Ameer Shaik

Romance Others

4  

Ameer Shaik

Romance Others

చూపులు కలసిన శుభ వేళ

చూపులు కలసిన శుభ వేళ

7 mins
360


    ఒరేయ్ ప్రవీణ్ ఇదిగో ఈ రోజు చూసే అమ్మాయికి కూడా ఇది లేదు, అది లేదు అని ఫోటోలోనే అమ్మాయి లకు పేర్లు పెట్టినట్టు , ఎప్పటిలానే చేశావ్ అంటే కనుక ఊరుకునేదే లేదు.

అందుకే నీకు ఫోటో కూడా చూపించ లేదు, నేను చూసా, అమ్మాయి బాగుంది. ఈ అమ్మాయి ఫిక్స్ అంతే. కాదు కూడదు అంటే కనుక ... ఇంక నీకు పిల్లను  చూడటం నా వల్ల కాదు ... 

ఈ జన్మలో నీకు పెళ్లి కూడా కాదు చెప్పుతున్నా చూడు.

అదేంటి అమ్మ అలాంటాప్ నేను ఏమైనా కావాలి అని అలా చేస్తున్ననా.... ఇప్పటి నువ్వు చూపించిన ఫోటోల్లో ఏ అమ్మాయిలో కూడా నాకు నచ్చిన ఒక్క క్వాలిటీ కనిపించనప్పుడు , నేను మాత్రం ఎలా ఓకే.చేస్తాను నువ్వే చెప్పు అంటాడు ప్రవీణ్.

క్వాలిటీస్ క్వాలిటీస్ అని కూర్చుంటే ఏదొక కోతే వస్తుంది చివరకు...జాగ్రత్త మరి అంటారు కావేరి గారు.

అమ్మ నువ్వు కూడా ఏంటమ్మా అలా అంటాప్ అని గారాలు పోతాడు తల్లి దగ్గర ప్రవీణ్.

సర్లే త్వరగా రెడి అవ్వు టైం అవ్వుతుంది .అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్లాడాని అని చెప్పి బయటికి వచేస్తారు కావేరి గారు.

ప్రవీణ్ బెడ్ మీద నుంచి లేచి రెడి అవ్వడానికి వెళ్తాడు.

కావేరి గారు బయటికి వచ్చి ఆలోచిస్తారు వాడు అన్నాడు అని కాదు గాని ఇప్పటి వరకు ఒక్క సంబంధం కూడా మంచిగా రాలేదు. ఫోటోలు చూసే వద్దు అనేసాడు .ఈ అమ్మాయి ఫొటోలో అయితే చాలా బాగుంది . నాకు తెలిసి వీడు ఓకే అనే అంటాడు వెళ్ళాక చూదాం ఎం అంటాడో అని ...

ఈ అమ్మాయి వీడికి నచ్చి అన్ని విధాలా బాగుంటే కనుక వెంటనే సంబంధం ఖాయం చేసేసుకోవడం బెస్ట్. నిన్న అల్లుడు గారు కూడా అదే అన్నారు. అలానే చెయ్యాలి అప్పుడే , నాకు వీడి పెళ్లి బెంగ తీరుతుంది అనుకుంటారు.

                  ఆవిడ ముందుగానే మధ్య వర్తితో అమ్మాయికి,అబ్బాయి . అబ్బాయి కి అమ్మాయి నచ్చితే చాలు, కట్నకానుకల ప్రసక్తి మాకు లేదు. పిల్ల బాగుంటే చాలు . వాళ్లకు కూడా అన్ని విధాలా నచ్చితే కనుక ఈ రోజే సంబంధం ఖాయం చేసుకుని తాంబులాలు మార్చుకుందాం అని చెప్పండి అని కబురు పెడతారు.

ఆయన కూడా సరే అని అదే విషయం రమేష్ గారికి చెప్పుతాడు మధ్య వర్తి .

అబ్బాయి బాగున్నాడు, జాబ్ ఉంది .మంచి ఫ్యామిలీ కావడం తో రమేష్ గారు సరే అంటారు.

