Varun Ravalakollu

Drama Romance

4.8  

Varun Ravalakollu

Drama Romance

డేంజరస్ లైఫ్-6

డేంజరస్ లైఫ్-6

3 mins
477


అంతే.. ఆ ఇన్సిడెంట్ తో నాకు విన్నికి మధ్య ఓ అగాధమే ఏర్పడింది. కానీ విన్నీ ఈ మేటర్ ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. కొన్ని నెలలు గడిచాక విన్నీ కాల్ చేసింది. నన్ను కలవాలని అంది. ఒక నిమిషం తెలీని ఆనందం. పరుగున వెళ్ళాను.


" థాంక్స్ విన్నీ.... నిజం ఇంట్లో వాళ్లకు చెప్పనందుకు "


" ఆల్రెడీ అమ్మానాన్నని పోగొట్టుకుంది. నిజం చెప్పి తనకి మీ అమ్మానాన్నని కూడా దూరం చెయ్యడం నాకు ఇష్టం లేదు "


" విన్నీ.. నేను దుర్మార్గుడినే.. కానీ మామయ్యని చంపేంత కాదు ".


" నాకు తెలుసు. షరీఫ్ చెప్పాడు. నువ్వు తనని టార్గెట్ చేస్తే అనుకోకుండా నాన్న అక్కడికి వచ్చాడు అని. సో ఇప్పుడు నేను నీకు సర్టిఫికెట్ ఇవ్వాళా ? షరీఫ్ది మాత్రం ప్రాణం కాదా ? తనకి ఫ్యామిలీ లేదా ? "


"షరీఫ్ కూడా మా గ్యాంగ్లో 12 మందిని చంపాడు. వాళ్ళవి ప్రాణాలు కాదా ? వాళ్ళకి ఫ్యామిలీ లేదా ? "


" వాళ్ళు తప్పు చేసారు. "


" ఎంతో మంది పోలీసులు మా గ్యాంగ్ దగ్గర లంచాలు తీసుకుని తప్పు చేసారు "


" ఎవరో తప్పు చేస్తే మంచి వాళ్ళని చంపుతావా ? "


అంతే ఇక నా దగ్గర ఆన్సర్ లేదు. " అయినా ఇప్పుడు ఈ డిస్కషన్ ఎందుకు విన్నీ... నేను ఎంచుకున్న దారి తప్పు అవ్వచ్చు. బట్ నీ మీద ప్రేమ, అత్తయ్య,మామయ్య మీద గౌరవం నాకు ఎప్పుడు ఉన్నాయ్ విన్నీ.."


" నిజంగా ఇంకా నా మీద ప్రేమ ఉందా ? "


" నిజం విన్నీ...ఎలా ప్రూవ్ చేయమంటావ్ ? "


"అయితే ఈ క్షణం ఇవన్నీ వదిలేసి రా..."


" వస్తా విన్నీ... నీ కోసం ఏదైనా చేస్తా "


విన్నీ లాగా నన్ను ఇంకెవ్వరు ప్రేమించలేరు అనిపించింది. తన సొంత తండ్రిని చంపినా వాళ్ళ మీద ఎవరికైనా చంపెయ్యాలి అన్నంత కోపం ఉంటుంది. కానీ విన్నీ.. నేను ఎందుకు అలా చేసానో ఆలోచించింది. నేనేంటో తెలుసు కాబట్టి నాకు పట్టిన ఈ 'అధికార దాహం' అనే దెయ్యాన్ని విడిపిస్తే చాలు అనుకుంది.


అందుకే తన మాటకి విలువ ఇచ్చి అన్ని వదిలేసి మాములు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ లో జాయిన్ అయ్యా. కానీ అదే సిటీలో ఉండడంతో నా గ్యాంగ్ వాళ్ళు నన్ను ఏదో విధంగా కలిసే వాళ్ళు. రమ్మని ఫోర్స్ చేసే వాళ్ళు, సెటిల్మెంట్స్ గురించి మాట్లాడేవాళ్ళు. ఓ పక్క నేను జాయిన్ అయినా కంపెనీలో నాకు గౌరవం ఉండేది కాదు. బీటెక్ తర్వాత ఇంత గ్యాప్ తీసుకుని జాయిన్ అయ్యా. సంపాదన లేదు, గౌరవం లేదు. బాస్లు నా మీద అర్చినప్పుడు రక్తం మరిగేది. అదే అక్కడ అయితే నా కిందే అంత మంది పని చేసేవారు. నేనంటేనే భయపడేవారు. కోట్లలో డీల్ సెట్ చేసినవాడ్ని. ఇలా PPT లు చేసుకోడం ఏంటో అనిపించింది.


నెమ్మదిగా విన్నీ అప్పుడప్పుడు నాతో మాట్లాడేది. నా పరిస్థితి విన్నీకి అర్థం అయ్యింది. ఇక్కడే ఉంటే నేను డైవర్ట్ అవుతానేమో అని దూరంగా వెళ్ళిపోదాం అని ముంబై కి టికెట్స్ బుక్ చేసింది..


సరిగ్గా ఆరోజు నైట్ 8 కి ఫ్లైట్ అనగా 5 కి మా గ్యాంగ్లో శివ ఫోన్ చేసాడు. 'అన్న ఆపోజిట్ గ్యాంగ్ వాళ్ళు ఎటాక్ చేసారు. మనోళ్లంతా చచ్చిపోతున్నారు. రా అన్న' అని.


' కుదరదు రా ' అన్న.


" ప్లీజ్ అన్న " అని వాడు బతిమాలుతూ ఉండగానే బులెట్ చప్పుడు. ఫోన్లో వాడి వాయిస్ ఆగిపోయింది. వాళ్లంతా నన్నే భరోసాగా నమ్ముకుని బతికే వాళ్ళు. వాళ్ళను అలా వదిలేసి వెళ్ళలేకపోయాను.


అంతే ఇమ్మీడియేట్ గా స్పాట్ కి వెళ్లాను.


అక్కడ అప్పటికే మా వాళ్ళు చాలా మంది పోయారు. నేను ఎటాక్ స్టార్ట్ చేసి చెదరగొట్టాక ఆపోజిట్ గ్యాంగ్ వాళ్ళు వెళ్లిపోయారు. శివ, మిగిలిన వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేశాను.


ఈ గ్యాంగ్స్, గొడవలు ఒక ఊబి లాంటివి. ఇందులో దిగ కూడదు. ఓసారి దిగితే బయటకు రావడం చాలా కష్టం. అయినా వాళ్ళని దూరం చేసుకుని ఏదో తెలియని దాని కోసం పాకులాడుతూ ఉంటాం.


ఈ గొడవలో టైమే తెలీలేదు.


టైం చూస్తే 8:30. ఫోన్ చూస్తే విన్నీవి 10 మిస్డ్ కాల్స్. అంతలో మళ్ళీ ఫోన్ మోగింది.


** కాల్ ఫర్మ్ విన్నీ**



Rate this content
Log in

Similar telugu story from Drama