Gayatri Tokachichu

Inspirational

4  

Gayatri Tokachichu

Inspirational

డా. విక్రమ్ సారాభాయ్

డా. విక్రమ్ సారాభాయ్

3 mins
22


డా॥ విక్రమ్ సారాభాయ్.


    టీచర్ :పిల్లలూ! ఈరోజు అందరూ సెల్ ఫోన్లు ఉపయోగిస్తున్నారు కదా! దానికి కారణం ఆకాశములోకి మనం పంపిన సాటిలైట్లు నిరంతరం పనిచేస్తూ ఉండటమే.  

   పిల్లలు : సాటిలైట్లు ఆకాశంలోకి ఎవరు ఎలా పంపిస్తారు టీచర్!

    టీచర్ : మన భారత స్పేస్ సెంటర్ సాటిలైట్లని అంతరిక్షంలోకి పంపిస్తుంది. మనదేశంలో ఈ స్పేస్ సెంటర్ ను స్థాపించి, మనం సెల్ ఫోన్లు, టి. వి. లు ఉపయోగించుటకు మూలకారకుడైన డాక్టర్ విక్రం సారాభాయ్ గురించి ఈరోజు చెప్పుకుందాము. శ్రద్ధగా వినండి!

   పిల్లలు : అలాగే టీచర్!

   టీచర్: విక్రం సారాభాయ్ 1919 ఆగస్టు 12 న గుజరాతులోని అహ్మదాబాద్ లో ఒక సంపన్న పారిశ్రామిక కుటుంబంలో జన్మించారు. తల్లి పేరు సరళాదేవి. తండ్రి పేరు అంబాలాల్ సారాభాయ్. అతని కుమారుడైన విక్రం సారాభాయ్ తన తండ్రి స్థాపించిన సారాభాయ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు, భారతీయ స్పేస్ ప్రోగ్రాం నిర్మించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. అందుకే ఆయన 'ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ స్పేస్ ప్రోగ్రాం' అయ్యారు. 

   పిల్లలు: అలాగా! ఆయన ఏం చదివారు మేడమ్? 

   టీచర్: అహ్మదాబాద్ లో డిగ్రీ పూర్తి చేసిన తరువాత విక్రం సారాభాయ్ ఇంగ్లాండ్ లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చేరారు. 1940 లో నేచురల్ సైన్సెస్ లో ట్రైపోస్ పూర్తి చేసిన తరువాత స్వదేశానికి తిరిగి వచ్చి, నోబుల్ బహుమతి గ్రహీత అయిన డా॥ సి.వి. రామన్ పర్యవేక్షణలో బెంగళూర్ లో కాస్మిక్ రేస్ పై పరిశోధన చేసారు. 1945లో తిరిగి కేంబ్రిడ్జి వెళ్ళి 'కాస్మిక్ రే ఇన్ ట్రాపికల్ లాటిట్యూడ్స్ 'అనే అంశంపై 1947 లో డాక్టరేట్ చేసారు. 

    విక్రం సారాభాయ్ కేంబ్రిడ్జి నుండి అప్పుడే స్వాతంత్ర్యం పొందిన భారతదేశానికి తిరిగి వచ్చారు. దేశ ప్రజలు శాంతి సంతోషాలతో ఉండుటకు స్వతంత్ర మొక్కటే సరపోదు, ఆర్థికంగా, విద్యా పరంగా కూడా ఎదుగవలెనని తలచి, 1947 లో 11 నవంబర్ న అహ్మదాబాద్ లోని M. G. సైన్స్ ఇన్స్టిట్యూట్లో ఫిజికల్ రీసెర్చ్ లాబరేటరీని(PRL) స్థాపించారు. 1962 ఫిబ్రవరి 23న ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ (INCOSPAR)ని స్థాపించారు. దీనిని తర్వాత ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ISRO) గా పేరు మార్చారు.

    పిల్లలు: టీచర్! స్పేస్ రీసెర్చ్ లను మాత్రమే స్థాపించారా లేక వేరే ఇండస్ట్రీస్ ఏవైనా పెట్టారా?

