Harianiketh M

Drama Romance Inspirational

4  

Harianiketh M

Drama Romance Inspirational

జీవితపు మలుపు

జీవితపు మలుపు

4 mins
266


జీవితం మలుపు తిరగడం అంటే...ఏనుగు కుంభస్థలం కొట్టడం అనే ఆలోచనలో ఉంటాం చాలామంది....కానీ కుంభస్థలన్ని కొట్టడానికి సింహప్రయత్నం ఏమీ లేనట్టేనా? అని ఆలోచించేవాళ్ళు తక్కువ...

అనుకున్నది సాధించలేకపోతున్నాం అనే నిస్పృహలో ,మన -తన తేడా లేకుండా దూషణపర్వం కూడా మొదలౌతుంది...

మౌర్య డిగ్రీ చదువుతుండగానే,పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది...అత్తయ్యకి ఆరోగ్యం బాగాలేకపోవడంతో,

పెద్దవాళ్ళు అనుకున్న మాటకు ఇష్టపడి మరీ,

మరదలు దృశ్యని పెళ్లి చేసుకున్నాడు .మౌర్య కొంచెం

స్థిరపడ్డాకే పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు...

ఈలోపు కంగారుగా అయినా,ఘనంగా అయింది..

.అమ్మాయి ఇంటర్ చదివింది...డిగ్రీ చదువుదాం అన్న మాట పక్కన పెట్టి ఈ పెళ్లికి అమ్మ మీద ఇష్టంతో పెళ్లికి ఒప్పుకుంది..

డిగ్రీ కట్టిపెట్టి పొలం పని చూసుకో అన్నాడు నాన్న సూర్యం..

సిటీ కి వెళ్తాను నాన్నా!ఏదొక జాబ్ చూసుకుంటాను ..అక్కడ అవకాశాలు కూడా ఎక్కువ...వ్యవసాయం ఎం మిగులుతుంది?అన్నాడు మౌర్య

బావా!నువు చిన్నప్పుడే బోలెడన్ని కూరగాయ పంటలు వేసేవాడివి....తెగులు రాకుండా శ్రద్ధగా చూసేవాడివి...వర్మీ ఎరువు చేసేవాడివి!ఎందుకు బావా?ఎవరి కిందో ఉద్యోగం...ఇక్కడయితే మేము కూడా సాయంగా ఉంటాము..అంది దృశ్య

చిన్నపిల్లవు నీకేం తెలీదు...సిటీ కి వెళ్తే బోలెడన్ని ఉద్యోగాలు దొరుకుతాయి...ఇడ్లీ,దోస అమ్ముకుని కూడా బోల్డు సంపాదించి,బతికేస్తున్నారు అక్కడ ...మౌర్య అమ్మ సుమతి తన అభిప్రాయం చెప్పింది..

కోడలికి,సూర్యానికి మౌర్య ఇక్కడే ఉంటే బావుణ్ణు అనిపించింది....సుమతి మాట చెల్లింది....ఆ సాయంత్రమే మౌర్య సిటీ కి ప్రయణమయ్యాడు..

సిటీ లో ఉంటున్న ఫ్రెండ్స్ ని కలిసేడు...వారితోపాటు రూంలో ఉంటున్నాడు...ఉద్యోగం వేటలో పడ్డాడు..

ఉద్యోగం కూడా దొరికింది స్టార్ హోటల్ లో అకౌంటంట్ గా...పదిహేనువేలు జీతం అని,ఇంటికీ ఫోన్ చేసి

అమ్మకి చెప్పేడు...దృశ్యకి చెప్పామన్నాడు ..

దృశ్య ఎలా ఉంది అమ్మా!గుర్తొస్తుంది ఎపుడూ...సాయంత్రం ఇంటికి వచ్చేసరికి పదకొండు అవుతుంది...మనవాళ్ళు ఉంటే బావుంటుంది అనిపిస్తుంది అమ్మా! భార్యని తీసుకెల్దామన్న ఉద్దేశ్యంతో అడిగేడు ఓ రోజు

పిచ్చి పిచ్చి ఆలోచనలు మాను...ముందు ఉద్యోగంలో ఎలా ఎదగాలో చూడు...అందరూ అల్లుడికి ఎదో సాయం చేస్తున్నారు పైకి తేవడానికి....నీకే !ఈ లంకణం తగిలింది...ఎం తక్కువరా నీకు గొల్లుమన్నంత పని చేసేది...

