ళు ఆస్తిని వేలం వేసేసారు. అలా తన బందువులకు షాక్ ఇచ్చినట్టు అటు ఆస్తి అమ్మేసింది,ఇటు డబ్బు ఒచ్చింది. ఆ నాటి నుండి తన బంధువుల నటన కూడా ఆగిపోయింది. ఇప్పుడు తనకంటు ఉన్నది,మిగిలింది విజయ్ మాత్రమే.

***

విజయ్ రెడి కా గానే అందరూ బయల్దేరారు.

జాహ్నవి కారు నడుపుతుంటే,విజయ్ జాహ్నవి పక్కన కూర్చున్నాడు.

శివుడు,రంగి వెనకాల కూర్చున్నారు.

వెస్ట్రన్ ఘాట్స్ మద్యలో ఉన్న మలుపుల రహాదారుల మద్యలోంచి కారు దూసుకెల్తుంది. కారు కిటికిలోంచి ఆ ఎత్తైన కొండల నుండి దూరంగా కనిపిస్తున్నా చిన్న సిటీ ని చూస్తుంటే తాము నిజంగా ప్రపంచం అంచున ఉన్నామేమో అన్న భావన కలుగుతుంది వాళ్ళందరికి. జాహ్నవి కి మాత్రం విజయ్ పక్కన ఉన్న ఈ క్షణం కాలం ఆగిపోతె బాగుండు అనిపిస్తుంది.

“డ్యూడ్,అమ్మాయివైన నువ్వు నడుపుతుంటే నేను కూర్చోవడం నాకు నచ్చట్లేదు” అన్నాడు విజయ్

“నువ్వు డ్రైవింగ్ చేస్తే మాకు నచ్చదు. నువ్వు మా దేవుడి వి నీకు శ్రమనిస్తా మా మేము.అమ్మా” నవ్వుతూ అంది జాహ్నవి.

“అంతే కానీ డ్రైవింగ్ ఇవ్వను అంటావ్” అన్నాడు విజయ్.

“అంతేగా,నీ డ్రెస్ నలిగిపోతే ఎలా డ్రైవింగ్ చేస్తే.ఈ రోజ్ ఫంక్షన్ కి మైన్ గెస్ట్ వి నువ్వు” అంది జాహ్నవి.

“దీనంతటికి బదులు,నీకు డ్రైవింగ్ రాదురా వెదవా,విసిగించకు అంటే బాగుంటది” అలిగాడు విజయ్

“ఇంటిలిజెంట్ బాయ్. అన్ని అర్దమయిపోతాయ్.అది సరే గాని ఎక్కడికి తీసుకెల్తున్నానో అడగవ” అంది జాహ్నవి

“నాట్ ఇంట్రెస్టెడ్ టు నొ. నేను అక్కడికి వస్తే నువ్వు హ్యాపీ అన్నపుడు,ఎక్కడికైనా వస్తా,ఎక్కడికి అన్నది నాకు అనవసరం” చెప్పేసాడు విజయ్.

“ దివ్య గుర్తుందా” తడబడుతున్న గొంతుతో అంది జాహ్నవి. వెంటనే జాహ్నవి చేయి పట్టుకున్నాడు విజయ్.జాహ్నవి కాళ్ళు ఆటోమేటిక్ గా బ్రేక్స్ మీద పడ్డాయ్. కారు అదుపు తప్పి ఒక చెట్టును డీ కొట్ట పోయింది. శివుడు,రంగీ గట్టిగా అరిచారు.కారు చెట్టుకి కొద్ది దూరం లో ఆగిపోయింది. పెద్ద ప్రమాదం తప్పింది. నీకేంకాలేదుగా అని టెన్షన్ తో విజయ్ ని గట్టిగా హత్తుకుంది జాహ్నవి.

