Pushyami Devulapalli

Tragedy Classics Inspirational

4  

Pushyami Devulapalli

Tragedy Classics Inspirational

అమ్మ

అమ్మ

8 mins
35.6K


#SeedhiBaat#

CHAPTER 1

అమ్మ కి ఎనిమిది ఏళ్ల వయసు.. చాలా బొద్దు గా ముద్దు గా ఉండేది. అమ్మ కి ఒక అక్క, పెళ్లి అయిపోయింది పద్నాలుగు ఏళ్లకు. ఇద్దరు అన్న లు ఒక తమ్ముడు. అమ్మ వాళ్ళ అమ్మ (అమ్మమ్మ) కు సంగీతం బాగా వచ్చు. అమ్మ కూడా చాలా బాగా పాడేది. చురుకుగా అందం గా ఉండే అమ్మ అంటే అందరికీ ముద్దే. ముఖ్యం గా ఆమె నాన్న (తాతగారు) కి. అయితే అమ్మమ్మ కి హిస్టేరియా మరియు ఇతర మానసిక రుగ్మత లు ఉండేవి. ఆమె మాట శాశనం కాదంటే ఆవిడ ఉన్మాదానికి భయపడి ఆమె భర్త సైతం ఎదురు చెప్పేవాడు కాదు. ఒకసారి అమ్మ తన స్నేహితురాలు బలవంత పెట్టడం తో వారి ఇంట్లో భోజనం చేసింది. విషయం తెలుసుకున్న అమ్మమ్మ తక్కువ కులం వారి ఇంట్లో భోజనం చేసిందని అమ్మని ఎండలో చెప్పులు లేకుండా నుంచోపెట్టింది. అక్కడకీ కోపం తీరక నాలుక మీద వాత పెట్ట బోయింది. అప్పుడే ఇంటికి వచ్చిన తాతగారు అడ్డుకుని ఇంత కులాహంకారం తగదని కేకలేసారు. తనకి అడ్డు చెప్పడం సహించలేను అమ్మమ్మ ఉన్మాదపు ధోరణి తో hysteric గా అరుస్తూ పడిపోయింది. తన భర్త తో తిట్టించిన కూతురి పట్ల కోపంతో కొన్ని రోజులు మానసికంగా చిత్ర హింస లు పెట్టింది. ఎనిమిది ఏళ్ల అమ్మ కి ఎందుకు ఇదంతా జరుగుతోంది అర్దం కాలేదు. కులం అంటే ఏమిటో తెలియని అమాయకపు మనసు లో తమది అగ్ర కులం అని తక్కువ కులాల మనుషుల ను దూరం పెట్టాలని విష బీజం నాటుకుంది.

బడి లో స్నేహితుల తో కొంచం దూరంగా ఉండడం మొదలు పెట్టింది. కానీ స్నేహితులతో ఆడుకోవడం మానేసాక ఏదో వెలితిగా అనిపించి ఆమె నాన్న ను అడిగింది కులం అంటే ఏంటి అని. కులం అంటే అహంకారం అని సమాధానం ఇచ్చిన నాన్న ను ముద్దు పెట్టుకుని మళ్ళీ స్నేహితులతో మామూలు గా ఉండడం మొదలు పెట్టింది. కానీ తన అమ్మ ఎదురుగా తక్కువ కులం వారిని అంటరాని వారు గా చూడడం కోసం ఒక కొత్త వ్యక్తిత్వాన్ని అలవాటు చేసుకుంది. అప్పుడు అమ్మ కు తెలియదు తను ముందు ముందు ఇంకా చాలా వ్యక్తిత్వాలు అలవరుచుకోబోతోందని.