    టీచర్: 1947లో సారాభాయ్ తన కుటుంబ వ్యాపారంలో అహ్మదాబాద్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ రీసెర్చ్ అసోసియేషన్ ను కూడా స్థాపించారు. 1962లో అహ్మదాబాద్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM)ని స్థాపించారు. 1966 లో సైన్స్ చదువును ప్రోత్సహించుటకు అహమ్మదాబాద్ లో కమ్యూనిటీ సైన్స్ సెంటర్ ను స్థాపించారు. తరువాత దాని పేరును విక్రం సారాభాయ్ కమ్యూనిటీ సెంటర్ గా మార్చారు. 1949లో ఆయన భార్య మృణాళిని సారాభాయ్ తో కలిసి దర్శన్ అకాడమీ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ను అహ్మదాబాద్ లో స్థాపించారు. తర్వాత దానిని ఆయన కుమార్తె మల్లికా సారాభాయ్ నడిపించారు.

   1966లో తన స్నేహితుడైన హోమీ బాబా మరణానంతరం విక్రం సారాభాయ్ భారత అటామిక్ ఎనర్జీ కమిషన్ కు చైర్మన్ గా నియమితులయ్యారు.

కేరళలో తుంబ ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశారు. స్వదేశీ అణు సాంకేతికతను అభివృద్ధి చేశారు. 1967లో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL)జాదూగూడ బీహార్ లో స్థాపించబడింది.విక్రం సారాభాయ్ ఆధ్వర్యంలో 1967లో ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ECIL) హైదరాబాదులో స్థాపించబడింది.

    రాకెట్ మ్యాన్ గా ప్రసిద్ధి గాంచిన అబ్దుల్ కలాం విక్రం సారాభాయ్ ని గురువుగా భావించేవారు. ఆయనను సైన్టిస్టులను సృష్టించే సృష్టికర్త అని అబ్దుల్ కలాం కొనియాడారు. 

   పిల్లలు: భారత దేశములో మొదటి ఉపగ్రహాన్ని ఎవరు తయారుచేసారు టీచర్?

   టీచర్: విక్రం సారాభాయ్ భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహమైన 'ఆర్యభట్ట'ను తయారుచేయించి, ప్రయోగించడానికి ప్రయత్నించాడు. కానీ ఆ ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి నాలుగు సంవత్సరాల ముందు డిసెంబర్ 30 న 1971లో ఆయన తన 52 సంవత్సరాల వయస్సులో గుండెపోటు కారణంగా మరణించాడు. తరువాత ఆ ఉపగ్రహాన్ని 1975లో ప్రయోగించారు. 

   ఇండియన్ స్పేస్ సెంటర్ పేరును తరువాత ఆయన గౌరవార్థం విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC)గా మార్చారు. అతని మొదటి వర్ధంతి సందర్బంగా 30 వ తేది డిసెంబర్ 1972 న భారత పోస్టల్ డిపార్ట్మెంట్ ఆయన పేరు మీదుగా పోస్టల్ స్టాంప్ ను విడుదల చేసింది.అతని గౌరవార్థం చంద్రుని దక్షిణ ధ్రువం పైకి పంపిన భారత మూన్ మిషన్ చంద్రయాన్ - 2 మరియు చంద్రయాన్ -3 ల్యాండర్లకు 'విక్రమ్ 'అని పేరు పెట్టారు.


అవార్డులు :

విక్రం సారాభాయ్, శాంతి స్వరూప్ అవార్డు ను 1962 లో అందుకున్నారు. 

పద్మభూషణ్ అవార్డును 1966 లో భారత ప్రభుత్వం అందచేసింది.

ఆయన మరణానంతరం పద్మ విభూషణ్ అవార్డును 1972లో భారత ప్రభుత్వం అందజేసింది.


టీచర్ : చూశారా! పిల్లలూ! ఈరోజు సాటిలైట్స్ స్పేస్ ప్రోగ్రామ్స్ లో భారతదేశం ప్రపంచం గర్వించదగ్గ స్థానంలో ఉందంటే దానికి మూల కారణం డాక్టర్ విక్రం సారాభాయ్ తాతగారు. వారి వలె చదువుకొని ఉన్నతమైన ఆశయాలతో మీరు కూడా దేశానికి సేవ చేయాలి!

పిల్లలు: అలాగే టీచర్!



Rate this content
Log in

Similar telugu story from Inspirational