***

దివ్య, విజయ్ ప్రేమించిన అమ్మాయి. తన ప్రేమ గురించి చెప్పిన ప్రతిసారి విజయ్ ని దివ్య చాలా అవమానించేది. “నువ్వెంతా నీ బ్రతుకెంతా,అసలు నీ మొహం చూడడం కూడా ఇష్టం లేదు నాకు.నా వెంట చాలా మంది పడుతున్నరు,ఇలా ప్రతి అడ్డ మైన వాడికి సమాదానం ఇవ్వలేను. అసలు నిన్ను ఒక అమ్మాయి ప్రేమిస్తుంది అని ఎలా అనుకున్నావ్. ప్లాస్టిక్ చెప్పులతో,ఎప్పుడు ఒకటే డ్రెస్ తో ఉంటావు.ఇంకోసారి నా జోలొకొస్తే చెప్పు తెగుతుంది” అని అందరి ముందు తనను,తన అందాన్ని పేదరికాన్ని అవహేళన చేస్తుంటే విజయ్ కళ్లలో నీల్లు తిరిగాయ్. కాలెజ్ అంతా తనని ఎంత అవహేళన చేసిన,దివ్య ను ప్రేమించడం మాత్రం ఆపలేదు. ఒకరు కాదంటే,ఇంకొకరు,ఒకరు వద్దంటే వారి మీద ప్రేమ తగ్గుతుంది అంటే అది నిజమైన ప్రేమ కాదని విజయ్ నమ్మకం. తను అంతే ఇంకో విదంగా చెప్పాలంటే.తను ఏ గుడికి వెళ్ళినా దివ్య బాగుండాలనే కోరుకునేవాడు,కాని తన గురించి ఏ రోజు ఏ ఒక్క కోరిక కోరుకోలేదు. ఎందుకురా ఇదంతా అంటే నన్ను ఏం అన్నా,దివ్య హ్యాపీగా ఉండటమే తనకు కావాల్సింది. తన హ్యపీనెస్ కి విలువ లేదు.ఎందుకంటే దివ్య హ్యాపినెస్ ఏ నా హ్యాపి నెస్ అనేవాడు. కాలేజ్ తర్వాత విజయ్ కి ఒక పెద్ద మల్టీ నేషనల్ కంపనీలో ఉద్యోగం ఒస్తే అన్నీ వదులుకుని,దివ్య ఉండే సిటీ లొ ఒక చిన్న ఉద్యొగం లో చేరాడు,దివ్య ను చూడొచ్చనే ఆశతో ఇది తెల్సిన దివ్య విజయ్ ని తన తమ్ముడు,అతని స్నేహితులతో విపరీతంగా కొట్టిచింది. విజయ్ హాస్పిటల్ లో ఉండగానే అతని తండ్రి చనిపోయాడు.భర్త పోయిన బాధ,కొడుకు ఇలా అయిపోయాడన్న బెంగతో విజయ్ తల్లి మంచం పట్టింది. ఒక సారీ విజయ్ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడింది. ఇంతలో దివ్య కి వేరే వాళ్ల తో పెళ్లయి పోయింది. విజయ్ కి తెల్సింది ఏంటంటే,దివ్య తను ఇంతకు ముందు ప్రేమించిన ఇద్దరు వ్యక్తులను కాకుండా,ఎవరో ఒక ధనవంతున్ని పెళ్ళి చేసుకుందని. ఆ రోజు నుండి విజయ్ జీవితం లో మార్పు మొదలయింది.తన తల్లిని సంతోషంగా ఉంచడమే అతనికున్న మొదటి బాద్యత. తన అమ్మను పెద్దమ్మకి అప్పగించి,విజయ్ తనని తను చీకటి గదిలో బందించుకున్నాడు. 6 నెలల్లో రేంజ్ ఆఫీసర్ గా ఉద్యోగం సంపాదించాడు.పెళ్ళి చేసుకుంటే తన భార్య అమ్మని సరిగా చూసుకోదేమో అని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్నాడు.దాంతో సంబంధాలు రావడం మానేసాయ్. విజయ్ మీద కోపం అతని అమ్మ విజయ్ ని వదిలి తన ఊరికి వెళ్ళి పోయింది.ఇప్పటికి మాటల్లేవ్. జాహ్నవి విజయ్ వాళ్ల అమ్మని తన దగ్గరికి తెచ్చుకుంది.సొంత తల్లిలా చూసుకుంటుంది. జాహ్నవి,విజయ్ ని అడిగే దైర్యం లేక,విజయ్ చిన్న నాటి స్నేహితుడితో “జాహ్నవి ని పెళ్ళి చేసుకో” అని అడిగించింది

కాని విజయ్ జాహ్నవి తనకు కేవలం స్నేహితురాలు మాత్రమే అని,, తాను ఎప్పటికి దివ్య నే ప్రేమిస్తూ ఉంటాను అని అనడం తో,తనకు ఆ ఉద్దేశం లేదని తేల్చి చెప్పడంతో,జాహ్నవి కలలు కూలి పోయాయి.

***

ఇంతలోనే కారు సిటీలో ఎంటరైంది. నేరుగా ఒక ఇంటి ముందు ఆగింది. జాహ్నవి,శివుడు,రంగీ కారు దిగి విజయ్ ని రమ్మన్నట్టు సైగ చేసారు.