CHAPTER 2

అమ్మ కు పన్నెండున్నర సంవత్సరాలు. సంగీతం నేర్చుకోవడానికి శాస్త్రి గారి దెగ్గర కి పంపించడం మొదలు పెట్టింది అమ్మమ్మ . అయితే పక్కింటి అక్క కూడా అక్కడే కొంతకాలం నేర్చుకుని మానేసింది. ఆ అక్క అమ్మ తో శాస్త్రి గారు తనతో తప్పు గా ప్రవర్తించారనీ, ఆ విషయం ఇంట్లో చెబితే నమ్మకపోగా సంగీతం మీద ధ్యాస లేక అబద్ధం చెబుతోందనీ మందలించి సంగీతం మాన్పించి పెళ్లి సంబంధాలు చూస్తున్నారనీ చెప్పింది. అమ్మ భయపడుతూనే వెళ్లేది కానీ ఆరు నెలలు వరకూ ఆయన అలా ప్రవర్తించకపోయేసరికి అమ్మ సంతోషంగా వెళ్ళడం మొదలుపెట్టింది. ఒకరోజు సంగీతం నేర్చుకుంటుంటే మధ్య లో అమ్మ లంగా తడిసి నట్టు అనిపించి చూస్తే మొత్తం రక్తమయం అయింది. శాస్త్రిగారు భయంతో బిక్కచచ్చిపోయిన అమ్మను నూతనోత్సాహం తో చూసి రజస్వల అయ్యావు పండూ ఇంటికెళ్ళు అన్నారు. పండు అనే కొత్త పిలుపుకు ఆశ్చర్యపడి కొంచం బెరుకు గా తన లంగా కి పుస్తకం అడ్డుపెట్టుకుని ఇంటికి బయలుదేరింది. వారం రోజుల తరువాత మళ్లీ సంగీతం క్లాస్ కి పంపింది అమ్మమ్మ. అమ్మ ను చూడగానే చాలా ఉత్సాహంగా శాస్త్రి గారు క్లాస్ చెప్పారు. అలా వారం రోజులుగా ఆయన లో వచ్చిన మార్పు ను అమ్మ అర్దం చేసుకుని తాతగారి తో చెప్పింది. ఈ విషయం చాటు గా విన్న అమ్మమ్మ తాతగారి తో శాస్త్రి గారు ఎంత మంచివారో చెప్పి అమ్మను మందలించి మరుసటి రోజు పంపించింది. ఆ రోజు అందరూ వెళ్లి పోయాక కూడా అమ్మను ఉంచి వీణ నేర్పే వంక తో తనని తడిమి గట్టిగా దగ్గర కు లాక్కోవడం తో గట్టిగా అరచి బయటికి పరుగు పెట్టింది అమ్మ. అమ్మ వెనకాలే ఇంటికి వెళ్ళిన శాస్త్రి గారు అక్కడ అమ్మ ను ఏమయిందని ప్రశ్నిస్తున్న తన తల్లి తండ్రులను చూసి తమ కూతురు ఇతర మగ పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించినందున కోప్పడ్డాననీ అందుకే ఇలా మధ్య లో వచ్చేసిందనీ చెప్పారు. తాతగారు ఆపుతున్నా ఆగకుండా అమ్మమ్మ శాస్త్రి గారు ఎదురుకుండా అమ్మను చెంపమీద కొట్టింది. భార్య ను ఏమీ అనలేని నిస్సహాయత తో తాతగారు , అడ్డు వెళితే తమనూ కొడుతుందేమో అని అన్నతమ్ములూ చూస్తూ ఉండిపోయారు. శాస్త్రి గారు గర్వంగా అమ్మ తో ఇప్పించిన మజ్జిగ తాగి వెళ్లిపోయారు. మరుసటి రోజు నుండీ వారం రోజులు అమ్మకు శాస్త్రి గారి బాధ తప్పలేదు. తన అన్న ను బతిమాలి తాతగారి తో అమ్మమ్మ కు చెప్పించి తనతో సంగీతానికి అన్న ను కూడా నేర్చుకొంటాడు అని తీసుకెళ్లింది. కానీ అన్న ని మభ్యపెట్టి బయటకు పంపి మరలా తనను తడిమి ఎక్కడో చేతులు పెట్టబోయే సమయం లో ఉన్నట్టుండి పక్కన ఉన్న కత్తెర తీసి ఆయన పంచ లాగి లోపల కత్తిరించిన అమ్మ కు తెలియదు తనలో ఇంకొక ఆల్టర్ పర్సనాలిటీ బయటకు వచ్చి శాస్త్రి గారి కి అలా చెమటలు పట్టిస్తుందని.


