చింతలబ్బయి
చింతలబ్బయి
మోహనరావుమంత్రిప్రగడ. ఆయ్ నాపేరు చింతల చింతలబ్బాయండి. నేను చింతపండు యాపారం సేత్తానండి. దానికోసం ముందుగా చింతలూరు ఎల్లానండి-కాని లక్కడ చింతలు లేవండి, యనకొచ్చీ చింతలమోరికి(రాజోలు దగ్గర) యల్లా, లక్కడ నాల్గు చింతలు దొరికాయండి, లక్కడనించి చింతలపిల్లి ("రాజోలకాడండి)" యల్లానండి, లాతరవాత చింతలపూడి యెల్లానండి అంటే రెండు చింతలపూషడిలున్నాయండి ఒకటిఅమలాపురంకాడ, మరోటి ముమ్మీడారం, కాడండి దాన్ని క్రాపచింతలపూడంటారండి, అమలాపురంకాడది వన్నెచింతలపూడండి, లక్కడ కూడా రెండేరెండు చింతలు దొరికాయండి. లిక్కడ పని కాదని తూర్పున చింతవలస ఎల్లానండి, లక్కడలు చింతలే లేవండి, అదేంటని అక్కడఆళ్ళని అడిగితే పూర్వం అక్కడన్ని చింతలుండే వంటండీ అందుకే చింతలవలస అని పిల్చెవారంటండి, మరేంటయ్య అంటే మాం లిక్కడకి వచ్చాక ఇల్లకోసం చింతలన్ని నరికేసామండి! లిప్పుడది చింతల్లేని వలసయిందండి.లాతరవాతచింతలమెరక (కాట్రేకోన కాడండి) యల్లనండి లక్కడ శానాచింతలు దొరికాయండి, లాడనించి చింతలచెర్వుఅమలాపురంకాడండి యూల్లానండి, లక్కడనించి చింతురు, బద్రాచలం కాడండి అదడవి కదండి శానా చింతలు దొరికాయండి, లటు తరవాత మనగోపాలపురం అంటే ప.గో జిల్లా కాడున్న చింతలపుడి కూడా యల్లానండి. ఇంక తిరపతి దాటాక రెండు చింతల అనే ఉరుందండి కాని యల్లలేక పాయానండి. లాతరవాత హైదరాబాదులో చింతలభస్తి అనుందండి అక్కడకి యల్దామంని బయలుదేరానండి మాతమ్ముడొచ్చి అన్నా అది సిటిలో బస్తి అక్కడ మేడలుతప్ప చింతలుండవని అన్నాడండి అంతె మానుకొన్నానండి.- "అయతే నీకు ఏ చీకు చింత ఏంలేవా" అడిగిను. "అయ్యగారు అన్నిచింతలు నాకాడుంటే నాకుయేరే చింతఎందకండి" అన్నాడతను. బాబు ఆగవయ్య నేనడిగిన ఒక్కప్రశ్నకి అసలు చింత-అనేపదం వదలకుండ అరంగట మాట్టాడేవు కొంచేపు నన్నోదియ్యవయ్య నాకు తల దిమ్మేక్కి పోయింది" అని లేవబోయాను నేను. "సార్ మరో సంగతి" అని చింతలబ్బాయి మెదలెట్టాడు. వెంటనే నేను కూర్చున్న హోటలు ఆయన "బాబు చింతలబ్బాయిగారు నిన్న మీకోసం ఆదినారాయణ వచ్చిడండి" అన్నాడు. "అలాగ ఇప్పుడే వెడత" అని లేచి పరుగు తీసాడు ఆయన. "తేంక్సండి బ్రతికించారండి బాబు" అన్నాను. "సార్ టీతాగండి" అని పెద్దగ్లాసు టీ బల్లమీద పెట్టాడు హోటలాయన. నేను అదేంటండి బాబు అంత టీ ఇచ్చారు" అని అడిగాను ఆశ్చర్యంగా , " తాగండి పరవాలేదు అన్నాడు" "ఎందుకు" అని అడిగానేను. "సారు ఆ చింతలబ్బాయిగారి దెబ్బనుండి బయట పడాలంటే అలాగే తాగాలండి" అన్నాడాయన, నెను మొత్తం టీ అంతా తాగేసాను, అప్పుడుకాని నా మెదడు పనిచెయలేదు. తరవాత తెలిసిందెమిటంటే అసలీ చింతలబ్బాయిగారిది విశాఖపట్నం చింతలగ్రహారంట ఆఊళ్ళోవాళ్ళు అతని బాధ భరించలేక చందాలేసుకొని టిక్కట్టుకొని రైలు ఎక్కించేసారట. ఆరకంగా ఇక్కడచేరి వీళ్ళ బుర్రలు తింటు గడుపుతున్నాడట-- అదండి సంగతి.*********