ఇల్లంతా హడావిడిగా ఉంది. విజయ్ ని ఒక సోఫా లో కూర్చోపెట్టి చెవిలో మెల్లిగా చెప్పింది జాహ్నవి. “మొన్న నాకు ప్రామిస్ చేసావు.దానికి తగ్గటే ఉండు. ఈ రోజు నీకు పెళ్ళి చూపులు.బయపడకు,నీ గతం గురించి పెళ్ళి కూతురికి తెలుసు.నిజం చెప్పాలంటే నాకన్నా బాగా తెలుసు.ఎలాంటి గొడవ చేయకు.చేసి నా పరువు తీయకు” అని జాహ్నవి పక్కకి జరగ గానే ఎదురుగా దివ్య కాఫీ ట్రే తో కనిపించింది. విజయ్ కి కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. వెనకాలే దివ్య వాళ్ల తమ్ముడు నిల బడ్డాడు. విజయ్ ఏం మాట్లాడకుండా లేచి వెళ్లబోయాడు. విజయ్ కి కోపం తను అంత బాద పడ్తుంటే,అన్ని కష్టాలు పడ్తుంటే అప్పుడు తనతో లేదు అని.అందుకే ఇక జీవితంలో దివ్య మొహం చూడొద్దు అనుకున్నాడు పక్కనే ఉన్న జాహ్నవి విజయ్ చేయి పట్టుకొని వెళ్లద్దు అన్నట్టు తల ఊపింది

“తను దివ్య కాదు సార్” దివ్య వాళ్ల తమ్ముడు చెప్పాడు “నా ఇంకో అక్క,స్నేహ,దివ్య,తను కవలలు. మా అక్క పెళ్ల యిన తర్వాత కొన్ని రోజులకు చనిపోయింది. కాదు చంపేసారు దుర్మార్గులు,మా అక భర్త,,తన అత్తమామలు కట్నం కోసం” ఉబికి ఒస్తున్న కన్నీటిని ఆపుకుంటూ చెప్పాడు.

విజయ్ కూల పడి పోయాడు.దివ్య చనిపోయిందన్న ఆలోచనే తట్టుకోలెక పోతున్నాడు. “మా అక్క కూతురు ఒంటరిది అయిపోయింది.స్నేహ మీ డిపార్ట్మెంట్లోనే పని చేస్తుంది.మీ గురించి మొత్తం తెలిసి మిమ్మల్ని ఇష్ట పడింది” చెప్పాడు దివ్య తమ్ముడు.

అంతలో 7 సంవత్సరాల దివ్య కూతురు వచ్చింది. విజయ్ లేచి నిలబడ్డాడు. అందరు విజయ్ ఏం చెప్తాడో అని ఎదురు చూస్తున్నారు. “నేను మీకు అభ్యంతరం లేకుంటేతనని దత్తత తీసుకుంటాను,నా సొంత కూతురిలా చూసుకొంటాను. స్నేహ ని పెళ్ళి చేసుకోలేను. ఎందుకంటే నా జీవితంలో ఒకే ఒక వ్యక్తికి చోటుంది.. స్నేహ కి ఇంకా చాలా జీవితం ఉంది. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ప్రేమించే అమ్మాయి అంత గొప్ప వాళ్లని నేను ఇంకా చూడలేదు.తను నన్ను,మా అమ్మని ఎలా చూసుకుంటుందో తనని అలాగే చూసుకొంటది”అంటూ జాహ్నవి వైపు చూసాడు జాహ్నవి కళ్లలో నీల్లు తిరిగాయ్.రంగీ,శివుడు సంతోషపడిపోయారు. “పిచ్చిదానా,నీకు నేను,నాకు నువ్వు తప్ప మనకింకెవరున్నారు.అలాంటిది నిన్ను వదిలేస్తా అని అసలు ఎలా అనుకున్నావే.నువ్ వేరే వాళ్ల ని పెళ్ళి చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉంటావ్ అని నేను దివ్యని ఎప్పటికి మర్చిపోలేని అని చెపితే.ఇడియట్లా పెల్లి చేసుకోకుండా నా ప్లాన్ నే కాపీ కొడతవా. I LOVE YOU FOREVER AND EVER” అని దివ్య కళ్ల లో చూస్తూ చెప్పాడు.


“ఇడియట్” అని విజయ్ చెంప చెళ్ళు మనిపించి గట్టిగా వాటేసుకుంది జాహ్నవి.

***


Rate this content
Log in

Similar telugu story from Drama