సరేలే!నా పెళ్ళాన్ని తెచ్చుకోవడానికి కూడా నాకు అధికారం లేదు...నాకన్నా చిన్న జీతగాళ్ళు కాపురాలు చేస్తున్నారు...కావాలంటే ఇద్దరం కష్టపడతాం.అన్నాడు కోపంగా ఓ సారి

ఈ వయసు పిల్లలకి డబ్బులు చిల్లర పెంకుల్లా ఆనిపిస్తాయిరా...పెద్దవాళ్ళు లేకుండా పిల్లలిద్దరూ ఉంటే,నువ్వు వెనకేసేది ఏమీ ఉండదు...ఊర్లోకి వచ్చాక ఫలానా వారి అబ్బాయి బాగుపడ్డాడు సిటీ వెళ్లి అనుకోవాలి కదా! లేదంటే చెప్పు రేపే బస్ ఎక్కిస్తాను నీ భార్యని...!గెడ్డాలనాడు కొడుకులా!?అని ఉత్తినే అడగలేదు ఏడుపు మొదలెట్టేది...

ఇక్కడ దృశ్య పనిమనిషి అయింది... అమ్మ లేకపోయేసరికి మంచిచెడు చెప్పేవారు లేకపోయేరు తనకి...నాన్న వచ్చినా పంట డబ్బులు ఇవ్వడం వరకే!అయినా నాన్నకి ఎం తెలుసని మాట్లాడతారు అనుకునేది...!

అమ్మ ఎపుడూ పెళ్లిచేసుకునే పిల్లవు ,అలా ఉంటే ఎలా ?అని ప్రతిదానికీ ఏదొకటి చెప్తుంటే విసుక్కునేది.

ఇపుడు అత్తయ్య అడిగినా ఏమీ చెప్పదు...

ఏమీ నేర్పకుండా నాకు అంటగట్టింది మీ అమ్మ ఎప్పుడూ ఒకటే మాట అనేది...

కట్నం,బంగారం ఆడిగినట్టే ముట్టజెప్పినా.!

వియ్యంకుడు వచ్చినప్పుడల్లా,అమ్మాయిని కూడా తీసుకెళ్లి ఉంటే బావుండేది అన్నప్పుడు..సిటీ లో ఖర్చు ఎక్కువ అన్నయ్యా!ఆ డబ్బు వెనకేస్తే,మన పిల్లలకేగా ఉంటుంది అనేది...చెప్పేదేమీ లేక,ఊ ...అనేవాడు...కూతురు కళ్ళు ఒక్కరోజు

సంతోషన్గా పలకరించలేదని బాధ పడేవాడు...

అమ్మలేని పిల్ల ,జాగ్రత్తమ్మా !అని మాత్రం చెప్పగలిగేవాడు..

మనింట్లో పిల్లకి జాగ్రత్త అవసరమా బావా!నేను ఉన్నానుగా అన్న,సూర్యం మాటకి దృశ్య,ఆమెనాన్న లక్ష్మయ్య కళ్ళు నవ్వుకునేవి...

దృశ్య స్నేహితులు డిగ్రీ చివరి సంవత్సరానికి వచ్చేరు...ఒక గంట ఇంటి అరుగుమీద వారితో మాటలు సాగేవి..అప్పుడే దృశ్య నవ్వేది..సుమతి కూడా అప్పుడే నవ్వనిచ్చేది...

ఖాళీగా తోచడం లేదు అత్తయ్యా...బావ గుర్తొస్తున్నాడు అని దృశ్య అన్నప్పుడు,తనభార్య చిన్నతనం లో ఇలానే బాధపడేది...కోడలికన్నా చిన్న వయసు అయినా,నేను దగ్గరే ఉన్నా...పొలం వెళ్ళొచ్చేలోపు ఏడ్చేసేది కొత్తల్లో..మరిప్పుడు కోడలి దగ్గర ఈ న్యాయం ఏంటి?కంటతడి పెట్టుకున్నాడు సూర్యం

మొత్తానికి సందులో పిల్లలకు ప్రైవేట్ చెప్పే పని పెట్టింది....పొద్దున్న,సాయంత్రం ఈ పని పెరిగింది తప్ప,మనసుకి హాయి లేదు దృశ్యకి...

దుఃఖం తర్వాత సుఖం ఉంటుంది అన్నట్టు ,ఒకరోజు ఉదాయాన్నే మౌర్య ఇంటికి వచ్చేడు సెలవుమీద...

బయట పలకరించిన సూర్యం..అమ్మాయి లోపలుంది వెళ్ళు..అన్నాడు సంతోషపడిపోతూ..

