Kanchu Chennakesavulu

Classics Inspirational Others

4.5  

Kanchu Chennakesavulu

Classics Inspirational Others

father's love

father's love

3 mins
357


Naanna అంటే అర్దం  

 N- నీ కోసం 

 A- ఆరాటపడుతు 

 A- అతిగా ఆలోచించి 

 N- నిరంతరం కష్టపడి 

 N- నిద్రపొలేని 

 A- అంకిత భావం కలవాడు 

                 నాన్న......... 

          

         మా నాన్న ఎప్పుడు నా గురించే ఆలోచిస్తూ ఉంటారు. అడక్కుండా అన్నం అయిన పెట్టరు అంటారు కదా కాని నేను అడిగే అవసరం లేకుండా నా సంతోషం కోసం ఏదైనా చేసేంత ప్రేమ ఉన్న మనిషి మా నాన్న. బాధలో ఓదార్పు నాన్న, బందo లో బాధ్యత నాన్న, ఉనికికి కారణం నాన్న, జవితానికి అర్దం నాన్న.......... నవ్వుంటే చాలు నాకు ఏ బాధ ఉండదు నాన్న 

      

               మదిలో ఎంత దిగులు ఉన్న నవ్వుతూ నన్ను పెంచావు నాన్న. కరిగే మైనం నువ్వు అవుతున్న నిశిలో వెలుగై నడపావు నాన్న. నువ్వు లేని నేను లేను. నువ్వు నేను వేరుకాము నాలో నేను నువ్వే నాన్న 


              నా అడుగు సరిగ్గా పడని క్షణం మా నాన్న మొహం లో సంతోషాన్ని కొనలేదు ఏ ధనం.దైర్యంగా నేను సమస్యల్ని ఎదుర్కున్న ఆ క్షణం తెలిసింది నాకొచ్చింది మా నాన్న గుండె బలం అని. నాన్న నిన్ను వర్నించడానికి సరిపోదు ఈ యుగం. నీ ప్రేమలో ప్రతి క్షణం నాకో వరం . 


                  నాన్న ఎందుకో వెనుక  పడ్డాడు. అమ్మ తొమ్మిది నెలలు మోస్తే నాన్న పాతికేళ్లు మోస్తాడు . రెండు సమానమే అయిన నాన్న ఎందుకో వెనుక పడ్డాడు. ఫోన్లలో అమ్మ పేరే, దెబ్బ తలిగినా అమ్మ అని పిలవడం , అవసరం వచ్చినప్పుడు తప్పా మిగతా అప్పుడు గుర్తించారు ఎందుకు ...... నాన్న అని... అయిన సరే నాన్న ఎప్పుడైనా బాధపడ్డరా? ఇద్దరి ప్రేమ సమానం అయిన పిల్లల ప్రేమలో తరతరాలుగా నాన్న ఎందుకో వెనుక పడ్డాడు . కూటికి పేదవాడు కావచ్చు కానీ .........ప్రేమలో తండ్రి కి మించిన మహారాజు ఎవ్వరూ ఉండరు. 


          " ఒక తండ్రీ తన కూతురునీ ఇలా అడిగాడు ? నువ్వు ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తావ్ నన్న నా నీ భర్త నా అని . దానికి ఆ కూతురు ఇలా చెప్పింది. ఏమో నేను సరిగ్గా చెప్పలేను కాని ......., నిన్ను చూసినప్పుడు మత్రం నా భర్తను మార్చిపోతాను . కానీ...... నా భర్తను చూసినప్పుడు మాత్రం నువ్వే గుర్తుకువస్తావ్ నాన్న. " 


    ************* 


నాన్న ...... కన్నీటి చుక్కల్లో నేను తడిసిపోయాను. నీ ప్రేమ ఇక లేదు. నీ రూపం కనిపించదు.సప్త స్వరాల నీ స్వరం వినిపించదు. చుక్కల పందిరిలో ఏ దిక్కున నువ్వు ఉన్నవో అని బిక్కు బిక్కు నా చూస్తున్నాను. నాన్న ఎందుకు నన్ను వదిలి వెళ్లిపోయారు. నీలా నన్ను ఎవ్వరూ అర్ధం చేసుకోలేరు, నీలా నన్ను ఎవ్వరూ ప్రేమించలేరు, బరించలేరు అని నీకు తెలియదా ? నాన్న నా కోసం మళ్ళీ ఒకసారి రావా ... మా ఆనందాలకు ప్రతి రూపం నువ్వు . నువ్వు వెళ్ళినా నీ జ్ఞాపకాలు మాత్రం చెదిరి పోవు. నువ్వు లెని ఈ ఒంటరి తనం చాలా బరువుగా ఉంది మోయలేక పోతున్న తిరిగి వచ్చేయి నాన్న....... 