ప్రవీణ్ రెడి అయ్యాక ... వాళ్ళ అక్క వాళ్ళు ఇంకా రాక పోవడం తో వాళ్ళ గురించి వెయిట్ చేసి వాళ్ళు వచ్చాక ఐదుగురు కలిసి అక్క రేఖ, బావ కళ్యాణ్ వాళ్ళ బాబు బన్నీ 6సం.. ప్రవీణ్ , & కావేరి గారు అందరూ కలిసి కార్ లో అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తారు.

అక్కడికి వెళ్ళాక అమ్మాయి తరపు బంధువులు అన్ని మర్యాదలు చేసి ,అబ్బాయి వాళ్ళను లోపలికి తీసుకువెళ్తారు.

      లోపలికి వెళ్లి కూర్చున్నాక కూల్ డ్రింక్స్ ఇస్తారు.. అందరూ తాగడం అయ్యాక పెద్దలు మాటలు మొదలు పెడతారు.. మీరు ఎవరి తాలూకా ఏంటి అని ఇలా... ఈ లోపు స్వీట్ ,హాట్స్ , ప్రూట్స్ అన్నీ తీసుకు వచ్చి వారి ఎదురుగా ఉంచుతారు.

అయ్యో ఇప్పుడు ఇవి ఏమి వద్దండి అంటారు కావేరి గారు మొహమాటం గా...

పర్వాలేదు కొద్దిగా తీసుకోండి అని అంటారు అమ్మాయి తరపు వాళ్ళు.

ఈ లోపు రేఖ లేచి అమ్మాయి ఉన్న గది లోకి వెళ్తుంది. బన్నీ ని వెంట పెట్టుకుని.

ఆ అమ్మాయి రేఖకు బాగా నచ్చుతుంది.

అమ్మాయి తో , అబ్బాయి వాళ్ళ అక్క అని చెపుతారు అక్కడి వాళ్ళు.

ఆ అమ్మాయి రేఖకు ఛైర్ చూపిస్తూ ఇలా కూర్చోండి అంటుంది.

అప్పుడు బన్నీ అంటాడు అమ్మా ఎవరు తను అని.

అన్ని కుదిరితే తను నీకు అత్త అవ్వుతాది అని అంటాది రేఖ ..

అత్త అవ్వుతాదా ఎలా అంటాడు బన్నీ. ...

ఎలా అంటే మీ మామా ని పెళ్లి చేసుకుకుని అని చెప్పి అమ్మాయి తల్లి లక్ష్మీ గారు అంటారు.

అందరూ నవ్వుతారు.

రేఖ వాళ్ళు అక్కడ నుంచి కళ్యాణ్ దగ్గరికి వచ్చికూర్చుంటారు.

రేఖ ఏవండి అమ్మాయి చాలా బాగుంది నాకు నచ్చింది అంటుంది.

నచ్చాలసింది నీకు కాదు.మీ తమ్ముడికి అంటాడు కళ్యాణ్.

ఇంతలో కావేరి గారు అమ్మాయిని పిలిపించండి అంటారు.

ప్రవీణ్ ఎలా ఉంటుందో ఏంటో ఈ అమ్మాయి అనుకుంటూ ఉంటాడు .

ఇంతలో పెద్దవాళ్ళు అమ్మాయిని తీసుకువచ్చి అబ్బాయి ఎదురుగా ఉన్న సోపా లో కూర్చోబెడతారు.

రేఖతో పాటు కళ్యాణ్, కావేరి గారికి కూడా అమ్మాయి నచ్చుతుంది. ఫోటో లో కంటే బాగుంది అనుకుంటారు అందరూ.

అమ్మాయి బాగుంది అని ప్రవీణ్ చెవిలో చిన్నగా చెప్పుతాడు కళ్యాణ్.

ప్రవీణ్ తల కిందకు వంచి ఉంటుంది . అలానే అమ్మాయి కూర్చున్న వైపు చూస్తాడు. యెల్లో కలర్ సారీ కనిపిస్తుంది. కొంచం పైకి చూస్తాడు. అమ్మాయి రెండు చేతి వేళ్ళు కలిపి ఒడిలో పెట్టుకుని కూర్చుని ఉంటుంది.