సుమతి ఎదురొచ్చి,ఫోనన్నా చెయ్యలేదురా వస్తున్నట్టు...పెళ్ళాం మీద దేర్ణం అయిందా?అంది

అంతా గుర్తొచ్చారు అమ్మా!రెండేళ్లు అవుతుంది ఊరు వచ్చి అని,దృశ్యా!దృశ్య ఎక్కడమ్మా?అమ్మని అడిగేడు

మేడమీద ఉంటుంది వెళ్ళు...పూర్తి మాట వినకుండానే వెళ్ళేడు పైకి...పిల్లల అరుపులు వినిపిస్తున్నాయి...చూస్తే పిల్లల్ని అదిలించే పనిలో ఉంది దృశ్య...మౌర్యని చూసిన పిల్లలు....అన్నయ్య వచ్చేడు,ఇంక మాకు సెలవు అరుచుకుంటూ, కిందకి వెళ్లిపోయారు.....

బావా!ఎప్పుడు వచ్చేవు!కళ్ళల్లో ఆనందం బయట పెట్టాలన్నా ,రావ(తెలీ)డం లేదు దృశ్యకి...

చాలా మారిపోయావు దృశ్యా!రెండేళ్లలో ఒక్కసారి అయినా నీకు నువ్వు ఫోన్ చేసావా?వదిలి వెళ్లిపోయానని కోపం కదూ!ఇరవై కూడా రాలేదు ముదు పేరక్కలా ఉన్నావు...అయినా ఈ పిల్లలు ఏంటి?

నువ్వు లేక చాలా బోర్ కొట్టేది బావా...అందుకే ఈ పని..నాన్న ఎప్పుడొకానీ రారు...అత్తయ్య పనికోసం తప్ప మాట్లాడదు...మావయ్యకి పొలం పని....నువ్వు కూడా మావయ్యతో ఉండీ ఉంటే బావుండేది కదా!

మెట్లు దిగుతూ అడుగుతుంది

నేను నీ బావని వచ్చేను దృశ్యా!చేతులు చాపేడు..

సరే బావా!కింద పని ఉంది..పిల్లలు వెళ్ళిపోయారుగా...టిఫిన్ చెయ్యాలి..అత్తయ్య వచ్చేస్తుంది...అంటూ వెళ్లిపోయింది

ఏమనుకున్నాడు తను!ఎం జరుగుతుంది ఇక్కడ?అర్థం కాలేదు మౌర్యకి

ఒసేయ్!మొద్దు నీ మొగుడు వచ్చేడు...వేన్నీళ్ళు పెట్టి,ముందు వాడి మొహాన కాఫీ పొయ్యి కొంచెం అరిచింది అత్త

ఇదేరా!దీని వాలకం....నువ్వేళ్లాక ఓ నెల బానే ఉంది...ఇంకా అప్పటినుంచీ ఇదే తీరు....చెప్పిన పని చేస్తుంది...లేకపోతే అలా ఉండిపోతుంది...ఖర్మ!తలకొట్టుకుంది..

సాయంత్రం భోజనాలు వరకూ ,తానేదో సినిమా చూస్తున్నాను అనుకున్నాడు మౌర్య..

రాత్రి చాప వేసుకు హాల్లో పడుకోబుతున్న దృశ్యని,అబ్బాయి వచ్చేడు..లోపల పడుకో అంది...

మంచం మీద పడుకుని నిద్రపోయింది దృశ్య...స్నేహితులతో కబుర్లు అయ్యి తిరిగొచ్చేడు మౌర్య...దృశ్య పడుకోవడం చూసి,లేపేడు నెమ్మదిగా....

దృశ్యా!భుజాలు పట్టుకు గట్టిగా కుదిపేడు..చెంప మీద ఒక్కటిచ్చేడు....అమ్మా!అరిచింది ,ఈలోకంలోకి వచ్చేను అన్నట్టుగా చుట్టూ చూసింది...బావా!ఇపుడే చూస్తున్నట్టు ఆశ్చర్యపోయింది...ఎప్పుడొచ్చేవు బావా!తడిమి చూసుకుంది బావని,చుట్టుకుని ఏడ్చేసింది....

మౌర్యకి కూడా ఏడుపు వచ్చేస్తుంది...ఏమైంది దృశ్యా! ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు.

నిద్రపోయింది...మర్నాడు దృశ్యనాన్న వచ్చేడు..అల్లుడిని పలకరించడానికి....టిఫిన్లు అయ్యాక అన్నాడు మౌర్య-దృశ్యని నాతోపాటు తీసుకు వెళ్తాను అని..