CHAPTER 3

అమ్మ కి 15 సంవత్సరములు. చాలా అందం గా ఉండేది. పదవ తరగతి స్కూల్ కి వెళ్ళి వస్తుంటే చాలా మంది పోకిరీ పిల్లలు వెంట పడే వాళ్ళు. లవ్ లెటర్స్ ఇస్తుండే వాళ్లు. ఇంట్లో చెబితే చదువు చాలు ఇంక పెళ్లి చేసుకో అంటారు అని భయపడి చెప్పలేదు. కానీ పక్కింటి బాబీ ఒక రోజు లవ్ లెటర్ ఇస్తుంటే సిగ్గు పడుతూ తీసుకున్న అమ్మ ని తన అన్న చూసి అమ్మమ్మ కు చెప్పాడు. బాబీ అంటే ఆ ఏజ్ లో ఉండే సహజ ఆకర్షణ ఉండేది అమ్మ కి. లవ్ లెటర్ చూసుకుని మురిసిపోతోంది కానీ తన వెనుక జరుగుతున్న పెళ్లి ప్రయత్నం సంగతి తెలియదు అమ్మ కి. తన ఫ్రెండ్ రాణి కి బాబీ ఇచ్చిన లెటర్ సిగ్గు పడుతూ చూపించింది అమ్మ. ఇంతలో తన తమ్ముడు వచ్చి తమ మేనమామ తో తన పెళ్లి మాటలు జరుగుతున్నాయి అని చెప్పి వెళ్లాడు. అంతే అమ్మ ఒక్క పరుగు న లోపలకు వెళ్లింది. తన పెద్ద మేనమామ తో తన అమ్మ, నాన్న తన పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. ఇంత లో అమ్మ ను చూసి "రావే నా ఆఖరి తమ్ముడు తో నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం" అన్నది అమ్మమ్మ . తన తండ్రి మౌనం గా వాళ్ళావిడ మాట శిలాశాసనం అన్నట్టు తల ఎత్తకుండా కూర్చున్నారు. తన పెద్ద మేనమామ అమ్మ ఎంత అద్రృష్టవంతురాలో చెప్పడానికి తన ఆఖరి తమ్ముడు ఇంజనీర్ అని సౌమ్యుడని పొగుడుతున్నారు. అమ్మ పెళ్లి అప్పుడే చేసుకొను ఇంకో ఐదు ఏళ్ల తరువాత చేసుకుంటానని చెప్పింది. తన చంప ఎర్ర గా కంది పోవడం, ఐదు వేళ్లు అచ్చు పడడం గ్రహించే లోపే రాణి తనని లోపల కి తీసుకుని వెళ్లింది.

కుమిలి కుమిలి ఏడుస్తున్న కూతురిని చూసి తాతగారు "నీ ఆఖరి మేనమామ అన్ని రకాలు గా మంచివాడు ఇంజనీర్ కూడా ను బంగారం. ఇప్పుడు వద్దు అని గొడవ చేస్తే అంత మంచి సంబంధం కట్నం లేకుండా మేము తేలేము తల్లీ. ఒప్పుకో అమ్మా" అని బ్రతిమాలాడారు. అమ్మ మౌనంగా ఏడుస్తునే ఉంది. ధైర్యం కూడ దీసుకుని తను సంగీతం లో diploma అయిపోయాక చేసుకుంటా అని అమ్మమ్మ తో చెప్పింది. పెళ్లి అయ్యాక కూడా చదువుకుని ఆ diploma తీసుకోవచ్చు అని వెంటనే fits తెచ్చుకుని పడిపోయింది అమ్మమ్మ . అమ్మ వల్లే ఆమె కు fits వచ్చాయి అని చుట్టు పక్కల వాళ్లు అమ్మ ను చిరాకుగా చూశారు. అయినా అమ్మ ఊరుకో కుండా తన ఆఖరి మేనమామ కి తనకి పెళ్లి కి కొంచం టైమ్ కావాలి అని ఉత్తరం రాసింది. తన మేనమామ ఇంట్లో వాళ్లకి ఎదురు చెప్పడం కరెక్ట్ కాదు అని, పెళ్లి అయ్యాక అమ్మ ఏమి చెప్తే అదే వింటాననీ, సెక్స్ కూడా తను ఎప్పుడు అంటే అప్పుడే అని హామీ ఇస్తూ తిరుగు ఉత్తరం రాశాడు. ఎలాగైతేనేం కొంత ధైర్యం తో అమ్మ పెళ్లి చేసుకుంది.


CHAPTER 4

పెళ్లి జరిగిన వెంటనే మొదటి రాత్రి ముహూర్తం పెడుతున్న పంతులు గారు అమ్మ ని చూసి అదొక రకంగా నవ్వుతుంటే తిరిగి నవ్వుతున్న అమ్మ ని చూసి కూతురు ముందు అభ్యంతరం చెప్పినా ఇప్పుడు సంతోషంగా ఉంది అని మురిసిపోయాడు తన తండ్రి. రాత్రి అయ్యింది. శోభనం గది లోకి పంపించారు తనని పాల గ్లాస్ తో తెల్ల చీర తో. లోపల తన మేనమామ ఉన్నాడు. అతనికి థాంక్స్ చెప్పింది. ఎందుకు అని అడిగాడు అతను.. "సెక్స్ విషయం లో తొందర పెట్టను అన్నావు గా అందుకు" చెప్పింది అమ్మ. గట్టిగా నవ్వాడు అతను.