        *********************** 


ఓ తండ్రి డైరీ లో చివరి పేజీ........ 


   చిన్నా..........  

 

      అలసిపోయాను, నిరశపడిపోయను, ముసలివాడిని దయచేసి నన్ను అర్ధం చేసుకో ! బట్టలు వేసుకోవటం కష్టం. తువ్వలా ఎదో చుట్టబెట్టుకుంటాను . గట్టిగా కట్టుకోలేను. అందుకే తొలగిపోతుఉంది , కసురుకొకు, అన్నం తింటున్నప్పుడు చప్పుడువస్తుంది, చప్పుడూ కాకుండా తినలేను అసహ్యించుకోకు నీ చిన్నతనం లో నువ్వు కూడా ఇంతే, గుర్తు తెచ్చుకోరా , బట్టలు సరిగ్గా వేసుకొనేవాడివి కాదు అన్నం కుడా అంతే పెద్దగా శబ్దం చేస్తు తినేవాడివి . ఒకే విషయాన్ని పదే పదే చెబుతూ ఉంటాను వీసక్కోకు స్నానం చేయటానికి ఓపిక ఉండదు చెయ్య లేదని తిట్టకు నువ్వు కూడా చిన్నప్పుడు స్నానం చేయమంటే ఎంత ఏడ్పించే వాడవో గుర్తుందా ? తినాలని లేనప్పుడు విసుక్కోకూ. కీళ్ళ నొప్పులు నడవలేను ఉతకర్ర నాతోనే ఉండాలి లేనప్పుడు నీ చెయ్యి అందించి నడిపించు నీకు నడక వచ్చేవరకు నేను అలాగే నిన్ను వేలు పట్టుకుని నడిపించాను అందుకేనేమో ముసలి వాళ్ళు పసి పిల్లలతో సమానం అంటారఅనుకుంటా ! ఏదో ఒక రోజు నాకు బతకాలని లేదు చనిపోవాలని ఉంది అంటాను అప్పుడు కోపం తెచ్చుకొ్కు . అర్దం చేసుకో ఈ వయసులో బతకాలని ఉండదు కానీ బతకక తప్పదు. ముసలి కంపు కొడుతున్న అని అసహ్యంగా చూడకు దగ్గరగా తీసుకొని కూర్చో, నీ చిన్నప్పుడు నువ్వు ఏలా ఉన్నా నేను అలానే దగ్గరగా తీసుకొనేవాడిని . నువ్వు అలా తీసుకుంటే నేను దైర్యంగా , అందంగా, హాయిగా నవ్వుతూ చనిపోతాను . 

      

     పేరెంట్స అర్ ఎవ్రీథింగ్ ..... 


     మనం అమ్మ నీ ఎంత ప్రేమిస్తాం. తండ్రి నీ కూడ అంతే ప్రేమించాలి ప్రతి ఒక్కరూ మా నాన్న అలాంటివాడు ఇలాంటివాడు అంటారు తండ్రి ఎలాంటివాడు అయిన తను మనకి జన్మ నీ ఇచ్చాడు కాబట్టి తల్లి నీ ఎంత ప్రేమిస్తామో తండ్రీ నీ కూడ అంతే ప్రేమించాలి తను ఏలా ఉన్నా మన ప్రేమతో తనలో మార్పును తేవాలి తప్ప దూరం పెట్టకూడదు . తండ్రి నీ మించిన దేవుడు లేడు ఈ లోకంలో , ఉన్నంత కాలం మీ తల్లి తండ్రి నీ ప్రేమ గా చూసుకోండి .  

  

 ********************* 

               *The end* 


Rate this content
Log in

More telugu story from Kanchu Chennakesavulu

Similar telugu story from Classics