Varun Ravalakollu

Drama Romance

4.8  

Varun Ravalakollu

Drama Romance

డేంజరస్ లైఫ్-4

డేంజరస్ లైఫ్-4

2 mins
705


దీర్ఘాయువు ఉండే నా లాంటివాడు మిగిలిన వాళ్ళకన్నా భిన్నంగా బతకాలి. అది ఎలా ?

కేవలం అధికారంతోనే అది సాధ్యం అవుతుంది.


అవును !! నేను పెద్ద పోసిషన్ కి వెళ్ళాలి. ఎలాగో నేను ఎక్కువ కాలం బతుకుతాను. ఆ బతుకేదో ఈసురో మంటూ బతికే బదులు, I will live like a king..


ఈ డెసిషన్ తీసుకున్నాక అందుకు మార్గాలు వెతికాను.. సక్రమమార్గంలో నేను అనుకుంది సాధించలేను.. అలా సాధించాలన్న టైం పడుతుంది. దొరికింది అక్రమ మార్గమే...


నాకు తెలిసిన స్కూల్ ఫ్రెండ్ ఒకడు smuggling చేస్తుంటాడని విన్న. ఎలాగో కష్టపడి వాడ్ని కలిసాను. నేను ఆ ఫీల్డ్లో ఎంటర్ అవుతా అని చెప్పా. '' అరేయ్ ! నాకంటే చదువు అబ్బలేదు.. నీకేంట్రా బానే చదువుకున్నావ్ గా '' అన్నాడు.


ఏమో రా నాకు అందరిలా ఇష్టం లేదు అన్న.


నా లైఫ్ సీక్రెట్ ఎవరికీ చెప్పదల్చుకోలేదు. దాన్ని జనాలు ఇంకోలా అడ్వాంటేజ్ తీసుకుంటారని నా భయం.. ఎలాగోలా, వాడితో పాటు ధను గ్యాంగ్లో చేరాను. ఆ గ్యాంగ్లో అవకాశాలు బాగుంటాయి అంటా.. స్టార్టింగ్లోనే ఆ గ్యాంగ్లో చేరడం అదృష్టం అంటా.


ఒక నార్మల్ కాలేజ్లో B.Tech చేసినవాడికి గూగుల్లో ప్లేసెమెంట్ వచ్చినట్లు.. ధన గ్యాంగ్లో నేను జాయిన్ అయ్యా.. ఫస్ట్ టైం గన్ పట్టుకున్న. ఏదో కొత్త ఫీలింగ్. నా చేతిలోకి పవర్ వచ్చినట్లు అనిపించింది.


కానీ నా లైఫ్ సీక్రెట్ని ఎవరో ఒకరితో షేర్ చేసుకోవాలి అనిపించింది.. నాకు ఇంకెవరు ఉన్నారు...విన్నీ తప్ప..


' ఏంటి , నువ్వు అనుకుంటే తప్ప నీకు చావు రాదా ? తపస్సు చెయ్యకుండానే గొప్ప వరం పొందావు !!! ' అనింది..


'' అవును ..హిరణ్యకశపునిలా '' అన్నాను.


వెంటనే విన్నీ మొహం ముడ్చుకుంది.. ' జాగ్రత్త బావ ' అంది.


' భయపడకు . ప్రహ్లాదుడు పుట్టాలంటే ముందు మనకి పెళ్లి అవ్వాలి ' అన్నాను..


తను సిగ్గు పడింది. ఈ మేటర్ ఎవరికీ చెప్పొద్దు అని తన దగ్గర ప్రామిస్ తీసుకున్న.


తనకి నా మాఫియా మేటర్ చెప్పలేదు. చెప్తే చంపేస్తుంది. నేనేం చేసిన ఊర్కోడానికి తను ' నేనే రాజు నేనే మంత్రి ' లో కాజల్ టైపు కాదు. శత్రువులో విజయ శాంతి టైపు పైగా జర్నలిస్ట్ కూడా.. లవ్ కన్నా నీతి న్యాయం ఏ ముఖ్యం అంటుంది. తనకి మేటర్ తెలిస్తే డైరెక్ట్గా పోయి వాళ్ళ నాన్నకు చెప్తుంది..


నాకున్న వరం వల్ల అతి కొద్దీ రోజుల్లోనే మాఫియాలో ఎదిగాను. విచ్చలవిడిగా ఎటాక్ చేసేవాడ్ని. నా మీద కౌంటర్ ఎటాక్ జరిగిన బతికిపోయే వాడ్ని. అందరూ నన్ను లక్కీ అనుకునేవాళ్లు.


మా గ్యాంగ్కి పొలిటికల్ లీడర్స్ తో కూడా సంబంధాలు ఉండడంతో I became prominent in society. కుప్పలు కుప్పలుగా డబ్బు, పలుకుబడి, అధికారం ఇదే నేను కోరుకుంది. అవి నా సొంతం అయ్యాయి. ఇప్పుడు నేనే మా గ్యాంగ్లీడర్ని.


నా కింద ఓ వంద మంది పని చేస్తారు. ఈ ప్రాసెస్లో ఎన్ని క్రైమ్స్ చేసానో ఎంత మందిని చంపానో లెక్కే లేదు.


ఇది నా కథ... ఒకప్పటి ఇప్పటికి నేను ఎంతో మారిపోయాను. మారనిదల్లా విన్నీ మీద ప్రేమ ఒక్కటే.. తనకి నేను చేసే పనులు తెలీకుండా దాచడం చాలాకష్టం అయ్యేది. తను ఫోన్ చేసి అర్జంట్ అంటే గాయాలను దాచుకుని మరి హాస్పిటల్ బెడ్ మీద నుండి లేచి వెళ్లే వాడ్ని....


ఏరోజైనా విన్నెల భానుప్రకాష్ అవుతుంది తను. తనకి అలా పిలిస్తే చాలా ఇష్టం. ఎప్పుడైనా తన కోపం తగ్గాలంటే, నేను అలా పిలుస్తా. దెబ్బకి కూల్ అయిపోతుంది.


ప్రతి లైఫ్లో ఓ ట్విస్ట్ ఉన్నట్లు నా లైఫ్లో కూడా ఉంది. అదే మా మామ చావు...



Rate this content
Log in

Similar telugu story from Drama