ఆమె చేతి వెళ్ళాను చూస్తూ ఉంటాడు ప్రవీణ్, పొడవుగా ఉన్న చేతి వేళ్ళు ,పెద్ద పెద్ద గోళ్లు ,నీట్ గా వేసిన నెయిల్ పాలిష్, , రెండు చేతులకు నిండు గా గాజులతో చూడటానికి చాలా అందంగా ఉన్నాయి అని అనుకుంటాడు.

ఇంతలో అమ్మాయి ని చూడు బాబు అంటారు ఒక పెద్దావిడ..

చూడు నాన్న అంటారు కావేరి గారు. సరే అని తల ఉపుతాడు ప్రవీణ్.

ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకోండి. మీ ఇద్దరికి ఒకే అయితే పెద్దవాళ్ళం మిగతా విషయాలు మాట్లాడుకుంటాం అంటారు.

ప్రవీణ్ తల ఎత్తి అమ్మాయి ని చూస్తాడు. ఒక్క నిమిషం అలా షాక్ అయిపోతాడు.

కళ్యాణ్ భుజం తట్టగా ఈ లోకం లోకి వస్తాడు. ఎందుకు అంటే తనని అమ్మాయి అని అనే కంటే దేవకన్య అంటే బాగుంటుందేమో అని అనిపిస్తుంది ప్రవీణ్ కి.

ప్రవీణ్ నేను అనుకున్న దాని కంటే ఇంకా కొన్ని క్వాలిటీస్ ఎక్కువే ఉన్నాయి గా అనుకుంటాడు.

అలా అని మన అబ్బాయి ఎం తక్కువ కాదు.

ఆరడుగుల అందగాడు, తెల్లని మేని ఛాయా.. చేతి వేళ్ళతో వెనకకు తోసిన నుదురుపై వచ్చి పడే సిల్కీ హెయిర్ , చిన్న నవ్వుతో చాలా అందంగా ఉన్నాడు.

నువ్వు కూడా అబ్బాయి ని చూడమ్మా అని వాళ్ళ నాన్నగారు అనడంతో అప్పటి వరకు కిందకు దించి ఉన్న కనురెప్పలను పైకి లేపి అబ్బాయి ని చూస్తుంది.

అప్పటికే తను ఎప్పుడు చూస్తుందా అని ఎదురు చూస్తున్న ప్రవీణ్.ఆమె పెద్ద పెద్ద నయనాలలోకి చూస్తూ ఉండిపోతాడు.

అమ్మాయి కూడా కొన్ని క్షణాల పాటు అబ్బాయి ని రేప్ప వేయ్యకుండా చూస్తోంది.

అందరూ వాళ్ళని చూసి నవ్వుకుంటారు. 

మొదటి చూపులోనే ఒకరికి ఒకరు పిచ్చగా నచ్చేస్తారు.

అమ్మాయిని ఏమైనా అడుగుతారేమో అడగండి అంటే .. నీపేరు ఏమిటమ్మా అంటుంది రేఖ.

రేఖ వైపు చూస్తూ ధరణి అండి అని చెప్పుతుంది అమ్మాయి.

నైస్ నేమ్ అంటుంది రేఖ.

ఎం బాబు మా అమ్మాయి నచ్చిందా ... అని అడుగుతారు .అమ్మాయి మేనమామ.

ఓకే అన్నట్టు ఒక నవ్వు నవ్వుతాడు ప్రవీణ్. ఇంతలో బన్నీ నాకు అత్త ఓకే సూపర్  ఉంది అంటాడు.

బన్నీ మాటలకు అందరూ పక పక నవ్వుతారు.

అత్త నచ్చవలసింది నీకు కాదురా... మీ మామకు అంటాడు కళ్యాణ్ బాబు ను ఒడిలోకి తీసుకుంటూ.

ధరణి మరి మావాడు నీకు ఓకే నా అంటుంది రేఖ.

తల ఉపుతుంది ధరణి.

