Varun Ravalakollu

Drama Romance

4.8  

Varun Ravalakollu

Drama Romance

డేంజరస్ లైఫ్-5

డేంజరస్ లైఫ్-5

2 mins
491


షరీఫ్ ఖాన్, స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్, నీతికి కట్టుబడ్డ అతి కొద్దీ మంది ఆఫీసర్స్లో ఆయన ఒకడు. ఈ మధ్యే ట్రాన్స్ఫర్ మీద మా సిటీకి వచ్చాడు. ఇలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఖాళీగా ఉండరు కదా.. ఏదోటి చేస్తారు. అలా.. ఇతను సిటీలో ఉన్న గ్యాంగ్స్ లిస్ట్ అంత బయటకు తీసాడు. నాది టాప్ గ్యాంగ్ కనుక లిస్ట్ లో ఫస్ట్ ఉంది. మమ్మల్ని టార్గెట్ చెయ్యడం స్టార్ట్ చేసాడు. ఆకు నుండి మొదలు పెట్టి, కొమ్మల దాకా... అటు పై ఏకంగా వీరు లాంటి నా దాకా వచ్చాడు.


తట్టుకోలేక పోయాను. నేను ఎంతో కష్టపడి నిర్మించుకున్న కోట ఇది. దాన్ని ఎవడో కొల్లగొడ్తా అంటే ఎలా ఒప్పుకుంటా...? అక్కడికి వాడికి లంచం ఇవ్వడం , బెదిరించడం కూడా ట్రై చేసాం . స్ట్రిక్ట్ ఆఫీసర్ కదా .. లొంగలేదు...అంతే ఎలాగైనా వేసెయ్యాలని ఫిక్స్ అయ్యా..


వాడికి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి సిటీ ఔట్సైడ్ ఐసోలేటెడ్ ఏరియాకి పిలిపించాం. కానీ వాడు గ్రూప్ తో వచ్చాడు. ఒకడ్ని చంపితే పొయ్యేది ఇప్పుడు 5,6 మందిని చంపాల్సి వచ్చింది.

షరీఫ్ అంత ఈజీ కాదు. అల్లాడిచాడు మమ్మల్ని. తన వాళ్లంతా పోయిన ఒంటరిగా గంట సేపు పోరాడాడు.


మా వాళ్ళని ఒక 12 మందిని ఏసేసాడు. ఇక వీడ్ని వదలకూడదని నేనే రంగంలోకి దిగాను. తన వైపు aim చేసి, చుట్టూ చూసి గోడ వెనక నుండి వచ్చి తనని కాల్చాను.


అంతే నా బ్రెయిన్ మొద్దుబారి పోయింది. ఎక్కడి నుండి వచ్చాడో, సడన్ గా మా మామయ్య అక్కడికి వచ్చాడు, షరీఫ్ని కాపాడబోయి బులెట్ తగిలి తను చనిపోయాడు. షరీఫ్ తన శవాన్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు కన్నీళ్లతో ' నిన్ను వదలను రా ' అని వార్నింగ్ ఇస్తూ...


అంటే నా కేస్ డీల్ చేసిన టీంలో మా మామయ్య కూడా ఉన్నాడు. మరి తనకి నేను అని తెలుసా ? తెలీదా ? తనని కాల్చింది నేనే అని తనకి తెలుసా లేదా ? ఆలోచనలు వస్తున్నాయి కానీ వాటికీ ఆన్సర్స్ తెలీవు. నా బ్రెయిన్ పని చెయ్యలేదు. చిన్నప్పటినుండి ఎత్తుకు పెంచిన మామయ్యని నా చేత్తో చంపాను.


ఈ విషయం విన్నీకి తెలిస్తే ఏమైనా ఉందా !!! ఆ ఆలోచనే తట్టుకోలేకపోయాను.


ఎందుకో వెంటనే విన్నీ ని కలవాలనిపించింది. అర్జంట్ గా బయటకు రమ్మన్నా. వచ్చింది. ఏమో ఆ రోజు విన్నీ చాలా హ్యాపీగా ఉన్నింది. రొమాంటిక్ మూడ్ లో కూడా. నన్ను హాగ్ చేసుకుంది. లైఫ్ లో ఫస్ట్ టైం we both kissed. కానీ నాకు ఏం అనిపించలేదు. I was just numb. భయమో, బాధో, పశ్చాతాపమో, guilt ఓ నాకేం తెలీలేదు. ఒక మెషిన్లా అక్కడున్న అంతే.


అంతలో విన్నీ ఫోన్ మోగింది. విన్నీ నన్ను వదిలి కుప్ప కూలిపోయింది.


' బావ...నాన్న !!! ' అని భోరున ఏడ్చింది.


తనని తీసుకుని ఇంటికెల్లా. మామయ్య శవం. చుట్టూ ఏడుస్తూ మా ఫ్యామిలీ. విన్నీ కూడా. నేను మాత్రం జీవశవంలా అలా ఉన్న అంతే. ఇక అక్కడ ఉండలేక వెళ్ళిపోయాను.


2 డేస్ తర్వాత కాల్ చేసింది విన్నీ. ఇంటికి రా బావ.. ' నాకంత శూన్యంలా ఉంది. నువ్వుంటే ధైర్యంగా ఉంటుంది ' అంటూ. తప్పక వెళ్ళాను.


వెళ్లి విన్నీతో మాట్లాడుతుంటే అక్కడికి అనుకోకుండా షరీఫ్ వచ్చాడు ఏవో ఫార్మాలిటీస్ కోసం. నన్ను చూసాడు. ఇంకేముంది,...భూకంపం ...!! అదృష్టం కొద్దీ ఆ టైంలో ఇంట్లో ఎవరు లేరు విన్నీ తప్పా.


విన్నీకి మొత్తం చెప్పాడు. విన్నీ ఒక్క నిమిషం నమ్మలేదు. నిజమా అన్నట్టు నా వైపు చూసింది. నేను అవును అనగానే తనకి తలకిందులైంది.


' మనిషివేనా నువ్వు ? మా నాన్నని చంపి నన్ను..' అని.....ఏడవడం స్టార్ట్ చేసింది.


' ఎందుకిలా మృగంలా తయారయ్యావ్ ? మృగాలే మేలు, తండ్రిని చంపి బిడ్డల్ని ముద్దాడవు. నిన్ను తిట్టాలంటే మాటలు కూడా రావట్లేదు. ఇలా..అయిన వాళ్ళని చంపుతూ నువ్వు కలకాలం బతికే బతుకు ఓ బతుకేనా !! ఛీ... పో ఇక్కడి నుండి ' అంది.


ఎందుకో అనుకోకుండా అలవాటులో తనని వెన్నెల భానుప్రకాష్ అని పిలిచా..

' వెన్నెల పార్థసారథి. ఆ పార్థసారథినే లేకుండా చేసావ్ ' అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయింది.



Rate this content
Log in

Similar telugu story from Drama