రెండేళ్లుగా ఈ మాట చెవున పడగానే భార్య దగ్గరకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు లక్ష్మయ్య,చాలా సంతోషపడ్డాడు...

ముందుగా ఊళ్ళో డాక్టర్ గారి దగ్గరకు తీసుకువెళ్ళేడు...ఈ వయసులో పెళ్లి ఎవరు చేసుకుంటున్నారు....పైగా పెళ్లి తరువాతి జీవితం మీకు తెలియకుండా ఉంటుందా మౌర్య?అమ్మాయి ఆశలు సినిమాల వరకేనా?లేదా మనింటి ఆడపిల్ల అయితేనేనా?పరాయింటిపిల్లకి భర్తతో ఉండాలనే ఆశ ఉండదా?పైగా ఆమెకు అమ్మ లేదంటున్నారు...ఇంకెవరితో ఓ వయస్సు అమ్మాయి తన బాధని చెప్పుకుంటుంది....ఈ రోజుల్లో కూడా మీ భార్యకు ఫోన్ కొనివ్వలేదు ...మిమ్మల్ని ఏమనాలి..సిటీ లైఫ్,ఎంజాయ్మెంట్ గురించి మాట్లాడను...దూరంగా ఉన్న మన మనిషితో,మనసువిప్పి మాట్లాడకపోతే ...ఆమె ఏమైపోవాలి? ఇదే కష్టం మీ చెల్లికి వస్తే ...ఎం చేస్తారో మీరే ఆలోచించండి...

బ్రతుకుతెరువు,పైకి రావడం అవసరమే...కానీ అంతే అవసరం మన కుటుంబాన్ని కాపాడుకోవడం కూడా....ఇది లేకుండా సంపాదించి,ఎవరికి పెడతారు మౌర్యా?చదువుకున్నారుగా ఆలోచించండి....మందులు ఇవ్వగలను కానీ,మీ స్పర్శ,మాట పని చేసినంతగా ఏ మెడిసిన్ పని చేయదని రాసిస్తాను...

ఉద్యగానికి వెళ్లి వచ్చిన మీకు,భార్య చల్లటి నీళ్లు అందిస్తే చాలు అంటారుగా...మరి రోజూ మీ అదే చల్లటి మాట మీ భార్యకి అవసరం లేదా?ఇపుడు మీ భార్యగా రాలేదు దృశ్య ఇక్కడికి...మనిషిగా అంతే!ఇంకొన్ని రోజులు ఆలస్యమయి ఉంటే...పిచ్చిది అయిపోయేది...మీతో ఉండకపోతే ఆమె మీకు దక్కదు....మీ సంపాదన ఎవరికోసం?ఆలోచించుకోండి...

కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి మౌర్యకి...రేపే నా భార్యని తీసుకు ఊరు వెళ్తాను ...నమస్తే .దృశ్యని తీసుకు ఇంట్లోకి వస్తూనే

అమ్మ!రేపే ప్రయాణం...నేను ఈసారి దృశ్యని నాతో తీసుకు వెళ్తాను...బట్టలు సర్దుతున్నాడు

ఇక్కడ మేము ఏమైపోవాలిరా?ఈ వయసులో...పైగా ఖర్చులు ,సంపాదన తక్కువ...సుమతి అడిగింది

పొలం చూసుకుంటూ ఇక్కడే ఉండిపోతాను...అంతేకానీ దృశ్యని ఒక్కదాన్నే వదిలేది లేదు ఎక్కడా?

సరే!పదిరోజులు అన్నావుగా ...అప్పటివరకూ ఉండి వెళ్ళండి అంది..

నేను వెళ్ళితీరాలీ అని నువ్వు అంటే,ఒక్క రోజు కూడా ఉండను...సాయంత్రమే ప్రయాణం...

వెళ్ళనివ్వు!ఇపుడే జీవితంలోకి అడుగుపెట్టారు...నడవనివ్వు...పడిపోనివ్వు...అన్నీ నేర్చుకుంటారు...ఎన్నాళ్ళు పట్టుకుని ఉంటావు?అడిగేడు భర్త..

నా కొడుకుని కొంగున కట్టేస్తుంది ఇక...మనసులో బాధ మొదలైంది సుమతికి..

నా దృశ్య నాతోనే ఉండబోతుంది...ఇదివరకటిలా మార్చుకుంటాను...మౌర్య జీవితం మలుపు తీసుకుంది...శుభమ్ జరగాలని ఆశిద్దాం...



Rate this content
Log in

Similar telugu story from Drama