అమ్మాయితో ఏమైనా మాట్లాడతావ బాబు అంటారు ధరణి తండ్రి రమేష్ గారు.

ఆ మాటతో ఓకే అన్నట్టు వెంటనే లేచి నిలబడతాడు ప్రవీణ్. ప్రవీణ్ చెయ్యి పట్టుకుని కూర్చో పెడతాడు కళ్యాణ్.

పర్వాలేదు లే బాబు ఇప్పుడు ఇవ్వన్నీ మాములు అయిపోయాయి. ఒకరికి ఒకరు నచ్చారుగా వెళ్ళనివ్వండి అంటారు ధరణి మేనమామ,

అమ్మా ధరణి ..అబ్బాయి ని నీ రూమ్ కి తీసుకువెల్లు అంటారు రమేష్ గారు.

ధరణి లేచి నిలుచుంటుంది. వెంటనే ప్రవీణ్ కూడా లేస్తాడు. సరే మీరు వెళ్ళండి అంటారు.

ధరణి ముందుకు కదులుతుంది. దరణిని అనుసరిస్తాడు ప్రవీణ్.

వాళ్ళు ఇద్దరు పైకి వెళ్ళాక.., పెద్దలు పిల్లలకు ఇష్టమే కాబట్టి , మనం మిగిలిన విషయాలు మాట్లాడు కుందాం అని , పెళ్లి మాటలు మొదలు పెడతారు.

  ధరణి. , ప్రవీణ్  గదిలోకి అయితే వెళ్లారు గాని ఎం మాట్లాడాలో తెలియక ఇద్దరిలో కూడా ఏదో తెలియని అలజడిగా ఉంటుంది.

కొద్ది సేపటికి, ప్రవీణ్ ధైర్యం చేసి మాట్లాడటం మొదలు పెడతాడు.

ఎం చదువుకున్నారు అండి అని అడుగుతాడు.

బీటెక్ చేసాను అండి అంటుంది ధరణి.

ఓకే గుడ్... జాబ్ చేసే ఉదేశ్యం ఉందా అండి మీకు అంటాడు ప్రవీణ్...

ఇంకా ఎం అనుకోలేదు అండి అని చాలా పొడిపొడి గా మాట్లాడుతుంది ధరణి ..

మీకు ఓకే నా నేను అని అడుగుతాడు ప్రవీణ్ .

హ అంటుంది ధరణి.

మరి నన్ను ఎం అడగరా అంటాడు ప్రవీణ్.

తల అడoగా ఉపుతుంది ధరణి.

ఎం ఎందుకని అంటాడు ప్రవీణ్.

నాన్నగారు అన్నీ ఆలోచించేస్తారు.. ఏది చేసినా ...

ఇప్పుడు మీతో మాట్లాడమని పంపించారు అంటే ఖచ్చితంగా నాన్నకు ఈ సంబంధం నచ్చింది అని తెలుస్తుంది. 

ఆయన ఏది చేసినా నా మంచి కోసమే చేస్తారని.. నాకు పూర్తి నమ్మకం ఉంది, మా నాన్నమీద అంటుంది.

హో అవునా మరి నా మీద అంటాడు నవ్వుతూ....

ఆ మాటకు ధరణి కూడా నవ్వుతుంది.

అది సరే నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను మీరు కాదనకూడదు అంటాడు.

దానితో ధరణి ప్రవీణ్ వైపు షార్ప్ గా చూస్తుంది.

ఆ తప్పుగా అనుకోకండి.. నేను మిమ్మల్ని ఒకసారి ము....ము...అని అగుతాడు. అడిగితే ధరణి ఎం అనుకుంటుందో అని,

ఎం అడగబోతున్నాడో ఏమిటో అని ధరణి లోపల కంగారు మొదలవ్వుతుంది.

అంటే మిమ్మల్ని అని మళ్ళీ మొదలు పెట్టి ..మిమ్మల్ని ముట్టుకోవచ్చా .. మీ చేతి వేళ్లను ఒకసారి తాకలి అని ఉంది అంటాడు.