" ఇంత అందాన్ని చూస్తూ ఎలా ఊరుకోమంటావు డార్లింగ్. మనకి పెళ్లి కూడా అయ్యింది. ఏదో అలా ఉత్తరం రాస్తే నువ్వు ఊరుకుంటావని రాశా అంతే. నువ్వు ఎంతైనా చదువు. సంగీతం కూడా పూర్తి చేయి. కానీ దానికి ఇప్పుడు ఇది ఆపడం ఎందుకు? " అంటూ అమ్మ ని మీదకు లాక్కొన్నాడు. అమ్మ వెంటనే తోసేసింది. అతను మంచి మాటలాడి ప్రయత్నించాడు. అమ్మ ఒప్పుకోలేదు. అతని అహం దెబ్బ తింది. బయటకు వచ్చి అతని అక్క, అంటే అమ్మమ్మ తో చెప్పాడు. ఆమె గట్టిగా అరుస్తూ fits వచ్చి పడిపోయింది. అమ్మ పెద్ద మేనమామ వచ్చి విషయం తెలుసుకుని అమ్మ ను ఒక లెంపకాయ కొట్టాడు. మిగిలిన బంధువులు అమ్మ ను ఛీ అన్నారు. తన వల్లే తన అమ్మ మళ్లీ fits వచ్చి పడిపోయింది అన్నారు. తాతగారు మౌనంగా దండం పెట్టారు తనకి. మళ్లీ తనని లోపల కి పంపారు. ఇప్పుడు అమ్మ ముభావంగా ఉంది. ఆమె ను ఆమె మేనమామ చాలా సుఖం గా అనుభవిస్తున్నాడు. రాత్రంతా అలానే అనుభవించి " ఈమాత్రం దానికి ఇంత గోల చేశావు" అని పక్కకు తిరిగి పడుకున్నాడు. ఏడుస్తున్న అమ్మ కి తెలియలేదు తనలో ఇంకో ఉన్మాదపు వ్యక్తిత్వం బయటకి వచ్చి తన కడుపులో పడబోతున్న పసికందు జీవితానికి తానే ఒక శాపం కాబోతోందని.