దానితో ధరణి ఊపిరి గట్టిగా పీల్చి వదిలి సరే అని తల ఉపుతుంది.

అప్పటి వరకు ప్రవీణ్ ఎం అడుగుతాడు అనే టెంక్షన్ నుంచి బయటపడుతూ....

ఆమె తన చేతులను ముందుకు చావు తుంది.

ప్రవీణ్ తన చేతులతో ధరణి చేతులు అందుకుని ,చాలా అపురూపంగా చూస్తూ ఉంటాడు.

కింద పెద్దలు కూడా పెళ్ళి ఖాయం చేసుకుంటారు. ముహుర్తాలు పెట్టుకోడానికి ఎప్పుడు మంచి రోజు అని చూస్తూ ఉంటారు.

ప్రవీణ్ తన చేతి వేళ్లను అలా సుకుమారంగా తాకుతుంటే ధరణి సిగ్గు తో తలదించు కుంటుంది.

తల వంచుకుని కూర్చున్న ధరణి ని చూస్తూ ...... ఆమే చేతులను ముద్దాడుతాడు ప్రవీణ్..

అనుకోని ఆ చర్యకు పులకించి పోతుంది గాని వెంటనే తన చేతులను వెనకకు తీసుకుంటుంది ధరణి.

దానితో 2 నిమిషాలు మౌనం రాజ్యమేలుతుంది ఆ గది లో....

   ఇంక కింది వెళ్దామా... అంటుంది అదురుతున్న గుండెతో...ధరణి.

హ్మ్మ్.... అంటాడు ప్రవీణ్.

ఇద్దరు బయటికి వెళ్లడానికి లేచి నిలుచుంటారు.

     ధరణి రెండు అడుగులు ముందుకు వెయ్యగానే ఆమె చెయ్యిని, పట్టుకుని వెనకకు లాగుతాడు ప్రవీణ్, దానితో ధరణి వెళ్లి ప్రవీణ్ కు అతుక్కుపోతుంది. 

వెంటనే దరణిని ,గట్టిగా హత్తుకొని... బుగ్గన ముద్దు పెట్టి ఎం తెలియని వాడిలా నవ్వుకుంటూ కిందకు వెళ్ళి పోతాడు ప్రవీణ్.

నవ్వుతూ కిందకు వస్తున్నా తమ్ముడిని చూసి ,వెనుక ధరణి లేకపోవడం తో తను ఏది అని సైగ చేస్తుంది రేఖ. ఏమో అన్నట్టు భుజాలు ఎగురవేస్తాడు ప్రవీణ్.

అదేంటి అన్నట్టు చూస్తుంది రేఖ.

ఒక పిచ్చి నవ్వు నవ్వుతాడు ప్రవీణ్..

అనుకోకుండా ప్రవీణ్ చేసిన పనికి షాక్ కొట్టి నట్టు అలానే నిలుచుని ఉండిపోతుంది ధరణి .

రేఖ ప్రవీణ్ వైపు కోపంగా చూస్తూ బన్నీ పైకి వెళ్లి అత్తని తీసుకుని రా అని పంపిస్తుంది బన్నీ పైకి వెళ్లి ధరణి చెయ్యి పట్టుకొని రా అత్త కిందికి రమ్మంటున్నారు అందరూ అంటాడు

అప్పుడు ఈ లోకం లోకి వస్తుంది ధరణి..

బన్నీ తో కలిసి కిందకు వస్తుంది ధరణి..

అప్పటికే పంతులు గారు వచ్చి ముహుర్తాలు చూస్తూ ఉంటారు.

అందరిని చూస్తూ అక్కడే నిలబడిన ధరణి. అలా కూర్చో అమ్మ అంటారు కావేరి గారు.

ముందులాగే ప్రవీణ్ ఎదురుగా కూర్చుంటుంది. ప్రవీణ్ తన వైపు చూస్తాడు.

ధరణి కొంచం సీరియస్ గా చూస్తాది. ప్రవీణ్ ప్లీజ్... సోరి అన్నట్టు సైగ చేస్తాడు.

ధరణి సీరియస్ గా చూడటం, ప్రవీణ్ బతిమాలడటం ,కళ్యాణ్ గమనించి ఎం జరిగింది అని ప్రవీణ్ కి మాత్రమే వినిపించేలా అడుగుతాడు.

ఎం జరిగింది బావ ఎం లేదు, పంతులు గారు పంచాంగం చూస్తున్నారు అంటాడు చాలా క్యూట్ గా చూస్తూ.

అరేయ్ బామ్మర్ది నీ పిచ్చి వేషాలు నా దగ్గర కాదు గాని పైన ఎం జరిగింది ,ధరణి ఎందుకు అలా సీరియస్ గా చూస్తుంది . అని అడుగుతాడు.

అదీ అది ఎం లేదు బావ ..ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ముహూర్తం పెట్టించు బావ అని కళ్యాణ్ షర్ట్ పట్టుకుని గుంజుతాడు.

దానితో కళ్యాణ్ దేనికి రా ముహూర్తం అని అడుగుతాడు..

హి హి హి అని ఒక వెర్రి నవ్వు నవ్వి దేనికి అంటావ్ ఏంటి బావ పెళ్లి కి , పెళ్లికి బావ అంటాడు ప్రవీణ్ అంతేనా అంటాడు కళ్యాణ్ ..

అంటే ఆ తరువాతివి మీరే పెట్టించేస్తారు గా నేను అడగడం ఎం బాగుంటుంది చెప్పు అంటాడు.

ఓర్ని .... చాలా వేషాలు ఉన్నాయి రా నీ దగ్గర... అని అంటాడు కళ్యాణ్.

వీళ్ళు మాట్లాడుకుంటుండగా.. పంతులు గారు.పిల్లల జాతకాలు బాగా కుదిరాయి. వీళ్ళ జాతకాలు ప్రకారం వచ్చే నెలలో ఒక ముహూర్తం ఉంది. 

, మళ్ళీ రెండు నెలలు పోయిన తరువాత మంచి ముహుర్తాలు ఉన్నాయి.

మీ ఇరుకుటుంభాలు మాట్లాడుకుని మీకు ఏది సౌకర్యవంతం గా ఉంటుంది అంటే అది ఖాయం చేస్తా అంటారు.

ఆడపిల్ల వాళ్లు మీరు , పెళ్లి అంటే బోలెడు పనులు ఉంటాయి మీకు , అబ్బాయి వాళ్ళకంటే ఎక్కువగా అందుకే మీరు చెప్పండి ముందు అంటారు.

ఈ లోపు ప్రవీణ్ కి ఎక్కడ లెట్ గా పెట్టిస్తారో పెళ్లి ముహూర్తం అని టెంక్షన్ వచ్చేస్తూ ఉంటుంది.

రమేష్ గారు, కావేరి గారితో చెల్లెమ్మ మీరు చెప్పండి మాకు ఏదైనా పర్వాలేదు అంటారు.

దానితో ప్రవీణ్ ... కళ్యాణ్ చెవి దగ్గర నువ్వు చెప్పు బావ నెక్స్ట్ మంత్ ఫిక్స్ చెయ్యమని అంటాడు.

అంతలో కళ్యాణ్... , అత్తయ్య వచ్చే నెలలో ముహూర్తం ఖాయం చెయ్యండి లేదంటే మన వాడు ఇప్పుడే తాళి కట్టేలా ఉన్నాడు అంటాడు.

కళ్యాణ్ మాటలకి అందరూ ఒక్కసారి ప్రవీణ్ వైపు చూసి నవ్వుతారు.

ప్రవీణ్ సిగ్గుతో పక్కచూపులు చూస్తుంటాడు.

ధరణి తల వంచుకుని నవ్వుతుంటుంది.

అందరూ మళ్ళీ మాటల్లో పడతారు . ప్రవీణ్ ధరణి ని చూస్తాడు . ధరణి కూడా ప్రవీణ్ ని చూస్తూ ఉంటుంది.