CHAPTER 5

అమ్మ కడుపులో నేను ఉన్నాను. అమ్మ అన్నింటికీ రాజీ పడిపోయింది. పూర్తిగా మారిపోయింది అని సంతోషం తో మా నాన్న అమ్మ ను కాలు కింద పెట్టకుండా చాలా జాగ్రత్త గా చూసుకుంటున్నాడు. అమ్మమ్మ తాతగారు వచ్చి కూతురు సంతోషం గా ఉండడం చూసి మురిసిపోయారు. ఏమూలో తమ కూతురి విషయంలో కొంచం గిల్టీ ఫీలింగ్ ఉన్న తాతగారు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. అలా అందరూ సంతోషంగా ఉండే సమయంలో నే అమ్మ వరుసగా నన్ను, తమ్ముడి ని కన్నది. మా నాన్న ఆనందం మాటల్లో చెప్పలేనిది. అప్పుడే ఇద్దరు పిల్లలను చూసుకోలేను అని అమ్మ నన్ను పిల్లలు లేని తన అక్క కి పెంచమని ఇచ్చింది. నాన్న చాలా బాధ పడ్డాడు. కానీ అప్పటికే అమ్మ కు పూర్తి గా surrender అయిపోయిన ఆయన ఏమీ మాట్లాడలేదు. నేను హ్యాపీ గా పెద్దమ్మ వాళ్ల ఇంట్లో పెరుగుతున్నాను. తమ్ముడు అమ్మ వాళ్ల దగ్గర పెరుగుతున్నాడు. నేను మూడవ తరగతి చదువుతున్నాను. ఒకరోజు పెద్దమ్మ ఆందోళన గా పెద్ధనాన్న తో ఏదో చెబుతోంది. ఏమిటో తెలుసుకోవాలని పడుకున్నట్టు నటించి అంతా విన్నాను - అమ్మకు ప్రేమ రుచి చూపించి ఇంట్లో నుండీ వెళ్లి పోయి పెళ్ళి చేసుకోవడానికి ఒక చుట్టాలతను ఒప్పించాడని. ఆ వయసులో నాకు అర్ధం కాలేదు అదంతా. అయితే అందరూ కలిసి అమ్మ మనసు మార్చి ఆ ప్రయత్నం విరమింపజేశారని మాత్రం అర్థమయ్యింది. విషయం సరిగ్గా అర్థం కాకపోయినా అమ్మ నాన్న కలిసుంటారు, సెలవుల్లో వెళ్లి తమ్ముడి తో ఆడుకోవచ్చు అని మాత్రం సంతోషపడ్డాను. అయితే అమ్మ మనసు మార్చలేదనీ, మళ్ళీ కొట్టి తిట్టి మనసు విరిచేశారనీ అప్పుడు నాకు తెలియదు. ఒకసారి మా పెద్ధనాన్న నా ఎడవ తరగతి లో హఠాత్తు గా చనిపోయారు. తప్పని పరిస్థితుల్లో నన్ను అమ్మ నాన్న తీసుకెళ్లారు. నన్ను ఇంట్లో చూడగానే మళ్లీ అమ్మ కు గతం గుర్తు వచ్చి నన్ను శత్రువు లా చూసే ఉన్మాదపు వ్యక్తిత్వం ఇంకొకటి బయటకి వస్తుందని అమ్మ తో సహా ఎవరికీ తెలియదు. అమ్మ అందగత్తె. తెలివి అందం టాలెంట్ ఉన్న గొప్ప మహిళ గా చూసి అలా ఉండాలి అనుకున్నాను. కానీ అప్పుడే తెలిసింది అమ్మ మత్తు మాతరలకు బానిస అయింది అని. ప్రతి రోజూ ముప్పయి మాత్రలు వేసుకోవడం చూశాను. అమ్మ కు పూర్తిగా లొంగిపోయిన నాన్న తెచ్చి మరీ ఇచ్చేవాడు. అమ్మ ప్రవర్తన లో కొంచం హింసాత్మక ధోరణి ఎక్కువ అవ్వడం మొదలుపెట్టింది. నాన్న ను మాటలతో హింసించేది. ఇంటికి చుట్టాలు రావడం మానేశారు. అలా నేను ఇంటర్ లో చేరాను. అప్పుడు మొదలయింది అమ్మ నాగమ్మ గా మారడం. తన పేరు నాగమ్మ అనీ, నన్ను చంపడానికి వచ్చాననీ చెబుతూ నన్ను విపరీతంగా హింసించడం మొదలుపెట్టింది. నాన్న ఇవన్నీ చూడలేక, బయట తెలిస్తే భార్య కి పిచ్చి అంటారు అని భయపడి ఆఫీసు వంక తో దూరంగా ఉండేవాడు. నేనూ, తమ్ముడు ఒకరికొకరం తోడుగా ఉంటూ, అమ్మ కు భయపడుతూ, అమ్మ పడుకున్నప్పుడు ఊపిరాడకుండా చేసి చంపేద్దాం అనుకునే వాళ్ళం. కానీ అమ్మ ప్రేమ గుర్తుకు వచ్చి ఆగిపోయాం. అలా ఒకరోజు నిద్ర లో తెల్లవారుజామున మూడు గంటలకు నన్ను కాలితో తన్ని లేపింది. ఉన్మాది లా ప్రవర్తిస్తూ నీ పుట్టుకే నాకు శాపం అని అరుస్తోంది. తమ్ముడు లేచి వచ్చి అమ్మను పట్టుకుని గదిలో తోసి బయట గఢియ పెట్టాడు. ఇలాంటి పరిస్థితుల్లో నే నేను ఇంజనీరింగ్ లో చేరాను. అప్పుడు ఎవరికీ తెలియని విషయం - నేను బయట చేదు అనుభవాలు ఇంట్లో చెప్పుకునే పరిస్థితి లేక, తన పుట్టుక వెనుక కారణం అర్దం చేసుకొని హింసించిన అమ్మను ద్వేషించడమా లేక ఆ కారణం అయిన నాన్న ను ద్వేషించడమా అనే సంగ్దిద్ధం లో, అవి ఏమీ భరించే అవగాహన లేని వయసు లో మా అమ్మ నాన్న లకి నా ప్రవర్తన అసహనానికి గురి చేసి నన్ను నేను దహించుకుంటూ, పుట్టుకే ఓటమి తో మొదలయిన నాకు ఆ ఓటమే శ్వాస గా మారి ఆయువు పోస్తోందని...

అమ్మాయి గా అమ్మ ను కష్ట పెట్టారు. భార్య గా మొదటి రాత్రి కాళరాత్రి ని చూసింది. అమ్మ గా గతం మారు రూపం లో తనలో ఉన్మాది గా ప్రవేశించింది. తన పాప మరో అమ్మాయి గా బాధ పడకూడదని, అమ్మ గా ఓడిపోకూడదని అప్పుడు తనకు అవగాహన లేదు. నాకు ఆ అవగాహన రావాలని కోరుకునే రేపటి నేను.. Future me..Rate this content
Log in

More telugu story from Pushyami Devulapalli

Similar telugu story from Tragedy