అందరూ ఎవరి మాటల్లో వాళ్ళు ఉన్నారు అన్న విషయం గమనించిన ప్రవీణ్ .ధరణి కి ముద్దు పెడుతున్నట్టుగా పెదాలు ముడి వేసి ఉమ్మ.. అంటాడు. ధరణి కళ్ళు పెద్దవి చేసి ,నోటి మీద చెయ్యి పెట్టుకుని ప్రవీణ్ ని,అక్కడ ఎవరైనా చూసారా అని అందరిని చూస్తుంటుంది. ఎవరు చూడలేదు హమ్మయ్య.... అనుకుంటూ ఉంటుంది.

అప్పటికే ఆ సీన్ మన బన్నీ బాబు కళ్ళలో పడుతుంది.ఇంకేముంది అందరికి వినిపించేలా గట్టిగా  అమ్మా.... ,మామా, అత్తకు ముద్దు పెట్టాడు అమ్మా అని వాళ్ళ అమ్మకు చెప్పుతాడు. వెంటనే రేఖ బన్నీ నోరుమూసేస్తుంది.

ప్రవీణ్ తల కొట్టుకుంటాడు బన్నీని చూసి..

కళ్యాణ్ ..ప్రవీణ్ తల మీద ఒక్కటి పీకుతాడు.. బా...వ అంటాడు ప్రవీణ్. ధరణి వెంటనే తల కిందకు దించేసుకుంటుంది.

ఆ రోజు మంచి రోజు కావడం తో తాoబులాలు మార్చేసుకుంటారు.ఇరుకుటుంభాలు.

తాంబులాలు మార్చుకున్నకా భోజనాలు చేసి.. కావేరి గారు వెళ్ళడానికి సిద్ధం అవ్వుతారు.

ఎలాగూ ఖాయం అయిపోయి ,తాంబులాలు మార్చేసుకున్నాం గా, ఇంకా ఎందుకు ఆలస్యం వెళ్లి నీకు కాబోయే శ్రీమతి కి చెప్పిరా వెళ్ళొస్తాం అని ... అంటుంది రేఖ.

తను ఆ గది లో ఉంది బాబు అని వెళ్ళండి వెళ్లి అమ్మాయికి చెప్పి రండి అంటుంది ధరణి తల్లి సుధ...

సరే అని ధరణి ఉన్న రూమ్ లోకి వెళ్తాడు ప్రవీణ్ .. అప్పటి వరకు ధరణి తో మాట్లాడుతున్న వాళ్ళు ప్రవీణ్ ని చూసి నవ్వుతూ బయటికి వెళ్ళిపోతారు.

ప్రవీణ్ దగ్గరికి రావడం తో ధరణి లేచి నిలబడుతుంది.

ధరణి దగ్గరకు వెళ్లి చెయ్యి పట్టుకుని వెళ్ళొస్తా... మళ్ళీ వచ్చి పెళ్లి చేసుకు తీసుకుపోతా  అంటాడు ప్రవీణ్..  మళ్ళీ ముద్దు పెడితే ఎం అనుకుంటుందో, పెట్టుకోవాలి వద్దా అన్నట్టు దరణి ని చూస్తూ.. ఉంటాడు.

ఇంతలో ధరణి నే చొరవ చేసి ప్రవీణ్ బుగ్గ మీద ముద్దు పెట్టి బై అంటుంది నవ్వుతూ...

దానితో ప్రవీణ్ ఆనందానికి అంతు ఉండదు.. దరణిని దగ్గరకు తీసుకుని ఆమె అదరాలపై, మధుర సంతకo చేసి బై రా అని చెప్పి బయటి కి వచ్చేస్తాడు.

ధరణి కూడా ప్రవీణ్ తో పాటు బయటికి వచ్చి వెళ్ళడానికి సిద్ధం గా ఉన్న అందరికి బై చెప్పుతుంది. వాళ్ళ కార్ బయలుదేరి వెళ్ళిపోతుంది.

అలా వాళ్ళ ప్రయాణము అక్కడ నుంచి పెళ్లి కి పయనమయ్యింది.

                  సమాప్తం....



Rate this content
Log in

Similar telugu story from Romance